Autism
-
పరువు కాదు ముఖ్యం: ఆటిజం పిల్లలకు మాటివ్వండి!
యుకేలో ముప్పై ఏళ్లుగా పిల్లలు, టీనేజర్లు, వారి కుటుంబాలతో కలిసి పనిచేయడంలో నైపుణ్యం కలిగిన పీడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సియాన్ విల్సన్. ఆటిజంలో క్లినికల్ స్పెషలిస్ట్‌గా స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. సోషల్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు.భారతదేశం పిల్లల్లో డిజేబిలిటీ ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయంపై సమీక్ష జరపడానికి ఇండియాకు వచ్చారు. పాతికేళ్లుగా చిల్డ్రన్ డిజేబిలిటీస్ పై వర్క్ చేస్తున్న మాధవి ఆదిమూలం, సియాన్ విల్సన్ లు యుకెలోనూ, ఇండియాలోనూ ఉన్న పరిస్థితులు, అమలు చేయాల్సిన విధానాల గురించి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన ఈవెంట్లో డిజేబిలిటీ చిల్డ్రన్ తల్లిదండ్రులతో కలిసి చర్చించారు.నాటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక థెరపిస్ట్‌గా పిల్లల వృద్ధికి దోహదపడేవారు. ఇప్పుడు తల్లితండ్రీ మాత్రమే కాదు ఒంటరి తల్లుల సంఖ్య పెరుగుతున్న ఈరోజుల్లో పిల్లల పెంపకం సమస్యగానే మారుతోంది అంటున్నారు నిపుణులు.స్పెషలిస్ట్‌లు ఎక్కువ‘‘యుకేలో స్పెషల్ చిల్డ్రన్ డెవలప్మెంట్కి సంబంధించిన విధానం, ఖర్చు అంతా అక్కడి కౌన్సిల్ చూసుకుంటుంది. కొన్నాళ్లుగా ఇండియాలోని ప్రముఖ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్స్‌తో సంప్రదింపులు చేస్తున్నాను. ఇక్కడితో పోల్చితే యుకేలో స్పెషల్ చిల్డ్రన్ని చాలా చిన్నవయసులోనే గుర్తించడంలో అవగాహన అక్కడి పేరెంట్స్‌కు ఎక్కువ ఉంది. ఆటిజం చైల్డ్‌లో స్పీచ్ థెరపీ ద్వారా సరైన మెరుగుదలను తీసుకురావడానికి వారి స్థితిని బట్టి నార్మల్ స్కూల్ స్టూడెంట్స్‌తో కలుపుతారు. అయితే, అలాంటి ఒక చైల్డ్‌కి ఒక టీచర్ చొప్పున లెర్నింగ్ స΄ోర్ట్ అసిస్టెంట్‌ను కేటాయిస్తారు. అంటే, తన వయసు పిల్లలతో కలిసి ఉండే దోరణి వల్ల ఆ స్పెషల్ చైల్డ్‌లో మానసిక ఆరోగ్యం బాగవుతుంటుంది. ఎవరూ కూడా ఈ విధానానికి అడ్డు చెప్పరు’ అంటూ దేశంలో స్పెషల్ చైల్డ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేశారు సియాన్ విల్సన్.పరువు కాదు ముఖ్యం‘చాలా మంది తల్లులు తమ పిల్లల్లో ఉన్న ఆటిజం సమస్యను గుర్తించడమే లేదు. ఒక వేళ ఏదైనా డిజేబిలిటీ ఉన్నా బయటకు తెలిస్తే పరువు ΄ోతుంది అనుకుంటున్నారు. ‘మా అమ్మాయి/అబ్బాయిని ట్యూషన్‌కో లేదో మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్‌కో తీసుకెళుతున్నామని చెప్పి, తీసుకువస్తున్నామ’ని చెబుతున్నారు. టీనేజర్ స్థాయిలో ఉన్న పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచుతున్నారు. వారికి ఎలాంటి థెరపీ ఇవ్వక΄ోవడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. దీంతో అప్పుడు నిపుణులను కలుస్తున్నారు. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే, పరిష్కారం కూడా త్వరగా లభిస్తుంది’ అని వివరించారు థెరపిస్ట్ లక్ష్మీ ప్రసన్న.పరువుతో వెనకడుగు వేయద్దు‘‘అనన్య చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పేరుతో 19 ఏళ్లుగా ఆటిజం పిల్లలకు సేవలు అందిస్తున్నాను. మా బాబు స్పెషల్ కిడ్ అవడంతో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయిన నేను స్పెషలైజేషన్ చేసి, ఈ తరహా పిల్లల కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు మా బాబు వయసు 24 ఏళ్లు. వాడు సంగీతంలో నైపుణ్యం సాధించడంతోపాటు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. మా బాబును ఇక్కడ సాధారణ స్కూల్లో చేర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎడీహెచ్‌డీ ఆటిజం ఉన్న పిల్లల్లో మెరుగుదల కనిపిస్తున్నప్పుడు వారిని, మిగతా అందరిలాగే స్కూళ్లో చేర్చగలిగే శక్తిని కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు సాధారణంగా ఎదుగుతారు. అంతేకాదు ఆటిజం పిల్లల పెంపకంలో వారిలో కొన్ని నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తమకు తాముగా పనులు చేసుకోవడమే కాదు నైపుణ్యాలను కూడా చూపుతారు. అందుకే ఈ విషయాల్లో గ్రామీణ స్థాయిలోనూ అవగాహన క్యాంపులను నిర్వహిస్తున్నాం. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. అక్యుపేషనల్ థెరపిస్ట్‌ల కొరత మన దగ్గర చాలా ఉంది. థెరపిస్ట్‌ల సంఖ్య, తల్లిదండ్రులలో అవగాహన పెరిగితే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది’ అని వివరించారు మాధవి ఆదిమూలం.– నిర్మలారెడ్డిఫొటోలు: బాలస్వామి, సాక్షి -
ఆటిజం బిడ్డలు, ఆ అమ్మలకు హ్యట్సాఫ్ : వీడియో వైరల్
ఆటిజంతో బాధపడుతున్న పిల్లల్ని పెంచి పెద్ద చేయడం తల్లి తండ్రులకు ఒక సవాల్. కానీ వారికి రోజువారీ కార్యకలాపాల నిర్వహణలో శిక్షణ ఇవ్వాలి. అలాగే ఆటిజం పిల్లల్లో స్పెషల్ టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగా రాణిస్తారు. దీనికి ఉదారణలు చాలానే ఉన్నాయి. తాజాగా తన బిడ్డ డ్యాన్స్ ప్రదర్శన కోసం తపన పడుతున్న ఓ తల్లి వీడియో ఒకటి ఇంటర్నెట్లో ఆసక్తికరంగా మారింది.ఒక తల్లి తన ఆటిస్టిక్ బిడ్డకు నృత్య పోటీలో ప్రదర్శన ఇవ్వడానికి సహాయం చేస్తోంది అంటూ అపర్ణ అనే యూజర్ ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘‘ప్రత్యేక పిల్లలను పెంచడానికి అనుభవించే బాధ.. సహనం.. ఎంత అంకితభావం అవసరమో ఊహించను కూడా ఊహించలేం.. హ్యాట్సాఫ్’’ అంటూ వ్యాఖ్యానించారు.A mother helps her autistic child perform in a dance competition ...Can't even imagine the amount of pain, patience and dedication required to bring up special children! Hats off 🙏💕 pic.twitter.com/JbEETe4yzC— Aparna 🇮🇳 (@apparrnnaa) June 10, 2024ఈ వీడియోలో ఆటిజంతో బాధపడుతున్న ఒక బాలిక స్టేజ్‌పై శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడే ఆమెకు ఎదురుగా కూర్చున్న తల్లి స్వయంగా ఆయా భంగిమలను చూపిస్తూ ఉంటుంది. దాని కనుగుణంగా ఆ పాప తన డ్యాన్స్‌ను కొనసాగిస్తుంది. ఈ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.ఆటిజంఆటిజం అనేది చిన్నపిల్లల్లో ఏర్పడే ఒక మానసిక స్థితేకానీ, రుగ్మత కాదు. తల్లి గర్భం దాల్చిన సమయంలో ఆమె మానసిక స్థితిని బట్టి లేదా మేనరికం కొన్ని జన్యుపరమైన కారణాలతో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం, ఎవరితో అయినా మాట్లాడే సమయంలో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకపోవడం, చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తుండటం, ఒక పనిని ఎప్పుడూ చేసినా తిరిగి అలాగే చేయాలని ప్రయత్నించడం, కొందరు సంతోషం కలిగితే చేతులను కాళ్ళను పైకి కిందికి అదే పనిగా ఆడించడం,చెప్పిన పని చేయకపోవడం, నేలపై నడిచేటప్పుడు నిటారుగా నడవకుండా వేళ్లపై నడవడం లాంటి లక్షణాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. ఇలాంటి సమస్యలు చిన్నపిల్లల్లో జన్మించిన మూడు సంవత్సరాల నుండి మొదలయ్యే అవకాశం ఉంటుందని, ఇలాంటి లక్షణాలు తల్లిదండ్రులు కనుగొన్నట్లయితే వెంటనే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స అందించాలి. లేకపోతే సమస్య తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. -
Israel-Hamas war: హమాస్ రాక్షసత్వం
టెల్ అవీవ్: ప్రఖ్యాత రచయిత్రి జేకే రౌలింగ్ రచించిన హ్యారీ పోట్టర్ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. చిన్నపిల్లలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇజ్రాయెల్‌కు చెందిన 12 ఏళ్ల బాలిక నోయా డాన్ ఆటిజం బాధితురాలు. ఆమెకు హ్యారీ పోట్టర్ సాహసాలంటే చెప్పలేనంత ఇష్టం. ఈ సిరీస్‌లో వచ్చిన పుస్తకాలన్నీ చదివేసింది. ఈ నెల 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు నోయా డాన్‌ను అపహరించారు. ఆమె నాన్నమ్మతోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులు బందీలుగా గాజాకు చేరారు. వారంతా ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో తెలియరాలేదు. అసలు బతికున్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆటిజం బాధితురాలైన నోయా డాన్‌ను విడుదల చేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్‌ను కోరింది. హ్యారీపోట్టర్ పాత్రధారి ఆహార్యంతో ఉన్న నోయా డాన్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ పోస్టును ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది షేర్ చేశారు. హమాస్ చెర నుంచి నోయా డాన్‌ను విడిపించేందుకు చొరవ చూపాలంటూ జేకే రౌలింగ్‌కు ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. జేకే రౌలింగ్ వెంటనే స్పందించారు. హ్యారీ పోట్టర్ అభిమాని కిడ్నాప్ అయ్యారని తెలుసుకొని చలించిపోయారు. ఆమెకు విముక్తి కలి్పంచాలని హమాస్‌ను అభ్యరి్థంచారు. నోడా డాన్ క్షేమంగా తిరిగిరావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రౌలింగ్ ప్రతిస్పందన తర్వాత ఇజ్రాయెల్ వ్య«థకు నోయా డాన్ ఒక ప్రతీకగా మారిపోయారు. ఇజ్రాయెల్ పౌరులంతా ఆమె గురించి చర్చించుకున్నారు. క్షేమంగా తిరిగిరావాలని ఆకాంక్షించారు. కానీ, ఇంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. నోయా డాన్తోపాటు ఆమె నాన్నమ్మ కార్మెలా మృతదేహాన్ని బుధవారం గాజాలో గుర్తించినట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నోయా డాన్ ఇక లేదని తెలిసి ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. బాలికను హమాస్ మిలిటెంట్లు హత్య చేసినట్లు తెలుస్తోంది. ‘‘అమ్మా, నాకు చాలా భయమేస్తోంది. ఎవరో బూచాళ్లు మన ఇంట్లోకి వచ్చారు. వెంటనే వచ్చి నన్ను నీతో తీసుకెళ్లు’’.. బయటకు వెళ్లిన తన తల్లితో ఫోన్లో నోయా డాన్ చివరి సంభాషణ ఇది. -
ఆటిజం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌కి ప్లాస్టిక్ కారణమా?
ప్లాస్టిక్ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయని విన్నాం. కానీ దీని వల్లే పుట్టే పిల్లలకు ఇంత ప్రమాదం అని ఊహించి కూడా ఉండం. మన కంటి పాపల్లాంటి చిన్నారుల జీవితాలను ప్లాస్టిక్ పెనుభూతం చిదిమేసి మన జీవితాలను కల్లోలంగా మార్చేస్తోంది. ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో తెలియకుండానే ఒక భాగమైంది. మన నిర్లక్ష్యమో మరే ఏదైనా కారణమో గానీ జరగకూడని నష్టమే వాటిల్లుతోందని తాజా పరిశోధనల్లోషాకింగ్ విషయాలే వెల్లడయ్యాయి. చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజం, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్‌డీ)కి ప్లాస్టిక్ కారకాలే కారణమని యూఎస్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల కాలంలో ఆటిజం, పిల్లల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది కూడా. సమాజంలో ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల కారణంగా ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో తెలిసిందే. తాజా అధ్యయనంలో "బిస్ ఫినాల్ ఏ(బీపీఏ)" అనే ప్లాస్టిక కారణంగానే పిల్లలు ఇలాంటి రుగ్మతలు బారిన పడుతున్నట్లు తేలింది. దీన్ని ప్లాస్టిక్‌ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో వినియోగిస్తారు. యూఎస్‌లోని రోవాన్ విశ్వవిద్యాలయం శాస్రవేత్తలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సముహంపై గ్లుకురోనిడేషన్ అనే ప్రకియను నిర్వహించారు. అంటే..మూత్రం ద్వారా శరీరంలో చెడు వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. ఈ ప్రకియలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఏఎస్డీ)తో బాధపడుతున్న చిన్నారుల, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్‌డీ)తో బాధపడుతున్న పిల్లలు శరీరం నుంచి ప్లాస్టిక్‌కి సంబంధించిన మరో రూపాంతరం అయినా డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్ను బయటకు పంపించే సామర్థ్యం లేనట్లు గుర్తించారు. ఈ "బిస్ ఫినాల్ ఏ" "ప్లాస్టిక్, డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్(డీఈహెచ్‌పీ)" ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రుగ్మతతో ఉన్న పిల్లల శరీరాని వాటిని బయటకు పంపించే సామర్థ్యం ఉండదని తేలింది. వారి కణాజాలల్లో ఈ రెండు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండిపోతాయని పేర్కొన్నారు. ఆటిజం పిల్లలు ఈ ప్లాస్టిక్‌కి సంబంధించిన టాక్సిన్లను కేవలం 11 శాతం, ఏడీహెచ్‌డీ బాధపడుతున్న చిన్నార్లుల్లో 17 శాతం శరీరం నుంచి బయటకు పంపించగల సామర్థ్యం ఉంటుందని అన్నారు. ఆ ప్లాస్టిక్ సంబంధించిన మిగతా టాక్సిన్లన్నీ వారి శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండిపోవడాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది న్యూరాన్ అభివృద్ధిని పూర్తిగా నష్టపరుస్తోందని అన్నారు. ఈ రెండు డిజార్డ్ర్లు, జన్యుపరమైన పర్యావరణ ప్రభావాల కలయికతోనే వచ్చినట్లు పరిశోధనల్లో వెల్లడించారు. అలా అని న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ ఉన్న ప్రతి బిడ్డ బీపీఏ ప్లాస్టిక్‌ని తొలగించడంలో సమస్యలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం అని చెప్పారు. దీంతో కొన్ని ఇతర అంశాలు కూడా ముడిపెట్టి ఉంటాయన్నారు. వాస్తవంగా ఇది గర్భాశయంలోంచే చిన్నారుల్లో ఈ న్యూరో డెవలప్మెంట్ సమస్య వస్తుందా లేక జన్మించాక అనేది తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మాత్రం న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్‌కి ప్లాస్టిక్‌కి సంబంధించిన పర్యావరణ కాలుష్య కారకాలతో పూర్తిగా సంబంధం ఉందని రుజువైంది. ఆ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్‌కి ఎంతమేర ప్లాస్టిక్ కారణమనేది అంచనా వేయడం అంత అజీ కాదన్నారు. (చదవండి: షుగర్ ఉంటే పెడిక్యూర్ చేయించుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..) -
Dr. Sonam Kapse: వడ్డించేవారు మనవారే
డౌన్ సిండ్రోమ్, ఆటిజమ్, మూగ, బధిర... వీరిని ‘మనలో ఒకరు’ అని అందరూ అనుకోరు. వీరికి ఉద్యోగం ఇవ్వాలంటే ‘వాళ్లేం చేయగలరు’ అని విడిగా చూస్తారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో అంతర్భాగమే అంటుంది డాక్టర్ సోనమ్ కాప్సే. కేవలం దివ్యాంగులనే స్టాఫ్‌గా చేసుకుని ఆమె నడుపుతున్న రెస్టరెంట్ పూణెలో విజయవంతంగా నడుస్తోంది. ‘ఇక్కడంతా వడ్డించేవారు మనవారే’ అంటుంది సోనమ్. పుణెలో ఆంకాలజిస్ట్‌గా, కేన్సర్ స్పెషలిస్ట్‌గా పని చేస్తున్న సోనమ్ కాప్సేకు బాల్యం నుంచి రకరకాల వంట పదార్థాలను రుచి చూడటం ఇష్టం. ‘మా అమ్మానాన్నలతో విదేశాలకు వెళ్లినప్పుడు హోటళ్ల లో రకరకాల ఫుడ్ తినేదాన్ని. మంచి రెస్టరెంట్ ఎప్పటికైనా నడపాలని నా మనసులో ఉండేది’ అంటుంది సోనమ్. అయితే ఆ కల వెంటనే నెరవేరలేదు. కేన్సర్ స్పెషలిస్ట్‌గా బిజీగా ఉంటూ ఆమె ఆ విషయాన్నే మర్చిపోయింది. యూరప్‌లో చూసి ‘నేను ట్రావెలింగ్‌ని ఇష్టపడతాను. యూరప్‌కు వెళ్లినప్పుడు ఒక బిస్ట్రో (కాకా హోటల్ లాంటిది)లో ఏదైనా తిందామని వెళ్లాను. ఆశ్చర్యంగా అక్కడ సర్వ్ చేస్తున్నవాళ్లంతా స్పెషల్ వ్యక్తులే. అంటే బుద్ధి మాంద్యం, వినికిడి లోపం, అంగ వైకల్యం, మూగ... ఇలాంటి వాళ్లు. వాళ్లంతా సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్నారు. కస్టమర్లు వారికి ఎంతో సహకరిస్తున్నారు. ఇటువంటి వారి జీవితం మర్యాదకరంగా గడవాలంటే వారిని ఉపాధి రంగంలో అంతర్భాగం చేయడం సరైన మార్గం అని తెలిసొచ్చింది. మన దేశంలో సహజంగానే ఇలాంటివారికి పని ఇవ్వరు. అందుకే మన దేశంలో కూడా ఇలాంటి రెస్టరెంట్లు విరివిగా ఉండాలనుకున్నాను. ఇప్పటికే కొన్నిచోట్ల ఉన్నాయి కానీ, నేను కూడా ఇలాంటి రెస్టరెంట్ ఒకటి ఎందుకు మొదలు పెట్టకూడదు... అని ఆలోచించాను. అలా పుట్టినదే ‘టెర్రసిన్’ రెస్టరెంట్. టెర్రసిన్ అంటే భూమి రుచులు అని అర్థం. పొలం నుంచి నేరుగా వంటశాలకు చేర్చి వండటం అన్నమాట’ అందామె. 2021లో ప్రారంభం పూణెలో బిజీగా ఉండే ఎఫ్.సి.రోడ్లో స్పెషల్ వ్యక్తులే సిబ్బందిగా 2021లో కోటిన్నర రూపాయల ఖర్చుతో ‘టెర్రసిన్’ పేరుతో రెస్టరెంట్ ప్రారంభించింది సోనమ్. ఇందు కోసం స్పెషల్ వ్యక్తులను ఎంపిక చేసి వారికి ట్రయినింగ్ ఇచ్చింది. ‘వారితో మాట్లాడటానికి మొదట నేను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చేయడం వంటి విషయాల్లో ట్రయినింగ్ ఇచ్చాం. కస్టమర్లు సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ చెప్పొచ్చు లేదా మెనూలో తాము ఎంచుకున్న ఫుడ్‌ను వేలితో చూపించడం ద్వారా చెప్పొచ్చు. అయితే ఆటిజమ్ వంటి బుద్ధిమాంద్యం ఉన్నవాళ్లను ఉద్యోగంలోకి పంపడానికి కుటుంబ సభ్యులు మొదట జంకారు. వారిని ఒప్పించడం కష్టమైంది. ఒకసారి వారు పనిలోకి దిగాక ఆ కుటుంబ సభ్యులే చూసి సంతోషించారు. మా హోటల్‌ను బిజీ సెంటర్లో పెట్టడానికి కారణం మా సిబ్బంది నలుగురి కళ్లల్లో పడి ఇలాంటివారికి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇతరులకు రావడానికే. మా హోటల్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పుడు ఆదాయంలో ఉంది. త్వరలో దేశంలో మరో ఐదుచోట్ల ఇలాంటి హోటల్స్ పెట్టాలనుకుంటున్నాను’ అని తెలిపింది సోనమ్. వారూ మనవారే సమాజ ఫలాలకు అందరూ హక్కుదారులే. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం, ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలి. ఇలాంటి ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. కొందరు పదిలో రెండు ఉద్యోగాలైనా ఇలాంటివారికి ఇస్తున్నారు. సోనమ్ లాంటి వారు పూర్తి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ రంగంలో ఇంకా ఎంతో జరగాల్సి ఉంది. దురదృష్టవశాత్తు దివ్యాంగులుగా జన్మిస్తే వివిధ కారణాల వల్ల శారీరక దురవస్థలు ఏర్పడితే ఇక వారిని విడిగా పెట్టడం... వారిని ఉపాధికి దూరం చేయడం సరికాదు. వీలైనంత వరకూ వారిని అంతర్భాగం చేసుకోవాలనే ఉద్యమాలు అనేకచోట్ల నడుస్తున్నాయి. రెస్టరెంట్లో సైన్ లాంగ్వేజ్‌లో ఆర్డర్ తీసుకుంటున్న వెయిటర్ -
నేను ప్రెగ్నెంట్‌ని..పోలియో, ఆటిజం జన్యుపరమైన జబ్బులా? నా బిడ్డకు..
మా మరిదికి పోలియో, మా బావగారి పాపకు ఆటిజం ఉంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని.. మూడో నెల. ఈ పోలియో, ఆటిజం ఏమైనా జన్యుపరమైన జబ్బులా? నా బిడ్డకూ వచ్చే ప్రమాదం ఉందా? –కర్నె ఉజ్వల, నాగర్ కర్నూల్ పోలియో అనేది వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఫ్లూ లాగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. పోలియో జన్యుపరమైన.. వంశపారంపర్య జబ్బు కాదు. పోలియో వైరస్ బారినపడిన వారికి స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ పక్షవాతం ఉంటుంది. మెనింజైటిస్ – బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల శాశ్వతమైన వైకల్యం సంభవిస్తుంది. టీకాతో పోలియోను పూర్తిగా నివారించవచ్చు. ఐపీవీ అండ్ ఓపీవీ వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. పిల్లలందరికీ ఇప్పుడు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో పోలియో టీకాను ఇస్తున్నారు. ఇది జన్యుపరమైన అంటే తల్లిదండ్రులు.. బంధువుల నుంచి వ్యాపించదు. మీ మరిదికి పోలియో ఉన్నా.. ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీలో మీ బిడ్డకు సోకే ప్రమాదం.. అవకాశం ఏమాత్రం లేదు. ఇక ఆటిజం విషయానికి వస్తే.. ఆటిజం అనేది.. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌లో ఒక భాగం. ఇది డెవలప్మెంటల్ డిజేబులిటీ. బాల్యంలోనే పిల్లల మెదడులో తేడాలను గుర్తించి దీన్ని డయాగ్నసిస్ చేస్తారు. దీనికి తల్లిదండ్రులతో కొంతవరకు జన్యుపరంగా రావచ్చు. కొన్నిసార్లు మామూలు తల్లితండ్రులకూ ఆటిజం ఉన్న బిడ్డ ఉండొచ్చు. ఇది స్పాంటేనియస్ మ్యుటేషన్స్‌తో అవుతుంది. ఎవరికి ఆటిజం ఉంటుంది అని ప్రెగ్నెన్సీలోనే కనిపెట్టడం కష్టం. కానీ కొన్ని జంటలకు జెనెటిక్ కౌన్సెలర్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ చేయించి.. కొన్ని కేసెస్‌లో బిడ్డకు వేరే సిండ్రోమ్స్ ఏమైనా వచ్చే చాన్సెస్ ఉంటే.. వాటిల్లో ఆటిజం కూడా ఉంటే మూడో నెల ప్రెగ్నెన్సీలో కొన్ని జెనెటిక్ టెస్ట్‌ల ద్వారా బిడ్డకు ఆ సిండ్రోమ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. కాబట్టి జెనెటిక్, నాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ రెండూ ఆటిజానికి కారణాలు కావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే చాన్స్ ఉన్న కేసెస్‌లో ముందస్తుగానే అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందే జెనెటిక్ , ఫీటల్ మెడిసిన్ కౌన్సెలింగ్ చేయిస్తే.. ఏ కేసెస్కి వైద్యపరీక్షలు అవసరం అనేది ముందుగానే నిర్ధారించే అవకాశం ఉంటుంది. --డా భావన కాసు గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని. ఇప్పుడు మూడో నెల. రక్త హీనత ఉందని నాకు మాత్రలు ఇచ్చారు. దీనివల్ల బిడ్డకు ఏదైనా ప్రమాదం ఉంటుందా?) -
18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్ అయ్యాడు!
అతనికి 11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు. అదేలా సాధ్యం అనిపిస్తుంది కదూ!. కానీ జాసన్ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు. అసలేం జరిగిందంటే..జాసన్ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్ ఈ సమస్య కారణంగా 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటికి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కి ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఐతే జాసన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు, ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలగేలా, అన్నినేర్చుకోవాలి అని తపించేవాడు. తన తల్లి బెడ్రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికీ చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్ విజయాన్ని కైవసం చేసుకోవడం తదితరాలను టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. అప్పుడూ అనుకున్నాడు అత్యున్నత చదువులను అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు. అలా జాసన్ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీస్‌లో డిగ్రీ పొందాడమే గాక 2016లో లివర్‌పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయులు అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రోఫెసర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన భాస్కర్ వీరా. జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడన్నారు. చదవండి: తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ మరణం: జెలెన్స్కీ) -
ఆటిజంపై అవగాహన కల్పించిన నాట్స్
న్యూజెర్సీ: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా ఆటిజం మీద వెబినార్ నిర్వహించింది. ఆటిజం బాధితులు ఎలా ఉంటారు.? చిన్నారుల్లో ఆటిజాన్ని ఎలా గుర్తించాలి..? వారి పట్ల ఎలా వ్యవహరించాలి..? వారికి ఎలాంటి మద్దతు అందించాలి..? చికిత్స ఎలా ఉంటుంది.? ఇలా ఆటిజం గురించి అనేక అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించేలా ఈ వెబినార్ సాగింది. ఈ ఆటిజం సదస్సులో వర్జీనియా ఆటిజం అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు, పిల్లల వైద్య నిపుణుడు కృష్ణ మాదిరాజు, పిల్లల మనో వికాస వైద్య నిఫుణులు కవిత అరోరా, మీనాక్షి చింతపల్లి, పిల్లల మానసిక వైద్య నిపుణులు రామ్ ప్రయాగ, పేరంట్ అడ్వకేట్స్ శుభ బొలిశెట్టి, రాధ కాశీనాథుని పాల్గొన్నారు. ఆటిజాన్ని ప్రాథమిక దశలోనే ఎలా గుర్తించాలనే విషయాన్ని కృష్ణ మాదిరాజు చక్కగా వివరించారు. ఆటిజంలో ఉండే లక్షణాలను ఆయన స్పష్టంగా వీక్షకులకు తెలిపారు. ఆటిజం పిల్లలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని కృష్ణ మాదిరాజు స్పష్టం చేశారు. ఆటిజం సమస్య తమ పిల్లలకు ఉందని తెలిసినప్పుడు తల్లిదండ్రులు కృంగిపోకుండా దైర్యంగా ఉండి.. ఆటిజం చికిత్స విధానాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. వైద్యుల సలహాలతో ఆటిజం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాలని కవిత అరోరా అన్నారు. ఆటిజం చికిత్స విధానాలపై కూడా ఈ వెబినార్‌లో ప్రముఖ వైద్యులు మీనాక్షి చింతపల్లి, రామ్ ప్రయాగ అవగాహన కల్పించారు. ఆటిజం సమస్యతో ఉన్న తమ వారిని తాము ఎలాంటి మార్గాలను అవలంభించి ఆ సమస్యను అధిగమించేలా చేశామనేది పేరెంట్స్ అడ్వకేట్స్ శుభ బొలిశెట్టి, రాధ కాశీనాథుని వివరించారు. ఆటిజం పిల్లల్లో ఉండే ప్రతిభను కూడా వెలికి తీసేలా తల్లిదండ్రులు వ్యవహరించాలని సూచించారు. ప్రముఖ వైరాలజీ వైద్యులు పద్మజ యలమంచిలి ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించారు. నాట్స్ ఆశయాలు, లక్ష్యాల గురించి ఈ వెబినార్‌లో నాట్స్ ఛైర్ విమెన్ అరుణ గంటి వివరించారు. ఈ కార్యక్రమానికి జ్యోతి వనం కూడా అనుసంధానకర్తగా వ్యవహరించి తన వంతు తోడ్పాటు అందించారు. ఇంకా జయశ్రీ పెద్దిభొట్ల, ఉమ మాకం ఆటిజంపై ఇంత చక్కటి వెబినార్ నిర్వహించినందుకు నెటిజన్లు నాట్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెబినార్ టెక్నికల్ సహకారం సుధీర్ మిక్కిలినేని, లక్ష్మి బొజ్జ అందించారు. చదవండి: అమెరికాలో భారతీయుల హవా..చతికిల పడ్డ చైనా..! -
ఆటిజంపై నాట్స్ సదస్సు
నార్త్ అమెరికా తెలుగు సోసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో ఆటిజంపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని నాట్స్ బోర్డ్ చైర్ఉమన్ అరుణగంటి, ప్రెసిడెంట్ విజయ్ శేఖర్ అన్నెలు తెలిపారు. 2022 ఏప్రిల్ 30న మధ్యాహ్నాం 2:00 గంటలు (4:30 ఈఎస్టీ) ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, నిపుణులు ఆటిజంపై చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మాదిరాజు, మీనాక్షి చింతపల్లి, రామ్ ప్రయాగ, శుభ బొలిశెట్టి, కాశినాథుని రాధ, పద్మజా యలమంచిలిలు పాల్గొంటారు. ఈ కార్యక్రమం వీక్షించేందుకు www.natsworld.org/autism-awareness-acceptance ఉపయోగించవచ్చు. ఫేస్బుక్లో కూడా లైవ్ ఇస్తామని నాట్స్ తెలిపింది. -
చేపల్లాంటి పిల్లలు... కడలిని ఈదేస్తున్నారు
జీవితమంటేనే కష్ట సుఖాల కలయిక. కొంతమంది జీవితాల్లో సుఖాలకంటే కష్టాలే ఎక్కువగా ఉంటాయి. వాటిలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొందరు. కానీ కొందరు తమ కష్టాలకు ప్రతిభను జోడించి అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. ఈ కోవకు చెందిన వారే జియారాయ్, కావేరి ధీమార్‌లు. వ్యక్తిగత జీవితంలో ఎదురైన అనేక సమస్యలను కడలికి ఎదురీదుతూ తమ వయసు కంటే ఎక్కు సంఖ్యలో మెడల్స్‌ను సాధిస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ఇండియన్ పారా స్విమ్మర్ జియారాయ్ నేవీ అధికారి మదన్ రాయ్, రచన దంపతుల ముద్దుల కూతురు. సొంత ఊరు యూపీ అయినప్పటికీ మదన్ ఉద్యోగ రీత్యా ముంబైలో ఉండడంతో జియా అక్కడే పెరిగింది. పుట్టి ఏడాదిన్నర దాటినా జియా చిన్న చిన్న మాటలు కూడా సరిగా పలకలేక పోతోంది. తల్లిదండ్రులు కంగారు పడి డాక్టర్లకు చూపించారు. ఆటిజం అని తెలిసింది. మిగతా పిల్లల్లా ఏదీ సులభంగా నేర్చుకునేది కాదు. ఏదైనా పదేపదే చెబితే కోపం వచ్చేది. నేర్చుకోకపోగా విపరీతంగా అరిచేది. ఒకరోజు మదన్ జియాను స్విమ్మింగ్ పూల్‌లో దించగానే అమె నీళ్లను ఇష్టపడుతూ బాగా ఆడుకుంది. డాక్టర్లు కూడా వాటర్ స్పోర్ట్స్ ఆడిస్తే జియాలో త్వరగా మార్పులు కనిపిస్తాయని సూచించారు. వాటర్ థెరపీలో భాగంగా వాటర్ గేమ్స్ ఆడుతూ జియాకు స్విమ్మింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. దీంతో స్విమ్మింగ్ సాధన చేయడం ప్రారంభించింది. ఎన్నో సమస్యలున్నా అన్నిటినీ తల్లిదండ్రుల సాయంతో ఎదుర్కొని మంచి స్విమ్మర్‌గా ఎదిగింది జియా. అనేక జాతీయ స్విమ్మింగ్ పోటీలలో పాల్గొని వయసుకంటే ఎక్కువ సంఖ్యలో బంగారు పతకాలను గెలుచుకుంది. అంతేగాక ఇప్పటిదాకా స్విమ్మింగ్‌లో అనేక జాతీయ రికార్డులను బద్దలు కొట్టి, 22 గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. రెండు వందల మీటర్ల ఫ్రీస్టైల్, వంద మీటర్ల బ్యాక్ స్ట్రోక్, బటర్‌ఫ్లై స్విమ్మింగ్‌లో అనేక మెడల్స్‌ను సాధించింది. 14 కిలోమీటర్లను మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల ముప్పై సెకన్లలో ఈది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. అంతేగాక 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందుకుంది. తాను సాధించిన అనేక విజయాల రికార్డులను ఆటిజంపై అవగాహన కల్పించడానికి అంకితం చేస్తోంది జియా. కనీసం మాట్లాడడం కూడా రాని జియా ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి సాధన చేసింది. ఉదయం నాలుగున్నర గంటలకు నిద్రలేచి ఐదు గంటల వరకు వ్యాయామం చేస్తుంది. ఎనిమిదింటి నుంచి పదింటి వరకు స్విమ్మింగ్ సాధన చేస్తుంది. తరువాత స్కూలుకు వెళ్తుంది. స్కూలు అయ్యాక సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ స్విమ్మింగ్ సాధన. ఎనిమిదో తరగతి చదువుతోన్న జియా రోజూ ఇదే దిన చర్యను పాటిస్తూ గోల్డ్ మెడల్స్‌ను సాధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జియా విజయాలను పొగడడం విశేషం. తాజాగా శ్రీలంకలోని తలైమన్నార్ సెటిల్మెంట్ నుంచి తమిళ నాడులోని ధనుష్కోటి వరకు ఉన్న 29 కిలోమీటర్ల దూరాన్ని 13 గంటల్లో ఈది మరో కొత్త రికార్డును నెలకొల్పింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో ‘యంగెస్ట్ స్విమ్మర్’గా నిలిచిన జియాకు అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫిలిప్స్ రోల్ మోడల్. అతని లాగే ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. చేప పిల్ల.. కావేరీ ధీమార్.. 2017 వరకు ఈమెవరో ప్రపంచానికి తెలియదు. ఆమెలోని ప్రతిభ పాటవాలు సుదూర శిఖరాలను అధిరోహించేలా చేసి జాతీయ రికార్డుల్లో తనకంటూ స్థానం సంపాదించుకుని ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంది. భోపాల్‌లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది. ఏడుగురు అక్కాచెల్లెళ్ళు,ఇద్దరు తమ్ముళ్ల మధ్య ఐదో అమ్మాయి కావేరి ధీమార్. జాలరుల కుటుంబం కావడంతో చేపలను వేటాడితేగానీ వారి కడుపులు నిండని పరిస్థితి. ఇది తప్ప వారికి ఆదాయం వచ్చే మరో మార్గం లేదు. కుటుంబ ఖర్చులతోపాటు తండ్రి అప్పులు కూడా పెరిగాయి. అప్పులు తీర్చడానికి తన అక్కచెల్లెళ ్లతో కలిసి కావేరి కూడా చేపల వేటకు వెళ్లేది. వేటలో ఎంతో చురుకుగా దూసుకుపోయేది కావేరి. ఈ విషయం ఆనోటా ఈ నోటా మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్’ అకాడమీకి తెలిసింది. వెంటనే కావేరీని అకాడమీలో చేర్చుకుని పడవలను నడపడడంలో శిక్షణ ఇచ్చారు. దీంతో నీళ్లమీద పడవలను పరిగెత్తిస్తూ ఇండియాలోనే టాప్ కెనోయిర్‌గా నిలిచింది. పొల్గొన్న ప్రతిపోటీలోనూ పతకాన్ని ఖాయం చేసుకొస్తోంది. ఈ క్రమంలోనే జాతీయ కనోయింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని 12 స్వర్ణపతకాలను గెలుచుకుంది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న జరుగుతున్న ‘ఏషియన్ చాంపియన్‌షిప్స్’ లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రతిభ ఉండి కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోగల నేర్పరితనం ఉండాలేగాని పేద, గొప్ప అనే తేడా లేకుండా ఎదగవచ్చనడానికి కావేరి జీవితం ఉదాహరణగా నిలుస్తోంది. -
Mugdha Kalra: నా బాబు కూడా ఈ ప్రపంచం నుంచే వచ్చాడు కదా.. అందుకే..
Mugdha Kalra: Not That Different Autism Rights Activist BBC 100 Women List: బ్యాంకులో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఆరోజు ముంబైలోని ముగ్ధ కల్రా ఇంటికి వచ్చాడు. వారి ముఖాలలో దిగులు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ‘సమస్య ఏమిటి?’ అని అడగక ముందే ఆయన ఇలా చెప్పాడు... ‘మీ గురించి చాలాసార్లు విన్నాము. చదివాము. మా సమస్యకు మీరే ఒక పరిష్కారం చూపాలి. మా బాబుకు ఆటిజం సమస్య ఉంది. వాడిని చూస్తుంటే బాధగా ఉంది. వాడి భవిష్యత్‌ను ఊహించుకుంటే భయంగా ఉంది. ఏదైనా ఫంక్షన్‌కు వెళ్లాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నాం...’ ముగ్ధ ఇంటిని వెదుక్కుంటూ వచ్చి ఇలా తమ మనసులోని బాధను చెప్పుకునే వారు ఎందరో ఉంటారు. వారిలో ఎన్నో అపోహలు గూడుకట్టుకొని ఉన్న విషయాన్ని ఆ సందర్భంలో గ్రహించేది ముగ్ధ. ముందుగా వారిలోని అపోహలను తొలగించేది. అలా వారి మనసులను తేలిక చేసేది. ‘ఆటిజం అనేది అంగవైకల్యం కాదు... న్యూరోడైవర్శిటీ మాత్రమే’... ‘వారిని ఎప్పుడూ ఇంటికి మాత్రమే పరిమితం చేయకూడదు. ఔట్‌డౌర్ యాక్టివిటీలకు ప్రాధాన్యాన్ని ఇవ్వండి. సైకిలింగ్, స్విమ్మింగ్, గార్డెనింగ్.. మొదలైనవి చేయించండి’ .. ‘వారిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి... వారికి దగ్గరగా కూర్చొని కళ్లలోకి చూస్తూ ప్రేమగా మాట్లాడండి’ .. ‘ప్రపంచంలోని ఎంతోమంది గొప్ప మేధావుల్లోనూ ఆటిజం లక్షణాలు ఉండేవనే విషయం మీకు తెలుసా!’... మాట సహాయం కోసం తన ఇంటికి వచ్చిన వారికి ఇలాంటి విషయాలు ఎన్నో చెబుతుంటుంది ముగ్ధ. నిజానికి ఆమె డాక్టర్ కాదు. పన్నెండు సంవత్సరాల తన కుమారుడికి ఆటిజం ఉంది. అయితే అదొక సమస్య అని ముగ్ధ ఎప్పుడూ అనుకోలేదు. ‘నా కొడుకు కోసం ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవాలనుకోలేదు. అతను ఈ ప్రపంచం నుంచే వచ్చాడు. కాబట్టి ఈ ప్రపంచంతోనే ఉండాలి. అందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనపై ఉంది’ అంటున్న ముగ్ధ ఆటిజం రైట్స్ యాక్టివిస్ట్‌గా ఎంతోమందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఎంతోమందిలో ఉన్న అజ్ఞానాన్ని, అపోహలను తొలగిస్తుంది. ‘నాట్ దట్ డిఫరెంట్’ పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. ‘నాలో ఎలాంటి అపోహలు, అకారణ భయాలు లేకుండా పిల్లాడిని సంపూర్ణంగా అర్ధం చేసుకున్నాను. అప్పుడు అనిపించింది... హి ఈజ్ నాట్ దట్ డిఫరెంట్’ అంటున్న ముగ్ధ తాను అనుకున్న మాటలోని ‘నాట్ దట్ డిఫరెంట్’ను మూమెంట్‌కు పేరుగా ఎంచుకొంది. యూట్యూబ్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఆటిజం ఉన్న పిల్లలతో ఎలా వ్యవహరించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేదానిపై ఎన్నో విషయాలు చెబుతుంది ముగ్ధ. పెద్దల సంగతి సరే, పిల్లల మాటేమిటి? కొందరు పిల్లలు, ఆటిజం ఉన్న పిల్లలతో వ్యవహరించే తీరు బాగుండదు. ‘అలా చేయడం తప్పు. వారు మీలాంటి పిల్లలే. మీ ఫ్రెండ్సే’ ఇలాంటి అవగాహనను పిల్లలలో కలిగించడానికి కామిక్ స్ట్రిప్‌లను తయారు చేయించి ప్రచారం చేసింది. అవి మంచి ఫలితాన్ని ఇస్తున్నాయి. తాజాగా ముగ్ధ పేరు బిబిసి–2021 ‘మోస్ట్ ఇన్స్పైరింగ్ అండ్ ఇన్ఫ్లూయెన్షియల్ ఉమెన్–వరల్డ్’ జాబితాలో చోటు చేసుకుంది. చదవండి: Bipin Rawat Wife Madhulika: భర్తకు తగ్గ భార్య.. ఆఖరి శ్వాస వరకు ఆయనతోనే View this post on Instagram A post shared by Mugdha Kalra (@autismtaleswithmugdha) View this post on Instagram A post shared by Mugdha Kalra (@autismtaleswithmugdha) -
Sanjana Chatlani: ఆ అక్షరాల రూపకర్త.. ఒకింత ఆశ్చర్యం, గర్వం!
రోలెక్స్, ది రిట్జ్ కార్ల్టన్, ఫ్యూచర్ గ్రూప్, గూచి, లూయీ వ్యుట్టన్, మిఖాయిల్ కోర్స్, జిమ్మీ చూ, గూగుల్ ఇండియా, ది వెడ్డింగ్ ఫిల్మర్, టాటా జోయా... ఇలా ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు. ఈ పేర్లతోపాటు ఆయా కంపెనీల అక్షరరూపం కూడా కళ్ల ముందు మెదిలి తీరుతుంది. ఆ ఆక్షరాలకు ఓ రూపం పురుడు పోసుకున్నది మనదేశంలోనే. ఆశ్చర్యమే కాదు ఒకింత గర్వంగానూ ఉంటుంది మరి. ఈ అక్షరాల రూపకర్త పూనాకు చెందిన సంజన చత్లాని. ఆమె తన జీవితాన్ని అక్షరాలా అక్షరాలతోనే దిద్దుకుంది. తన కెరీర్‌ను తానే అందంగా రాసుకుంది. నిస్తేజం నుంచి ఉత్తేజం అది 2015 ఆగస్టు. సంజన చట్లాని కాలేజ్ నుంచి సమాజంలోకి అడుగుపెట్టిన తొలినాళ్లు అవి. ఓ కార్పొరేట్ కంపెనీలో మార్కెటింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. మూడున్నరేళ్ల ఉద్యోగ జీవితం ఆమెకు ఏ మాత్రం సంతృప్తినివ్వలేదు. అంతటి నిస్పృహలోనూ ఆమెకు సాంత్వన చేకూరుతున్న విషయం ఒక్కటే. కుటుంబంతో యూఎస్‌కి వెళ్లినప్పుడు లాస్ ఏంజెల్స్, శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కాలిగ్రఫీ క్లాసులకు హాజరైంది. అప్పుడు నేర్చుకున్న కాలిగ్రఫీలో తోచిన నాలుగు అక్షరాలు రాసుకున్నప్పుడు మనసు ఆనందంగా ఉంటోంది. ‘తనను ఆనందంగా ఉంచని ఉద్యోగంలో కొనసాగడం కంటే తనకు సంతోషాన్నిస్తున్న కాలిగ్రఫీలోనే జీవితాన్ని వెతుక్కుంటే తప్పేంటి’ అనుకుంది సంజన. ఉద్యోగం మానేసి ముంబయిలో ఒక చిన్న గదిలో ‘ద బాంబే హ్యాండ్ లెటరింగ్ కంపెనీ’ సంస్థను స్థాపించింది. సాధనేలోకం సంజన సొంతంగా కంపెనీ స్థాపించిన తర్వాత ఆర్డర్ల కోసం ప్రయత్నించలేదు. అక్షరాలను అందంగా రాయడం అనే ప్రక్రియను సాధన చేయడానికే ఎక్కువ సమయం కేటాయించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే కాలిగ్రఫీ వర్క్‌షాపులకు హాజరయ్యేది. తిరిగి వచ్చిన తర్వాత స్టూడియోలో కూర్చుని ప్రాక్టీస్ చేస్తూ టైమ్ మర్చిపోయేది. అలా రోజుకు పన్నెండు గంటల సేపు స్టూడియోలోనే గడిపిన రోజులున్నాయి. ఆ అలవాటు ఆమె కెరీర్లో బిజీ అయిన తర్వాత అంత నిడివి స్టూడియోలో పని చేయడానికి దోహదం చేసింది. ఇప్పుడు ఆమె క్లయింట్ల జాబితాలో ప్రపంచంలో అనేక ప్రఖ్యాత కంపెనీలున్నాయి. ఇంతగా పేరు వచ్చేసింది కదా అని కూడా ఆమె రిలాక్స్ కావడంలేదు. ఆర్డర్ల పని పూర్తయిన తర్వాత రోజుకు కనీసం మూడు గంటల సేపు అక్షరాలను కొత్తగా రాయడానికి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. మొదట్లో బిజినెస్ ఆర్డర్స్ లేని రోజుల్లో సంజన దీపావళి శుభాకాంక్షల గ్రీటింగ్ కార్డ్స్ రాసి స్నేహితులకు, బంధువులకు పంపించేది. ఆ గ్రీటింగ్ కార్డులు అందుకున్న వారి ప్రశంస లు నోటిమాటగా ప్రచారం కల్పించాయి. ఇప్పుడు మనదేశంలో అత్యుత్తమ కాలిగ్రఫీ ఆర్టిస్టుల్లో ఆమె ఒకరు. ఆటిజమ్కి ఔషధం సంజన ఇప్పుడు మనదేశంలో సామాన్యులకు కూడా కాలిగ్రఫీ గురించి తెలియచేయాలనే సంకల్పంతో పని చేస్తోంది. కాలిగ్రఫీ సాధన చేయడం ద్వారా ఆటిజమ్ నుంచి బయటపడవచ్చని, ఆటిజమ్ పిల్లలకు ఉచితంగా వర్క్‌షాపులు నిర్వహిస్తోంది. కాలిగ్రఫీ నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోదని, ఎన్ని రకాలుగా సాధన చేసినా ఇంకా ఎన్నో మిగిలిపోయి ఉంటాయని చెప్తోంది. రానున్న ఏడాది జనవరిలో ఆమె యూకేలో మూడు నెలల అడ్వాన్స్డ్ స్టడీ కోసం వెళ్తోంది. అంతటి అంకితభావంతో పని చేస్తుంటే... విజయం వారిని నీడలా వెంటాడుతుంది. సంజన చట్లాని -
వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!
రాతి పనిముట్ల వాడకం మొదలెట్టడంతో మానవ పరిణామ క్రమంలో నూతనాధ్యాయం ఆరంభమైంది. క్రమంగా చక్రం, నిప్పు కనుగొనడం ఈ పరిణామ క్రమాన్ని మరింత వేగవంతం చేసింది. జంతు లక్షణాల నుంచి బయటపడ్డ మనిషి ఇతర జంతువుల్లాగా కాకుండా తమలో తాము సంభాషించుకోవడానికి భాషను సృష్టించాడు, అలాగే తాను చూసిన వాటిని పాతరాతియుగం నాటి మానవుడు కొండగుహల్లో చిత్రీకరించడం ఆరంభించాడు. క్రమంగా సంచార జీవనం వదిలి స్థిరజీవనం దిశగా ఆదిమ సమాజాలు పయనించడంతో మనిషిలో మరిన్ని కళలు బయటపడ్డాయి. భాష నుంచి సంగీతం, దానికనుగుణంగా నాట్యం వంటి అనేక కళలు మానవ జీవితంలోకి ప్రవేశించాయి. తర్వాత కాలంలో కళారూపాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇలాంటి కళా రూపాలు కేవలం మానసికోల్లాసానికే కాదని, వీటిని సరిగా ఆచరిస్తే ఆరోగ్యం కూడా మెరుగవుతుందని మనిషి కనుగొన్నాడు. ఆధునిక యుగంలో కూడా ఈ కళా రూపాలను ఉపయోగించి పలు దీర్ఘకాల వ్యాధులను, చికిత్స దొరకని రోగాలను ఉపశమింపచేసే థెరపీలు అనేకం ఉన్నాయి. కళలే కదా అని కొట్టి పారేయకుండా ఈ థెరపీలతో పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ఆధునిక వైద్యం ఈ థెరపీలను సమర్థించదు కానీ వీటి వాడకాన్ని వద్దనలేదు. సైడ్ ఎఫెక్టులు ఉండని కొన్నిరకాల ప్రత్యామ్నాయ థెరపీల గురించిన వివరాలు... పెట్ థెరపీ మనిషి జీవితంలో జంతువులను మచ్చిక చేసుకోవడం ఎంతో కలిసివచ్చింది. దీనివల్ల నాగరికతలు దూసుకుపోయాయి. మనిషి మనసును అర్ధం చేసుకొనే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు మధ్య ఒక మానసిక బంధం ఏర్పడుతుంది. దీని ఆధారంగా యానిమల్ అసిస్టెడ్ లేదా పెట్ థెరపీ పుట్టుకొచ్చింది. సాధారణంగా మనిషి పెంచుకునే కుక్క, పిల్లి, గుర్రం, పంది, పక్షులతో ఈ థెరపీ ప్లాన్‌ను రూపొందిస్తారు. ఆటిజం, బిహేవియరల్ సమస్యలు, మెంటల్ కండీషన్స్, స్క్రీజోఫ్రీనియా ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే పెట్ అలెర్జీ ఉన్నవారు, జంతువులంటే అసహ్యం ఉన్నవారు ఈ థెరపీకి దూరంగా ఉండడం మంచిది. ఈ విధానంలో మన పెంపుడు జంతువుతో మనకు ఎమోషనల్ బంధం బలపడేలా థెరపిస్టు చేస్తాడు. దీనివల్ల మనిషి మనసులో సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇతర జీవులపై ప్రేమ పెరుగుతుంది. దీనివల్ల మెదడులో కరుణ, జాలి భావాలకు ప్రాధాన్యం పెరిగి మానసికంగా బలోపేతం అవుతాడు. ఈ థెరపీలో కేవలం వైయుక్తిక విధానమే ఉంటుంది. గ్రూప్ థెరపీ ఉండదు. మ్యూజిక్ థెరపీ శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః అన్నాడు ప్రవచనకారుడు. సంగీతానికి పరవశించని జీవం ఉండదన్నది అందరికీ తెలిసిన సంగతే! అలాంటి సంగీతాన్నే ఆధారంగా చేసుకొని స్వాంతన చేకూర్చేది మ్యూజిక్ థెరపీ. పిల్లలో, పెద్దల్లో ఎదురయ్యే యాంగై్జటీ, డిప్రెషన్, నొప్పులు, ఆటిజం, ఆల్జీమర్స్, డిమెన్షియా, మెదడుకు దెబ్బతగలడం తదితర అనేక రకాల ఇక్కట్లకు ఈ థెరపీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతారు. ఇందులో రెండు రకాలున్నాయి. వినడం(రెసెప్టివ్ విధానం), పాడడం(యాక్టివ్ విధానం)లో మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో సంగీతానికి ప్రాధాన్యత మెండు. వివిధ రకాల మానసిక స్థితులకు తగినట్లు సంగీతంలో వివిధ రాగాలను సృష్టించారు. ఉదాహరణకు కరుణ రసాన్ని గాంధారం ప్లస్ నిషాధం అలాగే గాంధారం ప్లస్ షడ్జమం శౌర్య రసాన్ని ప్రేరేపిస్తాయి. రస, రాగ సమ్మిళితంతో మానసికోల్లాసమేకాకుండా, ఆరోగ్యం కూడా లభిస్తుందని భారతీయులు గుర్తించారు. పాశ్చాత్య సంగీతంలో కూడా ఆయా స్థితులకు తగ్గట్లు నోట్స్‌ను సృష్టించారు. ఇలా పనిచేస్తుంది... మనిషి పుట్టినప్పటి నుంచి చివరివరకు శబ్దమయ జీవితం గడుపుతాడు. శబ్దాలను క్రమపద్ధతిలో పేరిస్తే సంగీతమవుతుంది. సంగీతం వినడం ఒకలాగా, సొంతంగా పాడడం ఒకలాగా ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు మతిమరుపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులతో బాధపడేవాళ్లకు గతంలో విన్న సంగీతం కారణంగా మెదడులో గత న్యూరాన్లకు ప్రేరణ కలుగుతుంది. అలాగే సొంతంగా హమ్మింగ్ లేదా పాడుతూ పనిచేయడం శ్రమ తెలియనివ్వదు. మ్యూజిక్ థెరపీ చేసేవాళ్లు ముందుగా క్లయింట్ కండీషన్ బట్టి ఎలాంటి విధానం అవలంబించాలో నిర్ణయించుకుంటారు. అలాగే క్లయింట్‌కు మ్యూజిక్‌లో, సంగీత వాయిద్యాల్లో ప్రవేశం ఉన్నట్లయితే అందుకు తగిన విధానాన్ని సూచిస్తారు. అలాగే క్లయింట్ అవసరాన్ని బట్టి గ్రూప్ థెరపీని లేదా వైయుక్తిక సిట్టింగ్‌ను సూచిస్తారు. శ్రావ్య సంగీతం వినేప్పుడు శరీరంలోని రక్తపోటు, హదయ స్పందన రేటు నెమ్మదిస్తాయి. ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది. ఉద్రేకపూరిత సంగీతం వింటే ఈ మార్పులు రివర్సులో జరుగుతాయి. పేషెంటు కండీషన్‌ను బట్టి థెరపిస్టు సంగీతాన్ని ఎంచుకుంటాడు. ఒక పాటను విన్నప్పుడు, పాడినప్పుడు మనసులో కలిగే స్పందనలను గుర్తించేలా థెరపిస్టులు ప్రేరేపిస్తారు. తద్వారా ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన టెక్నిక్స్‌ను వాడతారు. ఆర్ట్ థెరపీ ఆదిమమానవ కాలం నుంచి మనిషిలో ఉండే క్రియేటివిటీ చిత్రాల రూపంలో బయటపడుతోంది. మనలోని సైకలాజికల్, ఎమోషనల్ ఆలోచనలకు ఒక రూపాన్నివ్వడంలో చిత్రలేఖనం ఉపయోగపడుతుంది. దీన్ని ఆధారంగా తీసుకొని ఆర్ట్ థెరపీ అభివృద్ధి చేశారు. ఇందులో చిత్రలేఖనం(పెయింటింగ్), రేఖాలేఖనం(డ్రాయింగ్), రంగులద్దడం(కలరింగ్), శిల్పాలు చెక్కడం(స్కల్ప్టింగ్)వంటివి మనిషిలో గూడుకట్టుకున్న భావాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఏ వయసు వారిలోనైనా ఆత్మస్థైర్యం పెంచడానికి, వ్యసనాలను దూరం చేయడానికి, ఒత్తిడి నివారణకు, యాంక్జైటీ, డిప్రెషన్ తగ్గించడానికి ఆర్ట్ థెరపీని వాడతారు. పైనవాటిలోలాగానే ఇందులో కూడా గ్రూప్ థెరపీ, వైయుక్తిక థెరపీ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి థెరపిస్టు సరైన విధానం సూచిస్తాడు. ఆర్ట్ థెరపీ అంటే మనలో ఆర్టిస్టిక్ ట్యాలెంట్ ఉండాల్సిన పనిలేదు. ఇది మన అంతఃచేతనలోని ఆలోచనలను బయటపెట్టడానికి చేసే ప్రయత్నమని గుర్తించాలి. థెరపీలో క్లయింట్ ఫీలింగ్స్‌ను థెరపిస్టు గమనించి తగిన టెక్నిక్స్ నేర్పుతాడు. వివిధ రంగుల సమ్మిళితాలను చిత్రీకరించడం, చూడడం వంటివి మనిషి మనసును తేటపరుస్తుందని అమెరికన్ ఆర్ట్ థెరపీ అసోసియేషన్ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మానవతాత్మక థెరపీ ప్రపంచంలో జరిగే సంక్షోభ కారణాలను గుర్తించి నివారించడానికి యత్నించడమే మానవత్వం. సాటివారి బాధను అర్థం చేసుకున్నవాడే అసలైన మానవుడు అన్న సూక్తి ఆధారంగా హ్యూమనిస్టిక్ థెరపీ ఆరంభమైంది. మనం చూసే, వినే, అనుభవించే వాటిని మరింతగా అర్థం చేసుకోవడంలో ఈ థెరపీ ఎంతో పయ్రోజనకారి. ఆత్మనూన్యత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతుండడం, ఇతరులతో సరైన సంబంధాలు లేకపోవడం, సున్నిత భావనలకు స్పందించకపోవడం వంటి పరిస్థితుల్లో ఈ థెరపీ ఉపయోగపడుతుంది. జీవితానికి అర్థం చెప్పడం ద్వారా మానవ జీవిత విలువను క్లయింట్‌కు థెరపిస్టు తెలియజేస్తాడు. జీవన విలువ తెలిసిన తర్వాత ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన మనసుకు రాదు. అదేవిధంగా సర్వమానవ సౌభ్రాతృత్వ దృష్టి అలవడుతుంది. నెగిటివ్ జడ్జిమెంట్ చేసే గుణం తొలగిపోతుంది. ఇది ఎక్కువగా థెరపిస్టుకు, క్లయింట్‌కు మధ్య సంభాషణల ద్వారా జరుగుతుంది. క్లయింట్ ఆలోచనా విధానంలో లోపాలను సున్నితంగా ఎత్తి చూపడం, వాటిని సరైన దారికి మళ్లించడం, ఎదుటివారిని నొప్పించకుండా సంభాషించడాన్ని అలవాటు చేయడం ద్వారా క్లయింట్‌ను థెరపిస్టు సరైన మార్గంలోకి తీసుకుపోతాడు. దీనివల్ల క్లయింట్ క్రమంగా తనతో, ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటాడు. డ్యాన్స్ థెరపీ పదంతో కలిసి కదం తొక్కినప్పుడు శరీరానికి నూతనోల్లాసం కలుగుతుంది. దీని ఆధారంగా డ్యాన్స్ థెరపీ ఆరంభమైంది. అందుకే ఆధునిక కాలంతో దీన్ని అనేక మొండి వ్యాధులకు స్వాంతనకోసం వాడుతున్నారు. నొప్పులు, ఒత్తిళ్లు, మానసిక చింత, కుంగుబాటు, కండరాల్లో బాధ, స్ట్రెస్, ఊబకాయం తదితర పలు ఇబ్బందులకు ఈ థెరపీ ఉపయోగపడుతుంది. కరోనా కాలంలో పిల్లల్లో పెరిగిన ఒత్తిడి తగ్గించడంలో దీని పాత్ర అమోఘమని అమెరికాకు చెందిన స్టెస్ర్ల్యాబ్ పేర్కొంది. సాంకేతికత పెరిగి శారీరక శ్రమ తగ్గుతూ వస్తున్న ఈ రోజుల్లో నృత్య సాధనతో శరీరానికి తగినంత వ్యాయామం కూడా లభిస్తుంది. డ్యాన్స్ థెరపీతో అటు మానసిక, ఇటు శారీరక ప్రయోజనాలు కలుగుతాయన్నది నిపుణుల మాట. నృత్యాల్లో అభినయించే ముద్రలు, స్టెప్పులు మూవ్మెంట్ థెరపీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని క్రమపద్ధతిలో పాటించడం వల్ల శరీరంలో ఒక రిథమ్ పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం మెరుగుపడడం గమనించవచ్చు. చిన్నపిల్లలకు అలవాటు చేయడం వల్ల వారి మానసిక, శారీరకోన్నతికి తోడ్పాటు లభిస్తుంది. ఇందులో కూడా గ్రూప్, వైయుక్తక థెరపీలుంటాయి. మన అవసరాన్ని బట్టి కావాల్సిన విధానాన్ని థెరపిస్టు సూచిస్తాడు. యోగాలో జరిగినట్లే డ్యాన్స్ థెరపీలో శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వల్ల వంట్లో ఉండే వేగస్ నరం చురుగ్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని అతిపెద్ద నరం. దీని ప్రభావం పలు జీవ క్రియలపై ఉంటుంది. దీన్ని చురుగ్గా ఉంచడమంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే! (చదవండి: అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్.. చూపు తిప్పుకోలేరు!) వినూత్న థెరపీలను ఎంచుకోవడమే కాదు, వాటిని ఆచరించే చిత్తశుద్ధి కూడా అవసరం. లేకుంటే ఎన్ని థెరపీలు చేపట్టినా ఏ ప్రయోజనం ఉండదు. అలాగే నకిలీలను ఎంచుకోకుండా సర్టిఫైడ్ థెరపిస్టుల వద్దకు వెళ్లడం మరువకూడదు. ఇప్పుడు ఇండియాలో పలు యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాంటి థెరపీల్లో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి థెరపిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవగాహన, అనుభవం ఉన్న థెరపిస్టు వద్ద తీసుకునే థెరపీ ఎప్పటికీ ప్రయోజనమే! – శాయి ప్రమోద్ (చదవండి: ఈ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చు.. ఇంకా) -
ఏడీహెచ్‌డీకి, ఆటిజమ్‌కు తేడా తెలుసా!?
కొంతమంది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ), ఆటిజమ్లను ఒకే రుగ్మతగా అభిప్రాయపడి, పొరబడుతుంటారు. నిజానికి ఏడీహెచ్‌డీ ఉన్న పిల్లలు, ఆటిజమ్ ఉన్న చిన్నారులు... ఈ రెండు కండిషన్స్‌లోనూ పిల్లలు అతి చురుగ్గా ఉంటారు. అయితే ఏడీహెచ్‌డీ చిన్నారుల తల్లిదండ్రులు తరచూ వారి పిల్లాడి గురించి చెబుతూ ‘‘మావాడు అతి చురుకు. చాలా వేగంగా నేర్చుకుంటాడు. కానీ స్కూల్లో చెప్పిందేదీ గుర్తుంచుకోడు’ అంటుంటారు. అయితే ఏడీహెచ్‌డీ అనే సమస్య జ్ఞాపకశక్తికి సంబంధించింది కాదు. ►ఇక ఆటిజమ్ ఉన్న పిల్లల్లోనూ అతిచురుకుదనం ఉన్నప్పటికీ వారి చురుకుదనమంతా నిర్దిష్టమైన లక్ష్యం లేకుండా, ఏమాత్రం ఫోకస్డ్గా లేకుండా ఉంటుంది. ఆటిజమ్ ఉన్న పిల్లలు తమదైన ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంటారు. నేరుగా కళ్లలో కళ్లు కలిపి మాట్లాడలేరు. పైగా వారికి మాట్లాడటంలో సమస్యలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న మనుష్యులూ, వాళ్ల వ్యవహారాలపై ఎలాంటి ఆసక్తీ ఉండదు. ►ఏడీహెచ్‌డీ ఉన్న ప్రతి పిల్లవాడికీ ఆటిజమ్ ఉండదు. అయితే అలా ఉందేమోనని ఒకసారి వైద్యనిపుణుల చేత పరీక్షింపజేసి, ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీలైనంత త్వరగా సమస్యలకు తగిన చికిత్సకు అవకాశం ఉంటుంది కాబట్టి మెరుగుదలకూ అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం లేకుండా ఉండాలి. -
కొడుకును చంపి, కిడ్నాప్ డ్రామా
ఫ్లొరిడా : ఆస్టిజం(ఎదుగుదల లోపం)తో బాధపడుతున్న కొడుకును చంపి, కిడ్నాప్ డ్రామా ఆడిందో తల్లి. చివరకు సీసీటీవీల కారణంగా చిక్కి జైలు పాలయింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫ్లోరిడా, మియామీ డేడ్ కౌంటీకి చెందిన పాట్రికా రీప్లే గురువారం రోజు తన కుమారుడు అలెజాన్డ్రో(9)ను ఇద్దరు వ్యక్తులు కిడ్రాప్ చేసి తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బాలుడి శవం అక్కడికి దగ్గరలోని సరస్సులో కనిపించింది. ఇదే విషయాన్ని పాట్రికాకు తెలియజేశారు వారు. అయితే పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. ( వంటలో ఇసుక వేశాడు: అందుకే చంపా!) పాట్రికా ఫిర్యాదు చేసిన కోణం నుంచి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో పాట్రియా కుమారుడ్ని సరస్సులోకి తోసిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వెంటనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆస్టిజంతో బాధపడుతున్న కుమారుడ్ని నీటిలో తోసి చంపటానికి ఇదివరకే ప్రయత్నించినా స్థానికులు అతడ్ని రక్షించారని, రెండో ప్రయత్నంలో సరస్సు దగ్గర ఎవరూ లేకపోవటంతో బాలుడు మరణించాడని పోలీసులు పేర్కొన్నారు. -
వైరల్: నీకు నేనున్నారా.. ఊరుకో!
బాధలో ఉన్న మనిషిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుంటే వారి వేదన కాస్తైనా తగ్గుతుంది. ‘నీకు నేనున్నా’ అనే భరోసాను ఇచ్చే అటువంటి ఆత్మీయ స్పర్శతో కలిగే ఉపశమనాన్ని మాటల్లో వర్ణించాలనుకుంటే.. ఈ ఫొటోలోని చిన్నారిని చూపిస్తే చాలు. తన స్నేహితుడు ఏడుస్తుంటే తట్టుకోలేక ఓ బాలుడు అతడిని అక్కున చేర్చుకున్నాడు. అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఓదార్చాడు. వీపుపై చేతితో నిమురుతూ అతడిని ఆడించాడు. ఆటిజంతో బాధ పడుతున్న స్నేహితుడిని ఊరడించాడు. అయితే ఇదంతా చేస్తున్న చిన్నారి కూడా డౌన్ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నవాడే కావడం విశేషం. మనసును కదిలించే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత మంచి మనసురా నీది బుడ్డోడా! స్నేహానికి, మానవత్వానికి నిజమైన అర్థం చెప్పావు. నీ నుంచి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి అంటూ సదరు బాలుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫేస్బుక్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ రాగా... లక్షల్లో కామెంట్లు వస్తున్నాయి. -
ఎంత గొప్ప మనసురా నీది బుడ్డోడా!
హాయిగా సెలవులు గడిపిన తర్వాత మళ్లీ స్కూలుకు వెళ్లాలంటే ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక ఈ విషయంలో చిన్న పిల్లల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతవరకు ఎంచక్కా బామ్మాతాతయ్యలు, అమ్మానాన్నాలతో సరదాగా గడిపిన చిన్నారులు చాలా మంది తిరిగి పాఠశాలకు వెళ్లాలంటే ఏడుపు లంకించుకోవడం సహజమే. అమెరికాకు చెందిన కానర్ అనే ఎనిమిదేళ్ల పిల్లాడు కూడా ఇలాగే స్కూలుకు వెళ్లే క్రమంలో ఏడుస్తూ ఓ చోట నిలబడిపోయాడు. పైగా అతడు ఆటిజం విద్యార్థి. తరగతి గదిలోకి వెళ్లలేక బాధ పడుతున్న అతడికి తోటి విద్యార్థి క్రిస్టియన్ మూరే అండగా నిలబడ్డాడు. కానర్ చేతిని ఆత్మీయంగా తన చేతుల్లోకి తీసుకుని లోపలికి తీసుకువెళ్లాడు. ఈ విషయం గురించి చెబుతూ..‘ నా కొడుకు పట్ల నాకెంతో గర్వంగా ఉంది. ఓ మూలన ఏడుస్తున్న చిన్నారిని తను ఓదార్చాడు. తన చేయిని పట్టుకుని స్కూళ్లోకి తీసుకువెళ్లాడు. ఇలాంటి కొడుకును కన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. తనది విశాలమైన హృదయం. స్కూళ్లో మొదటిరోజు తను ఈవిధంగా ప్రారంభించాడు’ అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోను క్రిస్టియన్ తల్లి కర్టనీ మూరే ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ బుజ్జిగాళ్ల ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో.. ‘ఎంత గొప్ప మనసురా నీది బుడ్డోడా. ఎదుటి వారి పరిస్థితిని అర్థం చేసుకున్న నీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక తన కొడుకును స్కూళ్లో దిగబెట్టేటపుడు బాగానే ఉన్నాడని.. తాను అక్కడి నుంచి వెళ్లిన తర్వాత క్రిస్టియన్ తనకు ఓదార్పునిచ్చాడని కానర్ తల్లి చెప్పుకొచ్చారు. ఆటిజం కారణంగా తన చిన్నారి ఎవరితోనూ కలవలేడని.. అతడికి స్నేహితులు కూడా తక్కువేనన్నారు. అయితే క్రిస్టియన్ మాత్రం అందరిలా కాకుండా తానే ముందుకొచ్చి కానర్‌తో స్నేహం చేశాడని..ఇప్పుడు వాళ్లిద్దరు ప్రాణ స్నేహితులు అయిపోయారని హర్షం వ్యక్తం చేశారు. కానర్- క్రిస్టియన్ల ఫొటోలు టీవీలో చూసినపుడు కుమారుడి పరిస్థితి చూసి తన భర్త కన్నీళ్లు ఆపుకోలేక పోయాడని చెప్పారు. అదేవిధంగా చిన్న వయస్సులోనే క్రిస్టియన్ మంచి స్వభావాన్ని అలవరచుకున్నాడని ప్రశంసించారు. -
యాసిడ్ దాడి బాధితులకు రిజర్వేషన్లు!
న్యూఢిల్లీ: యాసిడ్ దాడి బాధితులు, మానసిక వికలాంగులు, ఆటిజంతో బాధపడుతున్న వారు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ పొందే అవకాశాలున్నాయి. సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం(డీఓపీటీ) బుధవారం విడుదల చేసిన ముసాయిదా విధానంలో... దివ్యాంగులకు ఉద్యోగాలు, పదోన్నతుల్లో కోటా, వయో పరిమితిలో సడలింపులను ప్రతిపాదించింది. దివ్యాంగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలన్న అంశం సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్నందున తాజా చర్యకు అడ్డంకులు ఏర్పడే సూచనలూ కనిపిస్తున్నాయి. దివ్యాంగులకు కేటాయించిన ఖాళీల్లో ఐఏఎస్ అధికారుల కార్యాలయ సహాయకుల పోస్టులున్నాయి. డైరెక్ట్ నియామక ప్రక్రియలో ఏ,బీ,సీ,డీ గ్రూపులలోని మొత్తం ఖాళీల్లో నిర్దేశిత అంగవైకల్యం ఉన్న వారికి 4 శాతం కేటాయిస్తారని డీఓపీటీ తెలిపింది. అలాగే యాసిడ్ దాడి బాధితులతో పాటు ఆటిజం, మానసిక వికలాంగులు, దృష్టి, వినికిడిలోపం(సంయుక్తంగా) ఉన్నవారికి 1 శాతం రిజర్వేషన్‌ను ప్రతిపాదించారు. పదోన్నతులకు సంబంధించి గ్రూప్ డీ, సీలోని మొత్తం ఖాళీల్లో ప్రామాణిక అంగవైకల్యం ఉన్న వారికి 4 శాతం కేటాయిస్తారు. అంగవైకల్యం 40 శాతం కన్నా తక్కువ ఉన్న వారే ఈ రిజర్వేషన్లకు అర్హులని ముసాయిదా విధానంలో పేర్కొన్నారు. వయో పరిమితి సడలింపు 10–13 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. -
ఆ లోపంతోనే మతిమరుపు!
ఫ్లోరిడాః వృద్ధాప్యంలో మతిమరువు రావడానికి విటమిన్ బి-12 తక్కువ స్థాయిలో ఉండటమే కారణం కావచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వయసు పెరగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు విడుదలయ్యే స్థాయి తగ్గిపోవడంతో ఆహారంలోని బి-12 ను గ్రహించే శక్తి శరీరం కోల్పోతుందని, దీంతో క్రమ క్రమంగా వృద్ధుల్లో విటమిన్ లోపానికి దారితీస్తుందని ఫ్లోరిడాకు చెందిన సైంటిస్టులు పరిశోధనలద్వారా కనుగొన్నారు. వయసు పైబడినవారిలో మతిమరుపు రావడానికి ముఖ్య కారణం విటమిన్ బి-12 లోపం కావచ్చని నోవా ఆగ్నేయ యూనివర్శిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్.. రిచర్డ్ డెట్ మెదడుపై నిర్వహించిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లోపంతో బాధపడేవారిలో సమస్య బయటకు పెద్దగా కనిపించకపోయినా... క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో చెప్పిన విషయాలను మరచి పోవడం, మళ్ళీ మళ్ళీ అడుగుతుండటమే కాక, ప్రతి విషయానికీ తిగమక పడటం వంటి లక్షణాలు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థ పనిచేయడానికి బి-12 విటమిన్ ఎంతగానో సహకరిస్తుంది. అందుకే విటమిన్ లోపం ఏర్పడగానే శరీరంలో నిస్సత్తువ, అవయవాలు పట్టుతప్పి, మూత్రం తెలియకుండా వచ్చేయడం, బీపీ తగ్గడంతో పాటు మతిమరుపు వంటి అనేక సమస్యలు మెల్లమెల్లగా బయట పడతాయని పరిశోధకులు అంటున్నారు. సరైన సమయంలో సమస్యను గుర్తించకపోతే అది.. రక్త హీనతకు కూడా దారి తీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. వయసులో ఉన్నపుడు మనశరీరం కణజాలంలోనూ, కాలేయాల్లోనూ బి-12 ను నిల్వ చేసుకుంటుందని, అందుకే ఆ సమయంలో విటమిన్ తగినంత శరీరానికి అందకపోయినా పెద్దగా తేడా కనిపించదని చెప్తున్నారు. అయితే ఉండాల్సిన కన్నా భారీ స్థాయిలో లోపం ఏర్పడితే మాత్రం శరీరంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. బి-12 లోపం నివారించాలంటే ఆ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలైన చేపలు, మాంసం, కాలేయం వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. చికెన్, గుడ్లు, పాలు, పాల పదార్థాల్లో కూడా బి-12 ఉన్నా.. తక్కువ మోతాదులో ఉంటుందని, శాకాహారంలో అయితే బి-12 పెద్దగా కనిపించదని పరిశోధకలు చెప్తున్నారు. అందుకే శాకాహారులు.. బి-12 లోపం కనిపిస్తే వైద్యుల సలహా మేరకు విటమిన్ మాత్రలు వాడాల్సి ఉంటుందని సూచిస్తున్న పరిశోధకులు.. తమ అధ్యయనాలను ప్లాస్ వన్ జర్నల్ లో నివేదించారు. -
ఇదేమి ‘కటింగ్’ బాబూ!
సౌత్‌వేల్స్: చిన్నపిల్లలు సాధారణంగానే హెయిర్ సెలూన్లో కటింగ్ చేసుకోవాలంటే మారాం చేస్తారు, గోల చేస్తారు, ఏడుస్తారు, నానాయాగి చేస్తారు. వారికి కటింగ్ చేయాలంటే సెలూన్ వాడికి కూడా తలప్రాణం తోకకొస్తుంది. ఆదే ఆటిజం(మెదడు సంబంధిత వ్యాధి)తో బాధపడుతున్న పిల్లలకు కటింగ్ చేయించాలన్నా, చేయాలన్నా దేవతలు దిగిరావాలి! ఈ బాధను భరించలేననుకొనే డెనైన్ డీవీస్ అనే ఓ తల్లి ఆటిజంతో బాధ పడుతున్న తన నాలుగేళ్ల కొడుకు మాసన్కు 18 నెలల నుంచి కటింగ్ చేయించలేదు. మాసన్ జుట్టు పిచ్చి పిచ్చిగా పెరిగిపోయింది. క్షణం కూడా నిలకడగా కూర్చోని మాసన్ నిద్రలో ఉన్నప్పుడు కొంచెం, కొంచెం జుట్టు కత్తిరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే మేల్కొన్నాక మాసన్ తన జుట్టును చూసుకొని ఇల్లుపీకి పందిరేసేవాడట. సౌత్‌వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్‌లో నివసిస్తున్న డీ వీస్, చిన్న పిల్లలకు అతి నైపుణ్యంతో హేర్ కట్‌చేసే బార్బర్ కోసం వాకబు చేసింది. జేమ్స్ విలియమ్స్ అనే 26 ఏళ్ల బార్బర్ అందులో స్పెషలిస్ట్ అని తెలుసుకుంది. తన పార్టనర్ జామీ లెవీస్‌తో కలసి బాబును తీసుకొని ఓ రోజు ఆ బార్బర్ దగ్గరకు వెళ్లింది. ఆటిజమ్‌తో బాధపడుతున్న పిల్లలకు హేర్ కటింగ్ చేయడం అంత ఈజీ కాదని, ముందుగా వారితో చనువు పెంచుకోవాల్సి ఉంటుందని బార్బర్ విలియమ్స్ సూచించారు. వారికిచ్చిన మాట మేరకు బార్బర్ ప్రతిరోజు సెలూన్ తెరవడానికి ముందు ఆ బాలుడు ఇంటికెళ్లి బాలుడితో స్నేహం చేయడం ప్రారంభించారు. అలా ఒకరోజు ఇంటికొచ్చేసరికి బాలుడు నేలమీద పడుకొని తన తల్లి సెల్‌ఫోన్‌తో ఆడుకుంటున్నాడు. ఇదే మంచి సమయం అనుకున్న బార్బర్ విలియమ్స్ తాను కూడా బోర్లా నేలమీద పడుకొని బాలుడికి హేర్ కటింగ్ చేశారు. ఈ దృశ్యాలను మాసన్ తండ్రి లెవీస్ ఫొటోలుతీసి ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలకు ఇప్పటివరకు 25వేల మంది లైక్స్ కొట్టగా, ఐదేవేల మంది షేర్ చేసుకున్నారు. ఒక్కసారిగా ఆన్లైన్ బార్బర్ విలియమ్స్ సెలబ్రిటిగా మారిపోయారు. తమ పిల్లలకు హెయిర్ కట్ చేయాలంటూ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి రిక్వెస్టులు పెరిగాయి. ముఖ్యంగా ఆటిజమ్‌తో బాధ పడుతున్న పిల్లల తల్లిదండ్రులే వారిలో ఎక్కువగా ఉన్నారు. ‘నా వృత్తిని నేను నిర్వహించాను. ఇందులో గొప్పతనమేమి లేదు. కాకపోతే ఊహించని విధంగా డిమాండ్ పెరగడం ఆనందంగా ఉంది’ అని బార్బర్ వ్యాఖ్యానించారు. కటింగ్ అనంతరం అద్దంలో తన ముఖం చూసుకున్న మాసన్ అసలు ఏడ్వకపోగా తనపని ముగించుకొని వెళుతున్న బార్బర్ విలియమ్స్ వద్దకు వెళ్లి బుగ్గ మీద ముద్దు కూడా పెట్టుకున్నాడని తల్లీ డీవీస్ మురిపింగా తెలిపింది. బార్బర్‌కు థాంక్స్ తెలిపింది. -
థ్యాంక్యూ డాడీ!
నేడు వరల్డ్ ఆటిజమ్ డే ఆ అబ్బాయి పేరు ప్రణవ్. మంచి స్విమ్మర్. మార్షల్ ఆర్ట్స్ వచ్చు. హిందూస్థానీ శాస్త్రీయ సంగీతంలోనూ దిట్ట. సైకిలెక్కితే... ఇక దూకుడే! ఇప్పుడు స్పెషల్ ఒలింపిక్స్‌కూ సెలక్టయ్యాడు. తొమ్మిదేళ్ల గుర్రంకొండ ప్రణవ్ పేరుకు ముందు ఇలాంటి ప్రశంసలు పదుల సంఖ్యలో చేర్చవచ్చు. కానీ ఒక ఆటిజం కుర్రాడిని ఇన్ని అంశాల్లో మేటిగా మార్చింది మాత్రం అతని తండ్రి ప్రవీణ్. సాఫ్ట్వేర్ సంస్థలో ఉన్నతోద్యోగిగా కన్నా ఒక ఆటిజం చిన్నారిని తీర్చిదిద్దిన తండ్రిగా ఆయనకు అమెరికాలో లభిస్తున్న గౌరవం అపారం. ‘‘నెల్లూరులో పుట్టి పెరిగాను. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగరీత్యా 1999లో అమెరికాకు వెళ్ళాను. మా ఊరికే చెందిన మమతను వివాహం చేసుకున్నాను. ప్రణవ్ మాకు తొలి సంతానం. హుషారుగా ఉండేవాడు. నెలల వయసులోనే నోటితో శబ్దాలు చేస్తుంటే ‘‘త్వరగా మాటలొచ్చేస్తాయ్’’ అనేవారంతా. వాస్తవంలో అలా జరగలేదు. ప్రణవ్‌కు ఏడాదిన్నర వయసప్పుడు పిలిచినా పలికేవాడు కాదు. నిద్ర సరిగా పోయేవాడు కాదు. తోటి పిల్లలతో కలవలేకపోయేవాడు. మాట రాలేదు. స్పీచ్ పాథాలజిస్ట్, న్యూరాలజిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, డెవలప్మెంట్ పిడియాట్రీషియన్లను కలిశాం. రెండో బిడ్డ కృతిక్ పుట్టడానికి మూణ్నెల్ల ముందు ప్రణవ్‌కు ‘ఆటిజం’ అని నిర్ధారించారు. ఒక సంతోషాన్ని ఒక ఆవేదనను ఎలా సమన్వయం చేసుకోవాలో, అసలు ‘ఆటిజం’ అంటే ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఏమైతేనేం ప్రణవ్‌కు మమ్మల్ని తల్లిదండ్రుల్ని చేయాలన్న భగవంతుడి నిర్ణయాన్ని మేం అంగీకరించాం. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లాడి బాగోగులు చూసే బాధ్యత దేవుడు మాకు అప్పగించాడనుకున్నాం. ఉద్యోగానికి గుడ్‌బై... ఆటిజంపై యుద్ధం ప్రకటించాను. జీతం గురించి పట్టించుకోకుండా చేస్తున్న ఉద్యోగానికి స్వస్తి చెప్పి బాగా తీరిక ఉండే ఉద్యోగం చూసుకున్నాను. అంధత్వం, ఆటిజం, డౌన్ససిండ్రోమ్, ఎపిలెప్సీ, సెన్సరీ, స్పీచ్ డిజార్డర్స్, సెరెబ్రల్ పాల్సీ లాంటి తీవ్ర సమస్యలున్న పిల్లల తల్లిదండ్రుల్ని కలిశాను. కౌంటీ సర్వీసెస్వారిని సంప్రదిస్తే మాకో ఎర్లీ చైల్డ్ హుడ్ టీచర్‌ను కుదిర్చారు. ప్రణవ్‌తో ఎలా ఆడుకోవాలి? తనకి ఎలా నేర్పాలి? వంటివి నేర్చుకోవడానికి మేం మళ్లీ విద్యార్థులమయ్యాం. బలహీనత చూడలేదు... నేను, నా భార్య మా జీవనశైలిని మార్చుకున్నాం. ఆలోచనాధోరణినీ, కెరీర్లు, లక్ష్యాలనూ మార్చుకున్నాం. ఆటిజంను దూరం చేయలేమని తెలిశాక ప్రణవ్ బలహీనతల్ని పట్టించుకోవడం మానేసి సామర్థ్యాలను పెంపొందించే పనిలో పడ్డాం. ‘ప్రత్యేక’ పిల్లలున్న తల్లిదండ్రులు ఎటువంటి థెరపీలు ఫాలో అవుతున్నారు? పిల్లలెలా స్పందిస్తున్నారు? మందులు పనిచేస్తున్నాయా? సమాచారం సేకరించాం. ఆటిజం సంబంధిత సమస్యలపై సెమినార్లయినా, అవగాహన కార్యక్రమాలైనా తప్పకుండా హాజరవుతూ వచ్చాం. ఆటిజం టీచర్లు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్పెషల్ చిల్డ్రన్ కోసం టెక్నాలజీ, బొమ్మలు, పుస్తకాల వంటివి తయారు చేసే వ్యక్తులు - ఇలా అందరం బృందంలా ఏర్పడ్డాం. ఆ సమయంలోనే మాకు రెండో అబ్బాయి కృతిక్ పుట్టాడు. నేర్పడానికి నేర్చుకున్నాం... ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, మ్యూజిక్ థెరపీ ఎబిఎ థెరపీ... వీటన్నింటిలో ప్రణవ్ను చేర్చాం. వాడితో సంభాషించడానికి మమత, నేను సైగల భాషను నేర్చుకున్నాం. స్పీచ్ టూల్స్, ఆక్యుపేషనల్ టెక్నిక్స్, సెన్సరీ ఇంటిగ్రేషన్ టెక్నిక్స్, టీచింగ్ సోషల్ బిహేవియర్ ఇస్యూస్... అలవరచుకున్నాం. ఎడ్యుకేషన్ చార్ట్‌లు, బొమ్మలు, సెన్సరీ టూల్స్, డివిడిలు, బుక్స్ వంటివాటితో ఇంటిని నింపేశాం. ప్రణవ్‌తో సహా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ తరగతుల్లో చేరాను. ప్రణవ్‌కు సంగీతం నేర్పడానికి నా భార్య దక్షిణ భారతీయ కర్ణాటక సంగీత తరగతుల్లో చేరింది. ఆటిజం కిడ్స్‌కు మార్షల్ ఆర్ట్స్ బాగా ఉపకరిస్తాయని కరాటే అకాడమీలో శిక్షణ పొంది ఇంట్లోనే ప్రణవ్‌కు తర్ఫీదునిచ్చాను. గుడ్‌నైట్ డాడీ... గుడ్‌నైట్ మమ్మీ... మా శ్రమ ఫలిస్తోంది. ప్రస్తుతం ప్రణవ్‌కు తొమ్మిదేళ్లు. ఫిగర్ స్కేటింగ్‌తో పాటు 6 రకాల ఈత కొట్టే వెరైటీలతో లెవల్ ఫోర్ స్విమ్మర్ (ల్యాప్ స్విమ్మింగ్)గా స్పెషల్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యాడు. సైక్లింగ్ చేస్తాడు. బాస్కెట్‌బాల్, క్రికెట్, ఇంటరాక్టివ్ వీడియోగేమ్స్ ఆడతాడు. పుస్తకాలు చదువుతాడు. పదరంగాలు, పజిల్స్ చేస్తాడు. అయితే ఇదంతా నా ఒక్కడి వల్లే కాలేదు. దీని కోసం నేను నా ఉద్యోగంతో పాటు చాలా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మా పెద్ద బావ, బంధువులు, స్నేహితులు నా బాధ్యతలు తమ నెత్తి మీద వేసుకొని, నేను పూర్తిగా ప్రణవ్ మీద దృష్టి కేంద్రీకరించడానికి తోడ్పడ్డారు. ప్రతి రాత్రీ ‘‘ గుడ్‌నైట్ డాడీ, మమ్మీ, గుడ్‌నైట్ కృతిక్’’ అంటూ ప్రణవ్ చెప్పే మాటల్లో ఎనలేని సంతోషం కనపడుతుంది. అదే నేను కోరుకుంది. ప్రణవ్ ఈరోజు ఏదో చేయడం లేదని నేనెప్పుడూ బాధపడింది లేదు. తన భవిష్యత్తుపై నమ్మకాన్ని కోల్పోయిందీ లేదు’’అంటారు ప్రవీణ్ . ఏడేళ్ల పాటు తదేక ధ్యానంలా తన కొడుకు జీవితాన్ని తీర్చిదిద్ది, ఆటిజం మీద అనూహ్యమైన విజయాన్ని సాధించి ఎందరో తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచారు. అమెరికా వైద్యులకు సైతం సలహాదారుగా మారారు ప్రవీణ్.