Stray Dog Shows Unconditional Love by Helping Rag Picker - Sakshi
Sakshi News home page

యజమాని బాధ్యతలో భాగం.. మనసుల్ని గెలిచిన శునకం.. వీడియో వైరల్..

Published Wed, Jul 12 2023 8:15 PM | Last Updated on Wed, Jul 12 2023 9:11 PM

Dog Unconditional By Helping Rag Picker - Sakshi

కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతలా అంటే సొంత కొడుకులా సేవ చేస్తాయి. నిత్యం ఇంటికి కాపాలా కాస్తాయి. మనతో మంచి స్నేహం చేస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను మనం చాలానే చూశాం. కానీ మీరు ఇప్పుడు చూడబోయే కుక్క చేసే పని చూస్తే మనసు కరగకుండా ఉండలేరు. ఓ ర్యాగ్ పికర్‌ బాధ్యతలో సగభాగాన్ని పంచుకుంది శునకం. చెత్తతో కూడిన ఓ సంచిని కుక్క కూడా మోస్తూ యజమానికి సహాయం చేస్తోంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. మీరూ.. చూసేయండి మరి..!

వీడియోలో చూపిన విధంగా ఓ ర్యాగ్ పికర్ పనికిరాని వస్తువులను అన్నింటిని ఏరి సంచుల్లో వేసింది. ఇక ఆ రోజు పని అయిపోయిందనుకుంటా.. ఆ సంచులను ఇంటికి మోసుకెళుతోంది. ఈ క్రమంలో తాను ఓ పెద్ద సంచిని భుజాన మోస్తోంది. ఓ చిన్న సంచి బాధ్యతను తన కుక్కకు అప్పగించింది. తనకూ కొంచెం పని కల్పిస్తే బాగుండు.. యజమాని రుణం తీర్చుకుందును..!  అన్నట్లు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ కుక్క సంచిని మోసింది. మెడకు కట్టిన తాడుతో సంచిని లాక్కెళ్లింది. 

ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశారు. ముద్దొచ్చే కుక్క పని చూసి నెటిజన్లు తెగ స్పందించారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బుజ్జి కుక్క చేసే పని చూసి అందరూ మురిసిపోయారు. పెద్ద సంచిని మెడకు కట్టిన తాడుతో లాగుతూ చిన్న చిన్న అడుగులు వేస్తుంటే నెటిజన్లు మైమరిచిపోయారు. కుక్క బాధ్యతను చూసి నోరెళ్లబెట్టారు మరికొందరు.   

ఇదీ చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement