18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్‌ అయ్యాడు! | Man Could Not Read Or Write Becomes Cambridge University Professor | Sakshi
Sakshi News home page

18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్‌ అయ్యాడు!

Published Tue, Feb 28 2023 10:39 AM | Last Updated on Tue, Feb 28 2023 11:20 AM

Man Could Not Read Or Write Becomes Cambridge University Professor - Sakshi

అతనికి  11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్‌ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు. అదేలా సాధ్యం అనిపిస్తుంది కదూ!. కానీ జాసన్‌ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు.

అసలేం జరిగిందంటే..జాసన్‌ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్‌ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్‌ ఈ సమస్య కారణంగా 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటికి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కి ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఐతే జాసన్‌ దీన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు, ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలగేలా, అన్నినేర్చుకోవాలి అని తపించేవాడు.

తన తల్లి బెడ్‌రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికీ చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్‌. నెల్సన్‌ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్‌ విజయాన్ని కైవసం చేసుకోవడం తదితరాలను టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. అప్పుడూ అనుకున్నాడు అత్యున్నత చదువులను అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్‌ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్‌ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు.

అలా జాసన్‌ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌  స్టడీస్‌లో డిగ్రీ పొందాడమే గాక 2016లో లివర్‌పూల్‌ జాన్‌ మూర్స్‌ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయులు అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రోఫెసర్‌, యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ అయిన భాస్కర్‌ వీరా.  జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడన్నారు. 
చదవండి: తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్‌ మరణం: జెలెన్స్కీ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement