బెంగళూరు: చెత్త ఏరుకునే ఓ వ్యక్తి రోజూలాగే తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ఓ చెత్తకుప్ప దగ్గర అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. ఆశతో ఆ బ్యాగులో ఏమున్నాయో అని చూసిన అతనికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది.
ఆ బ్యాగులో అతనికి ఏకంగా 3 మిలియన్ డాలర్ల అమెరికన్ కరెన్సీ దొరికింది. మన రూపాయి విలువలో చెప్పాలంటే వాటి విలువ రూ.25 కోట్లు. అన్ని అమెరికన్ డాలర్లు చూసి ఎగిరి గంతేసిన ఆ చెత్త ఏరుకునే వ్యక్తి వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి విషయం తన బాస్‌కు చెప్పాడు. ఆ బాస్ ఓ సోషల్ యాక్టివిస్ట్ చెవిన ఈ విషయాన్నివేశాడు.
ఆ సోషల్ యాక్టివిస్ట్ వెంటనే పోలీసులకు డాలర్ల కట్టల బ్యాగ్ దొరికినట్లు చెప్పాడు. దీంతో సీన్‌లోకి ఎంటరైన పోలీసులు డాలర్లు అసలువా కావా కన్ఫమ్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి వాటిని పంపారు. వాటిని పరిశీలించిన ఆర్బీఐ ఆ డాలర్లన్నీ ఫేక్ అని తేల్చింది.
Comments
Please login to add a commentAdd a comment