helping
-
జగన్ ఆపన్న హస్తం.. బాబు ప్రచార అస్త్రం
సాక్షి, అమరావతి: గద్దెనెక్కిన వారందరూ నాయకులు అవుతారేమోగానీ.. వారిలో కొందరే మనసున్న పాలకులుగా ప్రజల మనసుల్లో నిలిచిపోతారు. ప్రకృతి విపత్తు సంభవించినప్పుడు మీడియా ముందు హడావుడి చేసి ప్రచారం కోసం పాకులాడే వారు కొందరైతే.. తాము తెరవెనుక ఉన్నా పర్వాలేదు బాధితులకు తక్షణం సహాయం అందడం ప్రధానం అని భావించే మనసున్న పాలకులు కొందరే.ప్రస్తుతం విజయవాడను భారీ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అందరూ ఈ అంశం ప్రాధాన్యతను గుర్తుచేసుకుంటున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి మీడియా హడావుడి లేకుండా బాధితులకు తక్షణం సహాయం సమర్థంగా అందించడంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కనబరిచిన నిబద్ధతను.. ప్రస్తుతం కేవలం మీడియా కోసం హడావుడి చేస్తూ బాధితులను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార పిచ్చిని పోల్చిచూస్తున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో నాడు–నేడు ముఖ్యమంత్రుల తీరు ఎలాగుందంటే.. అధికారులకు వారం గడువు.. బాధితులకు తక్షణ సాయం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గోదావరి తదితర వరదలు సంభవించినప్పుడు ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో పరిణతితో వ్యవహరించారు. వరద బాధిత ప్రాంతాలకు తాను తక్షణం వెళ్తే అధికార యంత్రాంగం అంతా తన చుట్టే ఉంటూ బాధితులను పట్టించుకోరని ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచే కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికార యంత్రాంగం మధ్య సమన్వయం సాధిస్తూ సహాయ, పునరావాస చర్యలను సమర్థంగా పర్యవేక్షించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించడమే కాదు.. అక్కడ వారికి తగిన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు.ప్రతి కుటుంబానికి తక్షణం నగదు సహాయం చేసి నిత్యావసర వస్తువులు అందేలా చూశారు. వరదలు తగ్గుముఖం పట్టిన తరువాతే బాధితులను సురక్షితంగా వారి ఇళ్లకు పంపించారు. ఆ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి ఏమన్నారంటే.. “కలెక్టర్‌కు వారం రోజుల గడువు ఇస్తున్నా. ఆ తరువాతే వరద బాధిత ప్రాంతాలకు వస్తా. ఒక్క బాధితుడు కూడా తనకు సహాయం అందలేదని చెప్పకూడదు’ అని కరాఖండీగా చెప్పారు. దాంతో యావత్ అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది. వారం రోజుల తరువాత జగన్ పర్యటించారు. ఎలాంటి ఇబ్బందుల్లేవని బాధితులంతా ముక్తకంఠంతో చెప్పారు. అంతా నేనే.. అంతటా నేనే.. ఇక వైఎస్ జగన్‌కు భిన్నంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పుడు క్షణాల్లో వాలిపోయారు. యావత్ అధికార యంత్రాంగం ఆయన పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమైపోయింది. మారుమూల ప్రాంతాల్లో బాధితుల గోడును ఏమాత్రం పట్టించుకోవడంలేదు. విజయవాడ నడిరొడ్డున వరద బీభత్సం సృష్టించినా 72 గంటల తరువాత కూడా బాధితులకు నిత్యావసర వస్తువులు అందించలేదు. తాగునీరు, పాల ప్యాకెట్ల సరఫరా చేయాలనే ధ్యాసే అధికార యంత్రాంగానికి లేకుండాపోయింది. తగినన్ని సహాయ శిబిరాలు ఏర్పాటుచేయలేదు.విజయవాడ వీధుల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో తిరుగుతున్న సీఎం చంద్రబాబుబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించనూ లేదు. కానీ, ఆయన అంతా నేనే.. అంతటా నేనే అన్నట్లుగా వ్యవహరించారు. మీడియా అంతా తనచుట్టూ ఉండేలా చూసుకుంటున్నారు. మరోవైపు.. వరదలతో ఏకంగా 19 మంది మృత్యువాత పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. మనసులేని ముఖ్యమంత్రి చంద్రబాబు, చేవచచి్చన ప్రభుత్వ యంత్రాంగాన్ని నమ్ముకుంటే ఇక లాభంలేదని బాధితులే తమ సామాన్లు పట్టుకుని వరద నీటిలో నడుచుకుంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి జిల్లాలో.. ⇒2019–20లో 1,604 మంది రైతులకు సంబంధించి 653 ఎకరాల్లో పంట నష్టపోతే రూ.90.20 లక్షలు పరిహారం ఇచ్చారు.⇒2020–21లో 8,441 మంది రైతులకు సంబంధించి 4,084 ఎకరాల్లో పంటలు కోల్పోయారు.రూ.6.03 కోట్లు పరిహారం చెల్లించారు. ⇒2021–22లో వరదల కారణంగా 4,447 మంది రైతులకు చెందిన 1,387 ఎకరాల్లో పంటను కోల్పోయారు. కేవలం నెలరోజుల్లో రూ.2.47 కోట్లు పరిహారం చెల్లించారు.⇒2022–2023 మధ్య కాలంలో 985 మంది రైతులకు సంబంధించిన 476 ఎకరాల్లోని పంటను కోల్పోయారు. రూ.72.34 లక్షల పరిహారం చెల్లించారు. 2022 జూలైలో వచ్చిన వరదలపై అధికారులతో సమీక్షిస్తున్న అప్పటి సీఎం జగన్ జగన్ సమర్థతకు ఈ ఉదంతాలే నిదర్శనం..2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లా అతలాకుతలమైంది. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని నగరం, పట్టణాలు, గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణం స్పందించి ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ సహాయ, పునరావాస చర్యలు చేపట్టారు. వలంటీర్లు, సచివాలయ ఏఎన్ఎం, పీహెచ్సీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు మంచినీరు, భోజనం, అత్యవసర, ప్రాథమిక చికిత్సలు అందించారు. తక్షణ సాయం కింద ప్రతి కుటుంబానికి రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారు. అంతా అయ్యాక జగన్ బాధితులను పరామర్శించారు. తమకు ప్రభుత్వ సహాయం అందిందని బాధితులు సంతోషంతో చెప్పారు. ఇక పంటలు నష్టపోయిన రైతులకు 25 రోజుల వ్యవధిలోనే పరిహారం చెల్లించారు.⇒2023 డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో గ్రామాలు, పట్టణాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 60 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆనాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం బాధితులను హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సుమారు 60 వేల కుటుంబాలకు రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ ఒక లీటరు, కేజీ ఉల్లిపాయలు, బంగాళా దుంపలు అందించారు. ప్రతి కుటుంబానికి రూ.2,500 ఆరి్థక సాయం చేశారు. ప్రతిరోజూ వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది బాధితుల వద్దకు వెళ్లారు. వారికి కావల్సిన అవసరాలను అందించారు. 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు పంపిణీ చేసింది. యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించారు.⇒డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2022 జూలైలో గోదావరికి రికార్డు స్థాయి వరద వచి్చంది. స్వయంగా నాటి సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయడంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులతో సమీక్షించారు. జిల్లా యంత్రాంగం హుటాహుటిన కదిలింది. వలంటీర్ నుంచి కలెక్టర్ వరకు ఒక్క తాటిమీదకు వచ్చి బాధితులను ఆదుకుని సమర్థవంతంగా సేవలందించారు. మరోవైపు.. హోంగార్డు, వలంటీర్ల బృందాలతో ఏటిగట్లకు రక్షణ కల్పించారు. దీని ఫలితంగానే వివిధ ప్రాంతాల్లో గట్లకు ఊలలు పడిన విషయాన్ని సకాలంలో గుర్తించి గండ్లు పడకుండా చూశారు.అప్పట్లో 45 వేల కుటుంబాలు వరద బారిన పడగా, వీరిలో 37,128 మందిని తరలించారు. ఇక వరద బాధితులకు రెండు విడతలుగా నిత్యావసరాలు అందించారు. ఇలా 36,801 మందికి అందజేశారు. నగదు సాయం కుటుంబానికి రూ.2వేల చొప్పున సుమారు రూ.6.50 కోట్ల వరకు నేరుగా బాధితుల అకౌంట్లలో జమచేశారు. మృతులు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున అందించారు. మరోవైపు పాడి రైతులను సైతం ప్రభుత్వం ఆదుకుంది. 33,570 పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 1,374 మెట్రిక్ టన్నుల దాణాను పంపిణీ చేశారు. 31,295 పశువులకు వ్యాక్సిన్లు అందించారు.⇒2023 డిసెంబరు మొదటి వారంలో వచి్చన మిచాంగ్ తుపానుతో ప్రకాశం జిల్లా అతలాకుతలమైంది. తీరప్రాంత మండలాల్లో ఎక్కువగా నష్టం వాటిల్లింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలోనే నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందే అలర్ట్ అయింది. ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. 46 పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించారు. 685 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించారు. ⇒2022 జూలై 11న అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పోలవరం నిర్వాసిత గ్రామాల్లో వరదలు ముంచెత్తాయి. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల పరిధిలో 217 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పట్లో జగన్ స్పందించి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున 37 వేల కుటుంబాలకు తక్షణ ఆరి్థక సహాయంగా రూ.7 కోట్ల 40 లక్షలు అందించారు. వీటిలో పాటు బియ్యం, నిత్యావసర సరుకులు ఉచితంగా అందించారు. ఆ నెలంతా కలెక్టర్‌తోపాటు యావత్ అధికార యంత్రాంగం ముమ్మరంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టింది. జూలై 27న జగన్ ఆయా ప్రాంతాల్లో పర్యటించగా బాధితులు పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. -
బడిని గుడి చేసిన గురుదేవుళ్లు..
బతకలేక బడిపంతులు అనే నానుడి పోయింది.. బతకనేర్చిన బడిపంతులు అనే అపవాదును మోయాల్సి వచ్చింది.. కానీ ఇప్పుడు.. బతుకు నేర్పుతున్న బడిపంతులుగా ఆ బాధ్యతను సమాజం పూజించే స్థాయికి తీసుకెళ్లారు కొందరు ప్రభుత్వోపాధ్యాయులు!కాన్వెంట్లు, ఇంటర్నేషనల్ కరిక్యులమ్‌తో కార్పొరేట్ స్కూళ్లు.. పల్లెలు, టౌన్లు, సిటీలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఉద్యోగ భద్రత కోసమే సర్కారు బడి, భవిష్యత్తుపై భరోసాకు మాత్రం ప్రైవేట్ స్కూలే సరి అనేది ప్రాక్టిస్లోకొచ్చింది. ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తెలుసుకోవడం కన్నా కంఠస్థమే ఫస్ట్ వస్తోంది. నైతికవిలువల కన్నా ద్రవ్య విలువకే ఇంపార్టెన్స్ అందుతోంది. ఇంత మార్పులో కూడా తన ముద్రను ప్రస్ఫుటంగా చూపించుకుంటోంది ప్రభుత్వ పాఠశాల. గత వైభవాన్ని ప్రేరణగా మలచుకుంటోంది.రామాయణ, భారత, భాగవతాల కథలతో రామకృష్ణులను, కౌరవపాండవ పాత్రలను కళ్లముందు నిలబెట్టే గురువులు, ఇంగ్లిష్ అంటే ఇష్టమున్నా కన్ఫ్యూజ్ చేసే టెన్సెస్తో భయపెట్టే ఆ భాషను సింపుల్‌గా బుర్రకెక్కించి.. అయ్యో ఇది ఎంత వీజీ అనుకునేలా చేసే టీచర్లు, అమ్మో లెక్కలా.. గొట్టు అనుకునే పిల్లల లాజిక్ సెన్స్‌కు రెక్కలు తొడిగి.. లెక్కల మీద మోజును పెంచే మాష్టార్లు, సైన్స్ అంటే పళ్లు తోముకోవడం, సైన్స్ అంటే ఏడ్వడం, నవ్వడం, ఆకలవడం, పరుగెత్తడం, గెంతడం, అలసిపోవడటం, ఉత్సాహపడటం, నిద్రపోవడమే.. ఒక్కమాటలో ‘సైన్స్ అంటే బతుకురా’ అంటూ తేల్చేసి ఆ కొండను పిండి చేయించే సార్లు, ఊరి సర్పంచ్ ఎవరు, వార్డ్ కౌన్సిలర్ ఏం చేస్తాడు?, గాంధీ తాతా చాటిందేంటి?, చాచా నెహ్రూ చెప్పిందేంటి.. ఇట్లా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సాంఘిక శాస్త్రం అంటూ లౌకిక జ్ఞానం మీద శ్రద్ధ పెంచిన నాటి బోధకులు.. నేటి ప్రభుత్వోపాధ్యాయులకు స్ఫూర్తిప్రదాతలవుతున్నారు. నిజమే! తెలివిడితనాన్నే ప్రోగ్రెస్‌గా పరిగణిస్తున్న గురువులతో ప్రభుత్వ పాఠశాలలు పాఠాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో ఇదిగో ఈ టీచర్లున్నారు. వాళ్లు అందుకుంటున్న గౌరవాభిమానాలు తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణలను చదవాల్సిందే!సొంత డబ్బుతో ప్రొజెక్టర్‌ను అమర్చిన టీచర్..రామగిరి దిలీప్ కుమార్ సెకండరీ గ్రేడ్ టీచర్. ఆసిఫాబాద్ జిల్లాలోని కోపుగూడ ప్రభుత్వ పాఠశాలలో బోధన వృత్తిని ప్రారంభించారు. తర్వాత మంచిర్యాల జిల్లా, కొమ్ముగూడేనికి బదిలీ అయ్యారు. తర్వాత పదమూడేళ్లు మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట, క్లబ్ రోడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. ప్రతిచోట తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని విద్యార్థులకు ఆర్థిక సాయం నుంచి స్కూల్లో సౌకర్యాల పెంపునకు కృషి, సొంత డబ్బుతో ప్రొజెక్టర్లను తెచ్చి డిజిటల్ బోధన వరకు చదువు మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. స్కూల్‌కు ఒక గంట ముందే వెళ్లి, ఒక గంట ఆలస్యంగా వస్తుంటారు.4, 5 తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు చెబుతూ గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల్లో సీట్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ టీచర్‌పై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే అతను ఎక్కడికి బదిలీ అయితే అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తోంది. 11 మందే విద్యార్థులున్న స్కూళ్లను 250 మంది విద్యార్థుల స్ట్రెంత్‌కి చేరుస్తోంది. గత జూలైలో ఆయన లక్సెట్టిపేట నుంచి ముల్కల్లగూడకు బదిలీ అయ్యారు. ‘సారు వెంటే మేమ’ంటూ 105 మంది విద్యార్థులు అంతకుముందు స్కూల్లోంచి టీసీ తీసుకుని ముల్కల్లగూడ స్కూల్లో చేరారు. దూరభారాన్ని లెక్కచేయక ఆటోలో వెళ్తున్నారు."ఫీజులు కట్టలేని ఎంతోమంది విద్యార్థులు సర్కారు బడిని ఎంచుకుంటున్నారు. వారికి సరైన బోధన అందిస్తే, బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారు. వాళ్లను పట్టించుకోకపోతే దేశానికి భవిష్యత్ లేకుండా చేసినవాళ్లమవుతాం. టీచింగ్ అనేది ఉన్నతమైన వృత్తి. నిబద్ధతతో ఉంటూ నేను చేయగలిగినంత చేయాలనేదే నా తాపత్రయం!" – రామగిరి దిలీప్ కుమార్.బదిలీ రద్దుకై పిల్లలు ధర్నాకు దిగేంత ప్రభావం చూపిన సార్లు.."కాతలే గంగారాం.. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆ బడిలో ఆయనది తొమ్మిదేళ్ల సర్వీస్. అంకితభావంతో పనిచేసి పిల్లలు, పెద్దల మనసులను గెలుచుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వాళ్లకు ప్రత్యేకంగా మరోసారి క్లాసులు తీసుకుంటారు. ఆ కర్తవ్యదీక్ష పిల్లలకు ఆయన మీద గౌరవాభిమానాలను పెంచింది. అందువల్లేమో మొన్న జూలైలో.. తమ సర్కి బదిలీ అవుతోందని తెలిసి.. ఆ స్కూల్ పిల్లలంతా రోడ్డు మీద ధర్నాకు దిగారు సర్ బదిలీ రద్దు చేయాలని కోరుతూ! ఊరి పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. అంతెందుకు స్వయానా గంగారాం సర్ వచ్చి చెప్పినా ససేమిరా అన్నారు. దాంతో పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పితే ధర్నా విరమించుకున్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో విషయంలో చురుకుదనాన్ని, ఆసక్తిని, ఉత్సుకతను చూపిస్తూంటారు. ఎవరూ ఎవరికి తీసిపోరు. ఎవరికి ఏ విషయంలో ప్రోత్సాహం అవసరమో గ్రహించి అందించాలి. కోపం, కరుకుదనంతో కాకుండా వాత్సల్యంతో వాళ్లను దారిలో పెట్టాలి. పిల్లలు ఉన్నతంగా ఎదగాలనేది మా ప్రయత్నం!" – కాతలే గంగారాం.మంచిర్యాల జిల్లా, పొనకల్లో ప్రధానోపాధ్యాయుడైన జాజల శ్రీనివాస్ మీద కూడా ఆయన విద్యార్థులకు గౌరవాభిమానాలు మెండు. పొనకల్ స్కూల్‌తో ఆయనది 12 ఏళ్ల అనుబంధం. గత జూ¯Œ లో శ్రీనివాస్ సర్కి అక్కపల్లిగూడకు బదిలీ అయింది. వెంటనే పొనకల్ స్కూల్లోని 141 మంది పిల్లలు అక్కపల్లిగూడ బడిలో చేరిపోయారు. అప్పటి వరకు 11 మందే ఉన్న ఆ స్కూల్లో శ్రీనివాస్ రాకతో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం, 4, 5వ తరగతి విద్యార్థులకు గురుకుల, నవోదయ ప్రవేశం దొరికేలా బోధించడంతో శ్రీనివాస్ సర్ ఉన్న చోటే చేరాలని పట్టుబట్టి మరీ ఆ స్కూల్లో చేరారు పిల్లలు.వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌తో పాఠాలు చెబుతున్న స్టార్లు..ముద్దాడ బాలరాజు.. నల్లగొండ జిల్లా, వావికొల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు పేద విద్యార్థులకు చేయుత అందించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలకు ఉచితంగా టై, బెల్ట్, షూస్‌ని పంపిణీ చేస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి కావల్సిన సౌకర్యాలను కల్పిస్తూ వావికోల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మనసుల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు ఇటీవల కొత్తతండాకు బదిలీ కావడంతో తమ స్కూల్‌ని వదలి వెళ్లద్దంటూ పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.జీనుగపల్లి సుధాకర్, రామగిరి సందీప్‌లకు వీరబోయనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పదకొండేళ్ల అనుబంధం. ఆ ఇద్దరూ సొంత డబ్బును వెచ్చించడంతో పాటు దాతల సహకారంతో ఆ స్కూల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావాలంటీర్లను నియమించారు. డిజిటల్ బోధనాసౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటివల్ల 50 మంది విద్యార్థులతో ఉన్న ఆ బడి 150 మందికి చేరుకుంది. అయితే ఇటీవల ఈ ఇద్దరు కూడా వరుసగా వావికోల్కు, నల్లగొండకు ట్రాన్స్ఫర్ కావడంతో ‘మాష్టార్లూ.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ’ కన్నీళ్లు పెట్టుకున్నారు పిల్లలు. ఆ ఇద్దరు టీచర్లు అందించిన సేవలను విద్యార్థుల తల్లిదండ్రులే కాదు గ్రామస్థులూ కొనియాడారు.కట్టెబోయిన సైదులు.. శిల్గాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆకవరపు శివప్రసాద్ కూడా అదే స్కూల్లో టీచర్. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టక ముందే.. ఆ ఇద్దరూ సొంత ఖర్చులతో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు కొని, తమ స్కూల్లో ఇంగ్లిష్‌లో బోధన మొదలుపెట్టారు. దాంతో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే కాక ఆ ఊర్లో ఏ విద్యార్థీ ప్రైవేట్ స్కూల్ మెట్లెక్కని శుభపరిణామం చోటుచేసుకుంది. పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ టీచర్లిద్దరూ పూర్వ విద్యార్థుల సహకారంతో వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌ను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పారు. ఆ గురుద్వయం కృషి వల్ల అయిదేళ్లుగా ఆ స్కూల్ గురుకుల పాఠశాల పోటీ పరీక్షల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తోంది. ఈ కీర్తి శిల్గాపురం చుట్టుపక్కల ఊళ్లకూ వ్యాపించి అక్కడి పిల్లలూ ఈ స్కూల్లో చేరుతున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరికీ వరుసగా పెద్దమునిగల్, రామడుగులకు బదిలీ అయింది. ఊరు ఊరంతా ఆ ఇద్దరికీ కన్నీటి వీడ్కోలు పలికింది. వాయిద్యాలతో సాగనంపి.. ఆ టీచర్ల మీద తమకున్న గౌరవాన్ని చాటుకుంది.గురిజ మహేశ్.. పదమూడేళ్లుగా టీచర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన ఏ బడిలో ఉన్నా దాని మౌలిక వసతుల కల్పనకై శ్రమిస్తారు. అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తారు. విద్యార్థుల గైర్హాజరుపై ప్రత్యేక దృష్టిపెడ్తారు. పిల్లలు బడి ఎగ్గొట్టి బావులు, పొలాల చుట్టూ తిరుగుతుంటే వెళ్లి వాళ్లను తన బైక్ మీద ఎక్కించుకుని స్కూల్‌కి తీసుకొస్తారు. చదువు ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఆయన దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ బడికి ఆయన 2023లో డిప్యుటేషన్‌పై వచ్చారు. ఇటీవల జరిగిన బదీలీల్లోనూ ఆయన అదే బడిలో కొనసాగుతున్నారు. వృత్తిని ప్రేమిస్తూ, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతూ.. బోధన గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న గురువులు అందరికీ వందనాలు! - సాక్షి నెట్వర్క్ -
శభాష్ పోలీస్..!
మాడ్గుల: రాత్రివేళ.. రాష్ట్రంకాని రాష్ట్రం.. ఇద్దరు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని స్థితి.. ఆపై మొదలైన పురిటినొప్పులు... ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గస్తీ పోలీసులు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు. ‘డయల్ 100’ కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక మహిళల చేత దగ్గరుండి పురుడు పోయించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆమె సంబం«దీకుల సహకారంతో తల్లీబిడ్డలను హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి పంపించారు.ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో..: సోమవారం రాత్రి గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి ఈ విషయం చెప్పగా కంట్రోల్ రూం సిబ్బంది ఆ సమాచారాన్ని గస్తీ పోలీసులకు చేరవేశారు. దీంతో వారు తక్షణమే అక్కడికి చేరుకొని మహిళ వివరాలు కనుక్కున్నారు. తన పేరు కుమీ భాయ్ అని, కర్ణాటకలోని చెంచోలు మండలం పోలేపల్లి తమ గ్రామమని తెలి పింది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలతో వారం క్రితం ఇల్లు వదిలి వచ్చా నని పేర్కొంది. భర్త పేరు, ఫోన్ నంబర్ చెప్పగా పోలీసులు ఆ నంబర్‌కు కాల్ చేశారు. అతను ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.హైదరాబాద్‌లో ఉన్న భార్య తమ్ముడిని పిలిపించి అతని వెంట పంపాలని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనంత రం పోలీసులు తల్లీబిడ్డలకు ఆహారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండ గా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళకు పెట్రో కార్ అడ్డంపెట్టి స్థానిక మహిళల చేత అక్కడే పురుడు పోయించారు. తర్వాత ఆమె సోదరుడిని పిలిపించారు. తల్లీపిల్లలను మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కోఠి మెటరి్న టీ హాస్పిటల్‌కి పంపించారు. ఆస్పత్రిలో మాడ్గుల సీఐ నాగరాజు గౌడ్ ఆమెను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వం చాటుకున్న పెట్రో కార్ సిబ్బంది రాజేందర్, సురేశ్, సీఐ నాగరాజు గౌడ్‌ను రాచకొండ సీపీ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ డి.సునీతారెడ్డి అభినందించారు. -
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్‌లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
ఆటిజం బిడ్డలు, ఆ అమ్మలకు హ్యట్సాఫ్ : వీడియో వైరల్
ఆటిజంతో బాధపడుతున్న పిల్లల్ని పెంచి పెద్ద చేయడం తల్లి తండ్రులకు ఒక సవాల్. కానీ వారికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలి. అలాగే ఆటిజం పిల్లల్లో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగా రాణిస్తారు. దీనికి ఉదారణలు చాలానే ఉన్నాయి. తాజాగా తన బిడ్డ డ్యాన్స్ ప్రదర్శన కోసం తపన పడుతున్న ఓ తల్లి వీడియో ఒకటి ఇంటర్నెట్లో ఆసక్తికరంగా మారింది.ఒక తల్లి తన ఆటిస్టిక్ బిడ్డకు నృత్య పోటీలో ప్రదర్శన ఇవ్వడానికి సహాయం చేస్తోంది అంటూ అపర్ణ అనే యూజర్ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రత్యేక పిల్లలను పెంచడానికి అనుభవించే బాధ.. సహనం.. ఎంత అంకితభావం అవసరమో ఊహించను కూడా ఊహించలేం.. హ్యాట్సాఫ్’’ అంటూ వ్యాఖ్యానించారు.A mother helps her autistic child perform in a dance competition ...Can't even imagine the amount of pain, patience and dedication required to bring up special children! Hats off 🙏💕 pic.twitter.com/JbEETe4yzC— Aparna 🇮🇳 (@apparrnnaa) June 10, 2024ఈ వీడియోలో ఆటిజంతో బాధపడుతున్న ఒక బాలిక స్టేజ్‌పై శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకు ఎదురుగా కూర్చున్న తల్లి స్వయంగా ఆయా భంగిమలను చూపిస్తూ ఉంటుంది. దాని కనుగుణంగా ఆ పాప తన డ్యాన్స్‌ను కొనసాగిస్తుంది. ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.ఆటిజంఆటిజం అనేది చిన్నపిల్లల్లో ఏర్పడే ఒక మానసిక స్థితేకానీ, రుగ్మత కాదు. తల్లి గర్భం దాల్చిన సమయంలో ఆమె మానసిక స్థితిని బట్టి లేదా మేనరికం కొన్ని జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం, ఎవరితో అయినా మాట్లాడే సమయంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం, ఒక పనిని ఎప్పుడూ చేసినా తిరిగి అలాగే చేయాలని ప్రయత్నించడం, కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్ళను పైకి కిందికి అదే పనిగా ఆడించడం,చెప్పిన పని చేయకపోవడం, నేలపై నడిచేటప్పుడు నిటారుగా నడవకుండా వేళ్లపై నడవడం లాంటి లక్షణాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలు చిన్నపిల్లల్లో జన్మించిన మూడు సంవత్సరాల నుండి మొదలయ్యే అవకాశం ఉంటుందని, ఇలాంటి లక్షణాలు తల్లిదండ్రులు కనుగొన్నట్లయితే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స అందించాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. -
సరిలేరు తనకెవ్వరు..!!
వేసవిలో మండుటెండల్లో ఖానా పూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే వారికి పట్టణానికి చెందిన జనార్దన్ అంబలి పోసి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా (లేఖరిగా) పనిచేస్తున్న పల్లికొండ జనార్దన్ తాను సంపాదించిన దాంట్లోంచి కొంత సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు.ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా రాజకీయాలకతీతంగా తొమ్మిదేళ్లుగా సామాజిక సేవచేస్తూ అందరి మన్ననలు పొందుతూ పలువురికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఏటా వేసవి ప్రారంభం కాగానే మూడు నెలల పాటు ప్రజలకు అంబలిని అందిస్తున్నారు.రద్దీ పెరిగినా వెనక్కి తగ్గకుండా..పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు గతంలో అంతగా జనం వచ్చేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ సేవలు పెంచడంతో రద్దీ పెరిగింది. అయినప్పటికీ ప్రతీరోజు వెయ్యిమందికి పైగా జనానికి ఉచితంగా అంబ లి అందిస్తున్నాడు. దీనికి తోడు రూ.50 వెచ్చించి ఆర్టీసీ బస్టాండ్‌లో కూల్ వాటర్ ఫ్రీజర్ ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నాడు. 7 పదుల వయస్సులోనూ అధైర్యపడకుండా తన సేవలు కొనసాగిస్తున్నాడు.అంబలితో ఆరోగ్యం..అంబలి తాగడం ద్వారా వేడిమి నుంచి చల్లద నం పొందడంతో పాటు ఎన్నో పోషక విలువలు అందుతాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా అంబలి సేవిస్తున్నారు.భవిష్యత్‌లోనూ అందిస్తా..నాటి కాలంలో ప్రతీ వేసవిలో అంబలి తాగడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వడదెబ్బల నుంచి ఉపశమనం పొందేవారు. తొమ్మిదేళ్ల క్రితం కార్యక్రమం చేపట్టా. భవిష్యత్తులోనూ అందిస్తా.– పల్లికొండ జనార్దన్, అంబలి దాతకొన్నేళ్లుగా తాగుతున్నాం..ఆర్టీసీ బస్టాండ్‌లో జనార్దన్ ఉచితంగా అందించే అంబలిని కొన్నేళ్లుగా తాగుతున్నాం. వేసవి వచ్చిందంటే బస్టాండ్‌లో జనార్దన్ అంబలి ఉంటుందని గుర్తుకు వస్తుంది. ఎన్ని పనులున్నా వదిలివెళ్లి అంబలి తాగుతున్నాం.– కరిపె రాజశేఖర్, ఖానాపూర్ఇవి చదవండి: ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు.. కానీ అతను..! -
భరత్ కుటుంబానికి అండగా.. YSRCP ప్రవాసాంధ్రులు
వైఎస్సార్సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తోన్న భరత్‌కుమార్.. హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు. ఎంతో నిబద్ధతతో పని చేసే మలసాని భరత్‌కుమార్ రెడ్డి.. చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకునే వాడని గుర్తు చేసుకుంటున్నారు. ప్రదీప్ చింతా, పంచ్ ప్రభాకర్, శివ మేకా మలసాని భరత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన YSRCP ప్రవాసాంధ్రులు.. మలసాని భరత్ కుటుంబానికి తమవంతుగా సాయం అందించారు. NRIలు Dr ప్రదీప్ చింతా , పంచ్ ప్రభాకర్, యాత్ర-2 నిర్మాత శివ మేక లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. YSRCP కోసం భరత్ చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమని, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. ఇటీవలే ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సాయం అందించిన YSRCP సోషల్ మీడియా కన్వీనర్ భార్గవ్ సజ్జల తో కోఆర్డినేట్ చేసి ఆ కుటుంబానికి ప్రదీప్ చింతా, పంచ్ ప్రభాకర్, శివమేకా. బాసటగా నిలిచారు. -
గాయం మానేలా సాయం
-
విశ్వకర్మ స్కీముతో చేతివృత్తులకు చేయూత - ఎన్ఎస్ఈ ఎండీ చౌహాన్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విశ్వకర్మ పథకంతో సంప్రదాయ హస్తకళలు, తత్సంబంధ వర్గాలకు గణనీయంగా ప్రయోజనం చేకూరగలదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) ఎండీ ఆశీష్ కుమార్ చౌహాన్ తెలిపారు. మార్కెట్లు, రుణ సదుపాయాలు తగినంత స్థాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల వడ్రంగులు, చేనేతకారులు, బొమ్మల తయారీదారులు మొదలైన వారు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని, ఈ స్కీము వారి స్థితిగతులను మార్చగలదని ఆయన చెప్పారు. దాదాపు రూ. 13,000 కోట్ల ప్రాథమిక కేటాయింపులతో విశ్వకర్మ పథకం సుమారు 30 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చగలదన్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశీయంగా 70 లక్షల పైచిలుకు చేతివృత్తుల వారు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నప్పటికీ ఇది 20 కోట్ల స్థాయిలో ఉండొచ్చని అనధికారిక లెక్కలు ఉన్నాయని చౌహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యవసాయం తర్వాత అత్యధిక శాతం మందికి ఉపాధినిస్తున్న ఈ రంగానికి, ఇటువంటి పథకాలతో మరింత ప్రయోజనం చేకూరగలదని చిన్న, మధ్య తరహా సంస్థల శాఖ కమిటీలో ఒక సభ్యుడిగా తాను భావిస్తున్నట్లు వివరించారు. మూడు దశాబ్దాల క్రితం ఎన్ఎస్ఈ ఏర్పాటు తర్వాత దేశవ్యాప్తంగా స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్ ఎలాగైతే అందుబాటులోకి వచ్చి, మార్కెట్లలో పెట్టుబడుల తీరును మార్చేసిందో.. ఈ స్కీము కూడా చేతివృత్తుల వారికి తోడ్పడగలదని చౌహాన్ చెప్పారు. -
'ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం'..! రెండ్రోజులుగా.. బిక్కు బిక్కుమంటూ..
కరీంనగర్: ‘ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం’ అని చెప్పి ఓ మహిళను వదిలేసి వెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐబీ రోడ్డులో చోటు చేసుకుంది. సదరు మహిళ రెండు రోజులుగా దిక్కుమొక్కు లేక చలిలో..వానలో వాటర్ ట్యాంక్ కింద ఉండి తనవాళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఆమె దీనస్థితి అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం కొందరు ఆటోలో వచ్చి ఐబీ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గర అనారోగ్యంతో ఉన్న మహిళ(45)ను వదిలేసి వెళ్లారు. అదే ఏరియాలో ఉండే మైనార్టీ యూత్ యువకులు అబుబకర్, షోయబ్ రెండు రోజులుగా వాటర్ ట్యాంక్ కింద ఉన్న మహిళను గుర్తించి ప్రశ్నించగా తనను రెండు రోజుల క్రితం తమవాళ్లు ఆటోలో తెచ్చి ఇక్కడ వదిలేశారని చెప్పింది. దీంతో ఆమె అనారోగ్య పరిస్థితిని గుర్తించిన యువకులు.. వెంటనే వార్డు కౌన్సిలర్ పేర్ల సత్యంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన వార్డు కౌన్సిలర్ సత్యం.. సోమవారం రాత్రి అక్కడికి వచ్చి అనారోగ్యంతో పడిఉన్న మహిళ వివరాలు తెలుసుకున్నారు. తన పేరు మిర్యాల లక్ష్మి అని, తనది నిజామాబాద్ జిల్లా అని, తమవాళ్లు తనను ఇక్కడ వదిలేసి వెళ్లారని అస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కాగా ఆమె చేయిపై విజయ అని పచ్చబొట్టు ఉందని కౌన్సిలర్ పేర్ల సత్యం చెప్పారు. అనారోగ్యంతో ఉన్నసదరు మహిళను యూత్ ప్రతినిధులు అబుబకర్, షోయబ్‌తో కలిసి కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ సరైన సమాధానాలు చెప్పకపోగా ఆమె కాలుకు తీవ్రమైన గాయంతో పుండు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు.. ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దాతలు దయచూపరూ..! నేను చదువుకుంటాను..!! విద్యార్థి సన్నీ..
మహబూబాబాద్: కడుపేదరికం.. రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం.. కూలీకి వెళ్తేనే కూడు. లేనిపక్షంలో కుటుంబ మొత్తం ఆకలికి అలమటించుడే. ఇలాంటి పరిస్థితి ఉన్నా ఓ విద్యార్థి పట్టుదలతో చదివాడు. అనుకున్న లక్ష్యం చేరుకున్నాడు. అయితే ఉన్నత చదువుకు లక్ష్మీ కటాక్షం లేక ఓ నిరుపేద విద్యార్థి ఇబ్బందులు పడుతున్నాడు. ఎవరైన ఆర్థిక సాయం అందిస్తే ఉన్నతంగా చదువుకుంటానని పేర్కొంటున్నాడు. దాతల సాయం కోసం వేయికండ్లతో ఎదురుచూస్తున్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బాపునగర్ గ్రామానికి చెందిన మంతెన ప్రభుదాస్, స్వప్న దంపతులకు ముగ్గురు కుమారులు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. వ్యవసాయ కూలి పనులకు వెళ్లి కుమారులను పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు సన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకున్నాడు. 5వ నుంచి 10వ తరగతి వరకు మరిపెడలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్ ఎంపీసీ రాంపూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకున్నాడు. బీటెక్ చదవడానికి ఎంసెట్ రాశాడు. అలాగే, జేఈఈ మెయిన్స్ రాయడంతో పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నిట్ కళాశాలలో ప్రవేశం వచ్చినట్లు మెయిల్ద్వారా సమాచారం పంపించారు. దీంతో తనను ఎలాగైనా చదివించాలని తల్లిదండ్రులను ఒప్పించాడు. అప్పుతెచ్చి రూ. 20 వేలు ప్రవేశం కోసం ఆన్లైన్ ఫీజు చెల్లించారు. కళాశాలలో చేరగానే మరో రూ. 36 వేలు చెల్లించాలని తెలిపినట్లు చెప్పారు. అంతేకాకుండా సుమారు రూ. లక్షకు పైగా ఖర్చు అవుతుందని, చేతిలో డబ్బు లేక చదువు ఆపేయాల్సి వస్తుందని విద్యార్థి సన్నీ మనోవేదన చెందుతున్నాడు. పట్టుదలతో చదవగా సీటు వచ్చినా లక్ష్మీకటాక్షం లేకపోవడంతో కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈనెల 10 తేదీ వరకు కళా శాలలో చేరాలని సమాచారం అందించడంతో వారికి వేదన ఎక్కువైంది. దీనిపై దాతలు స్పందించి ఆర్థిక సాయం అందించాలని సన్నీతోపాటు తల్లిదండ్రులు వేడుకుకుంటున్నారు. దాతలు 9052001950 ప్రభుదాస్, చెన్నారావుపేట ఎస్బీఐ అకౌంట్ నంబర్ 62202764705, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్ 0021352 కి సాయం అందించాలని కోరారు. -
Video: మానవత్వం చాటుకున్న కేటీఆర్..
సాక్షి, చేగుంట/ మెదక్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన కేటీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో మెదక్ జిల్లాలో మంత్రి కళ్లెదుటే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట మండలం రెడ్డిపల్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన కేటీఆర్ వెంటనే కాన్వాయ్ ఆపి కారు దిగి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. తన వెంట ఉన్న వైద్యుడితో బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, బాధితులను తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా కేటీఆర్ చూపిన చొరవకు అక్కడున్న వారు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ' మంత్రి @KTRBRS గారు ఈరోజు జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించారు. pic.twitter.com/AgDdpFf55K — KTR News (@KTR_News) July 16, 2023 -
బాధ్యతలో సగభాగం.. మనసుల్ని గెలిచిన శునకం..
కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతలా అంటే సొంత కొడుకులా సేవ చేస్తాయి. నిత్యం ఇంటికి కాపాలా కాస్తాయి. మనతో మంచి స్నేహం చేస్తాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను మనం చాలానే చూశాం. కానీ మీరు ఇప్పుడు చూడబోయే కుక్క చేసే పని చూస్తే మనసు కరగకుండా ఉండలేరు. ఓ ర్యాగ్ పికర్ బాధ్యతలో సగభాగాన్ని పంచుకుంది శునకం. చెత్తతో కూడిన ఓ సంచిని కుక్క కూడా మోస్తూ యజమానికి సహాయం చేస్తోంది. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. మీరూ.. చూసేయండి మరి..! Dog are our best friends! ❤️pic.twitter.com/UO5snDlS2O — Figen (@TheFigen_) July 11, 2023 వీడియోలో చూపిన విధంగా ఓ ర్యాగ్ పికర్ పనికిరాని వస్తువులను అన్నింటిని ఏరి సంచుల్లో వేసింది. ఇక ఆ రోజు పని అయిపోయిందనుకుంటా.. ఆ సంచులను ఇంటికి మోసుకెళుతోంది. ఈ క్రమంలో తాను ఓ పెద్ద సంచిని భుజాన మోస్తోంది. ఓ చిన్న సంచి బాధ్యతను తన కుక్కకు అప్పగించింది. తనకూ కొంచెం పని కల్పిస్తే బాగుండు.. యజమాని రుణం తీర్చుకుందును..! అన్నట్లు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఆ కుక్క సంచిని మోసింది. మెడకు కట్టిన తాడుతో సంచిని లాక్కెళ్లింది. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశారు. ముద్దొచ్చే కుక్క పని చూసి నెటిజన్లు తెగ స్పందించారు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బుజ్జి కుక్క చేసే పని చూసి అందరూ మురిసిపోయారు. పెద్ద సంచిని మెడకు కట్టిన తాడుతో లాగుతూ చిన్న చిన్న అడుగులు వేస్తుంటే నెటిజన్లు మైమరిచిపోయారు. కుక్క బాధ్యతను చూసి నోరెళ్లబెట్టారు మరికొందరు. ఇదీ చదవండి: Video: బట్టతల దాచి రెండో పెళ్లికి రెడీ.... విగ్గు ఊడదీసి చితకబాదారు -
అక్రమాలకు పాల్పడున్న భారతీయ అమెరికన్‌కు జైలు.. వివరాలివే..
