ఆటిజంతో బాధపడుతున్న పిల్లల్ని పెంచి పెద్ద చేయడం తల్లి తండ్రులకు ఒక సవాల్. కానీ వారికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలి. అలాగే ఆటిజం పిల్లల్లో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగా రాణిస్తారు. దీనికి ఉదారణలు చాలానే ఉన్నాయి. తాజాగా తన బిడ్డ డ్యాన్స్ ప్రదర్శన కోసం తపన పడుతున్న ఓ తల్లి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో ఆసక్తికరంగా మారింది.
ఒక తల్లి తన ఆటిస్టిక్ బిడ్డకు నృత్య పోటీలో ప్రదర్శన ఇవ్వడానికి సహాయం చేస్తోంది అంటూ అపర్ణ అనే యూజర్ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రత్యేక పిల్లలను పెంచడానికి అనుభవించే బాధ.. సహనం.. ఎంత అంకితభావం అవసరమో ఊహించను కూడా ఊహించలేం.. హ్యాట్సాఫ్’’ అంటూ వ్యాఖ్యానించారు.
A mother helps her autistic child perform in a dance competition ...
Can't even imagine the amount of pain, patience and dedication required to bring up special children! Hats off 🙏💕 pic.twitter.com/JbEETe4yzC— Aparna 🇮🇳 (@apparrnnaa) June 10, 2024
ఈ వీడియోలో ఆటిజంతో బాధపడుతున్న ఒక బాలిక స్టేజ్‌పై శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకు ఎదురుగా కూర్చున్న తల్లి స్వయంగా ఆయా భంగిమలను చూపిస్తూ ఉంటుంది. దాని కనుగుణంగా ఆ పాప తన డ్యాన్స్‌ను కొనసాగిస్తుంది. ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.
ఆటిజం
ఆటిజం అనేది చిన్నపిల్లల్లో ఏర్పడే ఒక మానసిక స్థితేకానీ, రుగ్మత కాదు. తల్లి గర్భం దాల్చిన సమయంలో ఆమె మానసిక స్థితిని బట్టి లేదా మేనరికం కొన్ని జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం, ఎవరితో అయినా మాట్లాడే సమయంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం, ఒక పనిని ఎప్పుడూ చేసినా తిరిగి అలాగే చేయాలని ప్రయత్నించడం, కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్ళను పైకి కిందికి అదే పనిగా ఆడించడం,చెప్పిన పని చేయకపోవడం, నేలపై నడిచేటప్పుడు నిటారుగా నడవకుండా వేళ్లపై నడవడం లాంటి లక్షణాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలు చిన్నపిల్లల్లో జన్మించిన మూడు సంవత్సరాల నుండి మొదలయ్యే అవకాశం ఉంటుందని, ఇలాంటి లక్షణాలు తల్లిదండ్రులు కనుగొన్నట్లయితే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స అందించాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment