ఫైల్ ఫోటో
యుకేలో ముప్పై ఏళ్లుగా పిల్లలు, టీనేజర్లు, వారి కుటుంబాలతో కలిసి పనిచేయడంలో నైపుణ్యం కలిగిన పీడియాట్రిక్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ సియాన్ విల్సన్. ఆటిజంలో క్లినికల్ స్పెషలిస్ట్‌గా స్కూళ్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేశారు. సోషల్ కోచ్‌గా సేవలు అందిస్తున్నారు.
భారతదేశం పిల్లల్లో డిజేబిలిటీ ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయంపై సమీక్ష జరపడానికి ఇండియాకు వచ్చారు. పాతికేళ్లుగా చిల్డ్రన్ డిజేబిలిటీస్ పై వర్క్ చేస్తున్న మాధవి ఆదిమూలం, సియాన్ విల్సన్ లు యుకెలోనూ, ఇండియాలోనూ ఉన్న పరిస్థితులు, అమలు చేయాల్సిన విధానాల గురించి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన ఈవెంట్‌లో డిజేబిలిటీ చిల్డ్రన్ తల్లిదండ్రులతో కలిసి చర్చించారు.
నాటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాల వల్ల ఇంట్లో ప్రతి ఒక్కరూ ఒక థెరపిస్ట్‌గా పిల్లల వృద్ధికి దోహదపడేవారు. ఇప్పుడు తల్లితండ్రీ మాత్రమే కాదు ఒంటరి తల్లుల సంఖ్య పెరుగుతున్న ఈరోజుల్లో పిల్లల పెంపకం సమస్యగానే మారుతోంది అంటున్నారు నిపుణులు.
స్పెషలిస్ట్‌లు ఎక్కువ
‘‘యుకేలో స్పెషల్ చిల్డ్రన్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన విధానం, ఖర్చు అంతా అక్కడి కౌన్సిల్ చూసుకుంటుంది. కొన్నాళ్లుగా ఇండియాలోని ప్రముఖ చైల్డ్ డెవలప్‌మెంట్ క్లినిక్స్‌తో సంప్రదింపులు చేస్తున్నాను. ఇక్కడితో పోల్చితే యుకేలో స్పెషల్ చిల్డ్రన్‌ని చాలా చిన్నవయసులోనే గుర్తించడంలో అవగాహన అక్కడి పేరెంట్స్‌కు ఎక్కువ ఉంది. ఆటిజం చైల్డ్‌లో స్పీచ్ థెరపీ ద్వారా సరైన మెరుగుదలను తీసుకురావడానికి వారి స్థితిని బట్టి నార్మల్ స్కూల్ స్టూడెంట్స్‌తో కలుపుతారు. అయితే, అలాంటి ఒక చైల్డ్‌కి ఒక టీచర్ చొప్పున లెర్నింగ్ స΄ోర్ట్ అసిస్టెంట్‌ను కేటాయిస్తారు. అంటే, తన వయసు పిల్లలతో కలిసి ఉండే దోరణి వల్ల ఆ స్పెషల్ చైల్డ్‌లో మానసిక ఆరోగ్యం బాగవుతుంటుంది. ఎవరూ కూడా ఈ విధానానికి అడ్డు చెప్పరు’ అంటూ దేశంలో స్పెషల్ చైల్డ్ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలియజేశారు సియాన్ విల్సన్.
పరువు కాదు ముఖ్యం
‘చాలా మంది తల్లులు తమ పిల్లల్లో ఉన్న ఆటిజం సమస్యను గుర్తించడమే లేదు. ఒక వేళ ఏదైనా డిజేబిలిటీ ఉన్నా బయటకు తెలిస్తే పరువు ΄ోతుంది అనుకుంటున్నారు. ‘మా అమ్మాయి/అబ్బాయిని ట్యూషన్‌కో లేదో మ్యూజిక్, డ్యాన్స్ స్కూల్‌కో తీసుకెళుతున్నామని చెప్పి, తీసుకువస్తున్నామ’ని చెబుతున్నారు. టీనేజర్ స్థాయిలో ఉన్న పిల్లలను కూడా ఇంట్లోనే ఉంచుతున్నారు. వారికి ఎలాంటి థెరపీ ఇవ్వక΄ోవడం వల్ల సమస్య ఇంకా పెరుగుతుంది. దీంతో అప్పుడు నిపుణులను కలుస్తున్నారు. సమస్యను మొదట్లోనే గుర్తిస్తే, పరిష్కారం కూడా త్వరగా లభిస్తుంది’ అని వివరించారు థెరపిస్ట్ లక్ష్మీ ప్రసన్న.
పరువుతో వెనకడుగు వేయద్దు
‘‘అనన్య చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ పేరుతో 19 ఏళ్లుగా ఆటిజం పిల్లలకు సేవలు అందిస్తున్నాను. మా బాబు స్పెషల్ కిడ్ అవడంతో సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన నేను స్పెషలైజేషన్ చేసి, ఈ తరహా పిల్లల కోసమే పనిచేస్తున్నాను. ఇప్పుడు మా బాబు వయసు 24 ఏళ్లు. వాడు సంగీతంలో నైపుణ్యం సాధించడంతోపాటు ప్రదర్శనలు కూడా ఇస్తున్నాడు. మా బాబును ఇక్కడ సాధారణ స్కూల్లో చేర్చడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎడీహెచ్‌డీ ఆటిజం ఉన్న పిల్లల్లో మెరుగుదల కనిపిస్తున్నప్పుడు వారిని, మిగతా అందరిలాగే స్కూళ్లో చేర్చగలిగే శక్తిని కూడా అందించాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్లు సాధారణంగా ఎదుగుతారు. అంతేకాదు ఆటిజం పిల్లల పెంపకంలో వారిలో కొన్ని నైపుణ్యాలు కనిపిస్తుంటాయి. ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తమకు తాముగా పనులు చేసుకోవడమే కాదు నైపుణ్యాలను కూడా చూపుతారు. అందుకే ఈ విషయాల్లో గ్రామీణ స్థాయిలోనూ అవగాహన క్యాంపులను నిర్వహిస్తున్నాం. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నాం. అక్యుపేషనల్ థెరపిస్ట్‌ల కొరత మన దగ్గర చాలా ఉంది. థెరపిస్ట్‌ల సంఖ్య, తల్లిదండ్రులలో అవగాహన పెరిగితే ఈ సమస్యకు సరైన పరిష్కారం లభిస్తుంది’ అని వివరించారు మాధవి ఆదిమూలం.
– నిర్మలారెడ్డి
ఫొటోలు: బాలస్వామి, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment