rag pickers
-
చెత్త కుప్పలో బ్యాగ్...తీసి చూస్తే డాలర్ల కట్టలు
బెంగళూరు: చెత్త ఏరుకునే ఓ వ్యక్తి రోజూలాగే తన పని తాను చేసుకుంటున్నాడు. ఇంతలో ఓ చెత్తకుప్ప దగ్గర అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. ఆశతో ఆ బ్యాగులో ఏమున్నాయో అని చూసిన అతనికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఆ బ్యాగులో అతనికి ఏకంగా 3 మిలియన్ డాలర్ల అమెరికన్ కరెన్సీ దొరికింది. మన రూపాయి విలువలో చెప్పాలంటే వాటి విలువ రూ.25 కోట్లు. అన్ని అమెరికన్ డాలర్లు చూసి ఎగిరి గంతేసిన ఆ చెత్త ఏరుకునే వ్యక్తి వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి విషయం తన బాస్‌కు చెప్పాడు. ఆ బాస్ ఓ సోషల్ యాక్టివిస్ట్ చెవిన ఈ విషయాన్నివేశాడు. ఆ సోషల్ యాక్టివిస్ట్ వెంటనే పోలీసులకు డాలర్ల కట్టల బ్యాగ్ దొరికినట్లు చెప్పాడు. దీంతో సీన్లోకి ఎంటరైన పోలీసులు డాలర్లు అసలువా కావా కన్ఫమ్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి వాటిని పంపారు. వాటిని పరిశీలించిన ఆర్బీఐ ఆ డాలర్లన్నీ ఫేక్ అని తేల్చింది. -
బాధ్యతలో సగభాగం.. మనసుల్ని గెలిచిన శునకం..
కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతలా అంటే సొంత కొడుకులా సేవ చేస్తాయి. నిత్యం ఇంటికి కాపాలా కాస్తాయి. మనతో మంచి స్నేహం చేస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను మనం చాలానే చూశాం. కానీ మీరు ఇప్పుడు చూడబోయే కుక్క చేసే పని చూస్తే మనసు కరగకుండా ఉండలేరు. ఓ ర్యాగ్ పికర్ బాధ్యతలో సగభాగాన్ని పంచుకుంది శునకం. చెత్తతో కూడిన ఓ సంచిని కుక్క కూడా మోస్తూ యజమానికి సహాయం చేస్తోంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. మీరూ.. చూసేయండి మరి..! Dog are our best friends! ❤️pic.twitter.com/UO5snDlS2O — Figen (@TheFigen_) July 11, 2023 వీడియోలో చూపిన విధంగా ఓ ర్యాగ్ పికర్ పనికిరాని వస్తువులను అన్నింటిని ఏరి సంచుల్లో వేసింది. ఇక ఆ రోజు పని అయిపోయిందనుకుంటా.. ఆ సంచులను ఇంటికి మోసుకెళుతోంది. ఈ క్రమంలో తాను ఓ పెద్ద సంచిని భుజాన మోస్తోంది. ఓ చిన్న సంచి బాధ్యతను తన కుక్కకు అప్పగించింది. తనకూ కొంచెం పని కల్పిస్తే బాగుండు.. యజమాని రుణం తీర్చుకుందును..! అన్నట్లు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ కుక్క సంచిని మోసింది. మెడకు కట్టిన తాడుతో సంచిని లాక్కెళ్లింది. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశారు. ముద్దొచ్చే కుక్క పని చూసి నెటిజన్లు తెగ స్పందించారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బుజ్జి కుక్క చేసే పని చూసి అందరూ మురిసిపోయారు. పెద్ద సంచిని మెడకు కట్టిన తాడుతో లాగుతూ చిన్న చిన్న అడుగులు వేస్తుంటే నెటిజన్లు మైమరిచిపోయారు. కుక్క బాధ్యతను చూసి నోరెళ్లబెట్టారు మరికొందరు. ఇదీ చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు -
ఆశయం కోసం అందర్నీ వదిలి: 20 ఏళ్ల తర్వాత..
చెన్నై : చెత్త బాటిళ్లు ఏరుకునే ఓ వ్యక్తి జీవితాశయం అతన్ని సెలబ్రిటీని చేసింది. తన ఆశయాన్ని సాధించటానికి కన్న వాళ్లను, కట్టుకున్న భార్యను, పిల్లల్ని వదలేసి, ఏకంగా 20 ఏళ్లు కష్టపడ్డాడు. ఎలాగైతేనేం సొంత స్థలంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న కలని నెరవేర్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా, అనైమేదు గ్రామానికి చెందిన నల్లతంబి అనే వ్యక్తి తాపీ పని చేసుకునేవాడు. కొన్ని గొడవల కారణంగా 20 ఏళ్ల క్రితం ఇంట్లోంచి బయటకు వచ్చేశాడు. ( ఆన్లైన్ క్లాసుల్లో పరిస్థితి ఇలానే ఉంటుందేమో? ) ఇంటిని వదిలి బయటకు వచ్చేసిన నాటి నుంచి దాదాపు 20 ఏళ్లలో తాపీ పని చేసి, వీధుల్లో చెత్త బాటిళ్లు ఏరుకుంటూ 10 లక్షల రూపాయలు సంపాదించాడు. ఆ డబ్బుతో రెండు స్థలాలను కొన్నాడు. ఓ స్థలంలో లక్ష రూపాయల ఖర్చుతో ఐదు అడుగుల ఎత్తుండే తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దీని గురించి నల్లతంబి మాట్లాడుతూ.. ‘‘ నేను యవ్వనంలో ఉన్నప్పటినుంచి గొప్ప పేరు తెచ్చుకోవాలని అనుకునేవాడిని. అందుకే నాకంటూ ఓ విగ్రహం ఉండాలనుకున్నా. నేను నా కలను సాకారం చేసుకున్నా’’నని అన్నారు. -
‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు
భోపాల్: చెత్త ఏరుకునే వ్యక్తి కుమారుడు ఎన్నో కష్టనష్టాలకోర్చి తొలి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో సీటు సాధించి పలువురు ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నాడు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన ఆశారాం చౌదరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ప్రవేశపరీక్షలో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో అతని ర్యాంకు 707. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్‌లో సీటు రావడంతో కళాశాలలో చేరేందుకు ఆశారాం రాజస్తాన్ వెళ్లాడు. అతని వైద్య విద్యకయ్యే ఖర్చు మొత్తాన్నీ భరించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)లోనూ ఆశారాం ఓబీసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 803 ర్యాంకు సాధించాడు. ఆశారాం గురించి తెలుసుకున్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. అతణ్ని కార్యాలయానికి పిలిపించి అభినందించి, తొలి సాయంగా 25 వేల రూపాయలు అందజేయాల్సిందిగా దేవాస్ జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ పాండేను ఆదేశించారు. శనివారమే ఆశారాం జోధ్‌పూర్ బయల్దేరాడు. అతనికి తోడుగా ప్రభుత్వమే ఓ అధికారిని పంపించింది. చెప్పలేనంత సంతోషంగా ఉంది: ఆశారాం ఎయిమ్స్‌లో సీటు రావడంతో తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని ఆశారాం అంటున్నాడు. ‘మా నాన్న చెత్త ఏరుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ మా కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమ్ముడు పన్నెండో తరగతి, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. మా ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌గానీ, మరుగుదొడ్డిగానీ లేదు’ అని ఆశారాం తన కుటుంబ దుర్భర పరిస్థితిని వివరించాడు. న్యూరాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమనీ, ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ చదివి సొంత ఊరిలోనే వైద్యశాల ప్రారంభించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తానని ఆశారాం వెల్లడించాడు. తమ ఊరిలోని వైద్యుడు దుర్గా శంకర్ కుమావత్ తనకు ఎంతో సాయం చేశాడనీ, ఆయనే తన హీరో అని వివరించాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆశారాంకు ఓ లేఖ రాసి అభినందించారు. ‘నీలాంటి వాళ్లు ఎందరికో ఆదర్శంగా మారుతారు’ అని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. -
వారిని చూస్తేనే చాలు ఛీత్కారం..
న్యూఢిల్లీ: చెత్తలో చిత్తు కాగితాలు ఏరేవారిని చూస్తే సమాజానానికి ఛీత్కార భావం. కాని వారు సమాజానానికి చేస్తున్న మేలు అంతా ఇంతా కాదు. దేశంలో ఏడాదికి 620 లక్షల టన్నుల చెత్తను వారు ఏరివేయడమే కాకుండా అది రీసైక్లింగ్‌కు వెళ్లేలా చేస్తున్నారు. ఢిల్లీ లాంటి మెట్రో నగరాల్లో రైళ్లు శుభ్రంగా ఉండడానికి కూడా వారే కారణం. అజ్మీర్ నుంచి ఢిల్లీ వచ్చే అజ్మీర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రతి రోజు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రాత్రి 11 గంటలకు ప్రయాణికులు దిగాక ఓ మూలన నిలిపేస్తారు. అప్పుడు బిరబిరమంటూ ర్యాగ్ పిక్కర్స్ రైలు బోగీల్లోకి వెళ్లి సగం తిని పడేసిన తిను బండారాలను, చెత్త కింద పడేసిన కాగితాలను ఏరుకుపోతారు. ఒక్క ఢిల్లీలోనే ర్యాగ్ పిక్కర్స్ ఐదు లక్షల మంది ఉండగా, దేశవ్యాప్తంగా 15 లక్షల నుంచి 40 లక్షల వరకు ఉంటారని ఓ అంచనా. దేశంలో మహా కూడిన చెత్తలో ఎప్పటికప్పుడు చెత్తను సేకరించే సామర్థ్యం పంచాయితీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు 75 శాతానికి మించి లేదట. ఆ లెక్కన 25 శాతం చెత్తను ర్యాగ్ పిక్కర్లే సేకరిస్తున్నారన్నది ‘ఇండియా స్పెండ్’ సంస్థ అంచనా. వారికి జీతాలు, భత్యాలు ఉండవు. బతుక్కే భద్రత ఉండదు. చిత్తు కాగితాలు, ఇనుప రేగులు, ఇనుప ఊసలు, విరిగిన ప్లాస్టిక్ ముక్కలు, పగిలిన సీసల కోసం వారు పెంట కుప్పలు తిరుగుతున్నప్పుడు వారి చేతులకు, కాళ్లకు గాయాలవుతాయి. ఇన్ఫెక్షన్లు వస్తాయి. శ్వాసకోశ వ్యాధులు తప్పవు. టీబీ కూడా వస్తుంది. అన్నింటిని భరిస్తున్నా వారికి కడుపు నిండా అన్నం కంటి నిండా నిద్ర ఉండదు. వారిని సమాజం శారీరకంగా, మానసికంగా చీదరించుకుంటుంది. వారిపై అప్పుడప్పుడు అత్యాచారాలు కూడా జరుగుతుంటాయి. ర్యాగ్ పిక్కర్స్ సమాజానికి ఎంతో మేలుచేస్తున్న విషయాన్ని తాను గ్రహించానని వారి పేరిట ఓ అవార్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించానని మాజీ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ 2015లో గర్వంగా ప్రకటించారు. ప్రతి ఏటా ముగ్గురు ర్యాగ్ పిక్కర్స్కు, మూడు స్వచ్ఛంద సంస్థలకు ఈ కొత్త అవార్డు కింద 1,50,000 రూపాయల చొప్పున నగదును అందజేస్తానని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ అవార్డును అమలు చేసిన దాఖలాలు మాత్రం కనిపించలేదు. ప్రస్తుతం కూడుతున్న చెత్త 2030 నాటికి మూడింతలు పెరిగి 16.5 కోట్ల టన్నులకు చేరుకుంటుందని, 2050 నాటికి 45 కోట్ల టన్నులకు చేరుకుంటుందని కూడా ఆయన తెలిపారు. ఢిల్లీలోని కెమికల్స్ హెల్త్ విభాగంలో సీనియర్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పాపియా సర్కార్ కథనం ప్రకారం ర్యాగ్ పిక్కర్స్ నాలుగు రకాలు. ఒకరు పెంట కుప్పలకు వెళ్లి ఏ చెత్తనైనా ఏరుకునేవారు. ఇల్లిల్లు తిరుగుతూ పనికొచ్చే వస్తువులను కొనుక్కెళ్లేవారు రెండోరకం, మూడు చక్రాల రిక్షాలో చెత్తను తీసుకెళ్లేవారు మూడవరకం, అన్ని రకాల పనికిరాని వస్తువులను కొనేందుకు చిన్న దుకాణాలను నడిపేవారు నాలుగోరకం. వీటిలో మొదటి రకం ర్యాగ్ పిక్కర్స్దే దర్భుర జీవితం. వారిలో ఏ కుటుంబాన్ని కదిలించినా ఓ కన్నీటి కథ వినిపిస్తుంది. తమను అనుమానాస్పదంగా, అంటరానివారిగా చూస్తారని, అసహించుకుంటారని, శరీరమేమో జబ్బులతో కుళ్లిపోతుందని ఢిల్లీలోని ర్యాగ్‌పిక్కర్స్ కాలనీ వాసులు చెబుతున్నారు. ఇక్కడ 250 కుటుంబాలు ఈ వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు. తమకూ కొంత గౌరవ వేతనం ఇవ్వాలని, రేషన్ కార్డులు సౌకర్యం కల్పించాలని, గుడెశెలకు స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీలంకలో మున్సిపాలిటీలు ప్రతి ర్యాగ్పిక్కర్కి రోజుకు రెండు డాలర్ల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తున్నాయి.