భర్తతో గొడవ.. డాలర్లు మింగిన భార్య | Wife swallows $7000 cash after argument with ‘cheater’ husband | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవ.. డాలర్లు మింగిన భార్య

Published Sat, May 6 2017 8:47 PM | Last Updated on Tue, Sep 5 2017 10:34 AM

భర్తతో గొడవ.. డాలర్లు మింగిన భార్య

భర్తతో గొడవ.. డాలర్లు మింగిన భార్య

చెడు మార్గాల్లో పయనిస్తున్న భర్తకు డబ్బు అందకుండా చేసేందుకు యత్నించిన ఓ మహిళ.. అతను పద్దతి మార్చుకోకపోవడంతో ఆ డబ్బు మొత్తాన్ని మింగేసింది. ఈ సంఘటన అమెరికాలోని కొలంబియా నగరంలో చోటు చేసుకుంది. 28 ఏళ్ల శాండ్రా మిలేనా భర్తతో చెడు అలవాట్లు మాన్పించేందుకు తమ సంపాదనను ఇంట్లోని ఓ రహస్య ప్రదేశంలో దాచి పెట్టడం మొదలుపెట్టింది.

దీంతో వ్యసనాలకు అలవాటు పడిన ఆమె భర్త డబ్బు కోసం పలుమార్లు మిలేనాతో గొడవ పెట్టుకున్నాడు. అయినా పట్టువదలని మిలేనా అతనికి డబ్బు అందకుండా ఉంచేందుకు యత్నించింది. అయితే ఎలాగో భార్య డబ్బు దాచి పెడుతున్న ప్రదేశాన్ని కనుక్కున్న భర్త ఆ డబ్బు మొత్తాన్న ఎత్తుకుపోయేందుకు ప్రయత్నించాడు.

దీంతో భర్తను అడ్డుకున్న మిలేనా ఆ డబ్బు మొత్తాన్ని మింగేసింది. కొద్దిసేపటికి ఆమెకు తీవ్ర కడుపునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ఆపరేషన్‌ నిర్వహించిన వైద్యులు 57 వంద డాలర్ల నోట్లను వెలికితీశారు. మిగిలిన నోట్లను గ్యాస్ట్రిక్‌ ఫ్లూయిడ్స్‌ కరిగించేశాయని చెప్పారు. పూర్తిగా కోలుకున్న ఆమెను వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement