ప్రపంచంలో మూడవ అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్. సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత, గొప్ప దాత కూడా. అంతేగాదు ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన సినిమా 'సోర్స్ కోడ్' ఫిబ్రవరి 04న విడుదల కానుంది. ఇటీవల ఆయన వాల్‌స్ట్రీట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి చాల ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పుకొచ్చారు. తాను గనుక ఇప్పుడు పుట్టి ఉంటే.. కచ్చితం తనకు ఆటిజం నిర్ణారణ అయ్యేదని అన్నారు. అలా అనడానికి గల రీజన్ వింటే విస్తుపోతారు. .!.
బిల్‌గేట్స్ తనకు చిన్నతనంలో ఆటిజం లక్షణాలను ఉన్నట్లు తెలిపారు. అయితే ఆ రోజుల్లో దాని గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం లేకపోవడంతో అదెంటో కూడా అప్పటి వ్యక్తులెవరకీ తెలిసే అవకాశం లేదన్నారు. తాను చిన్నప్పుడు చాలా నెమ్మదిగా ఉండేవాడినని అన్నారు. ప్రతిది తొందగా నేర్చుకోలేకపోవడం, ఎవరితో కలవకపోవడం వంటి ఆటిజం లక్షణాలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
మిగతా పిల్లలతో పోలిస్తే అంత చురుకైన వాడిని కాదు, పైగా అంత బాగా చదివే విద్యార్థిని కూడా కాదని చెప్పుకొచ్చారు. ఇక్కడ అలాంటి పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరిస్తారన్నా.. దానిపైనే ఆ పిల్లవాడు ఈ సమస్యని అధిగమించడం అనేది ఉంటుంది. తన తల్లిందండ్రులు అలానే తన సమస్యను అర్థం చేసుకుని ప్రత్యేకంగా చూడకుండా సాధారణంగానే వ్యహరించేవారన్నారు.
అలాగే తన ప్రవర్తన ఇబ్బందికరంగా మారకుండా తన బలహీనతలు, బలాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని అన్నారు. ముఖ్యంగా తనకు తగిన స్కూల్ ఏదో చెక్‌చేసి మరీ అందులో చేర్పించారన్నారు. అలాగే తన బిహేవియర్‌ని మార్చుకునేలా తగిన కౌన్సలర్ వద్ద ట్రీట్‌మెంట్ ఇప్పించారని చెప్పారు. అందువల్ల తాను ఈ రోజు ఆ సమస్యను అధిగమించి ప్రభావవంతంగా చదువుకోగలిగానన్నారు.
అయితే ఇప్పుడు ఇలాంటి సమస్యను గుర్తించగలిగే వైద్య పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చేంది. కానీ పిల్లలు ఆ సమస్యతోను అధిగమించలేకపోతున్నారు తల్లిదండ్రులకు అలాంటి పిల్లలతో మసులోకోవాలనే దాని గురించి అవగాహన ఉండటం లేదన్నారు. ఇక్కడ మిగతా పిల్లల్లా.. తన పిల్లవాడు చురుకుగా లేడన్న లోపంతో తల్లిదండ్రులే కుమిలిపోతున్నారు. ఇక పిల్లవాడికి ఎలా ధైర్యం చెప్పి వాడి లోపాన్ని సరిచేయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు.
ఏదైనా ముందు.. ఉన్న సమస్యను లేదా లోపాన్ని పూర్తిగా అంగీకరించాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి లోపల ఉన్న అంతర్గత శక్తిని తట్టి లేపేలా తల్లిదండ్రులుగా తగిన ప్రోత్సాహం ఇస్తే ఏ పిల్లవాడు ఆటిజం బాధతుడిగా జీవితాంత ఉండిపోడని అన్నారు. ఈ సమస్యను అవమానంగా భావించడం, సోసైటీలో చులకనైపోతామనే భయం తదితరాల నుంచి తల్లిందండ్రులు బయటపడాలి.
వారు స్థైర్యం తెచ్చుకుని వారితో తగిన విధంగా వ్యవహరించి ఓపికగా మార్చుకోగలం అనే దానిపై దృష్టి సారించండి. ఇది జీవితం విసిరిని సవాలు లేదా టాస్క్‌గా ఫీలవ్వండి. గెలిస్తే మీ అంత గొప్పోడు ఎవ్వడూ లేడనే విషయం గుర్తెరగండి. అలాంటి చిన్నారుల్లోని బలాన్ని తట్టి లేపి, వారు పుంజుకునేలా ప్రోత్సహించండి. అంతే ఏ పిల్లవాడు ఆటిజం బాధితుడిగా మిగిలిపోడు. అద్భుతాలను సృష్టించే మేధావిగా, గొప్ప వ్యక్తిగా రూపుదొద్దుకుంటాడని అన్నారు. ఏ చిన్నారికైనా ఇల్లే ప్రథమ బడి, అదే జ్ఞానాన్ని సముపార్జించగల శక్తిని అందిస్తుందని చెబుతున్నారు బిల్‌గేట్స్.
(చదవండి: భారత రాజ్యాంగ రచనలో పాల్గొన్న మహిళలు వీరే..!)
Comments
Please login to add a commentAdd a comment