dollars
-
ప్రపంచంలోనే అత్యంత సంపన్న పిల్లి ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కి ఏకంగా..!
ఎక్కువ సంపాదన కోసం రకరకా మార్గాల్లో అన్వేషిస్తుంటాడు మనిషి. అలా కష్టపడగా..కష్టపడగా.. కొన్నేళ్లకు ధనవంతుడవుతాడు. అదికూడా కొందరికే సాధ్యమవుతుంది. అలా ఓ జంతువు కూడా సంపాదించగలదంటే నమ్ముతారా..!. ఇది చిన్నప్పటి నుంచి దాని విభిన్నమైన లుక్స్‌తో సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రజాధరణ పొంది డబ్బులు ఆర్జించడం మొదలుపెట్టింది. అలా ప్రంపచంలోనే అత్యంత ధనవంతురాలైన పిల్లిగా రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ పిల్లి అంతలా ఎలా సంపాదిస్తుంటే..ఆ పిల్లి పేరు నాలా. ఇది కాలిఫోర్నియాకు చెందిన సియామీ టాబీ మిక్స్ క్యాట్. 2010లో వరిసిరి మేతచిట్టిఫాన్ అనే మహిళ ఈ నాలా అనే పిల్లిని జంతు సంరక్షణ కేంద్ర నుంచి దత్తత తీసుకుంది. అప్పుడు దాని వయసు కేవలం ఐదు నెలలే. 2012లో వరిసిరి తన స్నేహితులకు, కుటుంబ సభ్యలతో తన పెంపుడు పిల్లి క్యూట్ ఫోటోలను షేర్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇన్‌స్టాలో దాని పేరుతో ఒక ప్రొఫెల్ క్రియేట్ చేసింది. కొద్ది కాలంలోనే ఈ పిల్లి వేలాది ప్రజలను ఆకర్షించింది. అలా ఆ పిల్లి ఇన్‌స్టాలో 4.5 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్న జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పింది. ఈ పిల్లి అందమైన తలపాగా, నీలికళ్లతో చూపురులను కట్టిపడేస్తుంది. ఇలా నాలాకు పెరిగిన భారీ ఫాలోయింగే..పెంపుడు జంతువుల విభాగంలో ఫోర్బ్స్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలో చేర్చింది. అంతేగాదు ఈ పిల్లి పేరు మీదుగా లివింగ్ యువర్ బెస్ట్ లైఫ్ అకార్డింగ్ టు నాలా క్యాట్' అనే ఈబుక్‌ను కూడా కలిగి ఉంది. అలాగే ఆమె సొంత వెబ్సైట్ 'లవ్ నాలా' పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ బ్రాండ్‌ను కలిగి ఉంది. నివేదికల ప్రకారం ఈ లవ్ నాలా బ్రాండ్ హస్బ్రో, రియల్ వెంచర్స్, సీడ్ క్యాంప్‌ల వంటి పెట్టుబడుదారుల నుంచి వందల కోట్లు ఆర్జిస్తోంది. ఈ పిల్లి సంపాదనలో ఎక్కువ భాగం సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్, ప్రొడక్ట్స్ ప్రకటనలు, బ్రాండ్ల ద్వారానే ఎక్కువగా ఆర్జిస్తోంది. ఈ పిల్లి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు, టిక్‌టాక్, యూట్యూబ్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ప్రొఫైల్‌ను కలిగి ఉంది. అయితే ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో జంతు సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం, స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించడం వంటివి చేస్తుంది ఆ పిల్లి యజమాని వరిసిరి. కాగా, నాలా తర్వాత ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న పిల్లి ఒలివియా బెన్సన్. ఈ పిల్లి నికర విలువ రూ. 813 కోట్లు. మూడవ అత్యంత సంపన్న పిల్లి దివంగత జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ ఒట్టో లాగర్ఫెల్డ్కు చెందిన చౌపెట్టే. దీనికి రూ. 109 కోట్లు సంపద ఉంది.(చదవండి: 12 ఏళ్లుగా అతనిది 30 నిమిషాల నిద్రే..!) -
‘అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్!’
అగ్రరాజ్యం అమెరికాకు భారీ షాక్. ఈ ఏడాది ప్రపంచంలో పలు దేశాలు వ్యాపార నిమిత్తం వినియోగించే డాలర్‌ను ఇకపై తాము వినియోగించబోమని, సొంత కరెన్సీతో సంబంధిత లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని 20 దేశాలు తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యం అంటే మనకు టక్కున గుర్తుకొచ్చేది అమెరికన్ డాలర్. ప్రపచంలోనే 95 శాతం దేశాలు అమెరికన్ డాలర్ ఆధారంగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే ఇకపై ట్రెండ్ మారనుంది. ఇప్పటికే బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్ వినియోగాన్ని తగ్గించేశాయి. సొంత కరెన్సీని ఆయా వాణిజ్య లావాదేవీలకు ఉపయోగిస్తున్నాయి. డాలర్ పెత్తనాన్ని అయితే తాజాగా మరిన్ని బ్రిక్స్‌లో కూటమైన దేశాలు, ఆసియన్ దేశాలు డాలర్ పెత్తనాన్ని అంగీకరించడం లేదు. సొంతంగా తమ స్థానిక కరెన్సీని మాత్రమే ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యాయి. అటు బ్రిక్స్ కూటమితో పాటు ఆసియన్ దేశాలు సైతం డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టనున్నాయి. బ్రిక్స్ కూటమిలో మరిన్ని దేశాలు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు, గళాన్ని వినిపించేందుకు 2006లో బ్రెజిల్, రష్యా, భారత్, చైనాలకు ‘బ్రిక్’ కూటిమి ఏర్పాటైంది. 2010లో దక్షిణాఫ్రికా చేరాక అది బ్రిక్స్‌గా అవతరించింది. ఆ దేశాలు ఇవే తాజాగా, మరో 5 దేశాలకు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం ఇస్తూ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వచ్చి చేరాయి. ప్రస్తుతం బ్రిక్స్ 10 దేశాల కూటమి అమెరికన్ డాలర్ వినియోగాన్ని విరమించుకోనున్నాయి. బ్రిక్స్ దేశాల కూటమి బాటలో ఆసియా దేశాలు అదే సమయంలో 10 ఆసియన్ దేశాలు బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలు వ్యాపార లావాదేవీలకు యూఎస్ డాలర్ సొంత కరెన్సీని వినియోగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫలితంగా ఈ ఏడాది అదనంగా మరో 16 దేశాలు ఈ డి-డాలరైజేషన్ మిషన్‌లో చేరతాయని ఆర్ధిక నిపుణులు భావిస్తున్నారు. ఇది బలీయమైన ప్రపంచ ఆర్థిక కూటమిగా బ్రిక్స్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో కీలకం ఆసియన్ సభ్యులతో పాటు పాకిస్తాన్, ఇరాక్, టర్కీ, నైజీరియా, ఈజిప్టుతో సహా ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల నుండి అనేక దేశాలు బ్రిక్స్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ చేరికలు రాబోయే 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ఈ అంశం కీలక ఎజెండాగా మారనుందని అంచనా. వ్యాపార లావాదేవీల్లో అమెరికన్ డాలర్ ఆధిపత్యంపై అసంతృప్తి నేపథ్యంలో ప్రపంచంలోని పలు దేశాలు ఈ కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
వెడ్ ఇన్ ఇండియా: 'ప్లీజ్ ఇక్కడే పెళ్లి చేసుకోండి'!
భారతదేశంలో ప్రజలు పెళ్లిళ్లకు ఎంతెంత రేంజ్లో డబ్బుల ఖర్చు పెడతారో తెలిసిందే. నిజం చెప్పాలంటే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే భారత్‌లో అదొక వ్యాపారంలా సాగుతుంది. అయితే ఇటీవల ఆ పెళ్లిళ్లలో ట్రెండ్ మారుతోంది కూడా. ఏకంగా కోట్లు ఖర్చే చేసి మరీ విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలా చేసుకోవడం ఓ స్టేస్ సింబల్‌లా మారిపోయింది. ఇక రానురాను ఆ ట్రెండ్ ఓ రేంజ్లో కొనసాగేలా ఉంది. అయితే మన ప్రధాన మోదీ మాత్రం "ప్లీజ్ మన మాతృభూమిలోనే పెళ్లి చేసుకోండి" అని పిలుపునిస్తున్నారు. ఎందుకని ఆయన ఇలా విజ్ఞప్తి చేస్తున్నారు? కారణమేంటీ..? నిజానికి భారతీయుల్లో పెళ్లిళ్ల కోసం విదేశీయులకు వెళ్లే వాళ్లు కేవలం అత్యధిక ధనవంతులే. సాధారణ మానవుడు పెళ్లి చేసుకుంటే చాలనుకుంటాడు. అంత రేంజ్‌లకు వెళ్లడు. మన దేశంలో బడా బాబులకు కొదవలేదు కూడా. అయితే ఇంతకుమునుపు శ్రీమంతులు విభిన్నంగా కళ్లు చెదిరే ఆర్భాటాలతో చేసుకునేవారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారంటా! అని కథలుగా చెపుకునేవారు. కానీ ఈ 20 ఏళ్లలో పరిస్థితుల చాలా మారిపోయాయి. అంతెందుకు పెళ్లిళ్ల సీజన్‌కి రాజకీయనాయకుల సైతం ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎంతలా అంటే? ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికలే అందుకు నిదర్శనం. ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 23న ఖరారు చేయగా ఆ టైంలో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయని ఏకంగా తేదీనే మార్చారు. వెడ్డింగ్ అతిపెద్ద వ్యాపార ఇండస్ట్రీ.. పెళ్లిళ్ల టైంలో కళ్యాణ మండపాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. వాటి ధరలు హడలెత్తించేలా ఉంటాయి. ఆఖరికి పూల దగ్గర నుంచి నగలు, బట్టలు అన్నింటికి మంచి గిరాకీ టైం అనే చెప్పాలి. ఎంత ఎక్కువ ధర చెప్పినా ప్రజలు కూడా లెక్కచేయకుండా కొనే సమయం కావడంతో వ్యాపారులు కూడా ఈ సీజన్‌ని భలే క్యాష్ చేసుకుంటారు. ఈ దృష్ణ్యా చూస్తే పెళ్లిళ్లు ఓ పెద్ద మార్కెట్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈ పెళ్లి పేరుతో అన్ని రకాల వృత్తుల వారికి చేతినిండా పని, ఆదాయానికి ఆదాయం. పెళ్లిళ్ల కార్యక్రమాలను నిర్వహించే ఈవెంట్ మేనజర్లకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది. గతేడాది 2023లో దాదాపు 38 లక్షల వివాహాలు జరిగాయని, దాదాపు 4.74 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) స్వయంగా పేర్కొంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు ఎందుకింత ఆధరణ.. అందుకు ప్రధాన కారణం..జీవితంలో ఒక్కసారే చేసుకునేది కావడం, గుర్తుండిపోయేలా గ్రాండ్‌గా చేసుకోవాలన్న కోరికలే ఇంతలా ఖర్చు చేసేలా చేస్తోంది. దీంతోపాటు అరచేతిలోనే ప్రపంచంలా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం కూడా కొంత ఉంది. ఈ మేరకు ప్రముఖ మ్యారేజ్ ప్లానర్ అగ్నిశక్తి మాట్లాడుతూ..తాము సుమారు 8లక్షలు నుంచి 3 కోట్ల బడ్జెట్ వరకు వివాహాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ బడ్జెట్ ప్రధాన భాగం వేదికపైనే ఖర్చు అవుతుందని, మిగిలిన బడ్జెట్‌ని ఆహారం, పానీయాలు, డెకరేషన్ సెటప్, ఫోటోగ్రఫీ, మేకప్ ఆర్టిస్టులకు ఖర్చే చేస్తామని చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా వధువు, వరుడు కుటుంబాలకు ప్రత్యేక డిజైనర్లను పెట్టుకుని మరీ బట్టలను కొనుగోలు చేయడం ఓ ట్రెండ్‌గా మారిందని అన్నారు. సెలబ్రెటీలైతే ఈ విషయంలో ఏకంగా సినిమాలో పనిచేసే కాస్ట్యూమ్ డిజైనర్లను కూడా పెట్టుకుంటున్నట్లు తెలిపారు. చాలామంది ఈ లగ్జరీ పెళ్లిళ్లను తమ స్టేటస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా భావించడం కూడా కొంత కారణం. ఈ నేపథ్యంలోనే బహుశా డిస్టినేపన్ వెడ్డింగ్‌లకు బాగా ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఎలాగో లక్షలు లక్షలు ఖర్చుపెడుతున్నాం కాబట్టి అదేదో అందరూ గుర్తు పెట్టుకునేలా విదేశాల్లో చేసుకుంటే..ఎంజాయ్మెంట్కి ఎంజాయ్, అందరూ గొప్పగా కూడా చెప్పకునేలా ఉంటుందన్న ధోరణి ప్రజల్లో బాగా పెరిగిందని మరో వెడ్డింగ్ ప్లానర్ సక్షమ్ శర్మ చెబుత్నునారు. డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు అయ్యే ఖర్చు.. ఇది వారు వెళ్లే ప్రదేశం, వచ్చే అతిథుల బట్టి ఖర్చు ఉంటుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లకు బడ్జెట సుమారు 80 నుంచి 90 లక్షల నుంచి ప్రారంభమవుతుందని పెళ్లిళ్ల ఈవెంట్ మేనేజర్లు చెబుతున్నారు. అదే థాయిలాండ్, బాలి అయితే ఏకంగా కోట్లలోనే బడ్జెట్ మొదలవుతుందని తెలిపారు. ఇంతలా లగ్జరీయస్‌గా పెళ్లి చేసుకోవాడానికి కొన్ని హోటళ్లు క్రెడిట్ లోన్లు కూడా ఇస్తాయట. మోదీ వద్దు అనడానికి రీజన్.. నవంబర్‌లో మన్కి బాత్ రేడియో ప్రసంగంలో ప్రధాన మోదీ విదేశాలలో వివాహాలను చేసుకునే బడా కుటుంబాల ధోరణి కలవరపెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత మొత్తంలో ఖర్చే చేసేటప్పుడూ..మన భారత్‌లో ఉన్న చారిత్రాత్మక ప్రదేశాల్లో హుందాగా చేసుకోండని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేగాదు మేక్ ఇన్ ఇండియా మాదిరిగా వెడ్ ఇన్ ఇండియా అనే ఉద్యమం కూడా చేపట్టాలని అన్నారు. అంతగా కావాలనుకుంటే ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌లు జరుపుకోమని అన్నారు. మోదీ ఇలా అనడానకి ప్రధాన కారణం భారతదేశం డబ్బు విదేశాలకు తరలిపోవడం ఇష్టం లేక ఆయన ఈ విధంగా పిలుపునిచ్చారు. ఇది ఒక రకంగా భారతీయ ఆర్థికవ్యవస్థకు, స్థానిక వ్యాపారులకు ఉపకరించే చొరవ. ఇది చాలామంచి ప్రయత్నమే కానీ భారతీయులను ఇక్కడే పెళ్లిళ్లు చేసుకునేలా మంచి వెడ్డింగ్ సెట్టింగ్ మైదానాలతో మార్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే వెడ్డింగ్ టైంలో భారీ డిమాండ్ పలికే ఫంగ్షన్ హాల్స్ చార్జీల్లో కూడా మార్పులు వస్తే ఇదంతా సాధ్యమని అంటున్నారు ఈవెంట్ మేనేజర్లు. దీంతో ప్రవాస భారతీయులు సైతం తమ సొంత గడ్డలోనే పెళ్లిళ్లు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారని చెబుతున్నారు. అలాగే తమ పెళ్లి గుర్తుండిపోయేలా జరుపుకోవాలనుకునే వాళ్లకు.. మన భారత్‌లో ఉన్న గోవా, రాజస్థాన్, హిమచల్‌ప్రదేశ్, అండమాన్ తదితర ప్రసిద్ద ప్రదేశాలను హైలెట్ చూస్తూ.. అక్కడి ఫంక్షన్ హాల్లో భారీ మార్పులు తీసుకొచ్చేలా తీర్చిదిద్ధడమే గాక అందుబాటు ధరలో ఉండేలా చేస్తే ప్రధాని మోదీ చెబుత్ను నినాదం సాకారం అవుతుందన్ని అంటున్నారు మ్యారేజ్ ఈవెంట్ మేనేజర్లు. ఈ నినాదానికి మద్దతు పలుకుతూ ప్రముఖ సెలబ్రెటీ రియా కపూర్ ఇండియాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు కూడా. భారతదేశం వివిధ ఐకానిక్ ప్రదేశాలకు పెట్టింది పేరు. ఈ చొరవ నిజంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు మంచి బూస్టప్. (చదవండి: ఏకంగా రూ. 1 కోటి వార్షిక వేతనం అందుకుంటున్న భారత విద్యార్థి!అతనేమి ఐఐఎం, ఐఐటీ.. !) -
ఐటీ సర్వ్ అలయెన్స్ ఉదారత.. టాస్క్‌కి రూ. 80 వేలు విరాళం!
అమెరికాలోని ఐటీ సర్వ్ అలయెన్స్ (ఐటీ సర్వీస్ అలియన్స్) నార్త్ ఈస్ట్ చాప్టర్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. న్యూజెర్సీలో సీఎస్ఆర్ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా థాంక్స్ గివింగ్ చేపట్టింది. నార్త్ ఈస్ట్ చాప్టర్ అధ్యక్షుడు కళ్యాణ్ విజయ్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఫుడ్ బ్యాంక్ అయిన ట్రెంటన్ ఏరియా సూప్ కిచెన్ (టాస్క్) కి 1,000 డాలర్ల విరాళం అందజేశారు. ఈ మేరకు ఐటీ సర్క్ సభ్యులు టాస్క్ నిర్వహకులకు చెక్ అందజేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫుడ్ బ్యాంక్‌ను ఐటీ సర్వ్ సభ్యులు సందర్శించారు. టాస్క్ చేస్తున్నసేవా కార్యక్రమాలతో పాటు ఆహారం తయారు చేసే విధానాన్ని ఐటీ సర్వ్ సభ్యులకు నిర్వహకులు వివరించారు. ట్రెంటన్ నగరంలో ఆకలితో మరియు కష్టాల్లో ఉన్న వారి అవసరాలను తీర్చే ఒక అద్భుతమైన సంస్థ టాస్క్ అని ఈ సందర్భంగా కళ్యాణ్ విజయ్ పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగమైనందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ సర్క్ అలయన్స్ తరుపున సహాయం చేసే అవకాశం వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయన్స్ ఉదారతను టాస్క్ ప్రశంసించింది. ఈ ఆర్థిక సాయం ఎంతో మందికి ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. సంస్థ చేస్తున్న సేవాకార్యక్రమాల్లో భాగమై ఆర్థిక సహాయసహాకారాలు అందించినందుకు ఐటీ సర్వ్ అలయన్స్ కు ధన్యవాదాలు తెలిపారు. ఐటీ సర్వ్ అలయెన్స్ అనేది ఐటీ రంగానికి చెందిన 1400 కంపెనీలతో ఏర్పడిన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అమెరికాలోని 22 రాష్ట్రాలలో ఉన్న 19 చాప్టర్లలో ఈ సంస్థ ఐటీ సేవలను అందిస్తోంది. ఈ సంస్థలో ఉన్న ఐటీ కంపెనీల మొత్తం ఆదాయం 10 బిలియన్ డాలర్లు. లక్ష మంది ఐటీ నిపుణులు ఈ సంస్థల్లో పనిచేస్తున్నారు. (చదవండి: ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఏఏఏ ఆస్టిన్ చాప్టర్ ప్రారంభం) -
చెత్త కుప్పలో బ్యాగ్...తీసి చూస్తే డాలర్ల కట్టలు
బెంగళూరు: చెత్త ఏరుకునే ఓ వ్యక్తి రోజూలాగే తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ఓ చెత్తకుప్ప దగ్గర అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. ఆశతో ఆ బ్యాగులో ఏమున్నాయో అని చూసిన అతనికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఆ బ్యాగులో అతనికి ఏకంగా 3 మిలియన్ డాలర్ల అమెరికన్ కరెన్సీ దొరికింది. మన రూపాయి విలువలో చెప్పాలంటే వాటి విలువ రూ.25 కోట్లు. అన్ని అమెరికన్ డాలర్లు చూసి ఎగిరి గంతేసిన ఆ చెత్త ఏరుకునే వ్యక్తి వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి విషయం తన బాస్‌కు చెప్పాడు. ఆ బాస్ ఓ సోషల్ యాక్టివిస్ట్ చెవిన ఈ విషయాన్నివేశాడు. ఆ సోషల్ యాక్టివిస్ట్ వెంటనే పోలీసులకు డాలర్ల కట్టల బ్యాగ్ దొరికినట్లు చెప్పాడు. దీంతో సీన్లోకి ఎంటరైన పోలీసులు డాలర్లు అసలువా కావా కన్ఫమ్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి వాటిని పంపారు. వాటిని పరిశీలించిన ఆర్బీఐ ఆ డాలర్లన్నీ ఫేక్ అని తేల్చింది. -
చెత్త కుప్పలో 30 లక్షల డాలర్లు
బనశంకరి: రోడ్డు పక్కన చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తికి ఒక బ్యాగు దొరికింది. అందులో 30 లక్షల అమెరికన్ డాలర్ల కట్టలున్నాయి. భారతీయ కరెన్సీలోకి మారిస్తే వాటి విలువ సుమారు రూ.25 కోట్లు ఉంటుంది. ఈ నెల 3వ తేదీన బెంగళూరు నాగవార రైల్వేస్టేషన్ వద్ద పట్టాల పక్కన ఎస్కే సాల్మన్ చెత్త సేకరిస్తుండగా ఓ బ్యాగు దొరికింది. దానిపై యునైటెడ్ నేషన్స్ అనే ముద్ర ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియాకు చెందిన ఎస్కే సాల్మన్ బెంగళూరులో చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సంచిని అమృతహళ్లిలోని ఇంటికి తీసుకెళ్లి తెరిచి చూడగా 23 బండిళ్ల డాలర్లు కనిపించాయి. ఏం చేయాలో తెలియక గుజరీ వ్యాపారికి ఈ విషయం చెప్పాడు. తాను వేరే ఊరికి వెళ్లానని, బెంగళూరుకు వచ్చేవరకు మీ వద్ద పెట్టుకోవాలని సూచించాడు. కానీ భయపడ్డ సాల్మన్.. రెండురోజుల తర్వాత స్వరాజ్ ఇండియా సామాజిక కార్యకర్త ఆర్.కలీముల్లాను కలిసి విషయం చెప్పాడు. కలీముల్లా ఈ సంగతిని నగర పోలీస్ కమిషనర్ దయానందకు తెలిపారు. ఆయన సూచనతో సాల్మన్‌ను, నగదును తీసుకుని కమిషనర్ ఆఫీసుకు వెళ్లారు. మరోవైపు నగదు దొరికిన ప్రదేశంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ డాలర్లు నకిలీవని భావిస్తున్నారు. తనిఖీ కోసం వాటిని నగరంలోని రిజర్వు బ్యాంకుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. ఈ డబ్బు ఐక్యరాజ్యసమితి ఆర్థిక నేరాల విభాగానికి చెందినదని పోలీసులు చెప్పారు. బ్యాగులో విషపూరితమైన రసాయనాలున్నందున.. తెరిచేటప్పుడు జాగ్రత్త అని ఒక పెద్ద లెటర్ కూడా అందులో ఉండటం విశేషం. అంత డబ్బును చూశాక తాను ఉద్వేగంతో ఒక రోజంతా నిద్రపోలేదని సాల్మన్ చెప్పాడు. -
"విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..
ఇంతకుమునుపు విన్నాం ఓ సాధారణ కూలీ ఏకంగా విమానంలాంటి ఇల్లుని నిర్మించాడని. అందుకోసం ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చాడు. కానీ ఇక్కడొక వ్యక్తికి అసలు విమానాన్నే ఇల్లుగా మార్చుకుంటే అని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను కార్యరూపం ఇచ్చి మరీ తన సృజనాత్మకతకు జోడించి విలాసవంతమైన ఇల్లుగా మార్చాడు. చూస్తే అక్కడ విమానం ఆగిందేమో అనుకునేలా ఆ ఇల్లు ఉంటుంది. లోపలకి చూస్తే ఇల్లులా ఉంటుంది. అద్భతం కదా! అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, ఆ విమానం ఎక్కడది? తదితర సందేహాలు వచ్చేస్తున్నాయా!..ఆ కథ కమామీషు ఏంటో చూద్దాం!. అసలేం జరిగిందంటే..అమెరికాకు చెందిన 64 ఏళ్ల రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ బ్రూస్ క్యాంపెబెల్కి చిన్నప్పటి నుంచి పాత వస్తువులను కొత్తవాటిగా మార్చడం అతని ప్రత్యేకత. సరుకులు రవాణా చేసే విమానమే ఇల్లుగా మార్చాలనే ఓ డ్రీమ్ ఉంది. హెయిర్ స్టయిలిస్ట్ జాన్ ఉస్సేరీ.. బోయింగ్ 727 విమానాన్ని కొనుగోలు చేసి ఇల్లుగా మార్చకుందని, ఆమె ఇల్లు అగ్రిప్రమాదంలో కాలిపోవడంతో ఇలా వినూత్నంగా ఆలోచించి రూపొందించదని విన్నాడు. అదే క్యాపెంబెల్కు విమానాన్ని ఇల్లుగా మార్చే ఆలోచనకు పురికొల్పింది. అందుకోసం క్యాపెంబెల్ ఒరెగాన్లోని హిల్స్‌బోరో అడవుల్లో 10 ఎకరాల భూమిని 23 వేల డాలర్లు(రూ. 19 లక్షలు)కు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఒలింపిక్ ఎయిర్వేస్ నుంచి బోయింగ్ 727 విమానాన్ని లక్ష డాలర్లకు(రూ. 85 లక్షలకు) కొనుగోలు చేశాడు. అయితే ఆ విమానాన్ని ఒరెగాన్లోని అడవులకు తీసుకువచ్చే రవాణా ఖర్చులు మాత్రం తడిసిమోపడయ్యాయి. అయిన వెనుకడుగు వేయలేదు క్యాంప్‌బెల్. చేయాలనుకుంది చేసే తీరాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు క్యాంప్‌బెల్. ఇక ఆ విమానాన్ని ఎన్నో ప్రయాసలు పడి ఆ అడవులకు చేర్చాక దాన్ని ఇల్లులా మర్చే పనికి ఉపక్రమించాడు. ఎలాగో విమానంలో సీట్లు టాయిలెట్లు ఉంటాయి కాబట్టి ఇక వాషింగ్ మిషన్, షింక్ వంటివి, కిచెన్‌కి కావల్సిన ఇంటీరియర్ డిజైన్ చేసుకుంటే చాలని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆ విధంగానే దాన్ని అత్యంత విలాసవంతమైన ఇల్లులా మార్చేశాడు. క్యాంపెబెల్ వంట చేసేందుకు మైక్రోవేవ్, టోస్టర్‌ని ఉపయోగిస్తాడు. అద్భుతమైన భారీ "ఎయిర్‌ప్లేన్ హోం" చూపురులను కట్టేపడేసేంత ఆకర్షణగా ఉంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఇకెందుకు ఆలస్యం మీరు కూడా క్యాంపెబెల్లా ప్లేన్హోం లాంటి లగ్జరీ ఇల్లును కట్టుకునేందుకు ట్రై చేయండి మరీ. (చదవండి: అక్కడ వరదలా.. వీధుల గుండా "వైన్ ప్రవాహం"..షాక్‌లో ప్రజలు) -
చంద్రయాన్-3 సక్సెస్: సోషల్‌మీడియాలో 45 ట్రిలియన్ డాలర్ల మోత
Chandrayaan-3 VS 45 Trillion చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండింగ్ అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటోంది. చంద్రయాన్-3 గ్రాండ్ సక్సెస్ తరువాత ఇస్రో ఇంజనీర్ల ఘనతను పలు దేశాలు అభినందించాయి. అయితే బ్రిటీష్ మీడియాలో జెలసీతో అనూహ్య వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది. దీంతో ఇండియానుంచి బ్రిటిష్ వలసపాలకులు కొల్లగొట్టిన 45 ట్రిలియన్ డాలర్లు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి. (చంద్రయాన్-3 మరో ఘనత: యూట్యూబ్‌లో టాప్ రికార్డ్) సోషల్ మీడియాలో,ఒక జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్య దుమారం రేపుతోంది. భారత ఘనతపై అక్కసు వెళ్లగక్కుతున్న జర్నలిస్టు పాట్రిక్ క్రిస్టీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూన్ మిషనను అభినందిస్తూనే చంద్రుని దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను విజయవంతంగా ల్యాండ్ చేసిన తర్వాత గత ఎనిమిది సంవత్సరాలుగా యూకే నుంచి 2.5 బిలియన్డాలర్లను విదేశీ సహాయాన్ని వెనక్కి ఇవ్వాలంటూ పాట్రిక్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు న్యాయవాది శశాంక్ శంకర్ ఝా భారతీయులనుంచి దోచుకున్న45 ట్రిలియన్ డాలర్లను తిరిగి ఇవ్వాలంటూ కౌంటర్ ఇచ్చారు. India has become the first country to successfully land a spacecraft near the south pole of the moon so why did we send them £33.4 million in foreign aid which is set to rise to £57 million in 24/25 Time we get our money back. — Sophie Corcoran (@sophielouisecc) August 23, 2023 అలాగే అంతరిక్షంలోని రాకెట్లను పంపించేందుకు ఇక దేశాలకు యూకే సాయం అందించకూడదు అంటూ సోఫియా కోర్కోరన్ ట్వీట్ చేశారు. అంతేకాదు తమ డబ్బు తిరిగి తమకు కావాలని కూడా ఈమె పేర్కొన్నారు. దీంతో భారతీయ యూజర్లు మండిపడుతున్నారు. భారతదేశం నుండి దోచుకున్న సొమ్ము 45 ట్రిలియన్ డాలర్లు అని కమెంట్ చేస్తున్నారు. మా కొహినూర్ మాకిచ్చేయండి అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు భారత్ 2015నుంచి ఎలాంటి సాయం తీసుకోలేదంటూ పేర్కొన్నారు. ‘Britain, give us back our $44.997 TRILLION!’ Hi @PatrickChristys, @GBNEWS Thank you for reminding about the grant. Now ‘as a rule, salute us & return $45 TRILLION you’ve looted from us’ Britain gave, as you say, £2.3 BILLION i.e. $2.5 BILLION. Deduct it & return the… pic.twitter.com/9lSfwpvoWn — Shashank Shekhar Jha (@shashank_ssj) August 23, 2023 కాగా 1765 -1938 మధ్య కాలంలో బ్రిటన్ భారతదేశం నుండి దాదాపు 45 ట్రిలియన్డాలర్ల మొత్తాన్ని దోచుకుందని ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ కొలంబియా యూనివర్శిటీ ప్రెస్ ప్రచురించిన పరిశోధన తర్వాత తొలుత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పట్నాయక్ పన్ను మరియు వాణిజ్యంపై దాదాపు రెండు శతాబ్దాల వివరణాత్మక డేటాను విశ్లేషించిన తర్వాత ఈ డేటాను వెల్లడించారు.అయితే ఈ ఏడాది మార్చిలో ది గార్డియన్ నివేదిక ప్రకారం, భారతదేశానికి యూకే సహాయం 2015లో ఆగిపోయింది. అయితే ఇండిపెండెంట్ కమిషన్ ఫర్ ఎయిడ్ ఇంపాక్ట్ సమీక్ష ప్రకారం సుమారు 2.3 బిలియన్లు పౌండ్లు (రూ. 23,000 కోట్లు) 2016 -2021 మధ్య భారతదేశానికి అందాయి. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహంలేదు. దశాబ్దాలు పాటు భారత్‌ను పాలించిన బ్రిటీషర్లుమనదేశంలోని ఎనలేని సంపదను దోచుకుపోయారు. బంగారం, వజ్ర వైడూర్యాలు లాంటి ఎంతోఘనమైన సంపదను తమ దేశానికి తరలించుకుపోయారు. ఇండియా నుంచి బ్రిటీషర్లు తమ దేశానికి తరలించిన సంపద.. ప్రస్తుత విలువలో దాదాపుగా 45 ట్రిలియన్ డాలర్లకు సమానం. -
5.2 బిలియన్ డాలర్లకు.. పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ
కోల్‌కతా: దేశీయంగా పరిమళాలు, ఫ్లేవర్ల పరిశ్రమ ఏటా 12 శాతం వృద్ధి చెందనుంది. దీంతో వచ్చే మూడు, నాలుగేళ్లలో 5.2 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనాలు నెలకొన్నాయి. ఫ్రాగ్రెన్సెస్ అండ్ ఫ్లేవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏఎఫ్ఏఐ) ప్రెసిడెంట్ రిషభ్ కొఠారీ ఈ విషయాలు తెలిపారు. ‘దేశీయంగా ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఇది 3.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది‘ అని ఆయన చెప్పారు. వినియోగదారుల అభిరుచుల్లో మార్పులు, ఇతరత్రా అంశాలపై ఖర్చు చేయగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని కొఠారీ వివరించారు. ఆహారోత్పత్తులు, పానీయాలు, వ్యక్తిగత సౌందర్య సంరక్షణ, హోమ్‌కేర్, ఫార్మా, కాస్మెటిక్స్ మొదలైన రంగాల్లో వీటిని ఎక్కువగా వినియోగి స్తుంటారు. సహజసిద్ధమైన, సేంద్రియ ఉత్పత్తులవైపు వినియోగదారులు మళ్లుతున్నందున ఆ విభాగాల్లో ఫ్రాగ్రెన్స్, ఫ్లేవర్స్ సంస్థలకు వ్యాపార అవకాశాలు ఉన్నాయని కొఠారీ పేర్కొన్నారు. -
పాన్ మసాలా ప్యాకెట్లలో 32 లక్షల యూఎస్ డాలర్లు, కంగుతిన్న అధికారులు
ఒక వ్యక్తి ఎయిర్ పోర్ట్‌లో వందలకొద్ది పాన్‌మసాలా ప్యాకేట్లతో పట్టుబడినట్లు కోల్‌కత్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. వాటిలో ఏకంగా రూ 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీని ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించాడు. దీంతో ఎయిర్పోర్ట్ ఇంటిలిజెన్స్ అధికారులు కోల్‌కతా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన కస్టమస్స్ అధికారులు నిందితుడు పాన్‌మసాలా ప్యాకెట్లలో యూఎస్ కరెన్సీని తరలించే విధానం చూసి కంగుతిన్నారు. సుమారు రూ. 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తామ తనిఖీలు చేస్తున్నప్పుడు వందలకొద్ది పాన్ మసాల ప్యాకెట్లు చూసి ఆశ్యర్యపోయాం అన్నారు. ఆ పాన్ ప్యాకెట్లలో ఒక పారదర్శక కవర్లో ఒక జతన యూఎస్ కరెన్సీ దానితో పాటు పాన్ పౌడర్ పెట్టి ప్యాక్ చేశారు. ఒక పెద్ద ట్రాలీ లగేజ్‌లో నిండా ఈ మసాల ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది) #WATCH | AIU officials of Kolkata Customs intercepted a passenger scheduled to depart to Bangkok yesterday. A search of his checked-in baggage resulted in the recovery of US $40O00 (worth over Rs 32 lakh) concealed inside Gutkha pouches: Customs pic.twitter.com/unxgdR7jSu — ANI (@ANI) January 9, 2023 -
పీఈ పెట్టుబడులు 77 శాతం డౌన్
ముంబై: ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు సెప్టెంబర్ త్రైమాసికంలో 3.84 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఏకంగా 77.5 శాతం క్షీణించాయి. సీక్వెన్షియల్‌గా జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 43.5 శాతం తగ్గాయి. 2021 మూడో త్రైమాసికంలో పీఈ పెట్టుబడులు 17.05 బిలియన్ డాలర్లుగా ఉండగా ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 6.80 బిలియన్ డాలర్లు వచ్చాయి. లండన్ స్టాక్ ఎక్సే్చంజ్ గ్రూప్‌లో భాగమైన రెఫినిటివ్ సమీకరించిన డేటాలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో పీఈ పెట్టుబడులు 33 శాతం క్షీణించి 19.6 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. మరోవైపు, భారత్ ఆధారిత పీఈ ఫండ్స్ తొలి తొమ్మిది నెలల్లో 8.98 బిలియన్ డాలర్లు సమీకరించాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఈ మొత్తం 123 శాతం అధికం. తగ్గిన డీల్స్.. : డేటా ప్రకారం సెప్టెంబర్ త్రైమాసికంలో డీల్స్ 14.6 శాతం తగ్గాయి. 478 నుంచి 408కి పడిపోయాయి. అయితే, జూన్ త్రైమాసికంలో నమోదైన 356 డీల్స్‌తో పోలిస్తే 14.6 శాతం పెరిగాయి. తొలి తొమ్మది నెలల్లో ఇంటర్నెట్ సంబంధ కంపెనీల్లోకి పెట్టుబడులు 52 శాతం తగ్గి 7.47 బిలియన్ డాలర్లకు పరిమితం కాగా, కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి 29 శాతం పెట్టుబడులు తగ్గాయి. అటు ఫైనాన్షియల్ సర్వీసుల కంపెనీల్లోకి వచ్చే నిధులు 25.7 శాతం, ఇండస్ట్రియల్స్‌లోకి 12.4 శాతం క్షీణించాయి. రవాణా రంగంలోకి మాత్రం 56.8 శాతం, కమ్యూనికేషన్స్‌లో 950 శాతం, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంస్థల్లోకి 197 శాతం పెరిగాయి. టాప్ డీల్స్‌లో కొన్ని.. వెర్స్ ఇన్నోవేషన్ (827.7 మిలియన్ డాలర్లు), థింక్ అండ్ లెర్న్ (800 మిలియన్ డాలర్లు), బండిల్ టెక్నాలజీస్ .. భారతి ఎయిర్టెల్ (చెరి 700 మిలియన్ డాలర్లు), టాటా మోటర్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (494.7 మిలియన్ డాలర్లు) మొదలైనవి టాప్ డీల్స్‌లో ఉన్నాయి. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
శ్రీశైలం మల్లన్న హుండీలో 378 యూఎస్ డాలర్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలదేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో ఉన్న హుండీలలో భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఇందులో రూ.4,08,66,617 నగదు, 335.40 గ్రాముల బంగారం, 8.400 కేజీల వెండి ఉంది. అలాగే 378 యూఎస్ఏ డాలర్లు, 50 కెనడా డాలర్లు, 105 ఇంగ్లాండ్ ఫౌండ్స్, 70 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూఏఈ దిర్హమ్స్, 2 మలేషియా రింగిట్స్, 3 ఖతర్ రియాల్స్ తదితర విదేశీ కరెన్సీ లభించింది. పటిష్టమైన సీసీ కెమెరాల మధ్య అలంకార మండపంలో కానుకల లెక్కింపు జరిగింది. లెక్కించిన హుండీ కానుకలు భక్తులు గత 27 రోజుల్లో సమర్పించినవి అని దేవస్థానం ఈఓ ఎస్ లవన్న తెలిపారు. (క్లిక్: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం) సాక్షి గణపతికి పూజలు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో లోక కల్యాణార్థం బుధవారం సాక్షి గణపతి స్వామికి విశేష పూజలు నిర్వహించారు శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. (క్లిక్: కొత్త సొబగులద్దుకున్న వైఎస్సార్ స్మృతివనం) -
మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?
బడ్జెట్ అంటేనే డబ్బుల లెక్కలు.. అంటే మనకు గుర్తొచ్చేవి కరెన్సీ నోట్లు, నాణేలే. నాగరికతలు అభివృద్ధి చెందిన మొదట్లో డబ్బులనేవే లేవు. ఓ వస్తువు ఇవ్వడం, బదులుగా మరో వస్తువు తీసుకోవడమే. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి, ఇతర లోహాలతో చేసిన నాణేలు కరెన్సీగా అమల్లోకి వచ్చాయి. కాగితాన్ని కనిపెట్టాక నోట్లు మొదలయ్యాయి. అందులోనూ ఏ దేశానికి ఆ దేశం నచ్చినట్టుగా కరెన్సీ నోట్లు, నాణేలను తయారు చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ కరెన్సీలో కొన్ని చిత్రాలేమిటో చూద్దామా..? స్టాంపు కాదు డబ్బులే.. ప్రపంచంలోనే ఇప్పటివరకు అధికారికంగా చలామణీ అయిన అతిచిన్న కరెన్సీ నోటు.. రొమేనియా దేశానికి చెందిన ‘10 బని’. 1917లో ముద్రించిన ఈ కరెన్సీనోటు పరిమాణం 4.4 సెంటీమీటర్ల ఎత్తు, 3.3 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే. అంటే కాస్త పెద్ద సైజు స్టాంపు అంత అన్నమాట. సాధారణంగా కరెన్సీ నోట్లు తక్కువ ఎత్తుతో, ఎక్కువ వెడల్పుతో అడ్డంగా ఉంటాయి. కానీ దీని ఎత్తు ఎక్కువ, వెడల్పు తక్కువ. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ నోట్లకు నకిలీలను తయారు చేస్తే పదేళ్లు జైల్లో వేస్తామని ఆ నోటుపైనే ముద్రించారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) సర్టిఫికెట్ సైజులో లక్ష నోటు... ఈ ఫొటోలో ఓ సర్టిఫికెట్ అంత పెద్దగా కనిపిస్తున్నది ఫిలిప్పీన్స్‌కు చెందిన లక్ష పెసోల కరెన్సీ నోటు. ఆ దేశానికి స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం వచ్చి 300 ఏళ్లయిన సందర్భంగా.. 1998లో 14 అంగుళాల పొడవు, 8.5 అంగుళాల వెడల్పుతో ఈ నోటును విడుదల చేసింది. ప్రపంచంలో అధికారికంగా చెలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు ఇదే. కోటి కోట్ల కోట్లు.. ఒక్క నోటు మామూలుగా మనం చూసే పెద్ద నోట్లు అంటే ఏంటి? ఐదు వందలు, రెండు వేలే కదా. ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేది. మరి ప్రపంచంలో ఇలా అత్యధిక డినామినేషన్ ఉన్న నోటు ఏదో తెలుసా..? హంగరీ దేశానికి చెందిన ‘కోటి కోట్ల కోట్లు (100 మిలియన్ బిలియన్)’ పెంగో నోటు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అది. 1946లో రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న హంగరీలో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. దాంతో ఈ నోటును విడుదల చేశారు. 2008లో జింబాబ్వేలో ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఏకంగా కోటి కోట్ల (హండ్రెడ్ ట్రిలియన్) జింబాబ్వే డాలర్ల నోట్లను విడుదల చేసింది. పోకెమాన్.. డాలర్ మిక్కీమౌస్.. 2 డాలర్లు సాధారణంగా ఏ దేశమైనా తమ నాణేలపై ప్రముఖులు, తమ దేశ ప్రత్యేకతలు వంటివాటిని ముద్రిస్తుంటుంది. కానీ నియూ మాత్రం చిత్రంగా స్టార్‌వార్స్, పోకెమాన్, మిక్కీమౌస్, చివరికి ఇటీవలి ఫ్రాజెన్ వంటి యానిమేటెడ్ క్యారెక్టర్లను కాయిన్లపై ముద్రిస్తోంది. పసిఫిక్ సముద్రం మధ్యలో చిన్న దీవి అయిన నియూ.. న్యూజిలాండ్ పర్యవేక్షణలో స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. ‘నియూ డాలర్స్’గా పిలిచే ఈ కరెన్సీ అధికారికంగా చెల్లుబాటు అవుతుంది కూడా. -
సాఫ్ట్వేర్ ఉద్యోగులకు బంపరాఫర్!!
ఓ స్వచ్ఛంద సంస్థ తాము ఎంపిక చేసిన ప్రాంతంలో నివసించే వారికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు 10వేల డాలర్లు(రూ.7లక్షల పై మాటే) విలువ చేసే బిట్కాయిన్లను ఉచితంగా అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది. అమెరికాకు చెందిన నార్తవెస్ట్ ఆర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్..ఆ ప్రాంతంలో వచ్చి స్థిరపడేవారికి భారీ ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు 2020నవంబర్ నుంచి ఫ్రీగా 10 వేలడాలర్లతో పాటు రోడ్ బైక్ లేదంటే మౌంటెన్ బైక్ అందిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి లాభపేక్షలేకుండా ఫ్రీగా అంతపెద్దమొత్తాన్ని ఎలా చెల్లిస్తారనే ప్రశ్నకు సమాధానంగా నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్ కౌన్సిల్ సభ్యులు స్పందించారు. నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్‌కు వలసల్ని ప్రోత్సహించడంతో పాటు ఆ ప్రాంతాన్ని క్రిప్టో హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ ప్రోత్సహకాల్ని అందిస్తున్నాం. బ్లాక్‌చెయిన్‌పై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలను ఆకర్షించాలనదే మా ఉద్దేశం. ఈ ఆఫర్లో ఎవరైనా పాల్గొనచ్చని కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈఓ నెల్సన్ పీకాక్ తెలిపారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం..ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి 50మంది తరలి వచ్చినట్లు తెలుస్తోంది. బిట్కాయిన్ల ఇన్సెంటీవ్లను అందించడం ద్వారా రానున్న రోజుల్లో 7,500 ఓపెన్ టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో సహాయపడుతుందని కౌన్సిల్ భావిస్తోంది. చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు! -
బాబ్బాబు.. మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లిస్తాం..!
ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! ఫేస్ వాల్యూ.. ఫేస్ వాల్యూ అంటుంటారు కదా..మన ఫేస్కీ వాల్యూ ఇచ్చే రోజు వచ్చేసింది.‘మీ వయసు 25లోపు ఉందా? అందమైన ముఖవర్చస్సు మీ సొంతమా?అయితే మీలాంటి వారి కోసమే వెతుకున్నాం. కాస్త మీ ‘ముఖాన్ని’మాకు ఇస్తారా? ఊరికనే కాదులెండి.. కోట్లలో భారీ నజరానా ఇస్తాం.’ అంటూ ‘నెట్టిం'ట్లో తాజాగా చక్కర్లు కొట్టిన ప్రకటన ఇది. ఈ విచిత్రమైన యాడ్‌కు ఔత్సాహికుల నుంచి స్పందన సైతం అనూహ్యంగానే వచ్చింది. తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఒకరిద్దరు కాదు.. ఏకంగా 20 వేల మందికిపైగా తమ ‘ముఖాలను’ ఇచ్చేందుకు సిద్ధమంటూ దరఖాస్తులు పంపారు! ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆధునిక రోబోలను ఎంత అందంగా తయారు చేసినా, కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా వాటికి మనిషి రూపాన్ని జోడించినా అందులో కృత్రిమత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ప్రోమోబోట్ అనే హ్యూమనాయిడ్ రోబోల తయారీ కంపెనీ మనిషి ముఖాన్ని అచ్చుగుద్దినట్లుండే రోబోను తయారు చేసేందుకు సిద్ధమైంది! తమ ‘క్లయింట్ల’ కోరిక మేరకు ఉత్తర అమెరికా, మిడిల్‌ఈస్ట్‌లోని వివిధ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఎయిర్‌పోర్టుల్లో దాన్ని ‘పని’కి కుదర్చనుంది. ఇందుకోసం ఎవరైనా తమ ముఖాన్ని రోబో తయారీలో వాడుకునేందుకు ముందుకొస్తే ఏకంగా రూ. కోటిన్నర నజరానా ఇస్తామని ప్రకటించింది!! హ్యూమనాయిడ్ అసిస్టెంట్‌గా సేవలందించబోయే రోబోతో పర్యాటకులు మాటకలిపేలా ఆ ‘ముఖం’ కనిపించాలన్నదే షరతు అట! అలాంటి ముఖాన్ని శాశ్వతంగా రోబోపై ముద్రించేందుకు చట్టబద్ధంగా సమ్మతించిన వారికి ఈ బహుమానాన్ని ఇస్తామని కంపెనీ తెలిపింది. ఒక భారీ ప్రాజెక్టును ప్రారంభించడంలో నెలకొన్న చట్టపరమైన జాప్యాన్ని అధిగమించేందుకు తమ క్లయింట్లు సరికొత్త రోబో రూపాన్ని కోరుకున్నారని, అందుకే ఈ వెరైటీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు కంపెనీ వివరించింది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదట. ఈ రోబో తయారీ కోసం ముందుగా మనిషి ముఖంతోపాటు శరీర 3డీ నమూనాను తీసుకొని కొలతలు తీసుకుంటారట. ఆపై ఆ వ్యక్తి 100 గంటలకు సమానమైన సంభాషణలను రికార్డు చేసి ఇవ్వాలట. చివరగా అపరిమిత కాలానికి తన ముఖాన్ని ప్రింట్ లేదా డిజిటల్ రూపంలో ఆ సంస్థ వాడుకునేలా నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలట. ఇవన్నీ సవ్యంగా సాగితే 2023లో ఈ సరికొత్త రోబో ప్రపంచానికి తన ‘ముఖం’ చూపించనుంది. -
3 శాతం పెరిగి, జులైలో కార్పొరేట్ డీల్స్ రూ.97,680 కోట్లు
ముంబై: దేశీయంగా కార్పొరేట్ డీల్స్ (ఒప్పందాలు) జూలై నెలలో 3 శాతం పెరిగి 13.2 బిలియన్ డాలర్లు (రూ.97,680 కోట్లు)గా నమోదైనట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ ఓ నివేదిక రూపంలో తెలిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరగ్గా.. ఈ ఏడాది జూన్ నెలతో పోలిస్తే 6 శాతం పురోగతి కనిపించింది. కరోనా తర్వాత కంపెనీలు తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే వ్యూహంలో భాగంగా చౌకగా నిధులు సమీకరించడంతోపాటు.. నగదు నిల్వలను ఖర్చు పెట్టడంపై దృష్టి సారించినట్టు గ్రాంట్ థార్న్టన్ పార్ట్నర్ శాంతి విజేత తెలిపారు. రానున్న నెలల్లోనూ ఒప్పందాలు సానుకూలంగానే ఉంటాయని అంచనా వేశారు. జూలై నెలలో విలీనాలు, కొనుగోళ్లకు సంబంధించి (ఎంఅండ్ఏ) 36 ఒప్పందాలు నమోదయ్యాయి. వీటి విలువ 5.6 బిలియన్ డాలర్లుగా ఉంది. సంఖ్యా పరంగా చూస్తే 13 శాతం పెరిగాయి. కానీ విలువ పరంగా ఎంఅండ్ఏ ఒప్పందాల విలువ 37 శాతం తగ్గింది. ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులకు సంబంధించి 145 ఒప్పందాలు నమోదు కాగా.. వీటి విలువ 7.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ సొల్యూషన్స్, ఈ కామర్స్, కన్జ్యూమర్ రిటైల్, డిజిటల్ హెల్త్‌కేర్, ఫిన్‌టెక్, ఎడ్టెక్ కంపెనీల విభాగాల్లో లావాదేవీలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లు పెరగడం, నగదు లభ్యత అధికంగా ఉండడం, కరోనా కారణంగా ప్రయోజనం పొందే రంగాల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరగడం సానుకూలించినట్టు గ్రాంట్ థార్న్టన్ పేర్కొంది. చదవండి: భవిష్యత్తులో ఏం జరుగుతుందో, కనిపెట్టే పనిలో అమెరికా -
డాలర్ల కోసం బ్యాంకర్ల డిమాండ్
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు తగ్గి 73.64 వద్ద ముగిసింది. బ్యాంకర్లు, చమురు దిగుమతిదారుల నుంచి అమెరికా డాలర్లకు భారీ డిమాండ్ దీనికి కారణం. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... సోమవారం రూపాయి ముగింపు 73.48. మంగళవారం 73.33 వద్ద సానుకూలంగానే ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే డాలర్ల కోసం భారీ డిమాండ్‌తో ఒక దశలో 73.72 కనిష్టానికి కూడా చూసింది. రోజంతా ఈ శ్రేణి (73.33–73.72)లోనే రూపాయి తిరిగింది. పోర్టిఫోలియో ఇన్‌ఫ్లోల (ఈక్విటీల్లో విదేశీ అమ్మకాలు) పరిస్థితుల్లో డాలర్ల అవసరాల రీత్యా ఆర్బీఐ తరఫున బ్యాంకులు డాలర్లు కొనుగోలు చేస్తున్నట్లు భావిస్తున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. (నేడు ప్రతికూల ఓపెనింగ్?! ) ఇక చమురు దిగుమతిదారుల నుంచి కూడా డాలర్లకు డిమాండ్ ఉన్నట్లు ఎల్కేపీ సెక్యూరిటీస్‌లో సీనియర్ రిసెర్చ్ విశ్లేషకులు (కమోడిటీ అండ్ కరెన్సీ) జితిన్ త్రివేది తెలిపారు. 73.40–73.50 మధ్య రూపాయి నిలకడగా ఉండడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోందని పేర్కొన్నారు. అయితే సమీప భవిష్యత్తులో 73.90–74.10 వరకూ రూపాయి వెళ్లే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. ఇక అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై భారీ క్షీణ రేట్ల అంచనా కూడా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోందని నిపుణుల అంచనా. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). 73.83 వద్ద నిరోధం, 73.20 వద్ద మద్దతు ఉందని హెచ్డీఎఫ్సీ రిటైల్ రిసెర్చ్ డిప్యూటీ హెడ్ దేవర్షి వకీల్ పేర్కొన్నారు. (ఎస్బీఐ ఏటీఎంకు మొబైల్ తీసుకెళ్లండి!) -
ఈ–కామర్స్ వ్యాపారం 52 బిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విభాగం ఆదాయం 2022 నాటికి 52 బిలియన్ డాలర్ల (రూ.3.53లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా. 2017 నాటికి ఇది 25 బిలియన్ డాలర్లు(రూ.1.7లక్షల కోట్లు)గా ఉందని మార్కెటింగ్ కంపెనీ ‘అడ్మిటాడ్’ అధ్యయన నివేదిక తెలియజేసింది. 37 శాతం జనాభా ఇంటర్నెట్ వినియోగిస్తుండగా, వీరిలో 14 శాతం ఆన్లైన్ కొనుగోళ్లు చేస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ యూజర్లు 2021 నాటికి 45 శాతం పెరుగుతారని అంచనా వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ఆన్లైన్ కొనుగోలుదారులు 90 శాతం పెరుగుతారని పేర్కొంది. డెస్క్‌టాప్ ద్వారా కొనుగోళ్లు 56 శాతంగాను, స్మార్ట్ఫోన్ల ద్వారా 30 శాతం జరుగుతాయని నివేదికలో వివరించింది. మొబైల్ వినియోగం మరింత పెరగనున్న నేపథ్యంలో ఎం–కామర్స్‌కు అధిక అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. భారత్‌లో 57 శాతం మంది డెలివరీ సమయంలో చెల్లింపులకు మొగ్గు చూపుతున్నారని, 11 శాతం మంది క్రెడిట్ కార్డుల ద్వారా, 15 శాతం మంది డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నట్టు తెలిపింది. అయితే, ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఈ ధోరణిలో మార్పులు చోటు చేసుకోవచ్చని పేర్కొంది. -
అదృష్టం అంటే ఆ అమ్మాయిదే..!
కెనడా : ఆ అమ్మాయిది మధ్యతరగతి కుటుంబం. అయినా బతకడానికి ఏ పని చేయక్కర్లేదు. ఆమె కుటుంబం కూడా ఇంట్లో కాలుమీద కాలు వేసుకుని కూర్చుని దర్జాగా జీవితాంతం అలా బతికేయెచ్చు. ఆమె ఇంట్లో వాళ్లు ఏ పని చేయకపోయినా వారానికి వెయ్యి డాలర్లు అప్పనంగా వాళ్ల అకౌంట్లో పడతాయి. ఏంటి ఎందుకు అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే కెనడాకు చెందిన చార్లీ లగార్డే అనే యువతికి తన పుట్టిన రోజున లాటరీ తగిలింది. లాటరీయేగా ఏంటి గొప్ప అనుకుంటున్నారా..? అది మామూలు లాటరీ కాదు. అలాగని కోట్లు ఒకటే సారి వచ్చి పడవు. ఆమె బతికున్నంత కాలం వారానికి వెయ్యి డాలర్లు.. మన రూపాయల్లో అక్షరాల యాభై వేల రూపాయలు .. నెలకు మూడు లక్షల రూపాయలు చార్లీ అందుకోనుంది. కొద్ది రోజుల క్రితమే మొదటి వారానికి సంబంధించిన డబ్బును ఆమె అందుకుంది. ఈ సందర్భంగా చార్లీ మాట్లాడుతూ.. వచ్చిన డబ్బుతో ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని తెలిపింది. ఇప్పుడు ఇలాంటి లాటరీ మనకు కూడా తగిలితే బాగుండనిపిస్తుంది కదూ... -
వారంలో 30 డాలర్లు కిందకు..!
అంతర్జాతీయ న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజి నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 8వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో భారీగా 30 డాలర్లు పడిపోయింది. వారాంతపు ట్రేడింగ్ రోజు (శుక్రవారం) ఒక దశలో కీలకమైన మద్దతు 1,250 డాలర్ల దిగువకు పడిపోయి, 1,246 డాలర్ల స్థాయిని తాకి చివరకు మళ్లీ 1,250 డాలర్ల పైస్థాయిలో ముగిసింది. జూలై తరువాత పసిడి ఒకేవారంలో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. 1,250 డాలర్ల స్థాయి దిగువన ముగిస్తే, ధర తప్పనిసరిగా దిగువ స్థాయిలో 1,220 డాలర్లను చూస్తుందన్న అంచనాలున్నాయి. రెండు నెలలుగా 1,300 డాలర్లను అధిగమించలేకపోయిన నేపథ్యంలో దిగువవైపుగా ధర కొంత తగ్గే అవకాశం ఉంటుందని అంచనా. తక్షణం ప్రభావం చూపిన అంశాలివీ... ♦ అమెరికా పన్ను సంస్కరణలపై సానుకూల అంచనాలు పసిడిలో లాభాల స్వీకరణకు ప్రధాన కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ♦ ఇక నవంబర్‌లో అమెరికా వ్యవసాయేతేర ఉపాధి కల్పన గణాంకాలు ఊహించినదానికన్నా మెరుగ్గా వచ్చాయి. ఆయా సానుకూల అంశాల నేపథ్యంలో వారం క్రితం 93 స్థాయిలో ఉన్న డాలర్ ఇండెక్స్ గురువారమే 94 స్థాయిని దాటింది. వారాంతం ముగింపు 93.84. ♦ పెట్టుబడులకు సంబంధించి ఈక్విటీ మార్కెట్లకు లాభాలు, క్రిప్టో కరెన్సీ– బిట్ కాయిన్ రికార్డు పరుగుల వంటి అంశాలూ ఇక్కడ ప్రస్తావనాంశం. ♦ మరోవైపు అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) సమావేశాలు వచ్చే వారం జరగనుండడం, ఆయా నిర్ణయాల ప్రభావం పసిడిపై ఉంటుందన్న విశ్లేషణలున్నాయి. వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఫెడ్ నిర్ణయం తీసుకున్నా, ఈసీబీ కఠిన ద్రవ్య విధానం అవలంబించినా అది పసిడి మరింత పతనానికి దారితీసే వీలుందని విశ్లేషకుల అభిప్రాయం. ♦ అయితే 1,200 డాలర్ల స్థాయికి పసిడి పడిపోతే, అది కొనుగోళ్లకు మంచి అవకాశం అన్న అంచనా కూడా ఉంది. దేశీయంగా 3 వారాల్లో రూ.1,000 డౌన్! అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ ప్రభావం దేశీ ఫ్యూచర్స్ మార్కెట్‌పైనా కనబడింది. మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్– ఎంసీఎక్స్‌లో వారంలో పసిడి ధర వరుసగా మూడవ వారమూ తగ్గింది. 8వ తేదీతో ముగిసిన వారంలో రూ.666 తగ్గి రూ.28,533కు చేరింది. ఇక ముంబై స్పాట్ మార్కెట్లో వారం వారీగా ధర రూ 755 తగ్గింది. 99.9 స్వచ్ఛత రూ.755 తగ్గి రూ. 28,645 వద్ద ముగియగా, 99.5 స్వచ్ఛత ధర సైతం అదే స్థాయిలో పడిపోయి రూ.28,495కి పడింది. మొత్తంగా మూడు వారాల్లో దేశంలో పసిడి 10 గ్రాముల ధర దాదాపు రూ. 1,000 తగ్గింది. ఇక వెండి ధర కేజీకి రూ.1,450 పడిపోయి రూ. 36,620 వద్ద ముగిసింది. ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో వారంలో మరో ఐదు పైసలు బలపడి 64.45కు చేరింది. రూపాయి బలంగా లేకపోతే, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా బంగారం మరింత పడేది. -
పసిడికి డాలర్ ‘బులిష్’ షాక్
వారంలో పసిడి 12 డాలర్లు డౌన్! అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోందని, ఫెడ్ ఫండ్ రేటు (అమెరికా సెంట్రల్ బ్యాంక్ రేటు.. ప్రస్తుతం 1–1.25 శాతం శ్రేణి) ఈ ఏడాది ఒకసారి, వచ్చే ఏడాది మూడుసార్లు పెంపు తథ్యమని అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఇస్తున్న సంకేతాలు పసిడిపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. న్యూయార్క్‌లోని అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 29వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 12 డాలర్లు నష్టపోయింది. 1,286 డాలర్ల వద్ద ముగిసింది. అయితే దీర్ఘకాలంలో అమెరికా ఆర్థిక అనిశ్చితి ధోరణి, ఉత్తరకొరియాతో ఘర్షణాత్మక పరిస్థితి వంటి అంశాలు– పసిడి బులిష్ ట్రెండ్‌ను కొనసాగిస్తాయని భావిస్తున్నారు. దేశీయంగా పండుగల డిమాండ్ వారం వారీగా డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత (65.34), నైమెక్స్‌లో తగ్గిన బంగారం స్పీడ్ వంటి అంశాలు దేశీయంగా ప్రభావం చూపినా, వారం వారీగా ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్లో పసిడి పూర్తి నష్టాల్లోకి జారలేదు. దేశీయంగా పండుగ సీజన్ డిమాండ్ ఇందుకు ఒక కారణం. ముంబై ప్రధాన మార్కెట్లో వారం వారీగా పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.70 పెరిగి రూ.29,845కి చేరింది. -
భర్తతో గొడవ.. డాలర్లు మింగిన భార్య
చెడు మార్గాల్లో పయనిస్తున్న భర్తకు డబ్బు అందకుండా చేసేందుకు యత్నించిన ఓ మహిళ.. అతను పద్దతి మార్చుకోకపోవడంతో ఆ డబ్బు మొత్తాన్ని మింగేసింది. ఈ సంఘటన అమెరికాలోని కొలంబియా నగరంలో చోటు చేసుకుంది. 28 ఏళ్ల శాండ్రా మిలేనా భర్తతో చెడు అలవాట్లు మాన్పించేందుకు తమ సంపాదనను ఇంట్లోని ఓ రహస్య ప్రదేశంలో దాచి పెట్టడం మొదలుపెట్టింది. దీంతో వ్యసనాలకు అలవాటు పడిన ఆమె భర్త డబ్బు కోసం పలుమార్లు మిలేనాతో గొడవ పెట్టుకున్నాడు. అయినా పట్టువదలని మిలేనా అతనికి డబ్బు అందకుండా ఉంచేందుకు యత్నించింది. అయితే ఎలాగో భార్య డబ్బు దాచి పెడుతున్న ప్రదేశాన్ని కనుక్కున్న భర్త ఆ డబ్బు మొత్తాన్న ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో భర్తను అడ్డుకున్న మిలేనా ఆ డబ్బు మొత్తాన్ని మింగేసింది. కొద్దిసేపటికి ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు 57 వంద డాలర్ల నోట్లను వెలికితీశారు. మిగిలిన నోట్లను గ్యాస్ట్రిక్ ఫ్లూయిడ్స్ కరిగించేశాయని చెప్పారు. పూర్తిగా కోలుకున్న ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. -
అంతర్జాతీయంగా పసిడి దూకుడు..!
♦ 2 వారాల్లో 45 డాలర్లకుపైగా పెరుగుదల ♦ డాలర్ పటిష్టతపై అనుమానాల నేపథ్యం ♦ దేశంలో దూకుడుకు ‘రూపాయి’ బ్రేక్! న్యూయార్క్/ముంబై: అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై అనుమానాలు, దీనితో డాలర్‌పై ప్రతికూల ప్రభావం అంతర్జాతీయంగా పసిడిపై ప్రభావం చూపుతోంది. న్యూయార్క్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో శుక్రవారంతో ముగిసిన వారంలో ఔన్స్ (31.1గ్రా) ధర 13 డాలర్లు పెరిగి, 1,235 డాలర్లకు చేరింది. రెండు వారాల్లో ఇక్కడ ధర భారీగా 45 డాలర్లు పెరగడం గమనార్హం. డాలర్ బలహీనతలు, గత వారం ఫెడ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ప్రకటన, అమెరికా ఆర్థిక అనిశ్చితి దన్నుగా పసిడి మరింత ముందుకు వెళుతుందన్న విశ్లేషణలు కొనసాగుతున్నాయి. బంగారానికి 1,210 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండొచ్చనే సంకేతాలున్నాయి. అమెరికా గత ఏడాది నాల్గవ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు కనీసం 2.2 శాతం ఉంటుందని విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా 1.9 శాతం వృద్ధి మాత్రమే నమోదయిన సంగతి తెలిసిందే. అమెరికా ఉద్యోగ కల్పన తాజా నివేదిక కూడా అమెరికా ఆర్థికంగా ఆశను తగ్గిస్తోంది. దీనితో ఈ ఏడాది ఫెడ్ ప్రణాళిక ప్రకారం మూడుదఫాల రేటుపెంపు సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికితోడు ఇరాన్‌పై అమెరికా తాజా ఆంక్షలు, ఈ పరిస్థితుల్లో భౌగోళిక ఉద్రిక్తతలు పసిడికి బలాన్ని ఇస్తున్న మరో అంశం. దేశీయంగా చూస్తే... అంతర్జాతీయంగా పసిడి దూకుడు ప్రదర్శిస్తున్నా... దేశీయంగా రూపాయి పటిష్టతల్లో మెటల్ దూకుడుకు ఇక్కడ కళ్లెం వేస్తోంది. వారం వారీగా చూస్తే... పసిడి 99.9 స్వచ్ఛత 10 గ్రాముల ధర కేవలం రూ.50 పెరిగి రూ.29,195కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ.29,045కు చేరింది. ఇక వెండి ధర కేజీకి రూ.415 పెరిగి రూ.42,290కి చేరింది. శుక్రవారం వరకూ గడచిన 10 ట్రేడింగ్ సెషన్లలో రూపాయి డాలర్ మారకంలో దాదాపు 1.50 పైసలు బలపడింది. శుక్రవారంతో ముగిసిన వారంలో 66.84 స్థాయిలో ఉంది. రూపాయి ఈ స్థాయిలో బలపడి ఉండకపోతే, పసిడి ధర గడచిన వారంలో దాదాపు మరో రూ.200కుపైగా పెరిగి ఉండేదన్న అంచనాలు ఉన్నాయి. -
తక్కువ ధరకు డాలర్లు ఇస్తామంటూ మోసం
-
పెద్ద నోట్లకు డాలర్లు
• నల్లధనాన్ని డాలర్లుగా మారుస్తున్న ముఠా • వేలూరు నుంచి తీసుకొస్తున్న ఓ గ్యాంగ్ • 40 శాతం కమిషన్ తీసుకుంటున్న ఏజెంట్లు చిత్తూరు (అర్బన్): నల్లధనాన్ని వెలికి తీయడానికి మోదీ ఓ మంత్రమేస్తే తామేమి తక్కువ తిన్నామా అంటూ కుబేరులు మరో మంత్రమేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దాచి పెట్టిన నల్ల ధనమంతా బయటకు వస్తుందనుకుంటున్న సమయంలో చిత్తూరు నగరంలోని కొందరు కుబేరులు ఉన్న ధనాన్ని డాలర్లతో మార్చుకోవడంలో బిజీగా ఉన్నారు. నగర అభివృద్దికి, ఆర్థిక విలాసాలకు చాలా దూరంగా ఉన్న చిత్తూరు నగరంలో బడా కుబేరుల్ని సులువుగానే గుర్తించొచ్చు. ఆదాయపన్నుశాఖకు సక్రమంగా పన్నులు చెల్లించకుండా నల్లధనాన్ని ఓ స్థారుులో కూడబెట్టిన వ్యక్తులు నగరంలో 60 మంది వరకు ఉన్నారు. మోదీ ప్రకటనతో రూ.500, వెరుు్య నోట్లు బయటకు వస్తాయనకుంటే ఇక్కడి వ్యక్తులు కొత్త మార్గాన్ని అన్వేషించారు. భారీగా నిల్వ చేసిన పెద్ద నోట్లను డాలర్లగా మార్చుకుంటున్నారు. ఇందుకోసం వేలూరు, చెన్నై ప్రాంతాల్లోని మధ్యవర్తుల ద్వారా మన నగదును యూఎస్ డాలర్లుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మన నగదు రూ.లక్ష ఇస్తే ఇందులో రూ.40 వేలు మినహారుుంచుకుని రూ.60 వేలను పరిగణలోకి తీసుకుంటున్న మధ్యవర్తులు ఆ మొత్తానికి డాలర్లను అందజేస్తున్నారు. చిత్తూరులోని కొంగారెడ్డిపల్లె, మిట్టూరు, రామ్‌నగర్ కాలనీ, కట్టమంచి, గిరింపేట, చర్చీవీధి, ప్రాంతాల్లోని కొందరు వ్యక్తులు ప్రస్తుతం భారీగా యూఎస్ డాలర్లను తెప్పించుకున్నారనే వార్తలు గుప్పు మంటున్నారుు. విషయం ఆ నోట, ఈనోట పాకి చివరకు పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. డాలర్లలో కూడా దొంగ నోట్లు ఉన్నాయని.. వీటిని తీసుకుని చివరకు స్టేషన్లకు వచ్చి మోసపోయామంటూ క్యూ కట్టద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అరుుతే డాలర్లు ఇచ్చి వాటికి బదులుగా మన దేశపు రూ.500, వెరుు్య నోట్లను ఎలా మార్చుకుంటారనేదానిపై చిక్కుముడి వీడటంలేదు. కాగా ఇలా సేకరించిన మన కరెన్సీతో బంగారం కొంటున్నారని నరగానికి చెందిన ప్రముఖ ఆడిటర్ చెబుతున్నారు. సవరం బంగారాన్ని మార్కెట్ ధర కంటే రూ.10 వేలు ఎక్కువ వెచ్చించి కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నా.. ఇందులో నిజానిజాలు ఏమిటనేది స్పష్టంగా తెలియడంలేదు. ఏదీ ఏమైనా జిల్లాలో పాత నోట్లకు విదేశీ డాలర్లను సైతం ఇస్తున్నట్లు తెలిసింది. -
‘కోక్’ పేరుతో రూ.11 లక్షలు కాజేశాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఘట్కేసర్కు చెందిన ఓ వ్యక్తికి ఈ–మెయిల్ ద్వారా ఎర వేసి... 45 వేల పౌండ్ల విలువైన కోకకోలా లాటరీ తగిలిందని నమ్మించి రూ.11.8 లక్షలు కాజేసిన నైజీరియన్‌ను రాచకొండ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. న్యూఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన ఇతడి నుంచి 2100 డాలర్లు, 25 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ మహేష్ ఎం.భగవత్ శుక్రవారం వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఉడెలోర్ టోనీ న్యాండే 2010లో విజిట్ వీసా తీసుకుని భారత్‌కు వచ్చాడు. న్యూఢిల్లీలో మకాం ఏర్పాటు చేసుకున్న ఇతను మరికొందరు అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్స్ ఆధారంగా మోసాలకు తెరలేపాడు. ఇంటర్నెట్తో పాటు వివిధ మార్గాల్లో దేశ వ్యాప్తంగా అనేక మందికి చెందిన ఈ–మెయిల్ ఐడీలు, ఫోన్ నెంబర్లు సేకరించాడు. బీబీసీ, కోకకోలా, సామ్సంగ్ వంటి ప్రముఖ కంపెనీల పేర్లను వినియోగించే టోనీ వారికి ఆ లాటరీలు తగిలాయంటూ ఎరవేసేవాడు. ఘట్కేసర్ మల్లికార్జున నగర్‌కు చెందిన పి.నవీన్‌కుమార్‌కు ఈ ఏడాది ఆగస్టులో కోకకోలా లాటరీ పేరుతో ఈ–మెయిల్ వచ్చింది. రూ.3.67 కోట్ల (45 వేల పౌండ్లు) మొత్తం లాటరీ వచ్చినట్లు ఉన్న ఆ మెయిల్‌కు అతడు స్పందించడంతో అసలు కథ మొదలైంది. ఈ నగదు పొందడానికి పన్నుల రూపంలో కొంత మొత్తం చెల్లించాలంటూ చెప్పిన టోనీ అతడినినమ్మి ంచేందుకు సరికొత్త పంథా అనుసరించాడు. ‘డార్క్ నెట్’ నుంచి కొన్ని క్రెడిట్‌కార్డుల డేటాను సంగ్రహించాడు. వివిధ బ్యాంకుల వినియోగదారుల నుంచి చోరీ చేసిన క్రెడిట్‌కార్డుల డేటాను కొనుగోలు చేసి ఖాళీ మ్యాగ్నసిక్ స్టిప్ర్పై రైట్ చేయడంతో పాటు దానిపై బ్రిటిష్ బ్యాంకు పేరుతో పాటు బాధితుడి పేరునే ముద్రించాడు. ఈ కార్డ్‌తో పాటు దాని పిన్ నెంబర్‌ను సైతం బాధితుడికి పంపాడు. వీటిని వినియోగించి బాధితులు ఓ ఏటీఎం సెంటర్‌కు వెళ్ళి రూ.14 వేలు డ్రా చేసుకున్నాడు. దీంతో అతడికి లాటరీ డబ్బు తనకు వస్తుందని నమ్మకం కలగడంతో అప్పటి నుంచి వివిధ రకాలైన పన్నులు, ఇతర లావాదేవీల పేర్లు చెప్పి వివిధ దఫాల్లో రూ.11.8 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా వసూలు చేశాడు. చివరకు మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలను బట్టి టోనీ నిందితుడిగా గుర్తించారు. ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకువచ్చింది. -
తిరుమలలో శ్రీవారి డాలర్ల కొరత
-
బక్కెట్లకొద్దీ డబ్బు దొరికింది!
ఫ్లోరిడాలో పోలీసులకు దిమ్మతిరిగే దృశ్యం కనిపించింది. ఓ ఇంట్లో భద్రంగా దాచిన 24 బక్కెట్లలో కోట్ల కొద్దీ డబ్బు కనిపించడంతో షాక్ అయ్యారు. అక్రమ వ్యాపారం నిర్వహించగా వచ్చిన డబ్బును మియామీ ప్రాంతంలోని ఓ వ్యాపారి ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టిన వార్త.. ఇప్పుడక్కడ పెద్ద సంచలనంగా మారింది. అటకమీద ఎవ్వరికీ కనిపించకుండా దాచిన బక్కెట్లనిండా డబ్బుతోపాటు, కొన్ని డ్రగ్స్, ఓ గన్ కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. అమెరికా ఫ్లోరిడాలోని మియామీలోని ఓ ఇంట్లో తన అక్రమ వ్యాపారంతో సంపాదించిన డబ్బును సదరు వ్యాపారి బక్కెట్లలో భద్రంగా దాచుకున్నాడు. ఇంటి అటకమీద 24 బక్కెట్లలో దాచిపెట్టిన 163 కోట్ల రూపాయలను (సుమారు 20 మిలియన్ డాలర్లు) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సొమ్ముతోపాటు, అత్యంత ఖరీదైన తుపాకీ, కొన్ని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకొన్న మియామీ పోలీసులు.. వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. 44 ఏళ్ళ లూయిస్ హెర్నాండెజ్ గాంజలెజ్, ఆయన సోదరి 32 ఏళ్ళ సల్మా గాంజలెజ్ లను అక్రమ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేసులో అరెస్టు చేశారు. గార్డెన్ సామాన్లు అమ్మే బిజినెస్ నిర్వహిస్తున్న నిందితులు, అక్రమంగా మాదక ద్రవ్యాల వ్యాపారం కూడ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు.. వారి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లోని అటకపై భద్రంగా దాచిపెట్టిన బక్కెట్ల కొద్దీ డబ్బును, డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిద్దరిపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సెర్చ్ వారెంట్ తో నిందితుల ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు అటకపై ఉన్న బక్కెట్లు చూసి షాకయ్యారు. వాటితోపాటు ఎనబాలిక్ స్టెరాయిడ్లు, టీఈసీ-9 పిస్టల్ కనిపించడంతో వారి అనుమానాలు నిజమయ్యాయి. వెంటనే అలర్టయిన పోలీసులు... నిందితులను అదుపులోకి తీసుకొని అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇంత భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు. -
ప్రత్యర్థులతో పోటీకి సై అంటున్న ట్విట్టర్
ట్విట్టర్ తన ప్రత్యర్థి సోషల్ మీడియా సంస్థలతో పోటీకి సిద్ధమైంది. అంచనాలకు మించి ఆదాయాన్ని కోల్పోతుండడంతో, బ్రాండింగ్ అడ్వర్ టైజింగ్ డాలర్ల కోసం ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్, స్నాప్ చాట్ లతో పోటీ కి సై అంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ట్విట్టర్ షేర్లు 24శాతం పడిపోయాయి. కంపెనీ నిర్ణయించిన రేట్లకనుగుణంగా బ్రాండ్ మార్కెటర్లు తమ బడ్జెట్లను పెంచడం లేదని ట్విట్టర్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్నిగంటలోనే న్యూయార్క్ మార్కెట్ ట్రేడింగ్ లో ఈ షేర్లు 14శాతం కిందకి జారాయి. ట్విట్టర్ షేర్లు ఆల్ టైమ్ కనిష్టానికి నమోదవుతున్నాయి. ఈ సంస్థకు వాడుకదారుల వృద్ధి కూడా నెమ్మదించడం ప్రతికూలప్రభావాన్ని పడవేస్తోంది. మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు కాలినడకన సాగిందని, నెలకు కేవలం 310 మిలియన్ యాక్టివ్ యూజర్లే ఉన్నారని తెలుస్తోంది. కొత్త అడ్వర్ టైజింగ్ ప్రొడక్ట్ రూపకల్పనపై మొదట్లో ఎక్కువగా దృష్టిసారించిన కంపెనీ, ఇప్పుడు ఒక యాడ్ ఫార్మాట్ నుంచి మరో యాడ్ కు త్వరగా బడ్జెట్లను మరల్చుతోందని చీఫ్ ఫైనాన్సియల్ అధికారి ఆంటోని నోటో పేర్కొన్నారు. దీనివల్ల ప్రస్తుతం ట్విట్టర్ కు అడ్వర్ టైజింగ్ లో ఎక్కువ డిమాండ్ లేదని ఆయన చెప్పారు. 608 మిలియన్ డాలర్లుగా అంచనా వేసిన ట్విట్టర్ రెవెన్యూ ఈ త్రైమాసికంలో 595 మిలియన్ డాలర్లుగా నమోదైంది. రెండో క్వార్టర్లో కూడా ప్రకటనల ఆదాయం పడిపోనుందని కంపెనీ ముందుగానే అంచనావేస్తోంది.ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అడ్వర్ టైజింగ్ లకంటే కూడా ఆన్ లైన్ వీడియో బడ్జెట్లను పెంచుకుని, ఎక్కువగా అడ్వర్ టైజింగ్ డాలర్ రెవెన్యూలను పెంచుకోవాలని లక్ష్యంగా కంపెనీ నిర్ణయించింది.ఇప్పటికే ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్ లు లైవ్ వీడియోల ప్రచారాలకు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నాయి. -
డాలర్లు ఏవి స్వామీ?
రెండేళ్లుగా రెండు గ్రాముల బంగారు డాలర్లు లేవు ఏళ్ల తరబడి వెండి డాలర్లు పట్టించుకునే వారే కరువు కనిపించని డాలర్ విక్రయ కేంద్రం.. భక్తుల ఆవేదన సాక్షి, తిరుమల: దేశ విదేశాల్లో ధర్మప్రచారం పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే టీటీడీకి ధర్మప్రచారంతో ముడిపడిన శ్రీవేంకటేశ్వర స్వామి చిత్రాలతో కూడిన బంగారు, వెండి డాలర్ల విక్రయాలను విస్మరిస్తోంది. ‘‘నగదిస్తాం. శ్రీవారి బంగారు, వెండి డాలర్లు ఇవ్వండి’’ అని భక్తుల విజ్ఞప్తిని టీటీడీ అధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. తిరుమల ఆలయం పక్కన లడ్డూ కౌంటర్ల సమీపంలోనే శ్రీవారి బంగారు, వెండి డాలర్ల విక్రయ కేంద్రం ఉంది. శ్రీవేంకటేశ్వర స్వామివారు, పద్మావతి అమ్మవారు చిత్రాలతో కూడిన వెండి, బంగారు డాలర్లను చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకు ధరిస్తుంటారు. ఇది ధర్మప్రచారానికి తోడ్పాటు అందిస్తోంది. 5 గ్రాములు, 10 గ్రాముల వెండి డాలర్లు విక్రయిస్తుంటారు. వీటి ధర రూ.100 నుంచి రూ.250 లోపే ఉండటంతో తిరుమల క్షేత్ర సందర్శనకు గుర్తుగా సామాన్య భ క్తులు కొనుగోలు చేస్తుంటారు. మూడేళ్లుగా వెండి డాలర్ల కేంద్రంలో నో స్టాక్ బోర్డు పెట్టేశారు. దీనిపై భక్తులు నిత్యం ఫిర్యాదులు, విజ్ఞప్తులు చేస్తున్నా ఏమాత్రమూ పట్టించుకోలేదు. ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. రెండేళ్లుగా రెండు గ్రాముల బంగారు డాలర్లేవు బంగారు డాలర్లు విక్రయించే కౌంటర్లో రెండేళ్లుగా రెండు గ్రాముల డాలర్లు స్టాకు లేదు. సంబంధిత ఆలయ విభాగం అధికారులుగాని, తిరుపతిలోని జువెలరీ విభాగం గాని తమకు ఎలాంటి సంబంధమూ లేదని చెబుతోంది. డాలర్ల కొనుగోలు వ్యవహారాలను టీటీడీ మార్కెటింగ్ విభాగానికి అప్పగించినా ఫలితం కనిపించటం లేదు. ప్రస్తుతం 10 గ్రాములు రూ.26,260, 5 గ్రాములు రూ.13,345 బంగారు డాలర్లు మాత్రమే విక్రయిస్తున్నారు. వీటిలో తక్కువ ధర కలిగిన సుమారు రూ.5,400 ధర కలిగిన 2 గ్రాముల బంగారు డాలర్లకే భక్తుల నుంచి రెట్టింపు స్థాయిలో డిమాండ్ ఉంది. ఏటీఎం కార్డుల ద్వారా కొనుగోలు చేసే భక్తులకు 2.25శాతం సర్వీసు ట్యాక్స్ కట్టాల్సి వస్తోందని భక్తులు వాపోతున్నారు. ఈ విషయంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు పట్టించుకోవాలని భక్తులు కోరుతున్నారు. కనిపించని డాలర్ల విక్రయ కేంద్రం గతంలో ఆలయం ముందే డాలర్ల విక్రయం కేంద్రం ఉండేది. అందువల్ల శ్రీవారిని దర్శించుకుని వెలుపలకు వచ్చిన భక్తులు గుర్తుగా డాలర్లు కొనుగోలుచేసే వారు. రెండేళ్లుగా దాన్ని లడ్డూ కేంద్రానికి మార్పు చేయడంతో సరిగ్గా కనిపించటం లేదు. ఈ విషయంపైనా అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది. -
రూపాయి మరింత కిందకి
31 పైసలు పతనం 65.31 వద్ద ముగింపు ముంబై: దిగుమతిదారులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ నెలకొనడంతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం మరో 31 పైసలు క్షీణించి 65.31 వద్ద ముగిసింది. చైనా కరెన్సీ యువాన్ డీవేల్యుయేషన్ అనంతరం అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, బలహీన వాణిజ్య గణాంకాలు మొదలైనవి దేశీ కరెన్సీ క్షీణించడానికి కారణాలని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 65తో పోలిస్తే బలహీనంగా 65.12 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 65.36 స్థాయికి కూడా పడిపోయింది. గడిచిన రెండేళ్లలో రూపాయికి ఇది మరో కొత్త కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఆ తర్వాత క్లోజింగ్ సమయానికి 0.48 శాతం నష్టంతో దేశీ కరెన్సీ 65.31 వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 64.80-65.80 మధ్య తిరుగాడగలదని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
4 వారాల కనిష్టానికి రూపాయి
33 పైసలు డౌన్; 64.08 వద్ద క్లోజ్ ముంబై: బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడంతో రూపాయి మారకం విలువ సోమవారం గణనీయంగా తగ్గింది. 33 పైసలు క్షీణించి 64.08 వద్ద ముగిసింది. ఇది నాలుగు వారాల కనిష్ట స్థాయి. విదేశీ నిధులు తరలిపోతుండటం వల్ల స్టాక్ మార్కెట్ క్షీణిస్తున్న ప్రభావం కూడా రూపాయిపై ఉంటోందని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానించారు. గత నెల అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు మెరుగుపడటంతో.. శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లలో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలరు గణనీయంగా బలపడింది. జపాన్ యెన్‌తో పోలిస్తే 13 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ఆ ప్రభావం సోమవారం మిగతా మార్కెట్లలోనూ పడింది. చివరిసారిగా ఈ ఏడాది మే 12న డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 64.17 వద్ద క్లోజయ్యింది. ఆ తర్వాత ఈ స్థాయికి రావడం ఇదే తొలిసారి. స్పాట్ మార్కెట్లో రూపాయి ట్రేడింగ్ 63.75-64.40 శ్రేణిలో తిరుగాడవచ్చని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
3 నెలల కనిష్టానికి రూపాయి
50 పైసలు పతనం ముంబై: బ్యాంకులు, దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ మూడు నెలల కనిష్టానికి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 50 పైసలు పతనమై 63.32 వద్ద ముగిసింది. ఈక్విటీ మార్కెట్లు నుంచి విదేశీ నిధులు తరలిపోతుండటం కూడా దీనికి కారణమైంది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.82తో పోలిస్తే బలహీనంగా 62.95 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత ఒక దశలో 63.34 స్థాయికి కూడా క్షీణించింది. చివరికి 50 పైసల నష్టంతో 63.32 వద్ద ముగిసింది. చివరిసారిగా జనవరి 6న 63.57 స్థాయి దగ్గర రూపాయి క్లోజయ్యింది. మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలర్ సూచీ 0.03 శాతం మేర పెరిగింది. -
కొత్త శిఖరానికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 13వ తేదీతో ముగిసిన వారాంతానికి ఈ నిల్వలు అంతక్రితం వారం ముగింపుతో (ఫిబ్రవరి 6) పోల్చితే 2.95 బిలియన్ డాలర్లు పెరిగాయి. మొత్తంగా 333 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. తాజా నిల్వలు భారత్‌కు కనీసం 10 నెలల దిగుమతుల బిల్లుకు సరిపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. -
ఆల్‌టైమ్ గరిష్టానికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. జనవరి 30వ తేదీతో ముగిసిన వారాంతానికి 327.88 బిలియన్ డాలర్లను చేరాయి. అంతకు ముందు వారంతో పోల్చితే ఈ నిల్వలు ఏకంగా 5.84 బిలియన్లు పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. భారీగా విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ) దేశానికి రావడం, డాలర్లు పెద్దగా దేశం నుంచి బయటకు పోకపోవడం వంటి అంశాలు దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరడానికి కారణమని అధికార వర్గాలు తెలిపాయి. -
రికార్డ్ స్థాయికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక ద్రవ్య(ఫారెక్స్) నిల్వలు దాదాపు నాలుగేళ్ల తర్వాత రికార్డ్ స్థాయికి చేరాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 32,213 కోట్ల డాలర్లకు పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీ పతనం వల్ల దిగుమతుల బిల్లు తగ్గడం, మరోవైపు విదేశీ నిధుల ప్రవాహం జోరుగా ఉండడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, ఆర్బీఐ డాలర్లను కొనుగోలు చేయడం... ఈ కారణాల వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డ్ స్థాయికి చేరాయని ఫస్ట్‌ర్యాండ్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ హరిహర్ కృష్ణమూర్తి వివరించారు. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఈ నిల్వలు 266 కోట్ల డాలర్లు పెరిగాయని ఆర్బీఐ పేర్కొంది. 2011, సెప్టెంబర్2తో ముగిసిన వారానికి విదేశీ మారక ద్య్ర నిల్వలు తొలిసారిగా 32,000 కోట్ల డాలర్ల మార్క్‌ను అధిగమించాయి. ఈ నెలలో ఇప్పటివరకూ భారత మార్కట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 344 కోట్ల డాలర్ల నిధులు కుమ్మరించారు. ఈసీబీ ప్యాకేజీ కారణంగా 2,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు భారత్‌లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ శుక్రవారం ఒక నివేదికలో పేర్కొంది. -
వయసును పెంచితే.. డాలర్లు!
వాషింగ్టన్: మనిషి జీవితకాలాన్ని 120 ఏళ్లకు పైగా పెంచగలిగే ఔషధాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలకు 10 లక్షల డాలర్లు ప్రైజ్ మనీగా ఇస్తానని అమెరికాకు చెందిన ఝూన్ యున్ అనే ఫండ్ మేనేజర్ ప్రకటించారు. ‘మనిషి జీవిత కాలం గరిష్టంగా 120 ఏళ్లనే సిద్ధాంతం ఉంది. ఇందుకోసం ఔషధం కనుగొనాలన్నది నా షరతు’ అని ఆయన పేర్కొన్నారు. ఆ పనిలో 15 శాస్త్రవేత్తల బృందాలున్నాయన్నారు. -
దుర్గమ్మ సన్నిధికి.. డాలర్లే డాలర్లు
సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపమైన కనకదుర్గమ్మ డాలర్ల కుంభవృష్టి కురిపిస్తోంది. అంతులేని మూలధనంతో బంగారుతల్లిగా అలరారుతున్న ఆ అమ్మకు విదేశీ భక్తులు అధికసంఖ్యలో మొక్కులు చెల్లించుకుంటుండ టంతో కుప్పలుతెప్పలుగా ఫారన్ కరెన్సీ కానుకల రూపంలో వస్తోంది. గత రెండేళ్ల లెక్కలు చూసుకుంటే ప్రతినెలా జరిగే హుండీల లెక్కింపులో డాలర్లు అధిక సంఖ్యలో ఉంటున్నారుు. అంతేకాదు.. ఇటీవల దుర్గమ్మకు విదేశీ భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ : దుర్గమ్మను దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే విదేశీ భక్తులు సమర్పించే డాలర్లు అమ్మవారి మూలధనానికి భారీగా చేరుతున్నాయి. ఏటా జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్స వాలతో పాటు శాకంబరీ, శ్రావణమాస ఉత్సవాల్లో విదేశీ భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి 20 రోజులకోసారి హుండీ ఆదాయం లెక్కిస్తుండగా, సుమారు కోటి రూపాయల ఆదాయం వస్తే అందులో దాదాపు రూ.50వేలకుపైగా విదేశీ కరెన్సీనే ఉంటోంది. ఈ ఏడాదైతే హుండీల ద్వారా విదేశీ కరెన్సీ రూపంలో వస్తున్న ఆదాయం రికార్డుస్థాయికి చేరుకుంది. ఇలా అమ్మవారికి వచ్చిన విదేశీ కరెన్సీని బ్యాంకుల ద్వారా రూపాయల్లోకి మార్చి తిరిగా అమ్మవారి మూలధనానికే చేర్చుతున్నారు. అన్ని దేశాల నుంచి.. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వెళ్లి విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగరీత్యా స్థిరపడిన వారితో పాటు అమెరికా, కెనడా, సౌదీ, యూఏఈ, మలేషియా, బెహరిన్, ఈజిప్టు, ఓమన్, లిబ్రాన్, సింగపూర్, ఆస్ట్రేలియా, మాల్దీవులు, ఉగాండా, ఇంగ్లండ్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన భక్తులు ఎక్కువగా అమ్మవారి దర్శనానికి తరలివస్తున్నారు. టూరిజంలో అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్నారు. అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా స్థలపురాణం, అమ్మవారికి నిత్యం జరిగే పూజలు, అర్చనల గురించి తెలుసుకుంటూ..అమ్మవారి చిత్రపటాలను సైతం కొనుగోలు చేసి స్వస్థలాలకు తీసుకెళ్తున్నారు. విజయవాడను సీమాంధ్ర రాజధానిగా ప్రకటించడంతో పలు విదేశీ కంపెనీలు నగరంపై దృష్టి పెట్టాయి. అనేక కార్యకలాపాలతో పాటు టూరిజంను అభివృద్ధి చేసే అవకాశాలు ఉండటంతో విదేశీ భక్తుల సంఖ్య పెరగడంతో పాటు అమ్మవారి మూలధనానికి డాలర్లు మరిన్ని చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు నెలల్లో అధిక ఆదాయం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో విదేశీ కరెన్సీ రూపంలోదేవస్థానానికి రూ.7.20 లక్షల ఆదాయం సమకూరగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి రూ.3.50 లక్షలకు పైబడి వచ్చింది. ఉత్సవాలతో పాటు పండుగ పర్వదినాలు ముందుండటంతో ఈ ఏడాది హుండీల ద్వారా భారీగానే విదేశీ కరెన్సీ వచ్చే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. విదేశీ విరాళాలు పెరిగాయ్.. దుర్గమ్మకు విదేశీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిత్యం విదేశాల నుంచి ఇంద్రకీలాద్రికి అధిక సంఖ్యలో వస్తున్నారు. దీనికితోడు దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభంకావడంతో విదేశాల నుంచి అన్నదానానికి విరాళాలు రావడం, ప్రత్యేక పూజల్లో ఎక్కువగా పాల్గొనడం జరుగుతోంది. రాష్ర్ట రాజధానిగాగా విజయవాడను ప్రకటించిన నేపథ్యంలో విదేశీ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. - త్రినాథరావు, దుర్గగుడి ఈవో ఈ ఏడాది దుర్గమ్మకు సమకూరిన విదేశీ కరెన్సీ జనవరి యూఎస్ఏ డాలర్లు : 396 ఓమన్ : 500 బైసా కెనడా డాలర్లు : 145 సౌదీ అరేబియా : 173 రియాన్లు యూఏఈ : 150 ధీరమ్స్ లిబ్రాన్ : 9000 మిల్లీలివర్స్ మలేషియా : 23 ఆర్ఎం ఫిబ్రవరి యూఎస్ఏ డాలర్లు : 200 ఆస్ట్రేలియా : 120 డాలర్లు ఓమన్ : 61 రియాన్స్ 100 బైసా కతార్ : 701 రియాన్స్ యూఎస్ఈ : 120 ధీరమ్స్ మార్చి యూఎస్ఏ డాలర్లు : 291 ఓమన్ : 500 బైసా సింగపూర్ : 80 డాలర్లు ఇంగ్లండ్ : 40 పౌండ్లు సౌదీ అరేబియా : 152 రియాన్లు యూఏఈ : 720 ధీరమ్స్ ఉగాండా : 2000 షిలిగ్ ఏప్రిల్ యూఎస్ఏ డాలర్లు : 170 ఓమన్ : 2,500 బైసా యూఏఈ : 30 ధీరమ్స్ ఆస్ట్రేలియా : 320 డాలర్లు కత్తార్ : 120 రియాన్స్ మే యూఎస్ఏ డాలర్లు : 664 సౌదీ అరేబియా : 32 రియాన్లు యూఏఈ : 110 ధీరమ్స్ సౌదీ అరేబియా : 32 రియాన్స్ జూన్ యూఎస్ఏ డాలర్లు : 386 కత్తార్ రియాన్స్ : 177 కెనడా డాలర్లు : 170 సౌదీ అరేబియా : 115 రియాన్లు యూఏఈ : 200 ధీరమ్స్ సింగపూర్ : 78 డాలర్లు న్యూజిలాండ్ : 30 డాలర్లు జులై యూఎస్ఏ డాలర్లు : 570 ఆస్ట్రేలియా : 30 ఓమన్ : 500 బైసా సౌదీ అరేబియా : 32 రియాన్లు యూఏఈ : 530 ధీరమ్స్ ఆగస్టు యూఎస్ఏ డాలర్లు : 61 ఓమన్ : 100 బైసా బెహరైన్ : 10 దినార్లు ఆస్ట్రేలియా : 108 డాలర్లు సెప్టెంబర్ యూఎస్ఏ డాలర్లు : 472 కత్తార్ : 48 రియాన్స్ కెనడా డాలర్లు : 200 డాలర్లు యూఏఈ : 55 ధీరమ్స్ -
మనీ మేనేజ్‌మెంట్‌లోనూ ‘విన్’ ఫ్రే..
ఓప్రా విన్ఫ్రే.. దుర్భర దారిద్య్రం నుంచి స్వయంకృషితో కోట్లకు పడగలెత్తే దాకా ఓప్రా విన్‌ఫ్రేది స్ఫూర్తిదాయకమైన పయనం. ప్రస్తుతం దాదాపు 290 కోట్ల డాలర్ల సంపదతో ఆఫ్రికన్ అమెరికన్లలో ఆమె అత్యంత సంపన్నురాలిగా ఉన్నారు. టాక్ షో వ్యాఖ్యాతగా, నటిగా, ప్రొడ్యూసర్‌గా అనేక పాత్రలు పోషిస్తున్న ఓప్రా విన్ఫ్రే.. క్వీన్ ఆఫ్ ఆల్ మీడియాగా పేరొందారు. సుమారు పాతికేళ్ల పాటు (1986 నుంచి 2011 దాకా) సాగిన ది ఓప్రా విన్ఫ్రే షో అమెరికా టెలివిజన్ చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇలాంటి వాటి ద్వారా కోట్లు ఆర్జించినా.. డబ్బు విలువ గురించి గుర్తెరిగి వ్యవహరిస్తారు ఓప్రా. కొంత రిస్కు చేసి కొత్త వ్యాపారాలు చేపట్టినా .. రియల్టీ లాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసినా ఓప్రాది విభిన్న శైలి. కేవలం టాక్‌షోలకు పరిమితం కాకుండా ఆమె స్వయంగా హార్పో (ఇంగ్లిష్‌లో ఓప్రాను తిరగేస్తే వచ్చే పేరు) పేరిట ప్రొడక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. దీంతో ఓప్రాకు గణనీయంగా ఆదాయం వస్తుంటుంది. అలాగే, ‘ఒ’ పేరుతో ఏర్పాటు చేసిన మ్యాగజైన్ ఓప్రాకు ఏటా మిలియన్లకొద్దీ ఆదాయం తెచ్చిపెడుతోంది. దాదాపు కొన్నాళ్ల క్రితం భారీ బహుళ అంతస్తుల భవంతిలో సుమారు మూడు మిలియన్ డాలర్లు పెట్టి ఏకంగా నాలుగు ఫ్లాట్లను కొన్నారామె. వాటి విలువ ప్రస్తుతం 12 మిలియన్ డాలర్లు పలుకుతోంది. ఆ రకంగా స్వల్ప వ్యవధిలోనే దాదాపు 9 మిలియన్ డాలర్లు ఆర్జించారు. అలాగే మరో ప్రాంతంలో రెండు మిలియన్ డాలర్లకు కొన్న ఇంటిని 3.25 మిలియన్ డాలర్లకు అమ్మేసి మిలియన్ డాలర్లు లాభం అందుకున్నారు. వీటిలో ఎలాగైతే లాభాలు అందుకున్నారో.. అధిక ధరల్లో కొన్న కొన్ని కలసి రాని ప్రాపర్టీలను కాస్త తక్కువ రేటుకే అమ్మేశారు కూడా. ఓన్ పేరిట ఏర్పాటు చేసిన మీడియా సంస్థను భారీ నష్టాల్లో నుంచి మళ్లీ లాభాల్లోకి మళ్లించారు. ఇంత సంపదను మేనేజ్ చేయడం చాలా కష్టతరం అవుతుండటంతో ఇటీవలే తన పెట్టుబడులను పర్యవేక్షించడం కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ప్లానర్లను కూడా నియమించుకున్నారు ఓప్రా. కేవలం ధనార్జనకే పరిమితం కాకుండా .. పేదరికంలో మగ్గిపోతున్న వారికి తన వంతు సాయం చేస్తూ.. దానగుణాన్నీ చాటుకుంటున్నారు. ఇలా జరిగితే ఎలా.. అలా జరిగితే ఎలా అని బాధపడాల్సిన అవసరం లేకుండా మనసు హాయిగా ఉండటమే ఆర్థిక స్వేచ్ఛ అంటారు ఓప్రా. -
బయట పడని ‘డాలర్’ బండారం
సాక్షి, విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలో గత ఏడాది సరస్వతీయాగం సందర్భంగా మాయమైన డాలర్ల(లాకెట్ల) బండారం ఇంకా బయటపడలేదు. ఈ అవినీతి బాగోతాన్ని అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కప్పిపెట్టారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఓ దాత ఇచ్చిన డాలర్లు మాయం కావడంతో ఈ ఏడాది సరస్వతీ యాగానికి సహకరించేందుకు దాతలు ఎవరూ ముందుకు రాలేదు. పది వేల డాలర్లు మాయం ఈ నెల 4న శ్రీ పంచమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సరస్వతీయాగం జరగనుంది. గత ఏడాది ఫిబ్రవరి 11న కూడా ఈ యాగం జరిగింది. అప్పట్లో యాగం రోజున అమ్మవారి దర్శనానికి వచ్చే విద్యార్థులకు దుర్గగుడిలో పనిచేసే ఒక ఉద్యోగి ప్రొత్సాహంతో తెనాలికి చెందిన శివకుమార్ అనే భక్తుడు సుమారు రూ.7లక్షల ఖర్చుతో 10వేల డాలర్లు(ల్యాకెట్లు) తయారు చేయించి దేవస్థానానికి ఇచ్చారు. రాగితో చేసిన ల్యాకెట్కు వెండి, బంగారు పూత పూయించారు. అయితే దేవస్థానం అధికారులు, సిబ్బంది కమ్ముైక్కై ఆ డాలర్లును మాయం చేసినట్టు విమర్శలు వచ్చాయి. యాగం రోజున కేవలం రెండు రూపాయలకు లభించే రాగి ల్యాకెట్లును విద్యార్థులకు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. డాలర్లు విద్యార్థులకు ఇవ్వలేదని తెలుసుకున్న శివకుమార్ నివ్వెర పోయి ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఊరుకున్నారు. ఈ డాలర్లును దేవస్థానం అధికారులే గప్‌చుప్‌గా మాయం చేసేశారని తరువాత ప్రచారం జరిగింది. ఇవి ఇప్పటికీ దేవస్థానంలోని కొంతమంది ఉద్యోగుల వద్ద ఉన్నట్లు సమాచారం. అప్పటి ఈవో ఆ ఘటనపై ఏఈవో స్థాయి అధికారిని విచారించాలని ఆదేశించారు. ఆ ఏఈవో కేసును తూతూమంత్రంగా పూర్తి చేసినట్టు సమాచారం.దీంతో ఆలయానికి ఇచ్చిన వస్తువులను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని గుర్తించి ఈ ఏడాది దాతలెవరూ ముందుకు రాలేదు. నాకేమీ తెలియదు : ఇన్చార్జి ఈవో త్రినాథ్‌రావు సరస్వతీయాగం వివరాల గురించి చెప్పేందుకు శుక్రవారం ఇన్చార్జి ఈవో త్రినాథ్‌రావు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయగా, మాయమైన డాలర్లపై విలేకరులు ప్రశ్నించారు. ఆ కేసు వివరాలు తనకు తెలియదంటూ ఆయన మాట దాటవేశారు. -
ప్రజాపంపిణీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి
సాక్షి, కర్నూలు: ప్రజాపంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు జాయింట్ కలెక్టర్ కన్నబాబు చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఏఎస్‌ఓలతో సమావేశమై తనదైన శైలిలో ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలను అరికట్టేందుకు సమర్థులైన సీఎస్‌డీటీ, ఏఎస్‌ఓలతో ప్రత్యేక టీములను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇకపై నిత్యావసర సరుకులు దారి మళ్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేషన్ సరుకులను పంపిణీ చేయకుండానే కార్డుదారులకు అందించినట్లు చూపుతుండటం, డీలర్లు సమయపాలన పాటించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ మార్పు తీసుకురావాలన్నారు. మొత్తంగా రేషన్ సరుకుల పంపిణీ.. పెట్రోల్ బంకుల్లో మోసాలు.. తూకాల్లో తేడా.. బియ్యం మిల్లుల్లో ప్రజాపంపిణీ బియ్యం నిల్వలు.. బినామీ రేషన్ దుకాణాలు.. గ్యాస్ ఏజెన్సీల అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు శ్రీకారం చుట్టారు. ప్రక్షాళనలో భాగంగా ప్రత్యేక బృందాల ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. గతంలో రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున టాస్క్‌ఫోర్స్ బృందాలు ఉండగా.. రెండేళ్ల నుంచి నిద్రావస్థలో ఉన్నాయి. తాజాగా పౌరసరఫరాల శాఖ అధికారులతోనే ఆదోని, నంద్యాల, కర్నూలు డివిజన్లకు రెండు బృందాల చొప్పున ఆరు టీములను ఏర్పాటు చేశారు. వీరంతా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో పని చేయనున్నారు. తద్వారా పారదర్శకత తీసుకొచ్చేందుకు అధికారులను సమాయత్తం చేశారు. దుకాణాలు ఒకచోట.. లబ్ధిదారులు మరోచోట జిల్లాలో సుమారు 12 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా 86వేల కార్డులు జత కలిశాయి. జిల్లాలో మొత్తం 2,476 చౌకధరల దుకాణాలను నిర్వహిస్తున్నారు. కొత్త లబ్ధిదారులకు కార్డులు కాకుండా కూపన్లను మంజూరు చేస్తున్నారు. అయితే సమీపంలోని చౌక ధరల దుకాణాలను కాకుండా.. దూరంలో ఉన్న దుకాణాల పరిధిలోకి వీరిని తీసుకురావడంతో కొత్త సమస్యలకు తావిస్తోంది. ఈ కారణంగా సరుకులు తెచ్చుకునేందుకు పేదలు నానా పాట్లు పడుతున్నారు. రచ్చబండలోనూ ఈ విషయమై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో రేషన్కూపన్ల విభజనకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇదిలాఉండగా ఎలాంటి ముందుచూపు లేకుండా చేపట్టిన ఈ కేటాయింపునకు బాధ్యులైన అధికారులపైనా చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బినామీల కోసం వేట జిల్లాలో 2,476 రేషన్ దుకాణాలు ఉండగా ఎక్కువ శాతం బినామీలు నిర్వహిస్తున్నారు. ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ షాప్ నం.16 డీలర్ అరుణాదేవి ప్రస్తుతం వేరే ఊరిలో ఉండగా.. మరొకరి నిర్వహణలో దుకాణం కొనసాగుతోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా బినామీలు నిర్వహిస్తున్న దుకాణాల వివరాలు తెలుసుకుని తొలగింపునకు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా మరో 300 రేషన్ దుకాణాలను కొత్తగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీటి మాటేమిటి? ప్రజాపంపిణీ వ్యవస్థ సక్రమ నిర్వహణకు జిల్లా, మండల స్థాయిలో ఆహార సలహా సంఘాలను నియమించారు. ఏడాది కాలంగా ఈ సంఘాల సమావేశాలను నిర్వహించకపోవడంతో అక్రమాలు వెలుగుచూసే అవకాశం లేకుండాపోతోంది. అదేవిధంగా జిల్లా స్థాయి ధరల పర్యవేక్షణ కమిటీ ఉన్నా.. జాడ కరువైంది. మార్కెట్లో ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు ప్రభుత్వం ధర ల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. ఈ బాధ్యతను కమిటీ చేపట్టాల్సి ఉన్నా పూర్తిగా విస్మరించారు. ఉల్లి ధరలు విపరీతంగా పెరిగినప్పుడు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించాలి. అలా జరిగిన దాఖలాల్లేవు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఈ వ్యవస్థలను వినియోగంలోకి తీసుకొస్తే ప్రజలకు మేలు చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.