న్యూయార్క్: అక్రమాలకు పాల్పడుతున్న 49 ఏళ్ల భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు జైలు శిక్ష విధించింది. అతను అక్రమంగా భారతీయ పౌరులను ఉబెర్ సాయంతో కెనడా నుంచి అమెరికా సరిహద్దులలోకి ప్రవేశించేందుకు అవకాశం కల్పించడం, అలాగే వారిని మిడ్వెస్ట్, అక్కడి కన్నా ముందుకు తీసుకురావడం చేస్తున్నాడన్న ఆరోపణలతో అతనికి మూడేళ్లకు పైబడిన జైలు శిక్ష విధించింది. మనీలాండరింగ్‌కు పాల్పడుతూ.. కాలిఫోర్నియాకు చెందిన ఎల్మ్గ్రోవ్ నివాసి రాజిందర్ పాల్ సింగ్ ఉరఫ్ జస్పాల్ గిల్ మనీలాండరింగ్‌కు పాల్పడుతూ విదేశీయులను అక్రమంగా రవాణా చేయడం, వారికి ఆశ్రయం కల్పించడం చేస్తున్నాడన్న ఆరోపణలు రుజువు కావడంతో సియెటల్ జిల్లా కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. అక్రమంగా సరిహద్దులలోకి ప్రజలను తరలించేందుకు ఉబెర్‌ను ఉపయోగించిన స్మగ్లింగ్ రింగ్‌లో కీలక సభ్యుడైన రాజిందర్ సింగ్ తాను అర మిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని అందుకున్నట్లు గత ఫిబ్రవరిలో నేరాన్ని అంగీకరించాడు. సరిహద్దులు దాటించేందుకు ఉబెర్.. తీర్పు సందర్భంగా యూఎస్ తాత్కాలిక అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ మాట్లాడుతూ ‘నాలుగేళ్ల వ్యవధిలో సింగ్ 800 మందికి పైగా ప్రజలను ఉత్తర సరిహద్దుల గుండా యునైటెడ్ స్టేట్స్‌లోని వాషింగ్టన్ రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించేలా అవకాశం కల్పించాడన్నారు. 2018 జూలై ప్రారంభంలో సింగ్, అతని సహచరులు కెనడా నుండి సియెటల్ ప్రాంతానికి ప్రజలను అక్రమంగా సరిహద్దులు దాటించేందుకు ఉబెర్‌ను ఉపయోగించారని’ తెలిపారు. 2018 నుండి 2022 మే మధ్యకాలంలో భారతీయ పౌరులను యునైటెడ్ స్టేట్స్కు అక్రమంగా పంపేందుకు సింగ్ 600 ఉబెర్ ట్రిప్పులను ఏర్పాటు చేశాడు. ఇలా వారిని యూఎస్‌లోకి అక్రమంగా తరలించిన తర్వాత సింగ్ తన సహచరుల సాయంతో వాషింగ్టన్ రాష్ట్రం వెలుపలి నుంచి వారిని గమ్యస్థానాలకు తరలించేందుకు ప్లాన్ చేసిన మార్గాలకు ఒక్కొక్కటి చొప్పున పలు వాహనాలను అద్దెకు తీసుకున్నాడు. సింగ్, అతని సహచరులు నల్ల ధనాన్ని వైట్‌గా మార్చేందుకు అధునాతన పద్ధతులను ఉపయోగించారని రుజువయ్యింది. మహమ్మారి తర్వాత వేగవంతం.. వీరి అక్రమ రవాణా వ్యవహారాలు 2018 నుండి కొనసాగుతున్నాయని న్యాయవాద కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మహమ్మారి సమయంలో వీరి అక్రమ కార్యకలాపాలు మందగించాయి. మహమ్మారి పరిమితులు ఎత్తివేసిన తరువాత వారు తిరిగి తమ అక్రమ కార్యకలాపాలను వేగవంతం చేశారు. జూలై 2018- ఏప్రిల్ 2022 మధ్య ఈ స్మగ్లింగ్ రింగ్‌తో లింక్ అయిన 17 ఉబెర్ ఖాతాల ద్వారా $80,000కు పైగా మొత్తాన్ని ఖర్చు చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: గుడ్లను యూరిన్‌లో ఉడికించి, ఉప్పుకారం జల్లి.. -
మహిళలకే గృహలక్ష్మి అవకాశం... రూ. 3 లక్షల వరకు సాయం
మోర్తాడ్(బాల్కొండ) : సొంతంగా జాగా ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారికి వందశాతం రాయితీపై రూ. 3 లక్షల సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ‘గృహలక్ష్మి’ పథకం కింద మహిళా లబ్ధిదారులకే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కేటాయింపులను తక్కువ సంఖ్యలో కొనసాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి రూ. 1.50 లక్షల వరకు సాయం అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గృహ నిర్మాణ సంస్థను ప్రభుత్వం ఎత్తివేసింది. హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులను వివిధ శాఖల్లో విలీనం చేశారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలోనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంను కొనసాగించారు. తాజాగా ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించే పథకం తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరణకు నోచుకుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో మొదటి విడతలో 3 వేల చొప్పున ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించనున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి రూ. 30 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు ఉన్నాయి. అంటే జిల్లాకు గృహలక్ష్మి పథకం కింద రూ.165 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణానికి సాయం కోసం దరఖాస్తు చేసుకునేవారు స్థానికులై ఉండటమే కాకుండా తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉండటంతో పాటు ఓటరై ఉండాలనే నిబంధన విధించారు. ఓటరు కార్డును దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంది. ఓటరు కాని వారికి గృహలక్ష్మి పథకం వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. వరం కాదు భారమే.. గృహలక్ష్మి పథకం కింద అందే సాయం తక్కువగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుము, ఇటుకలు, ఇసుక ఇతరత్రా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం పేదలకు భారం అవుతుంది. రూ. మూడు లక్షలతో ఇంటిని నిర్మించుకోవడం కష్టమని అందువల్ల సాయం విలువను పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెండు గదులు, బాత్రూం, టాయ్లెట్లను నిర్మించాలంటే కనీసం రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
వీడియో వైరల్ చిట్టి చేతులతో చపాతీ చేస్తున్న చిన్నారి
-
ఫ్లోప్ డైరెక్టర్స్ కు మాస్ రాజా హెల్పింగ్ హ్యాండ్
-
మంచి మాట..: ఏది నిజమైన సంపద?
సంపద అంటే చాలామంది దృష్టిలో, భవంతులు, పొలాలు. మరికొందరికి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు. ఇంకొందరి భావనలో వాహనాలు, ఇళ్ళ స్థలాలు. కషీవలుడికి పంట, పశువులు, పండితుడికి జ్ఞానం... ఇలా సంపదను ఎన్నో రకాలుగా భావించి నిర్వచించవచ్చు. ఇది లౌకిక దృష్టి, సహజమైనది. ఆ రకమైన సంపద మన జీవనానికి అవసరమైనది. అయితే, సంపదంటే కేవలం ఇదే కాదు, ఈ భావనలకు లేదా మరికొన్ని ఇటువంటి భావనలకే ఈ మాట అర్థాన్ని పరిమితం చేయలేం. ఇది అర్థమయితేనే దాని లోతైన, విస్తృతార్థం బోధపడుతుంది. ఇహపరమైన సంపద ఏ రూపంలో ఉన్నా, తరతరాలకు తరగనిదైనా ఎవరి దగ్గర ఉన్నా వారికి తృప్తి అనేది ఉండాలి. తమ శక్తి మేరకు కూడబెట్టామన్న ఆలోచన రావాలి. ఇంకా ఎక్కువ పొందాలి అన్న తీవ్రమైన కోరిక కూడదు. అది ఉన్నవారు ప్రశాంతతకు దూరమవుతారు. అపార సంపన్నులైనా పరిమిత ప్రాథమిక అవసరాలతో, కోరికలతో నిరాడంబర జీవితం గడపగలగాలి. తమ తోటి వారికి ఆర్ధిక సహాయం చేయగలిగే దృష్టి రావాలి. ఆపన్నులకు చేయాత నివ్వాలన్న భావన రావాలి. ఇలా ఇతరులకు సహాయం చేయాలనే ఆలోచన నిజమైన సంపద. ఈ తృప్తి, నిరాడంబర జీవితం, పక్కవారిని ఆదుకోవాలన్న ఆలోచన ఉన్న వారు ఎంత పేదవారైనా ఐశ్వర్యవంతులే. ఆ ఆలోచన లేని వారు ఎంత ధనవంతులైనా అభాగ్యులే. గురువుల నుండి నేర్చుకున్న విద్యకు మెరుగు లు దిద్ది మన పరిశీలనా దృష్టితో దానిని మరింతగా వృద్ధి చేసుకోవాలి. ఇతరులకు అందివ్వగలగాలి. అపుడు అదెంతో సుసంపన్నమవుతుంది. ఇలా గురువులే కాదు ఇతరులూ చేయవచ్చు. గురువుల జ్ఞానం లేదా పాండిత్యం వారి శిష్యప్రశిష్యుల ద్వారా సర్వవ్యాపితమై అ దేశం జ్ఞాన సంపదగా నిక్షిప్తమవుతుంది. ‘మిడాస్ టచ్’ అనే కథలో ఒక రాజు తను ముట్టుకున్నది ప్రతిది బంగారంగా మార్చగల వరం పొందాడు. ఇక తన ఆనందానికి అవధులే లేవనుకుంటూ తన రాజభవనంలోని ప్రతి దానిని ముట్టుకుని హేమమయం చేసుకున్నాడు. తను తినే ఆహారం, తాగే మంచి నీరు, చివరకు తన కూతురు బంగారు విగ్రహంగా మారి పోవటం చూసి నిశ్చేష్టుడై, తన వరాన్ని వెనుకకు తీసుకోమని ఆ దేవతను వేడుకున్నాడు. నిజమైన ప్రేమ, అనుబంధాలు ముఖ్యమైన వని, అవే నిజమైన సంపదని గ్రహించాడు. నిజమైన సంపద ఇహపరమైనది కాదు. దానిని మన భౌతిక సంపదతో కొలవలేం. మన వ్యక్తిత్వం, గుణశీలత, మానవీయతలను మన ముందు తరాలవారికి వారసత్వంగా ఇవ్వగలగాలి. అదే నిజమైన సంపద. ఒక దేశంలోని అద్భుత కట్టడాలు సృజనశీలురు వారి అపురూప సృష్టి, సంగీత, సాహిత్య ప్రవాహాలు, శిల్ప సంపద, జీవనవిధానం, ఆహారం, నాట్యం, చలనచిత్రాలు, శాస్త్రవేత్తల అద్భుత మేధస్సు.. వీటి కలయిక ఆ దేశ సంస్కృతిగా భావన చేస్తారు. ఈ సంస్కృతి ఆ దేశ సంపదవుతుంది. వీటికి మనం జత చేయవలసిన అంశాలు ఆ దేశ ప్రజల నీతి, నిజాయితీ, నైతిక వర్తన, నిబద్ధత, వ్యక్తిత్వం, వారి ఆలోచనా తీరు. ఇవి వారికి వారసత్వసంపదగా వచ్చిన సంస్కృతిని మరింత ఉదాత్తంగా చేస్తుంది. ఇహపరమైన సంపదే కాకుండా ప్రతి ఒక్కరికీ సహజసిద్ధమైన చక్కని లక్షణాలు ఉంటాయి. వాటిలో ఒకటి ఆలోచనలు. మనల్ని సక్రమమార్గంలో పయనింపచేసే పథాలు. మనలోని అంతర్గత శక్తులకు సరైన ఆకృతి వీటివల్లే వస్తుంది. ఆలోచనలు మనిషి వ్యక్తిత్వ వికాసాన్నే కాదు సమాజ, దేశ వికాసాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. దేశ ప్రజల సక్రమ ఆలోచనా సరళి దేశ సంపదగానే భావించాలి. – బొడ్డపాటి చంద్రశేఖర్, అంగ్లోపన్యాసకులు -
హానీకి సీఎం జగన్ ఆపన్న హస్తం
-
చిన్నారి హానీ వైద్యానికి రూ.కోటి మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
-
పంచాయతీకొక సొసైటీ
న్యూఢిల్లీ: సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.10 లక్షల కోట్ల మేర చేయూత నివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామీణ సహకార బ్యాంకింగ్ విధానంపై కేంద్ర సహకార శాఖ, రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య(ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) నిర్వహించిన జాతీయ సదస్సులో శుక్రవారం అమిత్ షా మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 95 వేల ప్యాక్స్‌లో కేవలం 63 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందజేస్తున్నాయి. వ్యవసాయ రుణ విధానానికి గుండెకాయలాంటి ప్యాక్స్‌ను విస్తరించి, పటిష్టం చేయాలి. ఇందుకోసం పంచాయతీ కొకటి చొప్పున దేశంలోని 3 లక్షల పంచాయతీలకు మరో 2 లక్షల ప్యాక్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉంది’అని ఆయన చెప్పారు. ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే రూ.10 లక్షల కోట్ల రుణ సాయం అందించేందుకు వీలవుతుందని అన్నారు. మోడల్ బై–లాస్‌తోపాటు నూతన సహకార విధానం, సహకార వర్సిటీ, ఎక్స్పోర్ట్ హౌస్, సహకార బ్యాంకులకు డేటాబేస్ అభివృద్ధి వంటివి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి అమిత్ షా వెల్లడించారు. -
లంకకు భారత్ ఆపన్నహస్తం
కొలంబో: ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్ అందించిన నాలుగో డీజిల్ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది. 36 గంటల కర్ఫ్యూ ఆహార కొరత, ధరల మంటను భరించలేక శ్రీలంకలో జనం వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో శనివారం సాయంత్రం ఆరింటి వరకు దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించారు. ఆదివారం జరగనున్న దేశవ్యాప్త నిరసనలను అడ్డుకోవడమే దీని ఉద్దేశంగా కన్పిస్తోంది. ఏప్రిల్ 1 నుంచి దేశంలో ఎమర్జెన్సీ విధించడం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అన్ని పార్టీల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి ఆర్థిక సంక్షోభం ముగిసి పరిస్థితి చక్కబడాలంటే అన్ని పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు గొటబయా రాజపక్సకు ఫ్రీడం పార్టీ విజ్ఞప్తి చేసింది. సానుకూలంగా స్పందించకపోతే అధికార కూటమి నుంచి తప్పుకుంటామని తేల్చిచెప్పింది. 🇱🇰 #SriLankaEconomicCrisis #GoHomeGota pic.twitter.com/gx5yQYyob7 https://t.co/ZmEsprNC7T — Anonymous (@YourAnonNews) April 2, 2022 -
కోవిడ్ బాధితులకు ఐకియా సాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ‘ఏ ప్లేస్ కాల్డ్ హోమ్’ పేరుతో కోవిడ్–19 బాధిత కుటుంబాలకు తన వంతుగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులు, దినసరి కూలీలు, మురికివాడల్లో నివసించే వారికి ఆశ్రయం, సురక్షితమైన పారిశుధ్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం వంటివి చేపడుతుంది -
పరిమళించిన మానవత్వం..యాచకుడికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సపర్యలు
సాక్షి, షాద్‌నగర్: ఆకలితో అలమటిస్తున్న ఓ యాచకుడు రోడ్డు దాటుతూ కిందపడిపోయాడు. వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయం అందించి మానవత్వాన్ని చాటాడు. షాద్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మురళీ శుక్రవారం పట్టణంలోని ముఖ్య కూడలిలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో డొక్కలు ఎండిపోయి ఆకలితో అలుమటిస్తూ ఓ యాచకుడు రోడ్డు దాటేందుకు యత్నిస్తూ కింద పడిపోయాడు. చదవండి: టీఎస్ఆర్టీసీ: ప్రభుత్వ పూచీకత్తు లేకుండానే రూ.300 కోట్ల రుణం గమనించిన కానిస్టేబుల్ మురళీ ఆ యాచకుడిని పైకి లేపి పక్కన కూర్చోబెట్టాడు. ఆకలితో ఉన్నానని, కళ్లు తిరుగుతున్నాయని ఆ యాచకుడు సైగలు చేయడంతో వెంటనే కానిస్టేబుల్ యాచకుడికి నీళ్లు తాగించి, పక్కనే ఉన్న పండ్లు కొనిచ్చి ఆకలి తీర్చాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి ఉన్నతాధికారులకు పంపించారు. మానవత్వాన్ని చాటిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు అభినందించారు. షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ కానిస్టేబుల్ మురళీకి రివార్డు అందజేశారు. తోటి పోలీస్ సిబ్బంది అతన్ని అభినందించారు. చదవండి: కూకట్‌పల్లిలో వ్యభిచార దందా.. ఓ మహిళను రప్పించి.. -
Viral Video: అరే ఇటు చూడండ్రా.. నన్నే వదిలేసి వెళ్లిపోతారేంట్రా?
-
వైరల్: ‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారు’
జీవితంలో నేర్చుకునే విషయాలు ఎన్నో ఉంటాయి. కొన్ని ఇతరులు చెప్పడం వల్ల తెలిస్తే మరికొన్ని సొంత అనుభవాల ద్వారానే బోధపడుతుంటాయి. కేవలం మనుషులతోనే కాదు, ప్రకృతి, జంతువుల ద్వారా కూడా బోలేడు విషయాలు నేర్చుకోవచ్చు.. తాజాగా అలాంటి ఓ వీడియోను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిన్న చీమలకు సంబంధించిన విషయం మావవ జీవితానికి ఎలా ముడిపడి ఉందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. చదవండి: ఏడవకురా.. ఏప్రిల్‌లో వెళ్లిపోతాం లే’ వీడియోలో మూడు చీమలు ఒక పెద్ద ఆకు మీదకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే ఈ మూడింటిలోఒక చీమ కింద నుంచి సాయం చేస్తుండగా మిగతా రెండు చీమలు ఆకు పైకి ఎక్కేస్తుంటాయి. రెండు చీమలు ఆకు ఎక్కిన తరువాత వీటికి సాయం చేసిన చీమను మాత్రం ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాయి. దీనిని బెన్ ఫిలిప్స్ అనే వ్యక్తి ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశారు. చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ ‘ఇది ఇప్పటివరకు చేసిన అత్యంత బాధాకరమైన సినిమా’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ వీడియో ఇప్పటి వరకు 4 మిలియన్ల వ్యూవ్స్ సంపాదించింది. దీనిని చూసిన నెటిజన్లు చిన్న చీమల వీడియో వెనక పెద్ద జీవిత సత్యం దాగుందంటూ కామెంట్ చేస్తున్నారు. చివరికి మిగిలిన చీమ పట్ల జాలిపడుతూ, ప్రస్తుతం మనుషులు కూడా ఇలాగే తయారయ్యారని పేర్కొంటున్నారు. మరికొంత మంది‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారే’ అంటూ ట్వీట్ చసస్తున్నారు. -
Friend Ship Day 2021: స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
ఫ్రెండ్.. అందరికీ ఇష్టమైన పదం. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అన్నట్లు.. బాధలో ఉన్నప్పుడు మొదటగా గుర్తుకొచ్చేది స్నేహితుడు.. సంతోషాన్ని పంచుకునేందుకు వెంట ఉండేది స్నేహితుడు. జాతి, మతం అన్న తేడాల్లేకుండా ఇద్దరు వ్యక్తులను కలిపిఉంచే బంధం కేవలం స్నేహానిది మాత్రమే. ఏ రక్త బంధంతో నిమిత్తం లేకుండా చివరి వరకు నిలిచేది స్నేహితుడు. ట్రెండు మారినా ఫ్రెండ్ మారడే అన్న నానుడి కూడా స్వచ్ఛమైన స్నేహం నుంచి జన్మించిందే. ఏ స్వార్థం చూసుకోకుండా మనసు గెలిచిన స్నేహితుల బాగోగుల కోసం శ్రమించే స్వభావం ప్రస్తుత ప్రపంచంలో అరుదుగానే లభిస్తుందని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో చాలామంది స్నేహితులు కరోనా సమయంలో అండగా నిలిచారు. ఆపద సమయంలో ప్రాణాలు కాపాడారు. కాల పరీక్షకు ఎదురుగా నిలుస్తూ స్వచ్ఛమైన స్నేహానికి నిదర్శనంలా కనిపిస్తున్న పలువురిపై స్నేహితుల దినోత్సవం సందర్భంగా కథనాలు.. ఫేస్బుక్ మిత్రుల రూ.1.12లక్షల సాయం సాక్షి, ధర్మపురి(కరీంనగర్): ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద మహిళకు ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచి రూ.1.22లక్షల సాయం అందించారు. ధర్మపురికి చెందిన నరుముల లక్ష్మీ భర్త కొన్నినెలల క్రితం చనిపోయాడు. కొడుకు పుట్టుకతోనే మానసిక దివ్యాంగుడు. కూలీపని చేస్తూ.. కూతురును బీఈడీ చదివిస్తోంది. భర్త మరణంతో పోషణ కష్టమైంది. ఇల్లుగడవని పరిస్థితి ఎదురైంది. కూతురు చుదువు మానిపించేద్దామని అనుకుంది. విషయం తెలుసుకున్న సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ లక్ష్మీ కష్టాలను గురించి జూలై 5న ఫేస్బుక్లో పోస్టుచేసి సాయం అందించాలని మిత్రులను కోరాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారై మిత్రులు రూ.1.17లక్షలు, ధర్మపురికి చెందిన కొరెడె కిరణ్‌కుమార్ మిత్రబృందం రూ.5 వేలు సాయం అందించారు. డిపాజిట్ బాండ్లను సీఐ కోటేశ్వర్, ఎస్సై కిరణ్‌కుమార్ చేతుల మీదుగా శనివారం అందించారు. ఆదుకున్న స్నేహితులు కోరుట్ల: తమతో చదువుకున్న స్నేహితుల్లో మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో ఒకరు.. ఏడాది క్రితం అనారో గ్యంతో మరొక రు మృతి చెందడంతో మిత్రులు వారి కుటుంబాలకు అండగా నిలిచారు. కోరుట్లలోని ఆదర్శ విద్యాలయం 1994–95 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విడిపోయినా తమ స్నేహ బంధాన్ని వీడలేదు. ఈ మిత్ర బృందంలో గాజెంగి శ్రీధర్ మూడేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు పోతుగంటి శ్రీనివాస్, అంబల్ల ఆనంద్, తాళ్ల్లపల్లి శ్రీనివాస్‌లు తమ మిత్రు ల సహకారంతో రూ.1,02,000 శ్రీధర్ కూతురు నిత్య పేరిట డిపాజిట్ చేశారు. మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందగా అతడి కుటుంబానికి రూ.1,60,000 ఆర్థికసాయం అందించారు. బడి సోపతికి 37ఏళ్లు బోయినపల్లి(చొప్పదండి): విభిన్నానికి మారుపేరు కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్. ఆయనకు స్నేహమంటే ప్రాణం. స్నేహాన్ని మనసుతో చూస్తారు. ఉద్యోగంతో పాటు స్నేహాన్ని సైతం ఓ బాధ్యతగా తీసుకుని 37ఏళ్లుగా అల్లుకుపోతున్నారు. హుస్నాబాద్ 1983–84 ఎస్సెస్సీ బ్యాచ్ ఇతడిది. బడిసోపతులు పేరిట శ్యాంప్రసాద్‌లాల్ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో ఉన్న స్నేహితులను సమన్వయం చేసుకుంటూ, సోపతుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ గెట్టు గెదర్ నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి అశోక్, కొండూరి శ్రీనివాస్, ఆశోక్‌కుమార్ కామారపు, అన్నవరం శ్రీనివాస్, బాపిరాజు, రజని, లత, ఉమారెడ్డి కోర్‌కమిటీ సభ్యులతో ముందుకు సాగుతున్నారు. అనుకోకుండా చనిపోయిన ఇద్దరు మిత్రుల కూతుళ్ల వివాహానికి రూ.4 లక్షలు, ఆర్థికంగా లేని స్నేహితుల కూతుర్ల వివాహానికి రూ.2.50 లక్షలు, అనారోగ్యంతో బాధ పడుతున్న మిత్రులకు రూ.2లక్షల చొప్పున సాయం అందించారు. పాతికేళ్ల స్నేహం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లలో నివాసం ఉంటున్న వేముల తిరుపతి, ఎలగొండ రవీందర్ టైలరింగ్ పని మీద తొ లిసారి బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లినపుడు కలుసుకున్నారు. దాదాపు పాతికేళ్లుగా కలిసే ఉంటున్నారు. రవీందర్ కుటుంబం కరోనా బారిన పడగా.. తిరుపతి అన్ని వి«ధాలుగా అండగా ఉండి మనో«ధైర్యం కలిగించాడు. దైవం కలిపిన బంధం సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లకు చెందిన హనుమాండ్ల శ్రీకాంత్, మహ్మద్ ఫరీ ద్ ఆరోతరగతి నుంచి స్నేహితులు. గత మే నెలలో శ్రీకాంత్ ఇంట్లో అందరూ కోవిడ్ బారిన పడ్డారు. ఫరీద్ కు ఫోన్ చేశాడు శ్రీకాంత్. రాత్రి గంటలకు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఆక్సిజన్ లేదని డాక్టర్లు చేతులెత్తేశారు. వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే అక్కడ పడకలు లేవు. తనకున్న పరిచయాలతో ఆక్సిజన్ బెడ్ తెప్పించాడు. వారంపాటు కంటికి రెప్పలా కాపాడాడు. ‘మొదట్నుంచి అతనే లేకపోతే ఈ రోజు నేనిలా ఉండలేక పోయేవాడిని’ అని శ్రీకాంత్ చెప్పాడు. క్లాస్మేట్స్.. జాబ్మేట్స్ బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లికి చెందిన మాడిచెట్టి సాయికిరణ్, వాసాల సంతోశ్, మోగులోజి నరేశ్ ఊహ తెలిసినప్పటి నుంచి స్నేహితులు. ఒకేపాఠశాల,ఇంటర్, డిగ్రీ కలిసి చదివారు. గ్రామంలో కలిసి సాధనచేసి 2019లో పోలీస్ ఉద్యోగాలు సాధించారు. సాయికిరణ్ ఏఆర్ పీసీగా కరీంనగర్లో, సంతోష్ మంచిర్యాలలో టీఎస్ఎస్పీ పీసీగా, నరేశ్ సిరిసిల్ల 17వ బెటాలియన్‌లో పీసీగా ఉద్యోగం చేస్తున్నారు. -
Ambulance Couple: పెళ్లి బహుమతిగా అంబులెన్స్!
న్యూఢిల్లీ: కరోనాసురుడు విసురుతున్న మృత్యుపాశానికి చిక్కి ప్రాణాలు కోల్పోతున్నది కొందరైతే.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రులకు పరుగున వెళ్తున్నది ఇంకొందరు. వైద్యశాలకు వెళ్లాలంటే ముందుగా గుర్తొచ్చేది అంబులెన్సే. మెరుపు వేగంతో దూసుకెళ్తూ కోవిడ్ బాధితులను ఆస్పత్రులకు చేర్చే కదిలే దేవాలయాలు అంబులెన్స్‌లు. సరాయ్ కాలేఖాన్ శ్మశాన వాటికలో పీపీఈ కిట్లతో హిమాన్షు కాలియా దంపతులు అలాంటి అంబులెన్స్ సర్వీస్ చార్జీలను కోవిడ్ కష్టకాలంలో కొందరు నిర్దయగా వేలు, లక్షలు వసూలు చేస్తూ కోవిడ్ బాధితులను మరింతగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. అలాంటి పేదలకు పూర్తి ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తోంది ఓ జంట. వారే హిమాన్షు, ట్వింకిల్ ఖాలియా. 42 ఏళ్ల హిమాన్షుకు అర్ధాంగి అయిన 39 ఏళ్ల ట్వింకిల్.. సేవా కార్యక్రమాల్లో భర్తకు అన్నివేళలా అండగా ఉంటున్నారు. క్యాన్సర్ జయించి... ‘కొద్ది రోజుల క్రితం తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఆటోరిక్షాలో వెళ్తుండగా తన భార్య కుప్పకూలిందని ఆమె భర్త సందీప్ మిత్రా మాకు ఫోన్ చేశారు. అక్కడ ఉన్నవారిలో ఒక్కరు కూడా వారికి సాయపడేందుకు ముందుకు రాలేదు. విషయం తెల్సి డాక్టర్‌ను వెంటబెట్టుకుని అక్కడికెళ్లా. ఆమె అంత్యక్రియల బాధ్యత మేమే తీసుకున్నాం’అని హిమాన్షు సతీమణి ట్వింకిల్ నాటి సంగతిని గుర్తుచేసుకున్నారు. తనను క్యాన్సర్ చుట్టుముట్టినా దాన్ని ఎదిరించి నిలిచిన ధీశాలి ఆమె. వీరికి జప్జీ (13), రిధీ (7) అనే ఇద్దరు కుమార్తెలున్నారు. ‘కరోనా కష్టకాలంలో అంబులెన్స్ సేవలకు కొందరు అంబులెన్స్ డ్రైవర్లు, ఓనర్లు వేలు, లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని తెల్సి చాలా బాధపడ్డా. వెంటనే ఉచితంగా అంబులెన్స్ సేవల విషయాన్ని అందరికీ చెప్పా. ఢిల్లీ అంతటా నా ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లు అతికించాం. అది చూసి చాలా మంది మాకు ఫోన్లు చేశారు. ఢిల్లీ ఆవల ఘజియాబాద్, నోయిడా నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. అత్యంత వేగంగా నడిపే నా డ్రైవింగ్ నైపుణ్యం తెలిసి చాలా ఆస్పత్రుల వాళ్లూ నాకే ఫోన్ చేసేవారు ఆపత్కాలంలో’ అని హిమాన్షు అన్నారు. ఉచితంగా 12 అంబులెన్స్‌ల నిర్వహణ అంటే శ్రమ, ఖర్చుతో కూడిన వ్యవహారమే. వాటి రిపేర్లు, ఇతరత్రాల కోసం 18 మంది ఈ జంటకు సాయపడతారు. ఒక ఇంటినే కార్యాలయంగా మలచుకుని ఈ జంట ఇదంతా చేస్తోంది. హిమాన్షు, ట్వింకిల్ ఇద్దరూ వృత్తిరిత్యా బీమా ఏజెంట్లు. వారి ఆదాయంలో చాలా భాగాన్ని సేవ కోసమే ఖర్చుచేస్తారు. ‘కొన్ని సార్లు మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోయాం. కానీ, డ్రైవర్ల జీతాలు మాత్రం ఠంచనుగా ఇస్తాం’ అని హిమాన్షు నవ్వుతూ చెప్పారు. ‘2002లో తొలిసారిగా అంబులెన్స్ సేవలను ప్రారంభించాం. పెళ్లి సమయంలో నా అత్తామామలు పెళ్లి బహుమతిగా ఒక అంబులెన్స్ ఇచ్చారు. కాలం గడిచేకొద్దీ అంబులెన్స్ సంఖ్య పెరుగుతూ వచ్చింది’ అని హిమాన్షు అన్నారు. కోవిడ్ ముందు సైతం వారు ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు. పేదలకు పెద్ద ఆస్పత్రుల్లో అడ్మిషన్లు ఇప్పించడం, రక్తదానాలు, అంతిమసంస్కారాల ఖర్చులు భరించడం.. ఇలా పలు రకాలుగా కష్టాల్లో ఉన్న వారిని ఈ జంట ఆదుకుంది. ఈ జంటను కొన్ని అవార్డులూ వరించాయి. 2019లో ట్వింకిల్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘నారీ శక్తి పురస్కార్’తో సత్కరించారు. అంతకుముందు, 2015లో ‘ఫస్ట్ ఉమెన్ అంబులెన్స్ డ్రైవర్’ అవార్డును దుబాయ్ సంస్థ అందజేసింది. మలేసియాలో ‘అంబులెన్స్ మ్యాన్’ అవార్డుతో హిమాన్షును గౌరవించారు. 12 సొంత అంబులెన్స్‌లతో... కోవిడ్ రెండో వేవ్‌లో వేలాది కేసులతో దేశ రాజధాని ఢిల్లీ అల్లాడుతున్న వేళ ఉత్తర ఢిల్లీలో ఉండే ఈ జంట కోవిడ్ బాధితులకు తమ వంతు సాయం చేస్తోంది. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తూ, కావాల్సిన ఔషధాలు సమకూరుస్తూ తమ సేవా నిరతిని చాటుకుంటున్నారీ దంపతులు. రోగులకే కాదు కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియల్లోనూ హిమాన్షు– ట్వింకిల్‌లు తమకు తోచినంతలో ఆర్థికసాయం చేస్తున్నారు. పీపీఈ కిట్లు, ఫేస్ షీల్డ్, మాస్క్‌లు ధరించి ఆపదలో ఉన్న వారి ముందు వాలిపోతారు వీరిద్దరూ. దగ్గరి బంధువులు సైతం సపర్యలు చేయడానికి జంకే రోగులకు సైతం వీరు సేవచేశారు. హిమాన్షు జంటకు సొంతంగా 12 అంబులెన్స్‌లు ఉన్నాయి. అంబులెన్స్ అత్యవసరంగా కావా లని ఎవరైనా సమాచారం ఇవ్వగానే వెంటనే వీరు రంగంలోకి దిగుతారు. ‘సరిగ్గా అంకెలు గుర్తులేవుగానీ ఈ కరోనా సెకండ్ వేవ్ కాలంలో రోజుకు కనీసం పాతిక మందికి మేం సాయపడుతున్నాం. కోవిడ్‌తో మరణించిన 80 మంది అంత్యక్రియలకు మొత్తం ఖర్చు మేమే భరించాం. దాదాపు వేయి మందికిపైగా కోవిడ్ మృ తుల అంత్యక్రియలకు తోచినసాయం చేశాం. ఎక్కడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అంతా ఉచితం’ అని హిమాన్షు చెప్పారు. చదవండి: వ్యాక్సిన్ల సంఖ్య ఎందుకు తగ్గుతోంది: చిదంబరం ఫైర్ -
మీ సేవకు సలాం: కరోనా బాధితులకు కొండంత భరోసా
సాక్షి, నెట్వర్క్: కరోనా ధనిక, పేద తారతమ్యాలను చెరిపేసింది. మానవ సంబంధాలకు కొత్త అర్థం చెబుతోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అయినవారిని సైతం అనాథలుగా ఆస్పత్రుల్లో, రోడ్లపైనా వదిలేస్తున్నవారు కొందరైతే, కొందరు మనిషికి మనిషే అండగా నిలవాలనే మహోన్నతాశయంతో బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. తమ వంతు సేవలతో మానవత్వాన్ని చాటి చెబుతున్నారు. భోజన సదుపాయంతో ఆదుకోవడంతో పాటు ప్లాస్మా, రక్త దానాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు సైతం నిలబెడుతున్నారు. కొందరు తామే ‘ఆ నలుగురు’గా మారి అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఫుడ్ బ్యాంక్ .. బెస్ట్ మీల్స్ నిజామాబాద్‌కు చెందిన ఫుడ్ బ్యాంక్ గత ఏప్రిల్ 23 నుంచి బాధితులకు పౌష్టికాహారం అందిస్తోంది. అన్నం, పప్పు, కూరగాయలు, ఆకు కూరలతో కూరలు, పండ్లు, గుడ్లతో కూడిన భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసి ప్రతి రోజూ 300 మందికి ఉదయం, సాయంత్రం ఉచితంగా అందజేస్తున్నారు. 9966830143 వాట్సాప్ నంబర్ ద్వారా మెసేజ్‌లు, వాయిస్ కాల్స్ స్వీకరిస్తూ ఇంటి వద్దకే తీసుకెళ్లి ఆహారం అందజేస్తున్నారు. పేదలకు బియ్యం, నిత్యావసరాలు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు కరోనా బారిన పడ్డ పేద కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు 25 కేజీల బియ్యంతో పాటు, నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. ఇప్పటివరకు 80 కుటుంబాలను ఈ విధంగా ఆదుకున్నారు. సరి లేరు నారీ సేన కెవ్వరు.. కోవిడ్‌తో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారికి నారీ సేన సేవలందిస్తోంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన 50 మంది మహిళలు.. కోవిడ్ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉండే వారికి భోజనం ప్యాకెట్లు పంపిస్తున్నారు. ఆహారం, గుడ్లు, పండ్లు, డ్రైఫ్రూట్స్‌తో కూడిన ప్యాకెట్లు మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా డెలివరీ బాయ్‌తో పంపిస్తున్నారు. కోవిడ్ వచ్చిన వారు వారి పాజిటివ్ రిపోర్టుతోపాటు, వారి అడ్రస్, లొకేషన్‌ను వాట్సాప్ (8919823042) ద్వారా పంపిస్తే చాలు. ఇంట్లో వండి.. పేదలకు వడ్డిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలోని పందిల్ల గ్రామానికి చెందిన వెల్దండి సదానందం వేములవాడలోని జాత్రాగ్రౌండ్ ప్రాంతంలో టీస్టాల్ నిర్వహిస్తున్నాడు. మిత్రుల సహకారంతో ప్రతిరోజూ రాజన్న గుడి ప్రాంతంలో ఆకలితో అలమటిస్తున్న 30 మంది అభాగ్యులకు అన్నదానం చేస్తున్నాడు. ‘స్వాస్’.. మేము సైతం 2010లో పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఏర్పాటు చేసిన స్వాస్ సంస్థకు చెందిన 18 మంది మంచిర్యాలలో కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. గత రెండు రోజులుగా మంచిర్యాల, వేంపల్లి, నస్పూర్, క్యాత్వన్పల్లి, రామకృష్ణాపూర్ ఏరియాల్లోని దాదాపు 60 మందికి ఉచితంగా మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని వారి ఇళ్లకే తీసుకెళ్లి అందజేస్తున్నారు. ఆహారం అవసరమైన కోవిడ్ రోగులు 98662 88950 (స్వరాజ్), 8897939118 (వెంకటేశ్), 9573358625 (అనిల్), 9703175826 (కిరణ్) నంబర్లకు తమ చిరునామా, ఇతర వివరాలు వాట్సాప్‌లో పంపిస్తే చాలు. ఆదర్శం .. అజార్ బాయ్ బృందం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన ఎస్కే అజార్ బృందం కూడా అన్నీ తామై ముస్లిం, హిందూ, క్రైస్తవ మత సంప్రదాయాల ప్రకారం ఉచితంగా అంత్యక్రియలు నిర్వహిస్తూ శభాష్ అన్పించుకుంటున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఇప్పటివరకు 23 మృతదేహాలకు అజార్ (ఫోన్: 9550077229) ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహించాడు. అజార్ అంబులెన్స్ సర్వీస్ ఇప్పుడు కోవిడ్‌తో మరణించిన వారి అంత్యక్రియలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అజార్‌తో కలసి ఆయన మిత్ర బృందం పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతర్గాం మండల పరిధిలోని టీటీఎస్ అంతర్గాం గ్రామ సర్పంచ్ కుర్ర వెంకటమ్మ తన గ్రామంలో హోం క్వారెంటైన్ లో ఉన్న బాధితుల ఇళ్లకు వెళ్లి ఐదు వందల నగదు, పండ్లు అందజేస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. నిత్యాన్నదానం కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణంలో భూమి స్వచ్ఛంద సంస్థ పేరుతో కొందరు యువకులు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి ఇళ్లల్లో ఉన్నవారు, కాలినడకన వెళ్తున్న వలస కూలీలు, ఆస్పత్రిలో రోగులకు దాదాపు 20 మందికి ఆహారం పంపిణీ చేస్తున్నారు. గత నెల రోజులుగా వారీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. సహారా యూత్ కూడా.. నిర్మల్‌కు చెందిన సహారా యూత్ కూడా తమ వంతు సేవలు అందిస్తోంది. 57 మందితో కూడిన ఈ గ్రూప్ సభ్యులు.. బాసర మండలం కిర్గుల్(కె), బిద్రెల్లి, ముథోల్ మండలం రాంటెక్ గ్రామాల్లో కరోనాతో చనిపోయిన అనేకమందికి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా మృతుల అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ముందుకురాని సమయాల్లో సహారా యూత్ అక్కడికి వెళ్లి అంత్యక్రియలు పూర్తి చేస్తోందని సహారా యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వాజిద్ అలీ చెప్పారు. ప్లాస్మాతో ప్రాణం పోస్తున్నారు వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన యువకులు ‘మేము ఉన్నాము’అనే ఒక వాట్సాప్ గ్రూపు (ఫోన్ నం:9133645435) క్రియేట్ చేసుకుని ఆరేళ్లుగా ఎవరికి అవసరమైనా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా రక్తదానం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన వారికి కోవిడ్ నుంచి కోలుకున్న గ్రూప్ సభ్యులు ఉచితంగా ప్లాస్మా కూడా ఇస్తున్నారు. శ్రీపతి కిషోర్ అనే గ్రూప్ సభ్యుడు నెల వ్యవధిలో రెండుసార్లు ప్లాస్మా ఇచ్చాడు. ఇతనితో పాటు నల్లబెల్లి మండల కేంద్రానికే చెందిన యువకులు పున్నమాచారి, పున్నం కిరణ్, కారంపొడి శశికుమార్, అనుముల నితీష్ కుమార్‌లు ఈ విధంగా రక్తం, ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 70 యూనిట్ల ప్లాస్మా దానం కామారెడ్డి రక్తదాతల సమూహం (బ్లడ్ డోనర్స్ గ్రూప్)లోని సభ్యులు.. బాలు అనే వ్యక్తి ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా 70 యూనిట్ల ప్లాస్మా దానం చేశారు. అలాగే గత 12 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు 7 వేలకు పైగా యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఎవరైనా సరే రక్తం అవసరం ఉందని మెసేజ్ (ఫోన్ నం: 9492874006) చేస్తే చాలు సభ్యులు స్పందిస్తారు. తామే ఆ నలుగురై.. కరోనా మృతులకు అంతిమ సంస్కార సమయంలో తమకు వైరస్ సంక్రమిస్తుందనే ఆందోళనతో అయినవాళ్లు సైతం అంత్యక్రియలకు ముందుకు రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తామున్నామంటూ ముందుకొస్తోంది.. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ. జిల్లా కేంద్రానికి చెందిన అఫాన్ తబ్రేజ్, ఫరీద్, రఫీక్, అస్లాంతో పాటు భానుచందర్ హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట సమూహంగా ఏర్పడ్డారు. కరోనా మృతులకు ధైర్యంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగురి అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల బంధువుల సంప్రదాయాలకు అనుగుణంగా ఈ ప్రక్రియ పూర్తిచేస్తున్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థలో ఏ సభ్యుడికైనా సరే ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే తక్షణం అందుబాటులోకి వస్తారు. ఇవీ ఫోన్ నంబర్లు: ఆఫాన్ – 90103 27860, భాను – 98663 32139, తబ్రేజ్ – 98662 46460 , ఫరీద్ 94414 95050, రఫీఖ్ – 81065 07123, అస్లాం – 98859 75566 -
కరోనా బాధితులకు నారి సేన గ్లోబల్ ఉమెన్ ఫోరమ్ ఆపన్న హస్తం
-
పేదల చదువుకు "లియోన్ హ్యూమన్ ఫౌండేషన్" చేయూత
హైదరాబాద్: సుఖ సంతోషాలతో జీవిస్తున్న కుటుంబంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం వలన , ఆ కుటుంబానికి ఆధారమైన నరసింహాచారి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల చదువులు, ఇల్లు గడవడం కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ (ఆస్టిన్ - టెక్సాస్ ) డైరెక్టర్స్ పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్ రవి కుమార్ పులిమి పేద విద్యార్థుల చదువుకు మా సంస్థ తమ వంతు సహాయం చేస్తుందని తెలిపారు. లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి విన్ ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువుకు ఒక లక్ష ఎనిమిదివేల రూపాయలచెక్ ని నరసింహాచారితల్లికి అందచేశారు. అయితే, ఈ విషయాన్ని లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకొచ్చిన మాధవ రెడ్డి గారిని అభినందించారు . -
మేమున్నామని, మీకేం కాదని..
సాక్షి, అనంతపురం: ఆపదలో ఉన్న క్రీడాకారులకు నేనున్నానంటూ సాయమందిస్తున్నారు వాలీబాల్ క్రీడాకారులు. ఇందుకోసం ప్రత్యేకంగా అనంతపురం సిటీ వాలీబాల్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూప్ ద్వారా ఆపదలో ఉన్న వారిని గుర్తించి, వారికి తమకు తోచిన ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. సేవ చేయడమే లక్ష్యంగా.. అనంతపురం సిటీ వాలీబాల్ పేరుతో రూపొందించిన వాట్సాప్ గ్రూప్‌లో వివిధ రంగాల్లో స్థిరపడిన చిన్ననాటి స్నేహితులు, పాఠశాల, కళాశాల, ఉన్నత విద్యలో క్లాస్మేట్స్గా ఉన్న వారు సభ్యులుగా ఉన్నారు. తమ క్రీడాంశాలకు సంబంధించిన విషయాలతో పాటు, ఇతర సమాచారాన్ని చేరవేస్తూ తమ మధ్య స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే వీరి దృష్టి సేవ వైపు మళ్లింది. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకునేలా బృహత్ కార్యాచరణను రూపొందించుకుని, ఆ దిశగా సభ్యులు అడుగులేస్తున్నారు. రూ.లక్షల్లోనే సాయం ► పామిడికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు ముజాహిద్దీన్.. అదే పట్టణం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్సలకు సైతం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని రూ. లక్ష సాయం అందించారు. అలాగే అనంతపురం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును తగ్గించేలా యాజమాన్యంతో చర్చించి ఓ సీనియర్ క్రీడాకారుడు ఒప్పించారు. ► అంబులెన్స్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న వాలీబాల్ క్రీడాకారుడు మణికంఠ... గతేడాది గుత్తి సమీపంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఏటీపీ సిటీ వాలీబాల్ గ్రూప్, ఏపీ వాలీబాల్ మెన్స్ గ్రూప్ సభ్యులు రూ. 1.5 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి అందించారు. ► పొట్టకూటి కోసం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి అనంతపురానికి వచ్చి తోపుడు బండ్లపై ఉసిరి, జామ వంటి సీజనల్ పండ్ల విక్రయాలు చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి చేతికందిన కొడుకు (వాలీబాల్ క్రీడాకారుడు) మరణిస్తే, ఆ కుటుంబానికి అన్నీ తామై తోడునీడుగా నిలిచారు. ► ఈ నెల 1వ తేదీ కూడేరు సమీపంలో ఆటో బోల్తాపడి గార్లదిన్నె మండలం తరిమెల గ్రామానికి చెందిన వాలీబాల్ క్రీడాకారుడు లక్ష్మీపతితో పాటు కుటుంబసభ్యులూ తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులు తక్షణమే స్పందించారు. లక్ష్మీపతి చికిత్సల కోసం అవసరమైన రూ. 2 లక్షలు సర్దుబాటు చేసేందుకు ముందుకు వచ్చారు. తక్షణ సాయం కింద రూ. 60 వేలు అందజేశారు. తక్షణం స్పందిస్తూ.... వాలీబాల్ క్రీడాకారుల గ్రూప్‌లో జూనియర్లు, సీనియర్లు అనే భేదభావం లేదు. వాలీబాల్ క్రీడ గురించి తెలిసిన ఉత్సాహవంతులైన ప్రతి క్రీడాకారుడిని ఈ గ్రూప్‌లో సభ్యులుగా చేర్చుకుంటుంటారు. సభ్యుల్లో ఉన్న వారికే కాకుండా వారి కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ప్రమాదం వాటిల్లినా.. విపత్కర పరిస్థితుల్లో ఉన్నా సభ్యులు తక్షణమే స్పందిస్తుంటారు. ఈ గ్రూప్ ద్వారా ఇప్పటికే ముగ్గురు వాలీబాల్ క్రీడాకారులకు ఆపన్న హస్తమందించారు. వీరిలో ఇద్దరు ప్రమాదం బారిన పడి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఆర్థిక చేయూతనందించారు. ప్రమాదాల్లో మృతి చెందిన సీనియర్ క్రీడాకారుల కుటుంబాలకు అన్నీ తామై తోడునీడుగా ఉంటూ వస్తున్నారు. గొప్ప చెప్పుకోవాలని కాదు అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉంటున్న నేను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించా. కుటుంబ పోషణ కోసం అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నా. క్రీడాకారులంటే చాలా గౌరమిస్తా. ఎవరైనా క్రీడాకారుడికి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే నా అంబులెన్స్‌లోనే బెంగళూరుకు తీసుకెళుతుంటా. లక్ష్మీపతి విషయంలోనే ఇదే జరిగింది. ఆ సమయంలో వారి కుటుంబసభ్యులు పడ్డ వేదన మాటల్లో చెప్పలేను. వారికి మేమున్నామంటూ మా వాలీబాల్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు ధైర్యం చెప్పారు. ఇదంతా మేమేదో గొప్పలు చేస్తున్నామని చెప్పుకునేందుకు కాదు. ఆపదలో ఉన్న క్రీడాకారులను మా వంతు సాయంగా ఆదుకుంటున్నామనే తృప్తి మాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – ప్రభు, వాలీబాల్ క్రీడాకారుడు, అనంతపురం కరుణించే హృదయాలు స్పందిస్తున్నాయి మా తోటి క్రీడాకారుడు అపాయంలో ఉన్నాడనే విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌లో మిగిలిన సభ్యులకు తెలియపరుస్తుంటాం. ఆ సమయంలో చాలా మంది స్పందించి తమ వంతుగా ఎంతో కొంత ఆర్థిక సాయం అందిస్తుంటారు. ఈ సేవా కార్యక్రమం భవిష్యత్తులోనూ కొనసాగించేలా అన్ని చర్యలూ తీసుకున్నాం. క్రీడల ద్వారా మాకంటూ ఈ సమాజంలో ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాం. ఈ ఆటల ద్వారానే మాకు ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో క్రీడాభివృద్ధికే కాక, క్రీడాకారుల వ్యక్తిగత సమస్యలనూ పరిష్కరించే వేదికగా మా వాట్సాప్ గ్రూప్‌ను తీర్చిదిద్దాం. – దినేష్, సీనియర్ క్రీడాకారుడు, అనంతపురం -
చిన్నారికి సోనూ సూద్ భరోసా
డోర్నకల్: కరోనా కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్న సినీ నటుడు సోనూసూద్‌ను ‘సాక్షి’దినపత్రికలో ప్రచురితమైన ఓ కథనం కదిలించింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామానికి చెందిన దేశబోయిన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్థన్ (06) లివర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాడు. ఆయనకు లివర్ మార్పిడి చేయాలని, ఇందుకోసం రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని గత నెల 22న ‘సాక్షి’వరంగల్ టాబ్లాయిడ్లో ‘చిన్న వయస్సు.. పెద్ద జబ్బు’ఆరేళ్ల బాలుడికి లివర్ సమస్య’శీర్షికన కథనం ప్రచురితమైంది. అయితే, మహబూబాబాద్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న హర్షవర్ధన్ తండ్రి నాగరాజు అంత మొత్తం వెచ్చించలేని పరిస్థితి ఉంది. తన సహచర ఉద్యోగులు రూ.2 లక్షల వరకు సమకూర్చారు. అయినా హర్షవర్ధన్ చికిత్సకు పెద్ద ఎత్తున డబ్బు అవసరముంది. దీంతో మహబూబాబాద్ డిపో కండక్టర్ల ఐక్య వేదిక ఆధ్వర్యాన నాగరాజు, శ్రీలక్ష్మి దంపతులు గురువారం హైదరాబాద్‌లో షూటింగ్‌కు వచ్చిన సినీ నటుడు సోనూసూద్‌ను కలిశారు. హర్షవర్థన్ ఆరోగ్య పరిస్థితిని వివరించడంతో పాటు ‘సాక్షి’క్లిప్పింగ్‌ను ఇవ్వగా, అక్కడే ఉన్న నటులు బ్రహ్మాజీ, శ్రీనివాస్‌రెడ్డి తెలుగు కథనాన్ని సోనూసూద్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. హర్షవర్ధన్ లివర్ మార్పిడి కోసం జరిగే శస్త్రచికిత్స అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తానని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే అపోలో ఆస్పత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడి అవసరమైన వైద్యసాయం అందించాలని సోనూసూద్ కోరారు. దీంతో హర్షవర్థన్ తల్లిదండ్రులు నాగరాజు, శ్రీలక్ష్మి, ఆర్టీసీ కండక్టర్ల ఐక్య వేదిక నాయకులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
వీధికుక్కలను బతకన్విండి... ప్లీజ్
ప్రకృతిలో మానవుడితో అనేక రకాల జీవులు ఉన్నాయి. అన్ని రకాల జంతువులు, జీవజాలం మానవుడికి ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్ని జీవులు, జంతువుల పట్ల మానవులు పక్షపాతధోరణి ప్రదర్శిస్తున్నారు. ఖరీదైన విదేశీ కుక్కలను కొనుగోలు చేసి వాటిని అపురూపంగా పెంచుకుంటున్నారు. అదే సందర్భంలో వీధుల్లో కనిపించే కుక్కల పట్ల వివక్ష చూపుతున్నారు. కొందరు అకారణంగా వాటిని చంపివేయడం, గాయ పరచడం చేస్తున్నారు. చాల వీధికుక్కలకు ఆహారం అందక, తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నాయి. కరోనా వచ్చాక వీధి కుక్కల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఇంతకు మునుపు హోటళ్లు, రెస్టారెంట్లలో మిగిలిన ఆహారం తెచ్చి వేసేవారు, ప్రస్తుతం హోటళ్లు, రెస్టారెంట్ల నడవటం గగనమై వీధి కుక్కలకు ఆదరణ, ఆహారం కరువైంది. ఈ నేపథ్యంలో వీధికుక్కలను ఆదరిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు.. తిరుపతికి చెందిన సాప్ట్వేర్ ఇంజినీర్ ఉదయ. తన చిన్నతనం నుంచి తన తల్లిదండ్రులు, అవ్వా తాతలు వీధుల్లో తిరిగే ఆవులు, కుక్కలు, ఇతర జంతువులపై ప్రేమ చూపేవారు. వారి నుంచి ఈ సద్గుణాన్ని అందిపుచ్చుకున్న ఉదయ శ్రీ 10 సంవత్సరాల క్రితం బాణ సంచా పేలి శరీరం అంతా కాలి, కాలు విరిగి నడవలేని స్థితిలో ఉన్న ఒక వీధి కుక్కను అక్కున చేర్చుకొని దానిని బాగు చేయించి తానే పెంచుకోవడంతో పాటు దాని సంతతిని తన బంధువులకు ఇచ్చి పెంచుకొనేలా చేసింది. అంతే కాకుండా గత 10 సంవత్సరాలుగా తిరుపతి నగరంలో భవాని నగర్, అశోక్ నగర్, అలిపిరి బైపాస్ రోడ్డు, కపిల తీర్థం రోడ్డు, ఇస్కాన్ టెంపుల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో సుమారు 150 వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఎవరి సహాయం కోసమో ఎదురుచూడకుండా తనకున్న ఆర్థిక వనరులతోనే వాటికి ఆహారం సిద్దం చేసి నిత్యం ఆటోలో వెళ్లి ఆయా ప్రాంతాల్లో వీ«ధికుక్కలకు ఆహారం పంచుతూ తనకున్న జంతుప్రేమను చాటుకొంటోంది. శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వీధి కుక్కలకు ఆహారం అందిస్తున్న ఉదయశ్రీని ‘సాక్షి’ పలుకరించింది. ఈ సందర్బంగా ఆమె పలు విషయాలు సాక్షికి వివరించింది. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే... నా పేరు నవకోటి ఉదయశ్రీ. తిరుపతి నగర శివార్లలోని ఒక ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలో 2014లో బీటెక్ పూర్తి చేశాను. బీటెక్ తర్వాత టీసీఎస్ సంస్థలో ఉద్యోగంలో చేరాను. మూడు సంవత్సరాలు పనిచేశాక ఉద్యోగం వదిలేశాను. ప్రస్తుతం తిరుపతిలోనే ఉంటున్నాను. నా తల్లిదండ్రులు, అవ్వతాతలకు జంతువులంటే ఎంతో ప్రేమ. అమ్మ శాంతి వీధి కుక్కలను, ఆవులను, ఇతర జంతువులను ఆదరించేవారు. వాటికి ఆహారం అందించేవారు. గాయపడిన జంతువులు కనిపిస్తే వాటికి వైద్యం అందించేవారు. చిన్న తనం నుంచి ఇది చూసిన నాకు జంతువులపై ఎంతో ప్రేమ కల్గింది. గత కొన్నేళ్లుగా అనేక వీధి కుక్కలు ఆహారం, నీరు దొరక్క వీధుల్లో రోదిస్తుండటం చూసి వాటికోసం ఏమైనా చేయాలనుకున్నాను. నా వంతు సాయంగా ఆహారం సిద్దం చేసి నగరంలోని వివిధ ప్రాంతాల్లోని సుమారు 150 వీధి కుక్కలకు అందిస్తున్నాను. నా స్వంత ఖర్చులతోనే ఈ పని చేస్తున్నాను. ఎక్కడైనా వీధి కుక్కలు, ఆవులు గాయపడి కనిపించినా వెంటనే బ్లూ క్రాస్ సంస్థ సహకారంతో వాటికి వైద్యం అందిస్తాను. ఇందుకు అనిమల్ కేర్ లాండ్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ శ్రీకాంత్ సహకారిస్తున్నారు. నా ప్రయత్నంలో కొన్నిసార్లు చికాకులు ఎదురవుతుంటాయి. అయినప్పటికీ ఆపలేదు. వీధికుక్కలు, ఇతర జంతువులు గాయపడతాయన్న కారణంగా చిన్నతనం నుంచి దీపావళి జరుపుకోవడం లేదు. నా ప్రయత్నానికి అమ్మ శాంతి ఎంతో సహకారం అందిస్తున్నారు. నా విజ్ఞప్తి ఏమిటంటే... కొన్ని కుక్కలు తప్పు చేశాయని అన్నిటిని ఆలాగే చూడటం భావ్యం కాదు. ఖరీదైన కుక్కల స్థానంలో వీటిని ఆదరిస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఆహారం, మురికి నీరు తాగడం వల్ల వాటికి గజ్జి, ఇతర వ్యాధులు సంభవిస్తున్నాయి. వాటికి ఆదరణ ఉంటే ఇలా ఉండవు. ప్రతి ఒక్కరూ ఒక వీధికుక్కనైనా దత్తత తీసుకుంటే బాగుంటుంది. ఉదయశ్రీని ఆతృతతో చుట్టుముట్టిన వీధికుక్కలు -
వంద రూపాయలు
వంద సహాయాలు చెయ్యండి. చేతిలో ఓ వంద పెట్టడం వేరు. పప్పులు ఉప్పులు కడుపుకు. గుప్పెట్లో డబ్బు.. గుండెకు!! డబ్బు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుణ్ని దగ్గరే ఉంచుతుంది. గిఫ్టా? కవర్లో పెట్టి క్యాషా? ఏ చదివింపుల ఫంక్షన్‌కు వెళ్లే ముందైనా సహజంగా వచ్చే సందేహమే. డబ్బున్నవాళ్లకు క్యాష్ ఇవ్వక్కర్లేదు అనిపిస్తుంది. వాళ్లకు గిఫ్టూ అక్కరయి ఉండదు కానీ డబ్బులిస్తే బాగోదని గిఫ్టే ఫ్యాక్ చేయిస్తాం. కొందరికి డబ్బే ఇస్తాం. తెలుస్తుంటుంది.. వాళ్లకు డబ్బే మంచి కానుక అవుతుందని. గత మే నెలలో ఒక వార్త వచ్చింది. పేపర్లలో వచ్చిన వార్త కాదు. సోషల్ మీడియాలో వచ్చిన వార్త. ముంబైలో ఉంటున్న ఆమిర్ ఖాన్.. ఢిల్లీలోని కొన్ని మురికివాడల నిరుపేదలకు గోధుమపిండి బస్తాలతో పాటు, వాటిల్లో పదిహేను వేల రూపాయల చొప్పున నగదు కూడా పెట్టి ఇచ్చాడని. ఒక్కోబస్తాలో పదిహేను వేల రూపాయలు! అంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయినవారిలో ఆమిర్ ఖాన్ కూడా ఉన్నాడు! ‘‘నేను అంతటి వాడిని కాదు’’ అన్నారు ఆమిర్ ఆ వార్త విని నవ్వుకుని. ఆమిర్‌లా చేయలేదు కానీ, కేరళలో సెబానమ్మ అనే రోజువారీ కూలీ నిజంగా అలానే చేసింది. అయితే తన స్థోమతకు తగ్గట్టు తన ఇంటి భోజనం ప్యాకెట్లో వంద రూపాయలు ఉంచి, వరద బాధితులకు పంపించింది. అది ఎవరికి వెళ్లేదీ ఆమెకు తెలియదు. వార్డులోని ప్రతి ఇంట్లోని వారూ ఒక్కో ప్యాకెట్ భోజనం కట్టి ఉంచితే, ఇంటికి వచ్చిన ‘కుదుంబశ్రీ’ వాలంటీర్లు ఆ ప్యాకెట్లను సేకరించుకుని వెళ్లి వరద బాధితులకు అందజేస్తారు. అలా సెబానమ్మ ఇచ్చిన ప్యాకెట్ ఓ పోలీసు అధికారికి అందింది! అదైనా.. నాణ్యత పరిశీలన కోసం దానిని తెరిచి చూసినప్పుడు ఆయనకు అందులో వంద నోటు కనిపించింది! ఆ ప్యాకెట్ ఎవరిదా అని ఆరా దీస్తే సెబానమ్మ గురించి తెలిసింది. సెబానమ్మ అసలు పేరు మేరీ సెబాస్టియన్. చెల్లానమ్ గ్రామంలోని వారికి సెబానమ్మగా పరిచయం. అందరికీ ఏదో ఒక సహాయం చేస్తుండటంతో ‘అమ్మ’ అయింది. తను కూడా లాక్డౌన్ బాధితురాలే. మార్చి నెలాఖరులోనే కేటరింగ్‌లో తన ఉపాధిని కోల్పోయింది. కేరళలోని కొచ్చి నగర శివార్లలో ఉన్న కుంబలంగి దగ్గర వేలంపరంబిల్లో ఉంటుంది సెబానమ్మ. ఆ ప్రాంతం ఎర్నాకులం జిల్లా కిందికి వస్తుంది. చెల్లానమ్ వేలంపరంబిల్కు అనుకునే ఉంటుంది. అరేబియా సముద్ర తీర ప్రాంతం. ఇప్పుడా ప్రాంతం అంతా వరద ముంపులో ఉంది. ప్రాణాలు మాత్రమే మిగుల్చుకుని ఖాళీ కడుపుల్తో నిలబడ్డారు చెల్లానమ్లోని వారు. అందరూ ఎవరి సాయం వాళ్లు చేస్తున్నారు. సెబానమ్మ కూడా తనకు చేతనైన సాయం చేస్తోంది. ఆ సమయంలోనే ‘కుదుంబశ్రీ’ పథకం కింద తను ఇవ్వవలసిన భోజనం ప్యాకెట్లో ఓ వంద రూపాయలు కూడా పెట్టి పంపింది. ‘‘ఈ పరిస్థితుల్లో వంద చాలా పెద్ద మొత్తం కదమ్మా అని నా కొడుకు అన్నాడు. వాడికి నేను ఒకటే చెప్పాను. దేవుడి దయ మన మీద ఉంది. వాళ్లున్నంత కష్టంలో మనం లేము. లేము కాబట్టి వాళ్లను మనమే ఆదుకోవాలి అని. అర్థం చేసుకున్నాడు. తనూ చేతనైన సహాయం చేస్తున్నాడు..’’ అని పోలీసు అధికారి తనకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో చెప్పింది సెబానమ్మ. సన్మాన కార్యక్రమంలో సెబానమ్మ (మేరీ సెబాస్టియన్) -
నీడలకు రెక్కలు
గోడలు అడ్డు తప్పుకోవు. దూకేసి వెళ్లాలి. లేదంటే.. పడగొట్టుకుని వెళ్లాలి. రెడ్ లైట్ ఏరియాలో రెండూ కష్టమే. అక్కడ నీడలు కూడా గోడలే. తల్లులు గోడలు.. కూతుళ్లు నీడలు! ఆ నీడలకు.. రెక్కలు కడుతున్నాడు గంభీర్. చదువుల రెక్కలవి. ఎన్నికల సమయం. గౌతమ్ గంభీర్ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రాజకీయ అనుభవం లేదు. అనుభవం అవసరం అని కూడా అతడు అనుకోలేదు. ఏప్రిల్ నుంచి ఎన్నికలైతే, మార్చిలో రాజకీయాల్లోకి వచ్చాడు. అతడి మీద పోటీలో ఉన్నది అతిషీ సింగ్. అతడి వయసే. రాజకీయ అనుభవంలో మాత్రం సీనియర్. ‘ఆప్’ పార్టీ అభ్యర్థి. ఆ సీనియర్ని ఓడించాడు గంభీర్. 4 లక్షల 77 వేల ఓట్ల తేడాతో ఓడించాడు! రూలింగ్ పార్టీ అభ్యర్థి అనీ, మాజీ క్రికెటర్ అనీ అంత మార్జిన్ రాలేదు. అతడు ఎన్నికల్లో నిలబడక ముందు నుంచే, పద్మశ్రీ అవార్డు రాకముందే, అసలు క్రికెట్ నుంచి రిటైర్ అవడానికి నాలుగేళ్ల ముందు నుంచే గంభీర్ జనానికి తెలుసు. జనం అంటే.. నిద్రతో పస్తుల కడుపును నింపుకుంటున్నవారు. మిలటరీలో పని చేస్తున్న ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాల పిల్లలు. గూడు లేని అభాగ్యులైన ఆడపిల్లలు. వాళ్లకు అన్నం పెట్టాడు. చదువు చెప్పించాడు. వాళ్ల ఆరోగ్యం గురించి పట్టించుకున్నాడు. ఉపాధి కల్పించాడు. ఢిల్లీ నగరానికి కూడా కొంత చేశాడు. పచ్చటి మొక్కల్ని నాటించి కాలుష్యాన్ని తగ్గించే పనిని గడ్డిమోపులా తలమీదకు ఎత్తుకున్నాడు! ఇప్పుడు ఢిల్లీలోని సెక్స్ వర్కర్ల పిల్లల సంరక్షణను భుజాన వేసుకున్నాడు. ఆ బాధ్యతకు అతడు పెట్టుకున్న పేరు ‘పంఖ్’. అంటే రెక్కలు. అయిష్టమైన బతుకుల నుంచి ఆడపిల్లలకు వారు కోరుకున్న కెరీర్లో ఎదిగేలా, ఎగిరేలా రెక్కల్ని తొడగడమే ‘పంఖ్’. గంభీర్ ఎప్పుడూ మాట్లాడుతూ కనిపించడు. ఆలోచనల్లో ఉండేవాళ్లు మౌనం దాల్చడం సహజమే. క్రికెట్లోనూ అంతే, ఇప్పుడు రాజకీయాల్లోనూ అంతే. చేయడమే అతడు మాట్లాడ్డం. ‘‘ఎందుకలా ఉంటారు మీరు?’’ అని ఓ ఇంటర్వూ్యలో గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘‘పనిలో ఉన్నప్పుడు మాట్లాడను’’ అన్నాడు. పదో యేట క్రికెట్లోకి వచ్చినప్పటి నుంచే గంభీర్‌కు తను చేస్తున్న పనిలోనే ఉండిపోవడం అలవాటైంది. కష్టాలు చెప్పుకోడానికి మాటలు అవసరం. కష్టాలను తీర్చడానికి మాటలు అవసరం లేదు. ఎన్నికల ప్రచారం ఉద్దృతంగా ఉన్నప్పుడు గంభీర్‌ను అతిషీ సవాల్ చేశారు. ‘‘నాతో డిబేట్‌కి వస్తావా?’’ అన్నారు. ఆమె ఛాలెంజ్‌ని గంభీర్ తిరస్కరించాడు. ‘‘ధర్నాల మీద, డిబేట్ల మీద నాకు నమ్మకం లేదు’’ అన్నాడు! అమ్మానాన్న దగ్గర పెరిగిన పిల్లల కన్నా.. వాళ్ల అమ్మానాన్నల దగ్గర పెరిగిన పిల్లలు ఎక్కువ జీవితాన్ని చూస్తారు. నెమ్మదిని అలవరచుకుంటారు. గంభీర్ అలాగే పెరిగాడు. గంభీర్ పుట్టింది, క్రికెట్లో రాణించింది, రాజకీయాల్లోకి వచ్చిందీ అంతా ఢిల్లీలోనే. ఇప్పుడు అదే ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న జీబీ రోడ్డు ఏరియా సెక్స్ వర్కర్ల పిల్లల్లోని 25 మంది విద్యార్థినులలో ఈ ఏడాది 10 మందిని, వచ్చే విద్యా సంవత్సరం 15 మందిని తన ‘పంఖ్’ సంరక్షణలోకి ‘దత్తత’ తీసుకోబోతున్నాడు. వాళ్ల ఫీజులు తనే కడతాడు. వాళ్ల ఆరోగ్య అవసరాలను తనే చూసుకుంటాడు. వాళ్ల యూనిఫామ్‌లు, వాళ్లకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులు అన్నీ తనే ఏర్పాటు చేస్తాడు. అమ్మమ్మ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాడు గంభీర్. పంఖ్ కార్యక్రమాన్నీ ఆమెకే అంకితం ఇచ్చాడు. ఇప్పటికే అతడు సైన్యంలో అమరవీరులైన వారి పిల్లలు 200 మందికి చేయూతను ఇస్తున్నాడు. ఇవన్నీ చేయడం కోసమే అతడు ఆరేళ్ల క్రితం ‘గౌతమ్ గంభీర్ ఫౌండేషన్’ను నెలకొల్పాడు. ‘‘ఆడపిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి. వారికి విస్తృతంగా చదువు, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉండాలి. అందుకోసం ఏ కాస్త స్థోమత ఉన్నవారైనా ముందుకు రావాలి’’ అంటాడు గంభీర్. అమ్మమ్మ అతడిని అలా పెంచింది. -
మహారాష్ట్ర: తృటిలో తప్పిన ప్రమాదం
-
మానవత్వం పదిలం!
ఈ పదిమంది కలిస్తే మానవత్వం పరిమళిస్తుంది. కరోనా వేళ కారుణ్యమూర్తులై బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఏ తల్లి బిడ్డలో తెలియదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోతారు. అన్నీ తామై ఆదుకుంటారు. ‘కోవిడ్ వారియర్సై’ కదిలి వస్తున్నారు. అత్యవసర వైద్యసేవల కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లడం.. దురదృష్టవశాత్తు కన్నుమూస్తే అంత్యక్రియలు నిర్వహించడం వంటివి చేపడుతున్నారు. ‘అంతిమసంస్కారం’ చాటుకుంటున్నారు. ‘ఫీడ్‌దనీడ్’గొడుగు కింద సామాజికసేవకు పూనుకున్నారు. కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే చుట్టుపక్కల వాళ్లు భయపడిపోతున్నారు. సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. కరోనా కారణంగా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు కూడా ముందుకురాని స్థితిలో ఆ 10 మంది అన్నీ తామే అయి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. సాయితేజ, శ్రీనివాస్ బెల్లం, ప్రశాంత్ మామిండ్ల, వినయ్ వంగాల, రమణ్‌జిత్ సింగ్, సురేంద్ర, ప్రదీప్, అనుమోత్, విద్యాసాగర్, అంకిత్‌రాజ్ స్నేహితులు. అందరూ సాఫ్ట్వేర్ నిపుణులే. ‘‘వారం క్రితం మా స్నేహితుడు మాన్సింగ్ తల్లి కోవిడ్‌తో చనిపోయారు. కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నారు. మేమే బాధ్యత తీసుకున్నాం. ఆసుపత్రి నుంచి ఈఎస్ఐ శ్మశానం వరకు అంబులెన్స్‌కు రూ.25,000, అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్లేందుకు మరో రూ.20,000 ఖర్చయ్యాయి. మేమందరం కలిసి ఖర్చులు పంచుకున్నాం. కానీ పేద, మధ్యతరగతి ప్రజలు అంత ఖర్చును భరించగలరా... పైగా వారికి సహాయం చేసేందుకు ముందుకు వచ్చేదెవరు.. అందుకే అలాంటివారికి ఉచితంగా అన్నీ దగ్గ రుండి చేయాలని నిర్ణయించుకున్నాం’’అని చెప్పారు సాయితేజ. అంత్యక్రియల కోసం ఎవరైనా సహాయం కోరితే ఫీడ్ ద నీడ్ సంస్థ నుంచి లాస్ట్ రైడ్ వాహనం వస్తుంది. స్వచ్ఛందసేవకులు సైతం బాడీ బ్యాగు, పీపీఈ కిట్లు, సోడియం హైపోక్లోరైడ్, శానిటైజర్ తీసుకొని వస్తారు. వాళ్లే మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహిస్తారు. వారి అస్థికలను సైతం మేమే నదీజలాల్లో కలిపి వస్తున్నాం’ అని చెప్పారు. లాక్డౌన్ సమయంలోనూ వీరు 50 వేల మంది అన్నా ర్తుల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు. అన్నీ తామై.... ► బీహెచ్ఈఎల్కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్‌తో చనిపోతే అంత్యక్రియలు జరిపేందు కు కన్నకొడుకు భయపడ్డాడు. ఇరుగు పొరుగు సైతం వెనుకడుగు వేశారు. ఆ కుటుంబానికి ఫీడ్ ద నీడ్ వారియర్స్ అన్నీ తామై నిలిచారు. ► కొండాపూర్‌కు చెందిన ఓ వృద్ధుడు శుక్రవారం సోమాజిగూడలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో కోవిడ్‌తో కన్నుమూశాడు. కొడుకు, కూతురు అమెరికాలోనే ఉన్నారు. ఆయన భార్య 65 ఏళ్ల వయోధికురాలు. నిస్సహాయ స్థితిలో ఫీడ్ ద నీడ్‌ను సంప్రదించింది. ఒక్క ఫోన్ చాలు 8499843545 ఈ నెంబర్‌తో ఫీడ్ ద నీడ్ కాల్‌సెంటర్ పని చేస్తుంది. 24 గంటలపాటు సహాయం అందజేస్తారు. -
డబ్బావాలాలకు సాయం
ముంబైలో చాలామంది డబ్బావాలాల మీద ఆధారపడతారు. వేడి వేడి ఆహారం నింపిన డబ్బాలను కరెక్ట్ టైమ్‌కి సంబంధిత వ్యక్తులకు అందజేస్తుంటారు ఈ డబ్బావాలాలు. ముంబైలో దాదాపు 2 లక్షలమంది డబ్బావాలాల మీద ఆధారపడి ఉన్నారు. 2013లో ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యపాత్రలో డబ్బావాలాల నేపథ్యంలో ‘లంచ్‌బాక్స్’ అనే సినిమా కూడా వచ్చింది. ఇక ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా డబ్బావాలాల జీవితాలను ఇరకాటంలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన నటుడు సంజయ్ దత్ అస్లాం షేక్ అనే మంత్రితో కలిసి దాదాపు 5000 మంది డబ్బావాలాలకు ఆహారం అందజేసే బాధ్యతను తీసుకున్నారు. సంజయ్ దత్‌ని ఆదర్శంగా తీసుకుని డబ్బావాలాలను ఆదుకోవడానికి నటుడు సునీల్ శెట్టి కూడా ముందుకొచ్చారు. పుణేలోని ఒక క్యాంప్‌లో ఉంటున్న 800మంది డబ్బావాలాలకు అవసరమైన నిత్యావసరాలను స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి అందజేశారు సునీల్ శెట్టి. మరో మూడు నెలలపాటు డబ్బావాలాలకు సహాయం చేయాలనుకుంటున్నామని సంజయ్ దత్, సునీల్ శెట్టి పేర్కొన్నారు. -
నాన్నా! నేనున్నాను!!
‘‘నాన్నా! నీకు కొడుకుల్లేరని దిగులు వద్దు. నేనే కొడుకుని’’ ఈ డైలాగ్ సినిమాల్లో చూస్తుంటాం. కేరళలోని శ్రీదేవి ‘‘నాన్నా! నీకు కొడుకుని నేనే’’ అని అనట్లేదు. కానీ ‘‘నాన్నా! నేనున్నాను’’ అని తండ్రికి భరోసా ఇచ్చింది. లాక్డౌన్లో ఇంటికి ఆసరా అయింది. శ్రీదేవి గోపాలన్‌కి పాతికేళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, బీఈడీ ఫైనల్ ఇయర్లో ఉంది. ఈ వేసవి గడిస్తే టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు... అనుకుంది. కరోనా లాక్డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆమె తండ్రి గోపాలన్ కొబ్బరి చెట్ల నుంచి కాయలు దింపుతాడు. ‘‘ఆ సంపాదనతో ముగ్గురి కూతుళ్లను పెంచి పెద్ద చేయడం, కాలేజీ చదువులు చదివించడం చిన్న విషయం కాదు. అయినా సరే... మా నాన్న ఏనాడూ తనకు పుట్టింది కూతుళ్లు మాత్రమే. కొడుకులు లేరు... అని బెంగ పడలేదు. ముగ్గురినీ చదివిస్తున్నాడు. అలాంటిది ఈ లాక్డౌన్ కాలం ఆయనను మానసికంగా కుంగదీసింది. వయసు పెరగడం, లాక్డౌన్ మొదటినెలల్లో ఎవరూ పనికి పిలవలేదు. చేతిలో పని లేకపోవడం, ఇంటి ఖర్చులేవీ తప్పక పోవడంతో బాగా ఆందోళనకు గురయ్యారు. అమ్మతో ‘కొడుకు ఉండి ఉంటే... చేదోడుగా ఉండేవాడు’ అన్నాడు. ఆ మాటతో నా మనసు కదిలిపోయింది. ‘‘కొబ్బరి కాయలు దించడానికి నేను కూడా వస్తాను నాన్నా’’ అంటే ఒప్పుకోరని తెలుసు. అందుకే అమ్మానాన్నలకు చెప్పకుండా యూ ట్యూబ్‌లో కొబ్బరి చెట్టు ఎక్కడం, కాయలు దింపడం చూశాను. కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఉపయోగించే సాధనాలను మా చెల్లెళ్లు ఆన్లైన్లో బుక్ చేశారు. ఆ సాధనంతో నేను స్వయంగా కొబ్బరి చెట్లు ఎక్కడం నేర్చుకున్నాను. పని కూడా వెతుక్కున్నాను. ఒక చెట్టు నుంచి కాయలు దింపితే నలభై రూపాయలు వస్తాయి. రోజుకు ఇరవై చెట్ల పని ఉంటుంది. నేను పనికి వెళ్లడం చూసి నాన్న తాను కూడా నాతో వస్తానన్నారు. చెట్టు మీద ఎక్కువ సేపు స్థిరంగా ఉండడం, కోత దశకు వచ్చిన కాయలను గుర్తించడం నేర్పించారు నాన్న. ఈ పనితో మా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి. కానీ అమ్మ మాత్రం చాలా బాధ పడుతోంది. ‘ఇంత చదివించింది చెట్లెక్కి కొబ్బరి కాయలు కోయడానికా’ అని ఒకరు, ‘నువ్వు కన్నది కూతుర్ని... ఆడపిల్ల చేసే పనులేనా ఇవి’ అని మరొకరు బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు రకరకాలుగా దెప్పుతున్నారని కన్నీళ్లు పెట్టుకుంది. అప్పుడు నాన్న ‘‘నా కూతుర్ని చూస్తే గర్వంగా ఉంది. నా కూతురి చేతికింద పని చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉంద’’న్నారు. కోవిడ్ చాలా నేర్పిస్తోంది కోవిడ్ మనలో దాగి ఉన్న చాలా నైపుణ్యాలను వెలికి తీస్తోంది. మనల్ని మనం పోషించుకోవడానికి మన ఎదురుగా ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తాం. కొబ్బరి కాయలు కోయడంతో వచ్చిన డబ్బు ఇంటి ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో సెకండ్ హ్యాండ్ ఆటో కొన్నాం. కాయల రవాణా కూడా చేస్తున్నాం. నాన్నకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. నేను నాన్న దగ్గర డ్రైవింగ్ నేర్చుకున్నాను. కోవిడ్ మహమ్మారి ఇంతలా జీవితాల మీద దాడి చేయకపోయి ఉంటే... బీఈడీ తర్వాత టీచర్ ఉద్యోగం కోసం మాత్రమే ప్రయత్నించేదాన్ని. నేను ఇన్ని పనులు చేయగలుగుతాననే విషయం ఎప్పటికీ తెలిసేది కాదు కదా’’ అని నవ్వుతోంది శ్రీదేవి. ప్రతికూల పరిస్థితుల్లో సానుకూలంగా స్పందించడం అంటే ఇదే. ‘పాజిటివ్’ అనే పదమే భయపెడుతున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి పాజిటివ్ దృక్పథం అవసరం. అనారోగ్యాన్ని ఎదుర్కోవడానికైనా, జీవికను గాడిలో పెట్టుకోవడానికైనా. అమ్మానాన్న, చెల్లెళ్లతో శ్రీదేవి -
ఒక కుటుంబం ఆరు చపాతీలు..
లాక్డౌన్లో వలస కార్మికులకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి ఎంతో సేవాగుణం గలవారు చేస్తున్న సాయం గురించిన కథనాలు వింటున్నాం. చూస్తున్నాం. నోయిడాకు చెందిన ఎల్డికో గ్రీన్ మిడ్జ్ సొసైటీ మహిళలు మరో ప్రత్యేకమైన చొరవ తీసుకొని వలస కార్మికులకు, తమ ఇళ్లకు చేరుకోలేని వారికి పేదప్రజలకు సాయం చేస్తున్నారు. ప్రతి ఇంటి నుండి ఆరు చపాతీలను సేకరించి పేదలకు పంచుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఎల్డికో గ్రీన్ మిడ్జ్ సొసైటీ భవన సముదాయాలలో నివసిస్తున్న మహిళలు పేదలకు ఏ విధంగానైనా సహాయం చేయాలనుకున్నారు. వారుంటున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో దాదాపు 8వేల కుటుంబాలు నివసిస్తున్నాయి. ప్రతిరోజూ 100 ఇళ్లలో ఒక్కో కుటుంబం నుంచి ఆరు రొట్టెలను సేకరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా సేకరించినదానికి రోటీ బ్యాంకు అని పేరు పెట్టారు. రోటీ బ్యాంక్ దగ్గర వివిధరకాల కూరగాయలనూ ఉంచారు. ఇప్పటివరకు వేలాదిమంది పేదలకు ఈ రోటీ బ్యాంక్ నుండి సహాయం అందుతోంది. ఏకాభిప్రాయం ఈ సొసైటీలో నివసించే సుమితా వైద్య మాట్లాడుతూ ‘ఇక్కడ చాలా మంది మహిళలు ఉద్యోగాలు చేస్తున్నారు. వారు తమ కుటుంబాలను చూసుకుంటూనే వివిధ సంస్థలలో కూడా పనిచేస్తారు. లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు ఎన్నో కిలోమీటర్ల దూరం నడుస్తున్నట్లు టీవీ న్యూస్ ఛానెళ్లలో చూస్తున్నాం. గ్రేటర్ నోయిడా, నోయిడాలో నివసిస్తున్న కార్మికుల బాధాకరమైన వార్తలను చూసి అందరం బాధపడ్డాం. ఆ తరువాత మహిళలందరితో మాట్లాడటం ద్వారా పేదవారికి సహాయం చేయడానికి ఒక ఏకాభిప్రాయం ఏర్పడింది. మహిళలందరూ కలిసి వలస కార్మికులకు ఒక కుటుంబానికి 6 రోటీలు ఇస్తామని నిర్ణయించుకున్నాం. దీనిలో సామాజిక కార్యకర్తల సహాయం కూడా తీసుకున్నాం’ అని వివరించారు. ఈ పనిలో దిగువ, మధ్య, ఎగువ అని తేడా లేకుండా మహిళలందరూ పాల్గొంటున్నారు. లాక్డౌన్ 2.0 నుండి ఈ మహిళలు సృష్టించిన రోటీ బ్యాంక్ వేలాది మంది పేదలకు రొట్టెలను పంపిణీ చేసే పని చేస్తూనే ఉంది. గృహిణి అంజలి సింగ్ మాట్లాడుతూ – ‘చిన్న పిల్లలున్న కార్మికులను గుర్తించాం. వారు తినడానికి చాలామంది బియ్యం ఇస్తున్నారు. కాని రోటీస్ రావడం లేదు. దీనితో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని వివరించారు. బృందాల వారీగా సేవ సామాజిక కార్యకర్త హరేంద్ర భాటి మాట్లాడుతూ ‘మహిళలందరూ ఉదయం 9 గంటల సమయంలో తమ ఇళ్లలో రోటీలను సిద్ధం చేస్తారు. ఒక వ్యక్తి పెట్టెను పట్టుకొని ప్రతి ఇంటికీ వెళ్లి బెల్ కొడతాడు. ఆ కుటుంబంలో ఉన్న మహిళ రోటీలను ఆ పెట్టెలో ఉంచుతుంది. ఇందుకోసం మహిళలు సొసైటీని మండలాలుగా విభజించి తమను తాము గ్రూపులుగా విభజించుకున్నారు. వారు ఈ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. మొత్తం సొసైటీ నుండి ఆహారాన్ని సేకరించిన తరువాత మధ్యాహ్నం 12 గంటలకు బాక్స్ మెయిన్ గేటుకు పంపిస్తారు. ఆకలితో ఉన్నవారికి ఆహారాన్ని అందించేందుకు మరొక బృందం ఆ గేటు వద్దకు చేరుకుంటుంది. ఇలా బృందాలుగా సేవ చేస్తున్న ఎల్డికో గ్రీన్ మిడ్జ్ సొసైటీ మహిళలను అందరూ ప్రశంసిస్తున్నారు. -
వలస కూలీలకు అండగా ప్రభుత్వ టీచర్లు
ఆర్మూర్: లాక్డౌన్ వేళ పొట్ట చేత పట్టుకొని చిన్న పిల్లలను చంకన ఎత్తుకొని ఇతర రాష్ట్రాలలోని తమ స్వగ్రామాలకు కాలి నడకన వెళుతున్న వలస కార్మికులకు అండగా మేమున్నామంటూ.. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. ఈ మూడు మండలాల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా కొంత మొత్తాన్ని పోగు చేసుకున్నారు. గత నెల 16 నుంచి 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్మూర్ పట్టణం పెర్కిట్ శివారుతోపాటు ముప్కాల్, పోచంపాడ్ చౌరస్తాల్లో వలస కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు. దాతల సహకారంతో కొనుగోలు చేసిన వంట సామగ్రితో ముప్కాల్, మెండోర కేజీబీవీలలో అన్నం, కూరగాయలు వండిస్తున్నారు. అలాగే రొట్టెలను కూడా తయారు చేయిస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ వంటకాలను మూడు కేంద్రాల్లోకి తరలించి.. మూడు షిఫ్టులుగా పనిచేస్తూ జాతీయ రహదారి వెంట కాలినడకన, లారీలు, ఇతర వాహనాల్లో వెళుతున్న వలస కార్మికులకు భోజనంతోపాటు చల్లని నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, పండ్లు అందిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ 500 పైగా కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు. పెర్కిట్ శివా రులోని అన్నదాన కేంద్రం నిర్వహణకు రూ.40 వేలు, ముప్కాల్, పోచంపాడ్ చౌరస్తా కేంద్రాల్లో రూ.12 వేల చొప్పున ప్రతి రోజు ఖర్చవుతోంది. ఉపాధ్యాయుల సేవలను గుర్తించిన చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ రహదారిపై ఉంటూ వలస కార్మికుల కడుపులు నింపుతున్నారు. సమష్టి కృషితో సాధిస్తున్నాం.. బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. దాతలు కూడా ముందుకు రావడం చాలా తోడ్పాటుగా ఉంది. ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొనడం అభినందనీయం. కాలి నడకన వెళుతున్న కార్మికుల వెతలు చూడలేక మేము ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ 500 మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నాం. – బట్టు రాజేశ్వర్, ఎంఈవో, బాల్కొండ -
అక్కడి కూలీలకు ఆకలి భయం లేదు
కరోనా లాక్ డౌన్ కూలి లేకుండా చేసింది. కూలీల కడుపు ఎండగట్టేసింది. ఆఫీసులు మూసేశారు సరే!!. ఉద్యోగులకైతే జీతాలొస్తాయి. ఇంట్లో నుంచే పని చేస్తారు. మరి కూలీల సంగతో..? వేల కిలోమీటర్లు నడిచి సొంతిళ్లకు వెళ్లిపోవాలా? నడిచేటపుడు వారి ఆకలి దప్పుల సంగతేంటి? ఈ దేశంలో ఏ రాష్ట్రమైనా ఒకటే కదా? వారూ ఈ దేశీయులే కదా..? వాళ్లను ఆదుకునేదెవరు? అందరివీ ప్రశ్నలే. అశోక్‌బాబు మాత్రం తానే జవాబు కావాలనుకున్నాడు. కొంతైనా జవాబుదారీ అవుదామనుకున్నాడు. ఆ ఆలోచనతోనే పుట్టుకొచ్చాయి కమ్యూనిటీ కిచెన్లు. పుణె, పింప్రీ– చించ్వాడ్లో రోజుకు 25 వేల మంది ఆకలి తీర్చటంతో మొదలై... ఇపుడు రోజూ లక్షన్నర మందికి భోజనంతో పాటు ఆశ్రయం కూడా కల్పిస్తున్నాయి. ఐఆర్ఎస్ అధికారిగా తన విధిని నిర్వర్తించటంతో ఆగిపోలేదు అశోక్‌బాబు. తన స్నేహితుల్ని కూడా ఇందులోకి లాగాడు. సివిల్ సర్వెంట్ల నెట్వర్క్ చాలా పెద్దది. శక్తిమంతమైందిlకూడా. అందుకే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని ఎన్జీవోల సహకారంతో వీళ్లు తమ సేవల్ని అందించగలుగుతున్నారు. పుణే, పింప్రి–చించ్వాడ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆసియా ఖండంలోనే అతి పెద్ద పారిశ్రామిక వాడగా చెప్పాలి. ఎందుకంటే ఈ పరిసరాల్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలతో పాటు పలు ఆటోమొబైల్ కంపెనీలన్నాయి. చక్కెర మిల్లుతో పాటు ఇతర మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లు, సాఫ్ట్వేర్ హబ్‌లు, ఇతర వాణిజ్య, వ్యాపార సంస్థలు ఎక్కువే ఉన్నాయి. వీటిలో పనిచేసే లక్షల మంది కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారే. లాక్డౌన్ కారణంగా వీళం్లతా ఇబ్బందుల్లో పడ్డారు. కంపెనీలు మూసేయటం, నిర్మాణ కార్యకలాపాలు ఆగిపోవటంతో నిరాశ్రయులయ్యారు. తిండిలేక అలమటిస్తున్న వీరిని ఆదుకోవటానికి పుణె, షోలాపూర్, కొల్హాపూర్, సతారా, సాంగ్లీ జిల్లాలకు పుణె డీఆర్ఓ హోదాలో (రెవిన్యూ డివిజనల్ కమిషనర్) పనిచేస్తున్న దీపక్ మహిష్కర్ ఓ ఆలోచన చేశారు. కమ్యూనిటీ కిచెన్ భావనకు పురుడు పోశారు. ఆచరణ, పర్యవేక్షణ బాధ్యతలు ఐఆర్ఎస్ అధికారి నేలపట్ల అశోక్‌బాబుకు అప్పగించారు. ప్రతి రోజూ స్వయంగా కిచెన్లకు... కో–ఆర్డినేటర్‌గా నియమితులైన నాటినుంచి అశోక్ బాబు తనదైన శైలిలో సేవలు అందించటం మొదలెట్టారు. ముఖ్యంగా ప్రతిరోజూ పుణే డిప్యూటి కలెక్టరు, పుణే, పింప్రి–చించ్వడ్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర ్లతో సమన్వయం చేసుకునే వారు. రోజుకు కనీసం రెండు నుంచి మూడు కమ్యూనిటీ కిచెన్ సెంటర్లతోపాటు షెల్టర్ల వద్దకు నేరుగా వెళుతున్నారు. కూలీల్లో భయాన్ని పారదోలేందుకు ప్రయత్నిస్తూ... ఆహారం సరిగా అందిందో లేదో చూస్తున్నారు. పలువురికి బస కూడా ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లో... ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగువారికి అశోక్‌బాబు తన వంతు సాయం అందిస్తున్నారు. తన మిత్రులతో పాటు ఎన్జీఓ సంస్థల సహకారంతో పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలకు భోజనం, వీలైనంత వరకూ వసతి కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్, గుంటూరు, రాజమండ్రి, చిత్తూరు, తెలంగాణలోని హైదరాబాదు, మెదక్, సూర్యాపేట, గద్వాల్ ప్రాంతాలతో పాటు కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిషా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తమ సేవలు అందుతున్నట్లు చెప్పారాయన. గుంటూరు జిల్లా వినుకొండ నుంచి.. అశోక్బాబుది గుంటూరు జిల్లా. వినుకొండ తాలూకా మొగచిందలపాలెంలో పుట్టారు. వినుకొండలోని సెయింట్ మేరిస్, లయోల స్కూల్లో ప్రాథమిక విద్య అభ్యసించాక గుంటూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసి, వరంగల్‌లో బీటెక్ చేశారు. 2010లో హైదరాబాద్‌లో కొన్నాళ్లు పనిచేశాక ముంబై రీజియన్‌లో ఐటీ జాయింట్ కమిషనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పుణే సీనియర్ ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తూనే ఈ కమ్యూనిటీ కి చెన్ బాధ్యతలను చూస్తున్నారు. – గుండారపు శ్రీనివాస్ / చక్రవర్తి సాక్షి ముంబై/ పింప్రీ 25 వేల భోజనాలతో ప్రారంభం.. పుణే, పింప్రీ–చించ్వాడ్ పరిధిలో ఏప్రిల్ 16న కమ్యూనిటీ కిచెన్ సేవలను ప్రారంభించాం. మొదట సుమారు 25 వేల మందికి భోజనాలు అందించాం. ఈ సంఖ్య పెంచుతూ ఇపుడు 105 కమ్యూనిటీ కిచెన్ల ద్వారా రోజూ 1.50 లక్షల మందికిపైగా భోజనాలు అందిస్తున్నాం. అదేవిధంగా 57 షెల్టర్లలో సుమారు 70 వేల మందికి బస ఏర్పాటు చేశాం. – నేలపట్ల అశోక్‌బాబు ఐఆర్ఎస్, కో ఆర్డినేటర్, కమ్యూనిటీ కిచెన్ సెంటర్స్ -
మన ముగ్గురం కలిసి...
పారిస్: కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సిద్ధమవుతున్నారు. టెన్నిస్‌లో రాణించాలని కోటి ఆశలతో వచ్చిన కొత్త ఆటగాళ్లకు ప్రస్తుత లాక్డౌన్ శరాఘాతమైంది. వీరికి ఎలాంటి స్పాన్సర్షిప్స్ ఉండవు. చిన్నాచితక టోర్నీల్లో ఆడితేనే ప్రైజ్‌మనీల రూపంలో డబ్బు వస్తుంది. లేదంటే లేదు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నుంచి కూడా ఆర్థిక తోడ్పాటు ఉండదు. ముఖ్యంగా 200 ర్యాంకు నుంచి 700 ర్యాంకుల్లో ఉన్న వారికి టోర్నీలు జరగడమే ఇం‘ధనం’. లేదంటే కెరీర్ బండి నడవదు. వాళ్లు సొంత డబ్బులతో టోర్నీలకు వెళ్తారు. ఆ టోర్నీలే లేకపోతే వారి కష్టాలు వర్ణనాతీతం. దీన్ని గమనించిన ఈ ముగ్గురు దిగ్గజాలు భవిష్యత్ టెన్నిస్ తారల కోసం నిధిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాళ్ల సంఘానికి అధ్యక్షుడైన జొకోవిచ్ మాట్లా డుతూ... ‘మన ముగ్గురం కలిసి 30 నుంచి 45 లక్షల డాలర్లు సమకూర్చితే... ఈ మొ త్తాన్ని తక్కువ ర్యాంకు ఆటగాళ్లకు పంపిణీ చేయవచ్చు’ అని సూచించాడు. భవిష్యత్ టెన్నిస్ బాగుండాలనే ఈ ప్రతిపాదన తెచ్చినట్లు అతను చెప్పాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో వచ్చిన ప్రైజ్‌మనీతో ఈ నిధిని జమచేయవచ్చని అన్నాడు. ఒకవేళ ఈ సీజన్ మొత్తం రద్దయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దక్కించుకున్న ప్రైజ్‌మనీ నుంచైనా నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జొకోవిచ్ తెలిపాడు. -
పేకాటలో 'ఖాకీ'ల మాయాజాలం
సాక్షి, కర్నూలు : జిల్లాలో మట్కా, పేకాట యథేచ్ఛగా కొనసాగుతోంది. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇటీవల ఎక్కువైంది. వీటిని అరికట్టకుండా కొందరు పోలీసులు..జూదరులకు సహకరిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్లతో జతకడుతున్నారు. పోలీసుల పనితీరు విషయంలో ఎస్పీ ఫక్కీరప్ప గట్టిగా వ్యవహరిస్తున్నా కొందరు ఎస్ఐలు, సీఐలు..అక్రమార్జన కోసం గాడి తప్పుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఊతమిస్తున్నారు. వీరిపై ఎస్పీకి ఇటీవల ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బనగానపల్లె సర్కిల్ విషయంలో ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఇక్కడ కొందరు ఎస్ఐలు ఏకంగా నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా రాయుళ్ల నుంచి ఒక్కో స్టేషన్‌కు నెలకు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకూ మామూళ్లు వస్తున్నట్లు సమాచారం. ఫలితంగా మట్కారాయుళ్లు చీటీలు రాస్తున్నా, వారు ఎక్కడ రాస్తున్నారనే కచ్చితమైన సమాచారం ఉన్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.. పంచాయితీలు ఎక్కువే.. బనగానపల్లె సర్కిల్లోని పోలీసులపై ఇతర ఆరోపణలు కూడా అధికంగానే ఉన్నాయి. చనుగొండ్ల గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందితే పంచాయితీ చేయగా.. ఎస్ఐకి రూ.60వేలు ముట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఓ రైస్‌మిల్లు వ్యాపారి చౌక బియ్యాన్ని మిల్లులోకి సన్నబియ్యంగా మార్చి ఎగుమతి చేస్తున్నారు. మిల్లు తనిఖీ చేయకుండా రూ.50వేలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే గత నెల 17న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందితే కేసు నమోదైన తర్వాత సెక్షన్ మార్చేందుకు రూ.50వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రామాపురానికి చెందిన ఓ మట్కా బీటర్ నుంచి రూ.60వేలు..బనగానపల్లె సర్కిల్ కార్యాలయానికి ముట్టినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులను ఓ కానిస్టేబుల్ ద్వారా బీటర్ చేర్చినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మట్కా జోరు.. కర్నూలు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్, ఎమ్మిగనూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా మట్కా నడుస్తోంది. గతంలో రతనాల్ మట్కా.. వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు జరుగుతున్నాయి. ఈ మాట్కాకు నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి ఆన్లైన్లో వస్తాయి. ఇవి కాకుండా కర్నూలులో కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం ఐదు గంటల వరకూ చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15 గంటలకు ఓపెన్, రాత్రి 11.15 గంటలకు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతోనే మట్కా రాయుళ్లు చాలామంది సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఉత్కంఠతో వేచి చూస్తుంటారు. కర్నూలు వన్‌టౌన్, త్రీటౌన్‌లో పరిధిలో మట్కాబీటర్లు అధికం. ఇక్కడ ఎవరు మట్కా నిర్వహిస్తారు? మట్కా బీటర్లు ఎవరనే సంగతి ఇక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. అయినా మట్కా నిర్వహణకు బ్రేక్ వేయలేకపోతున్నారు. దీనికి కారణం ఇక్కడి పోలీసులతో ఉన్న సత్ససంబంధాలే అని తెలుస్తోంది. దీంతోపాటు టూటౌన్, ఫోర్త్ టౌన్ స్టేషన్లలో కూడా మట్కా నడుస్తోంది. ఏళ్ల తరబడి ఇక్కడి కానిస్టేబుళ్లు ఒకే స్టేషన్లో పనిచేస్తున్నారు. దీంతో బీటర్లతో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి. సీఐలు ఆరా తీసిన సందర్భాల్లో కానిస్టేబుళ్లు కచ్చితమైన సమాచారం కూడా స్టేషన్‌కు ఇవ్వడం లేదు. ఈ ఊబిలో కూరుకుపోయిన వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు, మహిళలు కూడా ఉన్నారు. యథేచ్ఛగా క్రికెట్ బెట్టింగ్ క్రికెట్‌బెట్టింగ్ అంటే గతంలో ప్రొద్దుటూరు పేరు వినిపించేది. ఇప్పుడు కర్నూలులో కూడా బెట్టింగ్ జోరుగా నడుస్తోంది. బడా వ్యాపారుల నుంచి బార్బర్ షాపు, టిఫిన్‌సెంటర్ల నిర్వాహకుల వరకూ అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకునిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో ఇండియా టీ–20 సిరీస్ మొదలైంది. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు జోరు పెంచారు. ఆదివారం ఇండియా–బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌పై బెట్టింగ్ వేసి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రూ. 25లక్షలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓ ఎలక్ట్రికల్ షోరూం వ్యక్తి రూ.7లక్షల దాకా కోల్పోయారు. క్రికెట్ బెట్టింగ్ ఊబిలో స్టూడెంట్స్ కూడా చిక్కుకుపోయారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జనవరిలో నోటిఫికేషన్ ఇస్తుందని ప్రకటించడంతో చాలామంది కోచింగ్సెంటర్లకు వెళుతున్నారు. ఫీజుల పేరుతో భారీగా తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకుని వీరు బెట్టింగ్‌లో పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లపై పత్రికల్లో కథనాలు వచ్చినపుడు మొక్కుబడిగా కొందరిని అరెస్టు చేయడం మినహా బుకీలు, సబ్బుకీలపై పోలీసులు దృష్టి సారించడం లేదు. జిల్లాలో పేకాట కూడా జోరుగా నడుస్తోంది. క్లబ్‌ల్లో పేకాట నిషేధించడంతో వీరంతా కొన్ని ఇళ్లను అద్దెకు తీసుకుని పేకాట ఆడుతున్నారు. సుంకేసుల, ఓర్వకల్లు రాక్‌గార్డెన్, అవుకు రిజర్వాయర్ ప్రాంతాల్లో కూడా బంకీని కడుతున్నారు. చూసేవాళ్లకు విహారయాత్రకు వెళ్లినట్లు అన్పించినా వారు వెళ్లేది పేకాటకు. వీరంతా లక్ష నుంచి రూ. 2 లక్షల బ్యాంక్ వరకూ ఆడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టడంపై ఎస్పీ గట్టిగానే ఉన్నారు. చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొందరు ధనార్జనే ధ్యేయంగా అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారు. వీరికి ఎస్పీ కళ్లెం వేయకపోతే మరింత పెరిగి, నేరాలు పెరిగే అవకాశం ఉంది. -
మానవత్వం చాటిన ఎమ్మెల్యే
సాక్షి, మైదుకూరు(కడప) : బ్రహ్మంగారిమఠం మండలంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి వెళుతూ అప్పుడే జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడి పట్ల మానవత్వం చూపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బి.మఠం మండలంలోని పెద్దిరాజుపల్లెలో రాజన్న బడిబాట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి జీవీ సత్రం మీదుగా కారులో వెళుతున్నారు. జెడ్పీ హైస్కూల్ సమీపంలో మోటారు సైకిల్‌ను లారీ ఢీ కొనడంతో మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్దరిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన జరిగిన కొద్ది నిమిషాలకే అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కారును ఆపి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బాధితుడి వివరాలు తెలుసుకున్నారు. బి.కోడూరు మండలం మేకవారిపల్లెకు చెందిన గురవయ్య అని తెలుసుకున్నారు. బాధితుడి పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చికిత్స కోసం రూ.10వేలు నగదును అందజేశారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పరిసరాల్లోని ప్రజలు ఎమ్మెల్యే ఔదార్యాన్ని ప్రశంసించారు. -
నరాల వ్యాధితో నరకయాతన
మదనపల్లె టౌన్ : ఈ ఫొటోలో మంచానికే పరిమితమై వున్న వ్యక్తి పేరు సంకారపు శ్రీనివాసులు(51). వైఎస్ఆర్ జిల్లా చిన్నమండ్యం మండలం, దేవగుడిపల్లె పంచాయతి, కొండమూలపల్లె. బతుకుదెరువు కోసమని 32 ఏళ్లక్రితం ఊరుగాని ఊరు రొచ్చాడు. మదనపల్లె పట్టణం చంద్రాకాలనీ సమీపంలోని వైఎస్సార్ కాలనీలో ఉంటున్నారు. ఇతనికి భార్య శారద, ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. రాత్రింబవళ్లు భార్య ఒక చోట తనొకచోట కూలి మాగ్గాలు నేస్తూ శ్రమించారు. రంగురంగుల చీరలనేసి ప్రశంసలు అందుకున్నారు. దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 2006లో పేదలకు ఇళ్లను మంజూరు చేయడంతో సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. ఆ అన్యోన్య దంపతులను చూసి దేవుడు ఓర్వలేక పోయాడు. తొమ్మిదేళ్ల క్రితం చీరలు నేస్తుండగా హైబీపీ రావడంతో కింద పడిపోయాడు. తిరుపతి, చెన్నై, బెంగుళూరు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. అయితేనరాల్లో కదలిక లేదని, ప్రతి రోజు ఫిజియోథెరపీ చేయిస్తే కొంతమేర మెరుగైన పరిస్థితి ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఇప్పటికే నెలకు మందులకు రూ.5 వేలపైనే ఖర్చు చేస్తుండడంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఆయన మంచానికే పరిమితమై కుటుంబాన్ని చూసి కుమిలిపోతున్నాడు. చదువుకోవాల్సిన 13 ఏళ్ల కొడుకు హోటల్లో ›పనిచేసే తెచ్చే కూలి డబ్బుతో బతుకు ఈడ్చుతూ దాతల చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు 63042 77828ను సంప్రదించాలని వేడుకుంటున్నారు. నీరుగట్టువారిపల్లె శాఖ ఆంధ్రాబ్యాంకు ఖాతా నంబర్: 209910100020445, ఐఎఫ్ఎస్సికోడ్ నెంబర్: ఏఎన్‌డిబీ 0002099.కు దాతలు జమ చేయవచ్చు. ఆపరేషన్ చేస్తేమామూలు స్థితికి చేరుకోవచ్చు కళ్లు తిరిగి కింద పడడంతో తలలో రక్త నాళాలు చిట్లి పక్షవాతం వచ్చింది. అంతేకాకుండా వెన్నెముక దెబ్బతినడం వల్ల కాళ్లు చేతులు పనిచేయకుండా పోయాయి. ఎమ్మార్ఐ స్కానింగ్ తీసి, వీలును బట్టి ఆపరేషన్ చేస్తే తిరిగి మామూలు స్థితికి చేరుకోవచ్చు. ఇది కాస్త ఖర్చుతో కూడిన వైద్యం.–డాక్టర్ సాయికిషోర్,మదనపల్లె జిల్లా ఆస్పత్రి వైద్యులు -
పాక్ సాయంలో అమెరికా భారీ కోత
వాషింగ్టన్: అమెరికా, పాకిస్తాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై మరో దెబ్బపడింది. ఉగ్ర గ్రూపులను కట్టడి చేసేందుకు పాక్ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ 30 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,130 కోట్లు) సాయాన్ని నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 5న పాక్ నూతన ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భేటీ నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టాక పాక్ విషయంలో అమెరికా వైఖరిలో మార్పు వచ్చింది. అఫ్గానిస్తాన్‌లో మోహరించిన తమ బలగాలపై దాడులకు పాక్ కేంద్రంగా పనిచేస్తున్న హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ఈ సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ పలుమార్లు కోరినా స్పందించనందుకు పాక్‌పై గుర్రుగా ఉంది. -
కేరళలో దళితులను ఆదుకోవాలి: చుక్కా రామయ్య
హైదరాబాద్: భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళలో శ్రీమంతులు నిలదొక్కుకుంటున్నారని, దళిత, గిరిజన, ఆదివాసీలు మాత్రం నిరాశ్రయులయ్యారని అలాంటి వారిని ఆదుకుని మానవత్వం చాటాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్, ఎస్సీ, ఎస్టీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సాక్షి దినపత్రిక ఇటీవల చుక్కా రామయ్యకు జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.లక్ష నగదును అందచేయగా, ఆ మొత్తాన్ని కేరళ వరద బాధితులకు అందించారు. కేరళకు చెందిన దళిత ఫ్యాంథర్స్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.అంబుజాక్షన్‌కు ఆయన ఈ చెక్కును అందించారు. కేరళకు విదేశాల నుంచి వచ్చే సాయాన్ని తిరస్కరించరాదని, దాన్ని పేదల కోసం వినియోగించాలని రామయ్య సూచించారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కన్వీ నర్ మల్లేపల్లి లక్ష్మయ్య, మాజీ ఐఏఎస్ కాకి మాధవరావులు మాట్లాడుతూ.. కేరళలో నిమ్నవర్గాల పట్ల చూపిస్తున్న వివక్ష తగదని, అక్కడి ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
కేరళ బాధితులకు లారెన్స్ సాయం ‘కోటి’
కేరళ వరద బాధితుల సహాయార్థం ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ కోటి రూపాయల సాయం ప్రకటించారు. కోలీవుడ్‌లో ఇంత పెద్ద మొత్తాన్ని ప్రకటించిన నటుడు లారెన్సే. వరదల్లో కేరళ ప్రజల కష్టాలు తనను కలచివేశాయని ఈ సందర్భంగా లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ సీఎం విజయన్ను శనివారం కలిసి చెక్‌ను అందజేస్తానని తెలిపారు. బాధితులు ఎవరైనా తనను వ్యక్తిగతంగా కలిస్తే, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. సేవా కార్యక్రమాల్లో లారెన్స్ ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. -
35 ఏళ్ల క్రితం కరుణానిధి సాయం
ముంబై: తమిళభాషపై అపార ప్రేమ ఉన్న కరుణానిధి, తమిళులు ఎక్కడ నుంచి సాయం కోరినా వెంటనే స్పందించేవారు. అన్నిరకాలుగా అదుకునేందుకు ప్రయత్నించేవారు. తాము కోరిన వెంటనే సమావేశానికి వచ్చిన కరుణానిధి, తమిళులకు ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ ఏర్పాటుకు సహకరించారని డీఎంకే ముంబై విభాగం చీఫ్ ఆర్.పళనిస్వామి గుర్తుచేసుకున్నారు. ‘ముంబైలో 1983లో తమిళులంతా కలసి నిర్వహించిన ఓ సమావేశానికి రావాల్సిందిగా మేము కరుణానిధిని ఆహ్వానించాం. ఆయన అందుకు అంగీకరించడమే కాకుండా మేం ఏయే కార్యక్రమాలు చేపడుతున్నామో, మాకు ఏం ఇబ్బందులు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళులు గణనీయంగా ఉన్న ధారావి ప్రాంతంలో కమ్యూనిటీ స్కూల్ లేదనీ, నిధులు లేకపోవడం వల్లే దాని నిర్మాణం చేపట్టలేకపోయామని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. దీంతో స్కూల్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని పార్టీ సీనియర్ నేతల్ని కరుణానిధి ఆదేశించారు. కేవలం ఆయన తీసుకున్న చొరవతో ఈ ప్రాంతంలో ఓ స్కూల్‌తో పాటు లైబ్రరీ కూడా ఏర్పాటైంది’ అని పళనిస్వామి చెప్పారు. ముంబై సమావేశానికి వచ్చిన సందర్భంగా కరుణ వేలాది మందిని కలుసుకున్నారన్నారు. 2010లోనే ఆసుపత్రి కోసం ఇల్లు దానం చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెన్నై గోపాలపురంలోని ఖరీదైన తన ఇంటిని ఆసుపత్రి స్థాపన కోసం 2010లోనే దానమిచ్చారు. ఆ ఏడాది తన 86వ జన్మదిన వేడుకల సందర్భంగా కరుణానిధి తన కొడుకులను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరుణానిధితోపాటు ఆయన భార్యలు కూడా చనిపోయిన తర్వాత ఈ ఆసుపత్రిని స్థాపించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం కరుణానిధి తల్లి పేరిట అన్నై అంజుగమ్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయగా, కరుణ కుటుంబసభ్యులతోపాటు కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, ప్రముఖ తమిళ గేయరచయిత వైరముత్తు తదితరులు కూడా ట్రస్ట్‌లో సభ్యులుగా ఉన్నారు. ఈ ఆసుపత్రికి కలైజ్ఞర్ కరుణానిధి హాస్పిటల్ అని పేరుపెట్టనున్నారు. -
ఉన్నది ఒకటే జిందగీ..
పసిపాప బోసి నవ్వు తల్లికి ఆనందం.. అమ్మాయి ఓర చూపు అబ్బాయికి ఆనందం... ఉద్యోగం దొరికితే నిరుద్యోగికి ఆనందం... పదవొస్తే రాజకీయ నాయకుడికి పట్టలేని ఆనందం.. ఇలా ఒక్కొక్కటీ ఒక్కొక్కరికీ ఆనందాన్ని పంచుతుంది. అయితే ప్రస్తుత యువత ఇంకాస్తా ముందడుగు వేసి.. ఇదిగో ఇలా ఎంజాయ్ చెయ్యడంలోనే అసలైన ఆనందం ఉందనీ.. ఎందుకంటే ‘‘ఉన్నది ఒకటే జిందగీ బాస్’’ అంటున్నారు. విశాఖ సిటీ: ఉరకలేసే ఉత్సాహం, కాలంతో పరిగెత్తే వేగాన్ని అందిపుచ్చుకున్న నేటి యువతరం ఆనందమనేది మనం సంపాదించుకునేది. అది ఏ రూపంలోనైనా పొందవచ్చని చెబుతున్నారు. జీవితమంటే ఓ సాహసయాత్రలాంటిది. కష్టాలు ఎదురవుతుంటాయి. వాటిని సంతోషంగా స్వీకరిస్తేనే ఆనందయాత్ర ముందుకు సాగుతుందనే వేదాంతం మాట్లాడేస్తున్నారు. వారి మాటల్లో నిజమే ఉంది. చిన్న కష్టం వస్తే అసంతృప్తి బాట పడుతూ ఆనందాన్ని దూరం చేసుకుంటున్నారు కొంతమంది. ఈ తరహా వైఖరిని వీడనాడాలని యువత సూచిస్తోంది. ఆనందపు వసంతం రావాలంటే.? అసంతృప్తే అన్ని అనర్థాలకు మూలం. సంతృప్తి అనేది లేకపోతే బతుకు దుర్భరమవుతుందని అన్నారు గోరాశాస్త్రి. కొంతమంది జీవితం సాఫీగా సాగిపోతున్నా.. సంతృప్తి చెందకుండా ఏదో మూలన బాధపడుతూ కాలం గడుపుతుంటారు. నగర జీవనంలో 35 ఏళ్లు పైబడిన వారిలో ఈ తరహా అసంతృప్తి ఇటీవల ఎక్కువైపోతోంది. ఈ విధానం నుంచి దూరమైపోతూ తమ సొంత ఆలోచనలతోనే ఆనందపుటంచుల్ని తాకుతోంది నేటి యువతరం. అసలు సంతోషం, ఆనందం అనేది 50 శాతం జన్యుపరంగానూ 40 శాతం మనిషి అంతర్గత ఆలోచనలు, 10 శాతం జీవన పరిస్థితుల పరంగా ఆధారపడి ఉంటుంది. సేవలోనే సంతృప్తి.. తాము ఆనందంగా ఉండటమే కాదు.. ఎదుటి వారి కళ్లల్లో ఆనందం చూస్తేనే తమకు నిజమైన సంతృప్తి అని అంటున్నారు కొందరు యువతీ యువకులు. అందుకే.. అభాగ్యులకు ఆసరాగా నిలుస్తూ వారి జీవితాల్లో నింపుతున్న వెలుగుల్లోనే ఆనందం వెతుక్కుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుస్తకాలు కొనేందుకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతూ నిస్సహాయ స్థితిలో విద్యకు మధ్యలోనే దూరమైపోతున్న వారికి చేయూతనిస్తున్నారు. వైజాగ్ స్మైల్స్, వేదిక్ సైన్స్ క్లబ్, కెన్ ఫౌండేషన్.. మొదలైన సంస్థలు స్థాపించి ఉచితంగా పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒక విద్యార్థిగా.. తోటి విద్యార్థికి సహాయం చేస్తే.. అందులో దొరికే ఆనందం చెప్పలేనిదనీ.. వీరంతా గర్వంగా చెబుతున్నారు. నగరంలో చైల్డ్ బెగ్గింగ్ని నిర్మూలించేందుకు జనరేషన్ యువ పేరుతో సంస్థను స్థాపించి కొంతమంది యువకులు ఆనందం వెతుక్కుంటున్నారు. యాచకవృత్తిలో ఉన్న బాలబాలికలకు ఉత్తమ జీవితాన్నందిస్తూ వారికీ ఆనందం పంచిపెడుతున్నారు. స్ట్రీట్ స్వచ్ఛంద సంస్థ పేరుతో 200 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వృథా ఆహారాన్ని సేకరిస్తూ నగరంలోని రోడ్లపై, ఫుట్ పాత్లపై ఎవరూ లేని అనాథల్లా.. ఆకలితో అలమటిస్తున్న వారికి అందిస్తూ వారి ఆకలి తీరుస్తున్నారు. కడుపు నిండిన తర్వాత వారి ఆశీర్వాదంలోనే ఆనందం వెతుక్కుంటున్నారు. ఇలా.. ఆనందం కోసం యువతరం ఒక్కోదారిలో అన్వేషణ సాగిస్తున్నారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు..? ఆనందంగా ఉండాలని అనుకుంటే పనిలో మునిగిపోండంటున్నాయి కొన్ని అధ్యయన సంస్థలు. ఖాళీగా కూర్చొని పగటి కలలు కనేవారితో పోలిస్తే చేతినిండా పని ఉన్న వారు ఎక్కువ ఆనందంగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఆనందంగా ఉండడంపై యువత అభిప్రాయమేంటని తరచి చూస్తే.. ఎన్నో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. నగరంలో కొంతమంది యువతీ యువకుల్ని వారి ఆనందం విషయంపై మాట్లాడమంటే గలగలా కబుర్లు చెప్పేస్తున్నారు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. కానీ.. ఎంత ఎక్కువ ఆనందం ఎందులో లభిస్తుందో.. దానివైపే మేము మొగ్గు చూపుతామంటూ ‘‘ఆనందం’’కొద్దీ చెప్పేస్తున్నారు. రోజులో ఎన్ని గంటలు ఆనందంగా ఉంటారు.? రోజంతా ఆనందంగా ఉంటాం టీవీలో కార్యక్రమాలు చూస్తున్న సమయంలో అప్పుడప్పుడూ ఆనందంగా ఉన్నామనిపిస్తుంది ఆనందాన్ని ఎందులో వెతుక్కుంటారు.? ఎదుటివారికి సహాయం చెయ్యడంలో చేస్తున్న ఉద్యోగంలో ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చెయ్యడంలో సినిమాలు, టీవీషోలు చూడటంలో ఎవరితో ఉంటే ఆనందంగా ఉంటారు.? కుటుంబంతో ఉన్నప్పుడు ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు బాయ్‌ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌తో ఉన్నప్పుడు ఆనందమంటే..? ఉద్యోగం దొరకడం సొంతూరిలో ఉపాధి దొరకడం మంచి మనసున్న తోడు దొరకడం ఎదుటి వారికి సాయం చెయ్యడం ఆనందం కోసం ఎక్కడ అన్వేషిస్తున్నారని కొంతమంది యువతను అడిగితే.. వారు చెప్పిన మాటలివీ... అభాగ్యుల ఆకలి తీర్చినప్పుడు ఆనందం విశాఖ వీధుల్లో దయనీయంగా కనిపిస్తున్న వారు అభాగ్యులు కాదు. వారికి స్ట్రీట్ ఫ్రెండ్స్ తోడుగా ఉన్నారు. వారి ఆకలిని తీర్చినప్పుడే అసలైన ఆనందం దొరుకుతుంటుంది. –గాయత్రి రాచర్ల, స్ట్రీట్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఫ్రెండ్స్ పలకరింపుతో ఖుషీ ఉద్యోగం కోసం ఇంటికి దూరంగా ఉంటున్నాం. ఆ సమయంలో మేమున్నామంటూ అమ్మ ప్రేమను అందించే ఫ్రెండ్స్ పలకరింపులోనే ఆనందం దొరుకుతోంది. –మోనిక, ఏయూ ఎంటెక్ విద్యార్థి, ఒంగోలు పని చేస్తుంటేనే సంతోషం సాఫ్ట్వేర్ కంపెనీలో బ్యాకెండ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. పని చేస్తున్నప్పుడు పై అధికారులనుంచి ప్రశంసలు పొందినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. –యామిని, సాఫ్ట్వేర్ టెస్టర్ అమ్మ నాన్నలతో ఉంటేనే.. మాది శ్రీకాకుళం జిల్లా. ఉద్యోగం కోసం విశాఖ వచ్చేశాను. ఫ్రెండ్స్ చుట్టూ ఉన్నా.. అమ్మా నాన్నతో గడిపిన క్షణాలే ఎంతో ఆనందాన్నిస్తాయి. – బి. ఆదిత్య, సాఫ్ట్వేర్ ఉద్యోగి చదువులోనే.. చిన్నప్పటి నుంచి చదువుకోవడమంటే ఇష్టం. ఉత్తమ ప్రతిభ కనబరిచినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. –వి. భార్గవి, బిట్స్ పిలానీ విద్యార్థిని, మద్దిలపాలెం ఫ్రెండ్స్‌తో గడుపుతుంటే ఆనందం చదువు, ఉద్యోగంతో జీవితం బిజీ బిజీగా గడిచిపోతుంటుంది. ఖాళీ సమయంలో ఫ్రెండ్స్‌తో గడుపుతున్నప్పుడు లెక్కకు మించిన ఆనందం నా సొంతమవుతుంది. – స్రవంతి, పీహెచ్‌పీ డెవలపర్, సీతంపేట ఆనందానికి ఐరాస ఆరు కొలమానాలు.. 1. ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు 2. తలసరి ఆదాయం 3. స్వేచ్ఛ 4. దాతృత్వం 5. సామాజిక భద్రత 6. అవినీతి రహితంగా జీవించడం. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా చిరునవ్వులొలికిస్తూ ఆనందంగా గడిపేస్తుంటారు చాలా మంది. సంపద ఎంత ఉన్నా ఆనంద లేమితో జీవిస్తుంటారు మరికొంతమంది. ఏమిటీ వ్యత్యాసం? అంటే.. సంపదే సమస్తం కాదు. అది ఉంటే సౌకర్యాలతో సుఖంగా ఉండొచ్చేమో కానీ.. ఆనందంగా ఉండలేమంటున్నారు నగర యువత. ఆనందమనేది హృదయానికి సంబం«ధించినది. అది అంతర్గతమైన అనుభూతి. సామాజిక పునాదులు బలంగా ఉంటేనే ప్రజలు ఆనందంగా ఉంటారని ఐరాస చెబుతోంది. అందుకే.. ఐక్యరాజ్యసమితి ఆనందానికి ఆరు కొలమానాల్ని ప్రాతిపదికగా తీసుకుంటోంది. -
పెరోల్ దందా ఇద్దరు నర్సులుపై వేటు
-
అజయ్‌కు ఆపన్నహస్తం
ప్రొద్దుటూరు టౌన్: అజయ్‌కి మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘అజయ్‌ను ఆదుకుందాం’ కథనాన్ని చూసి చాలా మంది చలించిపోయారు. కొందరు సాక్షికి ఫోన్ చేసి వారి వివరాలను తెలుసుకోవడంతోపాటు కొందరు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు డబ్బు అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకుడు శివచంద్రారెడ్డి కేన్సర్‌తో బాధపడుతున్న అజయ్ ఇంటికెళ్లి రూ.10 వేలు సహాయం అందించారు. అజయ్ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి బాలాజిలతోపాటు ఆ ప్రాంత డ్వాక్రా సంఘాల మహిళలు, శ్రీగోపికృష్ణ విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డిని కలిసి అజయ్ పరిస్థితిని వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రదీప్రెడ్డిచేత రూ.10 వేలు ఇప్పించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడా రమణారెడ్డి మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో మరింత సాయం అందిస్తామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డితోపాటు పట్టణాధ్యక్షుడు రమణారెడ్డితో కూడా మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సమావేశం ఉందని,ఆ సమావేశంలో అజయ్‌ని ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. విద్యార్థులు సాత్విక్ రెడ్డి, షణ్ముఖనందిని తండ్రి బండి రమణారెడ్డి పిల్లల పుట్టిన రోజు సందర్భంగా రూ.4వేలు సహాయం అందించారు. హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ ప్రవీణ్ రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. అలాగే అజయ్ ఇంటి వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి రూ.10వేలు అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు కృషి... మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి ఉన్న విషయం తెలుసుకుని అజయ్ తల్లిదండ్రులు, డ్వాక్రా మహిళలు వైఎస్సార్సీపీ నాయకుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆయనను కలిశారు. సాక్షి దినపత్రికలో అజయ్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన కథనాన్ని ఆయనకు చూపించారు. లింగారెడ్డి సీఎం పేషి క్లర్క్‌తో మాట్లాడారు. కేన్సర్‌తో బాధపడుతున్న అజయ్‌కి రూ.10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వస్తే అక్కడి నుంచి ఎన్టీఆర్ కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళుతామని, అజయ్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకు సంబంధించి వైద్యులతో అంచనా వేయించి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా చూస్తానని లింగారెడ్డి హామీ ఇచ్చారు. డ్వాక్రా సభ్యుల విరాళం .. అజయ్ నివాసం ఉంటున్న బాలాజి నగర్–2 ప్రాంతంలో ఉంటున్న డ్వాక్రా సంఘాల మహిళలు అజయ్ పరిస్థితిపై చలించిపోయారు. సంఘాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అజయ్‌కి ఆర్థిక సహాయం అందించేందుకు చర్చిస్తున్నారు. ఇప్పటికే రూ.13వేలు వీరు విరాళాలు వసూలు చేశారు. పట్టణంలో ఉన్న 2,400 సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అజయ్‌కి శక్తిమేర ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు అజయ్‌కి ఆర్థిక సహాయం అందించే దాతలు తల్లి శ్రీలక్ష్మి సెల్ నెంబర్ 9052085893లో సంప్రదించాలని కోరారు. -
వేలమందిని ఆదుకుంటున్న ఫేస్ బుక్ పేజీ!
కేరళః సామాజిక మాధ్యమాలతో చెడు అలవాట్లకు బానిసలౌతున్నవారు కోకొల్లలుగా కనిపిస్తున్న నేటి తరుణంలో.. ఆ బస్ డ్రైవర్ మాత్రం సద్వినియోగపరచుకున్నాడు. ప్రజాసేవే లక్ష్యంగా తాను స్వయంగా ఓ ఫేస్ బుక్ పేజీని సృష్టించి.. సోషల్ మీడియా పవర్ తో ప్రజల్లో సామాజిక మార్పు తెచ్చేందుకు కృషి చేశాడు. 'ఉయ్ హెల్ప్' పేరిట రూపొందించిన వేదిక ద్వారా పేదలకు సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టాడు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (కెఎస్ ఆర్టీసీ) లో కండక్టర్ గా పనిచేస్తున్న వినోద్.. ఆర్థికంగా వెనుకబడిన వారికి, పేదలకు సేవలు అందించాలనుకున్నాడు. 2011 లో ఉధృతంగా కొనసాగుతూ, ఎంతో ప్రజాదరణ పొందుతున్న సోషల్ మీడియా శక్తిని... తమ రాష్ట్ర ప్రజల్లో సామాజిక మార్పుకోసం వినియోగించాలని నిశ్చయించుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా 'ఉయ్ హెల్ప్' పేరున ఫేస్ బుక్ పేజీని ప్రారంభించి, పేద ప్రజలకు సహాయం అందించేందుకు వేదికగా మార్చాడు. ఆ పేజీ వినోద్ వంటి సేవా తత్పరత కలిగిన ఎంతోమందిని ఆకట్టుకుంది. గ్రూప్ ద్వారా రక్తదానం కార్యక్రమం ప్రారంభించిన వినోద్ బృందం, రక్తదానం చేసేవారినుంచి సేకరించి అవసరమైన వారికి అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం బ్లడ్ డొనేషన్.. ఈ గ్రూప్.. ప్రధాన కార్యక్రమంగా మారిపోయింది. 'బ్లడ్ డోనర్స్ కేరళ' పేరున పేజీలో ప్రత్యేక గ్రూప్ ఏర్పడింది. కొందరు ఔత్సాహికులు ఆయా ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూప్ ల ద్వారా ఈ బ్లడ్ డొనేషన్ గ్రూప్ కు సహకరిస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనివారికైనా రక్తం అవసరమైనప్పుడు తక్షణమే అందించేందుకు బృదంలోని సభ్యులు సహకరిస్తున్నారు. అంగమలై, అలువా, కోలన్ చ్చేరీ, ఎర్నాకుళం, ఎడప్పల్లీ, పెరంబవూర్ వంటి ప్రాంతాల్లోని గ్రూప్ సభ్యులను సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తే, డోనర్లు వారికి రక్తం అందించేందుకు ముందుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రూప్ ద్వారా రక్తం అందించే సభ్యులు 10,000 మంది వరకూ ఉన్నారు. అంతేకాదు గ్రూప్ సభ్యుల ఇళ్ళలో జరిగే వేడుకల సందర్భంలోనూ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల గ్రూప్ సభ్యుల్లోని ఓ వ్యక్తి తన పెళ్ళి వేడుకలో బంధువులతో రక్తదానం చేయించడంతోపాటు, తాను స్వయంగా రక్తాన్ని అందించాడు. గత సంవత్సర కాలంలో వినోద్ గ్రూప్ సుమారు 60 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి, రక్తం సేకరించడంతోపాటు, రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమం ద్వారా వేలకొద్దీ యూనిట్ల రక్తాన్ని సేకరించడంతోపాటు... అవసరమైనవారికి అందించేందుకు సహాయపడింది. రక్తదానం ఒక్కటే కాక పేద పిల్లలకు చదువు చెప్పించేందుకు, అనాధలకు, వృద్ధాశ్రమాలకు ఆహారం అందించేందుకు కూడ వేలకొద్దీ సభ్యులున్న ఈ గ్రూప్ సహకరిస్తోంది. -
ఆపరేషన్లకూ యూట్యూబే ఆధారం!
ఏదైనా కొత్త వంట గురించి తెలుసుకోవాలంటే గృహిణులు వెంటనే చూసేది.. యూట్యూబ్. కానీ ఇప్పుడు ఈ ఆన్లైన్ మాయాజాలం వైద్యరంగాన్ని కూడా వదలడం లేదు. నిపుణులు సైతం ఆపరేషన్లలో సరికొత్త పద్ధతులు తెలుసుకోడానికి యూట్యూబ్ లాంటి ఆన్లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారట. ఆమెరికన్ అకాడమీ ఆఫ్ ఫేషియల్ ప్లాస్టిక్ అండ్ రీ కనస్ట్రక్టివ్ సర్జరీ (ఏఏఎఫ్పీఆర్ఎస్)కి చెందిన బృందం జరిపిన సర్వేలు యూట్యూబ్ వాడకంపై కొత్త విషయాలను వెల్లడించాయి. ప్లాస్టిక్ సర్జరీల విషయంలో వస్తున్న కొత్త పద్ధతుల గురించి యూట్యూబ్‌లో చూడటంతో పాటు.. వాటిని ఆచరణలో కూడా పెడుతున్నట్లు భారత సంతతికి చెందిన అనిత్ సెత్నా బృందం చేసిన అధ్యయనాల్లో కనుగొన్నారు. ఏఏఎఫ్పీఆర్ఎస్ సభ్యులు కొందరితో సర్వే చేయగా.. మొత్తం 202 మంది దానికి స్పందించారు. సాంకేతిక, సాంకేతికేతర విషయాలు తెలుసుకోడానికి ప్రధానంగా సమావేశాల్లో పాల్గొనడం, జర్నల్స్ చదవడం, సహోద్యోగులతో చర్చించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి. అయితే.. సర్వేలో పాల్గొన్నవారిలో 64.1 శాతం మంది మాత్రం.. రైనో ప్లాస్టీ, సూదులతో చేసే చికిత్సా విధానాలను, అందులోని కొత్త పద్ధతులను తెలుసుకునేందుకు కనీసం ఒక్కసారైనా తాము యూట్యూబ్ వీడియోలు చూసినట్లు చెప్పారు. వాళ్లలో 83.1 శాతం మంది ఏకంగా తాము అలా చూసిన పద్ధతులను ఆచరణలో కూడా పెడుతున్నట్లు చెబుతున్నారు. అనుభవం ఉన్న వాళ్ల కంటే.. అంతగా అనుభవం లేనివాళ్లు ఎక్కువగా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారట. ఇంటర్నెట్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకోవడం వరకు బాగానే ఉంది గానీ, ఆయా ఆపరేషన్ల నాణ్యత విషయంలోనే ఆందోళన వ్యక్తమవుతోందని సెత్నా బృందం తెలిపింది. వీరి పరిశోధన వ్యాసం జామా ఫేషియల్ ప్లాస్టిక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమైంది. -
వయసులో చిన్నవాళ్లు.. మనసులో పెద్దవాళ్లు..
-
యూట్యూబ్ లో ఓ క్యూట్ వీడియో
యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం తర్వాతే మరే పెంపుడు జంతువైనా.. చాలా మంది ఇంట్లో కుక్కను పెంచుకుంటారు. జాతి శునకం ఇంట్లో ఉండటం గర్వంగా భావిస్తారు. శునక జాతిలో ఎంతో గుర్తింపు పొందిన, ఖరీదైన, అందమైన గోల్డెన్ రిట్రీవర్ ను పెంచుకుంటున్న జర్మనీకి చెందిన ఓ యజమాని... అది తమ పట్ల చూపిస్తున్న అభిమానాన్ని, ఇచ్చే సహకారాన్ని వీడియో తీసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పడు ఆ వీడియోకు ఎంతో స్పందన లభిస్తోంది. లక్షకు పైగా వ్యూయర్లను ఆకట్టుకుంది. యజమాని షాపింగ్ నుంచి తెచ్చిన సరుకులను కారు లోంచి ఇంట్లోకి నోటితో కరచుకొని తరలిస్తున్న వీడియో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంటికి కాపలాగా ఉండేందుకు పెంచిన శునకాన్ని అంతటితో వదిలేయకుండా ఇంటి పనులు చేయడంలో కూడా ఆ కుటుంబం శిక్షణ ఇచ్చింది. దీంతో యజమాని రుణం తీర్చుకోవాలన్న తాపత్రయంతో అతడు ఇంటికి రాగానే రిట్రీవర్ శునకాలు కారు చుట్టూ చేరి ఒక్క వస్తువును కూడా వదలకుండా ఇంట్లోకి చేర్చేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. పెంపుడు జంతువులు పచారీ సామాన్లు మోయడం ఎంతో ఆనందంగా ఉందని, వాటి ప్రేమను, ఆప్యాయతను యజమాని వద్ద ప్రదర్శించేందుకు, విశ్వాసాన్ని చాటుకునేందుకు తాపత్రయపడటం ఒకింత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోందని... కొందరు వ్యూయర్స్ తమ కామెంట్లనూ పోస్ట్ చేస్తున్నారంటే ఆ గోల్డెన్ రిట్రీవర్లకు ఎంత ఫ్యాన్స్ అయిపోయారో తెలుస్తోంది.