ఓ స్వచ్ఛంద సంస్థ తాము ఎంపిక చేసిన ప్రాంతంలో నివసించే వారికి ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, వ్యాపార వేత్తలకు 10వేల డాలర్లు(రూ.7లక్షల పై మాటే) విలువ చేసే బిట్‌కాయిన్‌లను ఉచితంగా అందిస్తామని బంపరాఫర్ ప్రకటించింది.
అమెరికాకు చెందిన నార్తవెస్ట్ ఆర్కాన్సాస్ ప్రాంతానికి చెందిన ఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్..ఆ ప్రాంతంలో వచ్చి స్థిరపడేవారికి భారీ ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు, వ్యాపారవేత్తలకు 2020నవంబర్ నుంచి ఫ్రీగా 10 వేలడాలర్లతో పాటు రోడ్ బైక్ లేదంటే మౌంటెన్ బైక్ అందిస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎలాంటి లాభపేక్షలేకుండా ఫ్రీగా అంతపెద్దమొత్తాన్ని ఎలా చెల్లిస్తారనే ప్రశ్నకు సమాధానంగా నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్ కౌన్సిల్ సభ్యులు స్పందించారు. నార్త్‌వెస్ట్ అర్కాన్సాస్‌కు వలసల్ని ప్రోత్సహించడంతో పాటు ఆ ప్రాంతాన్ని క్రిప్టో హబ్‌గా మార్చే ప్రక్రియలో భాగంగా ఈ ప్రోత్సహకాల్ని అందిస్తున్నాం. బ్లాక్‌చెయిన్‌పై ఆసక్తి ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలను ఆకర్షించాలనదే మా ఉద్దేశం. ఈ ఆఫర్‌లో ఎవరైనా పాల్గొనచ్చని కౌన్సిల్ ప్రెసిడెంట్, సీఈఓ నెల్సన్ పీకాక్ తెలిపారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక సైతం..ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి 50మంది తరలి వచ్చినట్లు తెలుస్తోంది. బిట్‌కాయిన్‌ల ఇన్సెంటీవ్‌లను అందించడం ద్వారా రానున్న రోజుల్లో 7,500 ఓపెన్ టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేయడంలో సహాయపడుతుందని కౌన్సిల్ భావిస్తోంది.
చదవండి: 'రండి బాబు రండి', పిలిచి మరి ఉద్యోగం ఇస్తున్న దిగ్గజ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment