కొత్త శిఖరానికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 13వ తేదీతో ముగిసిన వారాంతానికి ఈ నిల్వలు అంతక్రితం వారం ముగింపుతో (ఫిబ్రవరి 6) పోల్చితే 2.95 బిలియన్ డాలర్లు పెరిగాయి. మొత్తంగా 333 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. తాజా నిల్వలు భారత్‌కు కనీసం 10 నెలల దిగుమతుల బిల్లుకు సరిపోతాయని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి.