
ఆల్‌టైమ్ గరిష్టానికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. జనవరి 30వ తేదీతో ముగిసిన వారాంతానికి 327.88 బిలియన్ డాలర్లను చేరాయి. అంతకు ముందు వారంతో పోల్చితే ఈ నిల్వలు ఏకంగా 5.84 బిలియన్లు పెరిగినట్లు ఆర్‌బీఐ గణాంకాలు తెలిపాయి. భారీగా విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ) దేశానికి రావడం, డాలర్లు పెద్దగా దేశం నుంచి బయటకు పోకపోవడం వంటి అంశాలు దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరడానికి కారణమని అధికార వర్గాలు తెలిపాయి.