సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.
In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx
— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024
ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్‌లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment