దుర్గమ్మ సన్నిధికి.. డాలర్లే డాలర్లు | Dollar for dollar, before Durga .. | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ సన్నిధికి.. డాలర్లే డాలర్లు

Published Mon, Sep 22 2014 2:02 AM | Last Updated on Thu, Oct 4 2018 7:01 PM

దుర్గమ్మ సన్నిధికి.. డాలర్లే డాలర్లు - Sakshi

దుర్గమ్మ సన్నిధికి.. డాలర్లే డాలర్లు

సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపమైన కనకదుర్గమ్మ డాలర్ల కుంభవృష్టి కురిపిస్తోంది. అంతులేని మూలధనంతో బంగారుతల్లిగా అలరారుతున్న ఆ అమ్మకు విదేశీ భక్తులు అధికసంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటుండ టంతో కుప్పలుతెప్పలుగా ఫారన్ కరెన్సీ కానుకల రూపంలో వస్తోంది. గత రెండేళ్ల లెక్కలు చూసుకుంటే ప్రతినెలా జరిగే హుండీల లెక్కింపులో డాలర్లు అధిక సంఖ్యలో ఉంటున్నారుు. అంతేకాదు.. ఇటీవల దుర్గమ్మకు విదేశీ భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
 
విజయవాడ : దుర్గమ్మను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే విదేశీ భక్తులు సమర్పించే డాలర్లు అమ్మవారి మూలధనానికి భారీగా చేరుతున్నాయి. ఏటా జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్స  వాలతో పాటు శాకంబరీ, శ్రావణమాస ఉత్సవాల్లో విదేశీ భక్తులు  ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి 20 రోజులకోసారి హుండీ ఆదాయం లెక్కిస్తుండగా, సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తే అందులో  దాదాపు రూ.50వేలకుపైగా విదేశీ కరెన్సీనే ఉంటోంది. ఈ ఏడాదైతే హుండీల ద్వారా విదేశీ కరెన్సీ రూపంలో వస్తున్న ఆదాయం రికార్డుస్థాయికి చేరుకుంది. ఇలా అమ్మవారికి వచ్చిన విదేశీ కరెన్సీని బ్యాంకుల ద్వారా రూపాయల్లోకి మార్చి తిరిగా అమ్మవారి మూలధనానికే చేర్చుతున్నారు.
 
అన్ని దేశాల నుంచి..

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లి విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగరీత్యా స్థిరపడిన వారితో పాటు అమెరికా, కెనడా, సౌదీ, యూఏఈ, మలేషియా, బెహరిన్, ఈజిప్టు, ఓమన్, లిబ్రాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, మాల్దీవులు, ఉగాండా, ఇంగ్లండ్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. టూరిజంలో అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్నారు.

అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా స్థలపురాణం, అమ్మవారికి నిత్యం జరిగే పూజలు, అర్చనల గురించి తెలుసుకుంటూ..అమ్మవారి చిత్రపటాలను సైతం కొనుగోలు చేసి స్వస్థలాలకు తీసుకెళ్తున్నారు. విజయవాడను సీమాంధ్ర రాజధానిగా   ప్రకటించడంతో పలు విదేశీ కంపెనీలు నగరంపై దృష్టి పెట్టాయి. అనేక కార్యకలాపాలతో పాటు టూరిజంను  అభివృద్ధి చేసే అవకాశాలు ఉండటంతో విదేశీ భక్తుల సంఖ్య పెరగడంతో పాటు అమ్మవారి మూలధనానికి డాలర్లు మరిన్ని చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఆరు నెలల్లో అధిక ఆదాయం..

2013-14 ఆర్థిక సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలోదేవస్థానానికి రూ.7.20 లక్షల ఆదాయం సమకూరగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి రూ.3.50 లక్షలకు పైబడి వచ్చింది. ఉత్సవాలతో పాటు పండుగ పర్వదినాలు ముందుండటంతో ఈ ఏడాది హుండీల ద్వారా భారీగానే విదేశీ కరెన్సీ వచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు.
 
విదేశీ విరాళాలు పెరిగాయ్..

దుర్గమ్మకు విదేశీ భక్తుల సంఖ్య  పెరుగుతోంది. నిత్యం విదేశాల నుంచి ఇంద్రకీలాద్రికి అధిక సంఖ్యలో వస్తున్నారు. దీనికితోడు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆన్‌లైన్ సేవలు ప్రారంభంకావడంతో విదేశాల నుంచి అన్నదానానికి విరాళాలు రావడం, ప్రత్యేక పూజల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతోంది. రాష్ర్ట రాజధానిగాగా  విజయవాడను  ప్రకటించిన నేపథ్యంలో విదేశీ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
 - త్రినాథరావు, దుర్గగుడి ఈవో
 
ఈ ఏడాది దుర్గమ్మకు సమకూరిన విదేశీ కరెన్సీ
 జనవరి
 యూఎస్‌ఏ డాలర్లు : 396
 ఓమన్ : 500 బైసా
 కెనడా డాలర్లు : 145
 సౌదీ అరేబియా : 173 రియాన్లు
 యూఏఈ : 150 ధీరమ్స్
 లిబ్రాన్  : 9000 మిల్లీలివర్స్
 మలేషియా : 23 ఆర్‌ఎం
 
 ఫిబ్రవరి
 యూఎస్‌ఏ డాలర్లు : 200
 ఆస్ట్రేలియా : 120 డాలర్లు
 ఓమన్ : 61 రియాన్స్ 100 బైసా
 కతార్ : 701 రియాన్స్
 యూఎస్‌ఈ : 120 ధీరమ్స్
 
 మార్చి
 యూఎస్‌ఏ డాలర్లు : 291
 ఓమన్ : 500 బైసా
 సింగపూర్ : 80 డాలర్లు
 ఇంగ్లండ్ : 40 పౌండ్లు
 సౌదీ అరేబియా : 152 రియాన్లు
 యూఏఈ : 720 ధీరమ్స్
 ఉగాండా : 2000 షిలిగ్
 
 ఏప్రిల్
 యూఎస్‌ఏ డాలర్లు : 170
 ఓమన్ : 2,500 బైసా
 యూఏఈ : 30 ధీరమ్స్
 ఆస్ట్రేలియా : 320 డాలర్లు
 కత్తార్ : 120 రియాన్స్
 
 మే
 యూఎస్‌ఏ డాలర్లు : 664
 సౌదీ అరేబియా : 32 రియాన్లు
 యూఏఈ : 110 ధీరమ్స్
 సౌదీ అరేబియా : 32 రియాన్స్
 
 జూన్
 యూఎస్‌ఏ డాలర్లు : 386
 కత్తార్ రియాన్స్ : 177
 కెనడా డాలర్లు : 170
 సౌదీ అరేబియా : 115 రియాన్లు
 యూఏఈ : 200 ధీరమ్స్
 సింగపూర్ : 78 డాలర్లు
 న్యూజిలాండ్ : 30 డాలర్లు
 
 జులై
 యూఎస్‌ఏ డాలర్లు : 570
 ఆస్ట్రేలియా : 30
 ఓమన్ : 500 బైసా
 సౌదీ అరేబియా : 32 రియాన్లు
 యూఏఈ : 530 ధీరమ్స్
 
 ఆగస్టు
 యూఎస్‌ఏ డాలర్లు : 61
 ఓమన్ : 100 బైసా
 బెహరైన్ : 10 దినార్లు
 ఆస్ట్రేలియా : 108 డాలర్లు
 
 సెప్టెంబర్
 యూఎస్‌ఏ డాలర్లు : 472
 కత్తార్ : 48 రియాన్స్
 కెనడా డాలర్లు : 200 డాలర్లు
 యూఏఈ : 55 ధీరమ్స్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement