Cambridge University
-
ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!
ఇరవై సంవత్సరాల బ్రిటిష్–ఇండియా స్టూడెంట్ అనౌష్క కాలే కేంబ్రిడ్జిలోని చారిత్రాత్మకమైన ‘కేంబ్రిడ్జి యూనియన్ డిబేటింగ్ సొసైటీ’ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఇంగ్లీష్ సాహిత్యం చదువుతున్న కాలే ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టిన అతి కొద్దిమంది దక్షిణాసియా మహిళల్లో ఒకరిగా నిలిచింది.‘ఎంతో చరిత్ర కలిగిన కేంబ్రిడ్జి యూనియన్ సొసైటీకి అధ్యక్షురాలిగా ఎన్నిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అంటుంది అనౌష్క. వివిధ సాంస్కృతిక సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా యూనియన్‌లో మరింత వైవిధ్యాన్ని తీసుకువస్తాను అని చెబుతుంది. గ్లోబల్ డిబేట్స్పై తనకు ఉన్న ఆసక్తిని తెలియజేసింది. ఇంటర్నేషనల్ స్పీకర్స్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి సారించింది.(చదవండి: ఊరు ఉమెన్ అనుకున్నారా... నేషనల్!) -
రాహుల్ గాంధీకి ఖలిస్థానీ సిక్కుల నిరసన సెగ!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు బ్రేక్ ఇచ్చి ఇటీవల లండన్ పర్యటించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సీటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడానికి వెళ్లారు. అయితే రాహుల్ గాంధీకి జడ్జ్ బిజినెస్ స్కూల్లో ఖలీస్థానీ అనుకూల సిక్కుల నుంచి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది. అయితే బిజినెస్ స్కూల్ అధికారుల జోక్యంతో నిరసన అదుపలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పోలీసులు.. ఖలీస్థానీ అనుకూల సిక్కు నిరసనకారులను జడ్జ్ బిజినెస్ స్కూల్లోకి తాము అనుమతించలేదని పేర్కొనటం గమనార్హం. పరమజిత్ సింగ్ పమ్మా ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరసన తెలిపినట్లు యూకే పోలీసులు తెలిపారు. పరమజిత్ సింగ్ పమ్మా.. యూరప్‌లోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కో-ఆర్డినేటర్. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, అమృత్సర్ హత్యలకు కారణం గాంధీ కుంటుంబమేనంటూ నిరసన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టే పలు విదేశి పర్యటనల్లో సైతం ఆయన తమ నిరసన తప్పించుకోలేరని నిరసనకారులు సవాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక.. ఖలీస్థానీ అనుకూల సిక్కుల నిరసన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం అనతంరం.. యూకే పోలీసులు కల్పించిన పటిష్టమైన భద్రత నడుమ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగినట్లు తెలిసింది. అయితే ఈ నిరసన ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు. -
ప్రధానిగా కాదు ఒక హిందువుగా వచ్చాను: రిషి సునాక్
లండన్: భారత్ దేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవాణ్ని పురస్కరించుకుని వేడుకల్లో మునిగిన వేళ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరిగిన రామకథా కార్యక్రమానికి హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ నేను ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ మొరారి బాపు మాట్లాడుతూ.. ఒక సాధారణ వ్యక్తిలా రిషి గారు ఇక్కడికి వచ్చారు. మీకు నా ప్రేమ పూర్వక స్వాగతం. దేవుడి ఆశీస్సులు మీపైనా బ్రిటీష్ ప్రజలపైనా మెండుగా ఉంటాయని ఆశీర్వదిస్తూ ప్రధానికి ఆహ్వానం పలికారు. ఈ సందర్బంగా ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జరుగుతున్న మొరారి బాపు రామ కథా కార్యక్రమానికి హాజరుకావడం గౌరవం గానూ సంతోషంగానూ భావిస్తున్నానని, ఈరోజు ఇక్కడికి ప్రధానిగా కాకుండా ఒక హిందువుగా వచ్చినట్లు తెలిపారు. మత విశ్వాసమనేది వ్యక్తిగతమైనది. నా జీవితంలో ఆ విశ్వాసమే నాకు తోడుండి నడిపిస్తోంది. ఒక ప్రధానిగా బాధ్యతలు నిర్వహించడం ఏమంత సులువు కాదు. నిర్ణయాలు తీసుకోవడంలోనే కాదు కఠినమైన సవాళ్లను ఎదుర్కోవడంలోనూ ఆ నమ్మకమే నాకు శక్తిని, ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తోందని అన్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దేవుడు నాకు నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్బంగా రిషి సునాక్ సౌతాంఫ్టన్ లో తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబంతో కలిసి అక్కడ దగ్గర్లో ఉన్న గుడికి వెళ్తూ ఉండేవాళ్లమని అన్నారు. తాము కూడా సాంప్రదాయ హిందూ కుటుంబం లాగే హోమయజ్ఞాది పూజలను నిర్వహించేవారమని తెలిపారు. మా సోదరులు, సోదరీమణులతో కలిసి అన్న ప్రసాదాలను కూడా వడ్డించేవాడినని జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆధ్యాత్మిక గురువు బాపు జీవితం విలువలతో కూడుకున్నదని ఆయన భక్తి, నిస్వార్ధమైన సేవాతత్వ దృక్పధం అందరికీ మార్గదర్శకమని అన్నారు. బాపు గారు చెప్పిన రామాయణం, భగవద్గీత, హనుమాన్ చాలీసా స్మరించుకుంటూ వెళ్తున్నానని జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి వినయపూర్వక పరిపాలనతో నిస్వార్దమైన సేవలందించడంలో శ్రీరామచంద్రుడే నాకు స్ఫూర్తి అని సునాక్ చెప్పారు. ఇది కూడా చదవండి: రష్యాలో భారీ పేలుడు.. 35 మంది మృతి -
BJP: ముందు క్షమాపణ చెబితేనే..
న్యూఢిల్లీ: తీవ్ర ఆందోళనల నడుమ పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం ఏర్పడుతోంది. ప్రధాన పార్టీల సభ్యుల ఆందోళనలతో వరుసగా రెండోరోజూ కూడా ఉభయ సభల నిర్వాహణ కష్టతరంగా మారింది. భారత ప్రజాస్వామ్యంపై లండన్‌లో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. క్షమాపణలు చెప్పిన తర్వాతే ప్రసంగించేందుకు అనుమతిస్తామని బీజేపీ స్పష్టం చేస్తోంది. ఒకవైపు రాహుల్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రసంగంపై బీజేపీ క్షమాపణలు కోరుతోంది. మరోవైపు అదానీ-హిడెన్‌బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి ప్రతపతిక్షాలు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) కూడా బీజేపీ-కాంగ్రెస్ నినాదాల నడుమ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కిందటి రోజు మైకులను ఆఫ్ చేశారు. ఇవాళ ఏమో ఏకంగా సభలనే నడవకుండా చేశారు. ప్రధాని మోదీ స్నేహితుడి(అదానీని ఉద్దేశిస్తూ..) పార్లమెంట్‌నే మూగబోయేలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ తన ట్విటర్ పేజీలో ట్వీట్ చేసింది. తనను మాట్లాడనిస్తే తన లండన్ ప్రసంగంపై వివరణ ఇస్తానంటూ రాహుల్ గాంధీ చెప్తుండగా.. మరోవైపు ముందు జాతికి క్షమాపణ చెబితే రాహుల్ గాంధీని మాట్లాడేందుకు అనుమతిస్తామని చెబుతోంది. ఈ తరుణంలో పోటాపోటీ నినాదాలతో పార్లమెంట్ కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. బ్రిటన్ లండన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడి జరుగుతోందని ఆరోపించారు. -
రాహుల్‌పై బీజేపీ ఫైర్.. కాంగ్రెస్, చైనాలు భాయ్ భాయ్ అంటూ..
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ చేసిన విమర్శలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, ప్రతిపక్ష నాయకులపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్, రాహుల్ గాంధీపై ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి, పెగాసెస్ స్పైవేర్ దేశంలోని రాజకీయ నాయకుడి ఫోన్లలో ఉందంటూ కామెంట్స్ చేశారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. విదేశీ గడ్డపై ఇండియాను కించపరిచే ప్రయత్నమంటూ మండిపడ్డారు. ఇదివరకు విదేశీయులు దాడి చేస్తే.. ఇప్పుడు స్వదేశీయులు సైతం భారత్‌ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జ్‌లో రాహుల్ చేసిన ప్రసంగం ఆదరణీయ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ముసుగులో విదేశీ గడ్డపై మన దేశాన్ని కించపరిచే ధృడమైన ప్రయత్నం తప్ప మరొకటి కాదు అంటూ విమర్శించారు. ఇదే సమయంలో రాహుల్ ప్రస్తావించిన ప్రజాస్వామ్యంపై దాడి అనే వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. బీజేపీ ప్రభుత్వం అందించిన రక్షణలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర ముగిసిందన్నారు. జోడో యాత్రలో 4,000 కిలో మీటర్లు ఏ ప్రమాదం లేకుండా ప్రయాణించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నేతలు తలపెట్టిన యాత్రలను ఎలా విధ్వంసం చేశారో ఆయనకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందా? అంటూ మండిపడ్డారు. మరోవైపు.. రాహుల్ ఫోన్ పెగాసెస్ ఉందన్న వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. దీనిపై విచారణకు రాహుల్ తన ఫోన్ ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. First foreign agents target us! Then our own targets us on a foreign land! Rahul Gandhi’s speech at Cambridge was nothing but a brazen attempt to denigrate our country on foreign soil in the guise of targeting Adarniya PM Shri @narendramodi ji. Thread — Himanta Biswa Sarma (@himantabiswa) March 3, 2023 ఇక, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ స్పందిస్తూ.. విదేశాలకు వెళ్లిన ప్రతీసారి రాహుల్ భారత్‌ను అవమానపరుస్తున్నాడు. చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు. దేశ ప్రజలు ఆయన నిజస్వరూపాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రాహుల్ మాటలు చిన్న పిల్లాడు మాట్లాడినట్టుగా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అంటూ కామెంట్స్ చేశారు. #WATCH |This is Rahul Gandhi-whenever he goes abroad,he insults India...He does this whenever he goes abroad&calls China the symbol of goodwill. Country should see his true face...We condemn his childish statment..:BJP's RS Prasad on Rahul Gandhi's address at Cambridge University pic.twitter.com/aMEtS3nJJR — ANI (@ANI) March 3, 2023 -
18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్ అయ్యాడు!
అతనికి 11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు. అదేలా సాధ్యం అనిపిస్తుంది కదూ!. కానీ జాసన్ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు. అసలేం జరిగిందంటే..జాసన్ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్ ఈ సమస్య కారణంగా 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటికి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కి ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఐతే జాసన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు, ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలగేలా, అన్నినేర్చుకోవాలి అని తపించేవాడు. తన తల్లి బెడ్రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికీ చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్ విజయాన్ని కైవసం చేసుకోవడం తదితరాలను టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. అప్పుడూ అనుకున్నాడు అత్యున్నత చదువులను అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు. అలా జాసన్ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీస్‌లో డిగ్రీ పొందాడమే గాక 2016లో లివర్‌పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయులు అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రోఫెసర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన భాస్కర్ వీరా. జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడన్నారు. చదవండి: తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ మరణం: జెలెన్స్కీ) -
వైద్య చరిత్రలో మరో అద్భుతం... మూలకణాలతో కృత్రిమ గర్భస్థ పిండం
కేం బ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ గర్భస్థ పిండాన్ని సృష్టించారు. ఈ పిండంలో మానవ పిండం మాదిరిగా అవయవాలన్ని క్రమంగా అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భస్థ పిండాన్ని సృష్టించడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. వాస్తవానికి పరిశోధకులు వైద్యశాలల్లో పిండాన్ని స్త్రీలోని అండాలు, పురుషుడిలోని స్పెర్మ్‌ని ఉపయోగించి కృత్రిమంగా పిండాన్ని రూపొందిస్తారు. దీన్నే టెస్ట్‌ట్యూబ్ బేబి అంటారు. బాహ్యంగా పిండాన్ని రూపొందించడం. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రవేత్తలు వాటిని వినియోగించకుండా కేవలం స్టెమ్ సెల్స్(మూల కణాలను) వినియోగించి కృత్రిమ గర్భస్థ పిండాన్ని రూపొందించారు. ఈ మేరకు ప్రోఫెసర్ మాగ్డలీనా జెర్నికా నేతృత్వంలో తమ బృందం ఈ పిండాన్ని రూపొందిచినట్లు తెలిపారు. అదీకూడా మూడు వేర్వేరు మూలకణాలను తీసుకుని ఈ పరిశోధన చేసినట్లు తెలిపారు. ఆ మూలకణాల్లోని జన్యువులను పరస్పరం చర్య జరుపుకునేలా ప్రత్యేక వాతావరణాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలా రూపొందిన ఈ గర్భస్థ పిండం మానవుల గర్భస్థ పిండంలో గుండె కొట్టుకోవడం, మెదడు, చర్మం వంటివి ఎలా అభివృద్ధి చెందుతాయో అలా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధన కొంతమంది తల్లులకు గర్భం విజయవంతమవ్వడం, మరికొందరికి గర్భస్రావం అవ్వడంవంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. తల్లిగర్భంలో ఎలా పిండం అభివృద్ధి చెందుతుందో అలా మూలకణాలతో రూపొందిన కృత్రిమ పిండం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ కృత్రిమ పిండాన్ని తల్లి గర్భంలో అమర్చి వివిధ దశల్లో ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోగలగడమే కాకుండా మరిన్ని పరిశోధనలకు ఇది ఉపకరిస్తుందని చెప్పారు. (చదవండి: ఉక్రెయిన్ విడిచి వచ్చిన పౌరులకు... బంపరాఫర్ ప్రకటించిన పుతిన్) -
కేంబ్రిడ్జి విభాగానికి భారత శాస్త్రవేత్త పేరు
లండన్: కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి భారతీయ శాస్త్రవేత్త, ఔషధ దిగ్గజ కంపెనీ సిప్లా చైర్మన్ యూసుఫ్ హమీద్(84)పేరు పెట్టారు. ఈయన కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన క్రైస్ట్ కాలేజీలో చదివారు. యూసుఫ్ హమీద్ 66 ఏళ్లుగా యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి పెట్టిన ఈయన పేరు 2050 వరకు అమలులో ఉంటుందని యూనివర్సిటీ ప్రకటించింది. యూసుఫ్ 2018లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కెమిస్ట్రీ విభాగంలో ఉన్న పీఠానికి దాతగా ముందుకొచ్చారు. దీన్ని యూసుఫ్ హమీద్ 1702 పీఠంగా పిలుస్తుంటారు. కాగా యూసుఫ్ హమీద్ తండ్రి కె.ఎ.హమీద్ ముంబైలో సిప్లా కంపెనీని ప్రారంభించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు అతి తక్కువ ఖర్చుతో హెచ్ఐవీ ఎయిడ్స్ మందులను సరఫరా చేయడంలో ఈ కంపెనీ అగ్రభాగంలో నిలిచింది. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కి ఆయన చేసిన సాయం ఎంతో గొప్పదని, విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయోగపడుతుందని వైస్ చాన్స్‌లర్ స్టీఫెన్ జె టూపే అన్నారు. హమీద్‌ని 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. (చదవండి: నీరా నియామకాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్లు) -
డెమోక్రసీ పట్ల పడిపోయిన విశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల యువతకు క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. తాజాగా ప్రపంచంలోని 160 దేశాల నుంచి 35 ఏళ్ల లోపు యువత నుంచి అభిప్రాయాలను కేంబ్రిడ్జి యూనివర్శిటీ సేకరించగా కేవలం 48 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. 1990, 2000 దశకాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై మూడింట రెండు వంతుల మంది విశ్వాసం వ్యక్తం చేయగా, ఇప్పుడు వారి శాతం యాభైకన్నా దిగువకు పడిపోవడం గమనార్హం. అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల 62 శాతం యువత విశ్వాసం వ్యక్తం చేయగా ఇప్పుడు కేవలం 48 శాతం యువత మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 54 శాతం ఉండగా, అది 1950వ దశకానిని 57 శాతానికి పెరిగింది. 1990, రెండువేల సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరం భారీగా పెరగడంతో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 62 శాతానికి పెరిగింది. అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో మే 25వ తేదీన ఓ నల్లజాతీయుడు, ఓ తెల్లజాతి పోలీసు చేతిలో చనిపోవడం, ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ సిటీలో ప్రజా ఉద్యమంలో భాగంగా జూన్ ఏడవ తేదీన ఎడ్వర్డ్ కొలస్టన్ విగ్రహాన్ని విధ్వసం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో యువతలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. 160 దేశాల నుంచి 50 లక్షల మంది యువతను శాంపిల్‌గా తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఈ సర్వేను నిర్వహించింది. -
కోవిడ్-19: ఇలా చేస్తే కరోనా రాదు!
లండన్ : అమెరికాలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ తర్వాత ఎత్తివేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండకపోగా, కరోనా వైరస్ రెండవ విడతగా మరింత తీవ్రంగా విజృంభించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివేన్షన్ (సీడీసీ) డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ హెచ్చరించిన నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేసినా కరోనా కట్టడిలో ఉండడానికి తీసుకోవాల్సిన 275 జాగ్రత్తలను కేంబ్రిడ్జి యూనివర్శిటీ నిపుణులు ఖరారు చేశారు. తాము ఖరారు చేసిన ఈ సూచనలను పాటించినట్లయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు చెబుతున్నారు. 1. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మనుషులు పాటిస్తున్న అన్ని జాగ్రత్తలు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా పాటించాలని వారు చెప్పారు. ఇంటా, బయట ఒకరికి ఒకరి మధ్య దూరం రెండు మీటర్లు పాటించడం. 2. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం, మాస్క్‌లు ధరించడం. 3. ఇంటి గేటు, ప్రధాన డోర్ తలుపులను తెరచి ఉంచడం, ఇంట్లోకి వచ్చేవారు చేతులు వేయాల్సిన అవసరం లేకుండా. లేదా సెలఫోన్, ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా వాటంతట అవే తెరచుకునే ఏర్పాటు చేయడం. 4. తరచుగా ముఖంపైకి చేతులు పోకుండా నివారించేందుకు చేతుకు అలారం రబ్బర్ బ్యాండ్ ధరించడం. 5. వీలైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న వేళల్లోనే బయటకు రావడం. 6. అనవసరంగా ఎవరితో మాట్లాడక పోవడం. 7. ఎస్కలేటర్లు ఎక్కకుండా ఉండడం. 8. క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను దించినప్పుడు, ఎక్కించుకున్నప్పుడు కారు దిగకుండా తన సీటుకే పరిమితం కావడం. 9. ఆహారం, ఇతర నిత్యావసరాల సరఫరాకు డ్రోన్లు ఉపయోగించడం. 10. పెండ్లిళ్లు, పేరంటాలకు వీలైనంతగా దూరం ఉండడం. అంత్యక్రియలకైనా సరే 20 మందికి మించి అనుమతించకపోవడం. 11. హోటళ్లలో కూడా టేబుళ్లు, కుర్చీలు దూర దూరంగా ఏర్పాటు చేయడం, టేబుల్ ఖాళీ అయినప్పుడల్లా శానిటైజర్లతో తుడవడం. 12. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మ్యూజిక్‌ను అనుమతించక పోవడం. 13. 275 సూచనలు వివరించడం కష్టం కనుక ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక సంబంధాలకు దూరంగా ఇంటికి ఎలా పరిమితం అవుతామో, బయటకు వెళ్లినప్పుడు కూడా అన్ని సామాజిక సంబంధాలకు దూరంగా మసలుకోవడం. కరోనా అంతానికి అదొక్కటే మార్గం: యూఎన్ చీఫ్ -
ఆ మాట వినగానే గొల్లున నవ్వారు..
లండన్: కేంబ్రిడ్జి యూనివర్శిటీలో పీజీ చదువుతున్న 21 ఏళ్ల డానియెల్లీ బ్రాడ్‌ఫోర్డ్‌కు ‘మార్శ్ ఆర్కియాలోజీ’ విభాగం నుంచి ఫోన్ రాగానే ఆమె ఆనందంతో ఎగిరి గంతేశారు. ‘ఆర్కియాలజీ ఫీల్డ్ వర్క్‌లో మహిళలపై లైంగిక వేధింపులు’ అన్న అంశంపై రీసెర్చ్ చేసి థీసిస్‌ను సమర్పించినందుకుగాను ఆమెకు అవార్డు ఇస్తున్నట్లు చెప్పడానికే ఆ ఫోన్‌కాల్. నవంబర్ 22వ తేదీ సాయంత్రం తమ ఆర్కియాలజీ విభాగం ప్రాంగణంలోని ఆడిటోరియంలో జరిగే అవార్డుల కార్యక్రమానికి రావాల్సిందిగా బ్రాడ్ఫోర్డ్ను ఆహ్వానించారు. ఫీల్డ్‌వర్క్‌లో లైంగిక వేధింపులకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చర్యలను కూడా ఆమె తన థీసిస్‌లో సూచించారు. అవార్డు అందుకోబోతున్న సంతోషంలో ఆమె అవార్డుల కార్యక్రమానికి అరగంట ముందుగానే చేరుకున్నారు. వివిధ కేటగిరీల్లో అవార్డులను ప్రకటించిన నిర్వాహకులు ఆర్కియాలజీ ఫీల్డ్‌వర్క్‌లో మహిళలపై లైంగిక వేధింపులపై అధ్యయనం జరిపినందుకు అవార్డు ఇస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించగానే ప్రేక్షకులు ముఖ్యంగా మగాళ్లు గొల్లున నవ్వారు. ఆమె అవార్డు అందుకోవడానికి వేదికపైకి వెళుతున్నప్పుడు కూడా ‘ఆర్కియాలజీ ఫీల్డ్ వర్క్‌లో లైంగిక వేధింపులా’ అంటూ పగలబడి నవ్వారు. అవార్డు కింద ఓ జ్ఞాపికను, సర్టిఫికెట్‌ను అందుకున్న ఆనందం క్షణం కూడా నిలబడకుండా పోవడంతో బ్రాడ్ఫోర్డ్ వెక్కి వెక్కి ఏడుస్తూ పరుగు పరుగున వెళ్లి తన సీటులో కూర్చుంది. ‘ఆర్కియాలజీ ఫీడ్వర్క్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులు జరగకపోవచ్చుకానీ మీ పట్ల జరిగి ఉండవచ్చు’ అంటూ ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలను భరించలేక ఆమె అక్కడి నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు. బ్రాడ్ఫోర్డ్ సాహసించి రీసర్చ్కు ఈ అంశాన్ని ఎంపిక చేసుకున్నందుకు ప్రశంసించాల్సిందిపోయి, హేళన ఎందుకు చేస్తారంటూ నిర్వాహకులు ప్రేక్షకులకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆ తర్వాత ట్విటర్లో కూడా ఆమెను ట్రోల్ చేశారు. -
మధుమేహం.. ఇలా దూరం..
మధుమేహం వచ్చినట్లు నిర్ధారణైన తొలి ఐదేళ్లలోనే శరీర బరువును పది శాతం కంటే ఎక్కువ తగ్గించుకోగలితే వ్యాధిబారిన పడటాన్ని తప్పించుకోవచ్చని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహులు దాదాపు 40 కోట్ల మంది ఉండగా.. భారత్‌లో వీరి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత పలు రకాల జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా మనకు పరిచయమైన విషయమే. రోజుకు 700 కేలరీల ఆహారాన్ని 8 వారాలపాటు కొనసాగిస్తే వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని ఇటీవలి పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఈ ఫలితం చాలాకాలంగా వ్యాధి తో బాధపడుతున్న వారిలో సగం మందిలో కనిపించగా.. కొత్తగా నిర్ధారణ అయిన వారిలో 90 శాతం వరకూ ఉంది. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించారు. తొలి ఐదేళ్లలో పది శాతం కంటే ఎక్కువ బరువు తగ్గిన వారికి సమస్యలు తక్కువగా ఉన్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో కేలరీలను పరిమితం చేయడం, కడుపు కట్టుకుని వేగంగా బరువు తగ్గడం కంటే పది శాతం మాత్రమే తగ్గడమన్నది ఆచరణ సాధ్యమైన విషయమని, చాలామంది అనుసరించేందుకు వీలైందని, అందుకే తమ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడిందని డాక్టర్ హజీరా డంబా మిల్లర్ తెలిపారు. -
నింగికి నిచ్చెన వేద్దామా?
బాలభారతం సినిమాలో ఓ పాట ఉంటుంది.. అర్జునుడు బాణాలతో ఓ నిచ్చెన వేస్తే.. భీముడు ఆ మెట్లు ఎక్కుతూ అంతరిక్షానికి చేరుకుంటాడు. అంతరిక్షం అంచుల దాకా నిచ్చెన వేయడం ఆనాటి కవి కల్పన కావొచ్చు.. కానీ సాంకేతికత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నిర్మించలేమా? ఎంచక్కా చేయొచ్చు కానీ కొంచెం రివర్స్‌గా ఆలోచిద్దాం అంటున్నారు శాస్త్రవేత్తలు.. స్పేస్ ఎలివేటర్.. ప్రపంచవ్యాప్తంగా అందరిలో ఆసక్తి రేకెత్తించిన అంశం ఇది. భూమ్మీది నుంచి బలమైన ఉక్కుతాళ్లతో ఓ లిఫ్ట్ లాంటిది నిర్మించడం తద్వారా జాబిల్లితో పాటు ఇతర గ్రహాలను సులువుగా చేరుకోవడం ఆ ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం. అయితే అందుబాటులో ఉన్న పదార్థాలు, టెక్నాలజీలతో ఈ అంతరిక్ష నిచ్చెన కట్టడం దాదాపు అసాధ్యమని తేలింది. తాజాగా కొలంబియా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్పేస్ ఎలివేటర్ నిర్మాణానికి వినూత్న ప్రతిపాదన చేశారు. నిచ్చెన భూమ్మీది నుంచి కాకుండా.. చందమామ నుంచి వేలాడుతూ ఉండటం ఈ తాజా ఆలోచన! గ్రహాలను అందుకునేందుకు.. అంతరిక్ష ప్రయోగాల ఖర్చు కోట్లల్లో ఎందుకుంటుందో తెలుసా? భూమి గురుత్వాకర్షణ శక్తి మొత్తాన్ని అధిగమించేంత శక్తి అవసరం కాబట్టి.. బోలెడంత ఇంధనం అవసరమవుతుంది కాబట్టి. సమీప భవిష్యత్తులోనే జాబిల్లిపై మకాం పెట్టాలని అగ్రరాజ్యాలు ఆలోచిస్తుండగా.. ఎలన్ మస్క్ వంటివాళ్లు ఇంకో నాలుగేళ్లలో అంగారకుడిపై కాలనీ ఏర్పాటు చేస్తామంటున్నారు. కాబట్టి ఇలాంటివి సాధ్యం కావాలంటే స్పేస్‌లైన్ సూచిస్తున్న నిచ్చెన లాంటివి అత్యవసరమవుతాయి. కొలంబియా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల ప్రతిపాదన ప్రకారం.. జాబిల్లిపై బలమైన తీగ లాంటిదాన్ని బిగించి దాన్ని భూస్థిర కక్ష్య వరకు వేలాడేలా చేస్తారు. భూమ్మీది నుంచి వెళ్లే రాకెట్లు.. ఈ తీగ కొనకు చేరుకుంటాయి. అక్కడే పార్క్ అవుతాయి. ఆ తర్వాత వ్యోమగాములు ఈ తీగ వెంబడి ఇంకో రాకెట్లో సులువుగా జాబిల్లిని చేరుకుంటారు. అంతరిక్షంలో ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి తక్కువ శక్తితోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. ఈ శక్తిని కూడా సౌరశక్తితో అక్కడికక్కడే ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు అవసరమైన అన్ని టెక్నాలజీలు, పదార్థాలు అందుబాటులోనే ఉన్నాయని జెఫైర్ పెనైరీ అనే శాస్త్రవేత్త తెలిపారు. ఎంతో కీలకం... అతితక్కువ ఖర్చుతో వ్యోమగాములను జాబిల్లికి చేర్చడం మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో ఇతర గ్రహాలకు వెళ్లేందుకు కూడా స్పేస్‌లైన్ కీలకమైన నిర్మాణం కానుందని వివరించారు. భవిష్యత్తులో ఈ స్పేస్‌లైన్ నిర్మాణమంటూ జరిగితే.. దాన్ని టెలిస్కోపులు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు వాడుకోవచ్చని జెఫైర్ అంటు న్నారు. భూమి, జాబిల్లి తాలూకు గురుత్వశక్తులు సమానంగా.. వ్యతిరేక దిశలో ఉండే లంగ్రాంజ్ పాయింట్ ప్రాంతంలో ఇతర వ్యవస్థలను ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. పూర్తి వివరాలు ఏఆర్ఎక్స్ ఐవీ ప్రీ ప్రింట్లో ప్రచురితమయ్యాయి. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు...!
న్యూఢిల్లీ : బ్రిటన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థినులపై లైంగిక దాడులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి. గత నాలుగేళ్ల కాలంలోనే పదింతలు పెరగడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2014లో కేవలం 65 లైంగిక దాడులు చోటు చేసుకోగా అవి 2018లో 626కు చేరుకున్నాయి. బర్మింగ్‌హామ్ కేంబ్రిడ్జి యూనివర్శిటీ, ఈస్ట్ ఆంగ్లియా లెక్కల ప్రకారం ఆ ఏడాది దాదాపు 2000 రేప్‌లు, లైంగిక దాడులు, వేధింపు సంఘటనలు చోటు చేసుకున్నాయని ‘ఛానల్ 4 న్యూస్’ దర్యాప్తులో తేలింది. వీటిలో ఎక్కువ సంఘటనలు కేసుల వరకు వెళ్లలేదు. కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారనే ఆందోళనతో చాలా సంఘటనలపై బాధితులైన విద్యార్థినులు ఫిర్యాదు చేయలేదు. కొందరు ఫిర్యాదు చేయడానికి ధైర్యంగా ముందుకు వెళితే వారిని యూనివర్శిటీల నుంచే అధికారులు తొలగించి వేశారట. ఆకతాయి అబ్బాయిలు చిత్తుగా తాగడం ఈ దారుణాలు పెరగడానికి ఓ కారణమైతే, తల్లిదండ్రులు పిల్లల్ని హద్దుల్లో ఉంచకపోవడం మరో కారణమని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడులు జరిగిన విషయాన్ని కొంత మంది విద్యార్థినులు బయటకు చెప్పుకోలేక పోతున్న నేపథ్యంలో కేంబ్రిడ్జ్‌లో అలాంటి సంఘటనల గురించి ఆకాశ రామన్నలు ఫిర్యాదు చేయడానికి ఆన్లైన్ ఫిర్యాదుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. గత కొంతకాలంలో లైంగిక దాడులు మరీ పెరిగిన నేపథ్యంలో యూనివర్శిటీ అధికారులు ‘సెక్స్‌వెల్ అసాల్ట్ అడ్వైజరీ సెల్స్’ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విభాగాలు మహిళలు తమకు జరిగిన అన్యాయాలను సక్రమంగా ఫిర్యాదు చేయడానికి తోడ్పడుతున్నాయి. 60 శాతం మంది మహిళలు కళాశాలల నుంచి నేడు సురక్షితంగా ఇంటికి వెళ్లలేమని ఓ అధ్యయనంలో వెల్లడించారు. తమకు ఉద్దేశపూర్వకంగానే అనవసరంగా తాకుతున్నారని 35 శాతం మహిళలు వాపోతున్నారు. -
బడికి నడిచి వెళితే ఊబకాయం దూరం!
పాఠశాలకు తరచూ నడిచి లేదంటే సైకిల్‌పై వెళ్లే పిల్లలు ఊబకాయులుగా మారే అవకాశాలు తక్కువని అంటున్నారు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. లండన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వేల మంది పాఠశాల విద్యార్థులను ప్రశ్నించడం ద్వారా తాము ఒక అధ్యయనం నిర్వహించామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లాండర్ బాష్ తెలిపారు. బీఎంసీ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. జాతి, పరిసరాలు, ఆర్థిక, సామాజిక వర్గాలన్నింటిలోనూ ఒకే రకమైన ఫలితం కనిపించింది. ఊబకాయానికి బాడీ మాస్ ఇండెక్స్‌ను సూచికగా తీసుకోకుండా శరీరంలోని కొవ్వు, కండరాల ద్రవ్యరాశిని లెక్కకట్టి కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు ఈ అంచనాలకు వచ్చారు. ఈ అంశాలకూ వ్యాయామానికి మధ్య ఉన్న సంబంధాన్ని అంచనా వేశారు. అధ్యయనం చేసిన రెండు వేల మందిలో సగం మంది రోజూ ఆటలాడతారని, మిగిలిన వారు కాలినడకన లేదంటే సైకిల్‌పై స్కూలుకు వెళతారని బాష్ తెలిపారు. వీరిలో కొవ్వు మోతాదు తక్కువగా ఉండటాన్ని తాము అప్పుడప్పుడూ చేసిన పరీక్షల ద్వారా గుర్తించామని తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ పద్ధతి ద్వారా లెక్కించినప్పుడు రోజు ఆటలాడే పిల్లలు కూడా అధిక బరువు ఉన్నట్లు తెలుస్తోందని, కొవ్వు, కండరాల మోతాదులను పరిశీలించినప్పుడు రోజూ ఆటలాడే వారిలో కండరాల ద్రవ్యరాశి ఎక్కువగా ఉందని వివరించారు. బడికొచ్చే పిల్లలను సైకిల్ ఎక్కేలా ప్రోత్సహించడం ద్వారా ఊబకాయం సమస్యలను సులువుగా తగ్గించవచ్చునని చెప్పారు. -
టాప్ 250లో లేని భారత యూనివర్సిటీలు
లండన్ : ‘ది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్లో భారత్ నుంచి ఒక్క విశ్వవిద్యాలయం కూడా చోటు దక్కించుకోలేదు. కాగా, బుధవారం విడుదలైన ఈ జాబితాలో ప్రపంచ అత్యుత్తమ యూనివర్సీటీగా ఆక్స్ఫర్డ్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. మాసాచుసెట్స్ నాలుగో స్థానంలో ఉంది. 2019కి సంవత్సరానికి గాను ప్రపంచవ్యాప్తంగా 250 యూనివర్సీటీలకు టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాకింగ్స్ ఇచ్చింది. ఇదిలాఉండగా.. భారత్‌లోని అన్ని యూనివర్సిటీల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగుళూరు టాప్‌లో నిలిచింది. ఐఐటీ-ఇండోర్, ఐఐటీ-బాంబే యూనివర్సిటీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే, ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల జాబితాలో చోటు దక్కించుకోని భారత్.. గతేడాదికంటే కొంత మెరుగు పడింది. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ జాబితాలో భారత్‌నుంచి పోయిన సంవత్సరం 42 యూనివర్సీలు ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 49కి చేరింది. దీంతో 250పైన ర్యాంకులు గల దేశాల జాబితాలో ఇండియా అయిదో స్థానంలో నిలిచింది. ఐఐఎస్సీ బెంగుళూరు 251-300 ర్యాంకింగ్స్‌లో కొనసాగుతోంది. -
నకిలీ వార్తలకు చెక్ పెట్టే టెక్నాలజీ
సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లువెత్తుతున్న నకిలీ వార్తల వల్ల కలుగుతున్న నష్టాలేమిటో అందరికీ తెలిసిందే. ఫేస్‌బుక్‌లోనో లేదా ట్విట్టర్లోనో వచ్చిన వార్త నిజమో కాదో తెలుసుకునే అవకాశం ఇంత వరకు లేకపోవడం వల్ల ఆ వార్తలను నిజమని నమ్మిన కొందరు భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఈ ఇబ్బందుల్ని తొలగించడానికి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు అసలీనా నకిలీనా అన్ని నిగ్గుతేల్చే సాంతికేక పరిజ్ఞానం అందుబాటులోకి రానుంది. బ్రిటన్‌లో ఇంజనీరింగ్ చదువుతున్న భారత సంతతికి చెందిన లిరిక్ జైన్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్త నిజమైనదో కాదో నిర్థారించే పరిజ్ఞానాన్ని అభివద్ధి చేశాడు. ఈ పరిజ్ఞానం(ఫ్లాట్‌ఫాం) సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను వడబోసి నిజమైన వార్తలను నిర్థారిస్తుంది. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా కథనం లేదా సమాచారం రాగానే ఈ ఫ్లాట్‌ఫాం 70వేలకు పైగా డొమైన్ల నుంచి వాటికి సంబంధించిన కథనాల్ని సేకరిస్తుంది. ప్రతి కథనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఆ కథనం హేతుబద్ధంగా ఉందా... దాని వెనుక రాజకీయ ప్రయోజనాలేమైనా ఉన్నాయా? కథనంలో ఇచ్చిన గణాంకాలన్నీ సరైనవేనా? అన్నది పరిశీలించి ఆ వివరాలను బహిర్గతం చేస్తుంది. దానిని బట్టి వినియోగదారుడు ఆ కథనం నమ్మదగినదో కాదో నిర్థారించుకుంటాడు. ఈ పరిజ్ఞానం ప్రస్తుతం ప్రయోగదశలో ఉందని,వచ్చే సెప్టెంబర్‌లో అమెరికా, బ్రిటన్లలో అందుబాటులోకి వస్తుందని లిరక్ జైన్ తెలిపారు. అక్టోబర్‌లో ఈ పరిజ్ఞానం భారత్‌లో ప్రవేశపెడతామని ఆయన అంటున్నారు.వార్తలు, కథనాల్లో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు కత్రిమ మేథను కూడా ఉపయోగించుకుంటామని జైన్ చెప్పారు. భారత దేశంలో 20 కోట్ల మందికిపైగా వాట్సాప్ వినియోగదారులున్నారు.ఇటీవల వాట్సాప్‌లో వస్తున్న అసత్య ప్రచారాలు, నకిలీ కథనాలు అల్లర్లకు, హత్యలకు దారితీస్తున్నాయి. ‘వాట్సాప్‌లో వస్తున్న కథనాలు, వార్తలు ఉద్రేకపూరితంగా, భావోద్వేగాలను రెచ్చగొట్టేవిగా ఉంటున్నాయి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం ఆ కథనాలు అసలైనవో కాదో తెలుసుకోవడానికి, అవాస్తవ కథనాలను నియంత్రించడానికి చాలా సమయం పడుతోంది. ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ లోపాన్ని అధిగమించడం కోసం సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని అప్పటి కప్పుడే వడపోసే అవకాశాల కోసం మేం అన్వేషిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో దీనికి సంబంధించిన మా ప్రణాళికల్ని ప్రకటిస్తాం’ అని జైన్ అంటున్నారు. మైసూరు నుంచి కేంబ్రిడ్జి వరకు.. మైసూరు చెందిన 21 ఏళ్ల లిరిక్ జైన్ కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. గత ఏడాది లాజిక్ అలే పేరుతో ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశాడు. బ్రిటన్‌లో మొట్టమొదటి ఇంటెలిజెంట్ న్యూస్ ఫీడ్ కంపెనీ ఇదే. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నకిలీ వార్తలను గుర్తించడం దీని పని. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన నిపుణులతో 10లక్షల పౌండ్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేశారు. బ్రిటన్,అమెరికా, భారత్‌లలో ప్రస్తుతం ఈ కంపెనీకి 38 మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని ఆలోచిస్తున్నట్టు జైన్ తెలిపారు. -
వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..?
లండన్: మందుబాబులు..మీరు వారానికి 10 గ్లాసుల వైన్ తాగుతున్నారా..? అయితే ఇక మీ జీవితంలో రెండు ఏళ్ల ఆయుషు తగ్గిపోయినట్లేనని అంటున్నారు కేంబ్రిడ్జి యూనివర్సీటీ పరిశోధకులు. ఇటీవలే వారు మద్యంపై వైద్య పరంగా ఓ విస్తృతమైన పరిశోధన చేశారు. వారి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ వ్యక్తి వారానికి పది లేదా అంత కంటే ఎక్కువ గ్లాసుల వైన్‌ను సేవిస్తే రెండేళ్ల ఆయుషు తగ్గుతుందని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. పరిశోధన కోసం19 దేశాలకు చెందిన దాదాపు ఆరు లక్షల మందిని పరిశీలించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 40 ఏళ్ల ఓ వ్యక్తి వారానికి 5 పెగ్గుల మద్యాన్ని సేవిస్తే తన జీవిత కాలంలో ఆరు నెలలు నష్టపోతాడని, 10 గ్లాసుల వైన్ తాగితే రెండేళ్లు, 18 గ్లాసులు తాగితే ఐదేళ్ల ఆయుషును కోల్పోతారని యూనివర్సీటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. యూనివర్సీటీ శాస్త్రవేత్త డాక్టర్ ఎంజెలా వుడ్ మాట్లాడుతూ..ఇప్పటికే మద్యం సేవించేవారు తాగడం తగ్గించాలని లేదంటే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మితిమీరిన మద్యం తాగడం వల్ల లివర్ క్యాన్సర్, రక్త పోటు లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన వారికి మద్యం సేవించడం వల్లే ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు పరిశోధనలో తేలిందన్నారు. -
గొర్రెలు మనుషులను గుర్తుపట్టగలవట
-
గొర్రెలకు కూడా తెలివితేటలు ఉన్నాయట
సాక్షి, న్యూఢిల్లీ : తెలివితేటలులేని వారిని, మంద బుద్ధిగల వారిని మనం సాధారణంగా గొర్రెలని విమర్శిస్తుంటాం. కానీ తెలివితేటలు గొర్రెలకు కూడా ఉంటాయట అవి మనుషులను గుర్తుపట్టగలవట. ముఖ్యంగా జీవితంలో ఎప్పుడూ చూడని సెలబ్రిటీలను మరింత చక్కగా గుర్తుపట్టగలవట. అదెలాగంటే ఫొటోలను చూడడం ద్వారట. మనుషులవి, సెలబ్రిటీల ఫొటోలను చూపించడం ద్వారా కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు గొర్రెల తెలివితేటలపై అధ్యయనం జరిపి ఈ విషయాన్ని నిరూపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, సినీతారలు ఎమ్మా వాట్సన్, జేక్ గెల్లెన్హాల్, బ్రిటన్ న్యూస్ రీడర్ పిలోనా బ్రూస్ ఫొటోలను ఉపయోగించి యూనివర్శిటీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మరింత మెరుగ్గా జంతుసంరక్షణ చేయడం కోసం ఇలాంటి అధ్యయనాలు ఉపయోగపడడమే కాకుండా మనుషులకు వచ్చే హంటింగ్డాన్, పార్కిన్సన్స్ రోగాలతోపాటు స్కిజోఫ్రేనియా, ఆటిజమ్ లాంటి మానసిక రుగ్మలతలను అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని పరిశోధకులు తెలిపారు. మనుషులకు, గొర్రెలకున్న తేడాలను గుర్తుపడతాయా అన్న అంశానికి సంబంధించి 2001లోనే గొర్రెలపై పరిశోధనలు జరిగాయని, మనుషుల ఫొటోల నుంచి గొర్రెలను వేరుచేసి అవి గుర్తుపట్టడమే కాకుండా ఫొటోలో వ్యక్తమవుతున్న ఉద్విగ్న భావాలకు కూడా అవి స్పందిస్తాయని అప్పుడు పరిశోధకులు గుర్తించారన్నారు. అవి కేవలం ఫొటోలను మాత్రమే గుర్తించుకుంటాయా లేదా నిజంగా మనుషులను గుర్తిస్తాయా ? అన్న అంశాన్ని మరింత లోతుగా తెలుసుకోవడం కోసం తాజా అధ్యయనం జరిపినట్లు వారు చెప్పారు. అంతకుముందు చూపిన ఫొటోలు, ఎప్పుడు వాటికి చూపని ఫొటోలను వేలాడదీసి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఫొటోల కింద వాటికి కొద్దిగా ఆహారాన్ని ఏర్పాటు చేశారు. గొర్రెలు తెల్సిన ఫొటోలవైపే వెళ్లి అక్కడ ఏర్పాటుచేసిన గ్రాసాన్ని తిన్నాయి. ఎన్నిసార్లు పంపించినా తెలియని ఫొటోలవైపు అవి వెళ్లలేదు. మొదట నేరుగా చూపించిన ఫొటోలను రెండోసారి చూపించినప్పుడు అవి 80 శాతం టైమ్‌లోనే గుర్తించాయని, అదే వేర్వేరు భంగిమల్లో తీసిన ఫొటోలను చూపించినప్పుడు వాటిని గుర్తించడానికి మొదటిసారి ఎక్కువ సమయం తీసుకోగా, రెండోసారి అందులో 90 శాతం సమయాన్ని తీసుకున్నాయని పరిశోధకులు వివరించారు. మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారికి చికిత్స చేయడంలో గొర్రెలపై తాము నిర్వహించిన అధ్యయనాలు ఉపయోగపడతాయని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. -
ఏపీలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏర్పాటు..!
- పాల్గొన్న వై.ఎస్.చౌదరి, గంటా శ్రీనివాసరావు సాక్షి, న్యూఢిల్లీ ఏపీ రాజధాని అమరావతిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఏర్పాటు, ఏపీలో విద్యాభివృద్ధిపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వై.ఎస్.చౌదరి మాట్లాడుతూ వర్శిటీ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ వర్శిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా అభివృద్ధి చెందుతుందని, అక్టోబరు 15 లోపు సంబంధిత అవగాహన ఒప్పందం కుదురుతుందని వివరించారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగిందని తెలిపారు. ఏపీలో విద్యాభివృద్ధికి కేంబ్రిడ్జ్ సహకారంపై చర్చించామని తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వర్శిటీ సహకారం తీసుకుంటామని తెలిపారు. -
విశ్వమంతా ఒకే పటంలో: హాకింగ్ యత్నం
లండన్: ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఓ అద్భుతానికి తెర తీయబోతున్నారు. ఇప్పటి దాకా మనం చూసిన విశ్వాన్నంతా ఒకే మ్యాప్ మీదికి తీసుకురాబోతున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆయన ప్రత్యేక సూపర్ కంప్యూటింగ్ సెక్షన్లో ఈ పనికి శ్రీకారం చుట్టనున్నారు. వందల కోట్ల సంఖ్యలో ఉన్న నక్షత్ర వీధులు, కృష్ణబిలాలు అన్నిటినీ ఇందులో చూపించనున్నారు. ఇందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు చేసిన మహావిస్ఫోటన నమూనాను వారు ఉపయోగించనున్నారు. డార్క్ ఎనర్జీ సర్వే వారి నుంచి తీసుకున్న ఛాయాచిత్రాలను కూడా పరిశీలిస్తారు. ఈ ఫొటోలు చిలీలోని 13 అడుగుల వ్యాసంతో ఉన్న టెలిస్కోప్ నుంచి తీసుకున్నారు. -
అది అతి పిన్న పిండస్థ మమ్మీ
కైరో: చనిపోయినవారు ఏదో ఒకరోజు తిరిగి ప్రాణం పోసుకుంటారనే విశ్వాసంతో మృతదేహాలను మమ్మీలుగా భద్రపరిచే సంస్కతి ఈజిప్టు నాగరికతలో ఉందనే విషయం మనందరికి తెల్సిందే. అత్యంత పిన్న పిండస్థ దశ నుంచే మృతదేహాలను భద్రపరుస్తారనే కొత్త విషయం ఇప్పుడు బయటపడింది. క్రీస్తుపూర్వం 624–625 కాలంనాటి అతి చిన్న మమ్మీ రహస్యాన్ని వారు ఇప్పుడు ఛేదించారు. ఇంతకాలం మ్యూజియంలో భద్రపర్చిన ఆ చిన్న మమ్మీని అత్యాధునిక ఎక్స్‌రే పరికరాన్ని ఉపయోగించి అది 16 నుంచి 18 వారాల గర్భస్థ శిశువు మమ్మీదని తేల్చినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన పరాతత్వ శాస్త్రవేత్తలు బుధవారం నాడు ప్రకటించారు. ఈ చిన్న మమ్మీని ఈజిప్టులోని గిజా నగరంలో జరిపిన తవ్వకాల్లో 1907లో బయట పడింది. అది దేవదారు కలపతో తయారు చేసింది. మమ్మీని చెడగొట్టకుండానే అందులోని శిశువు ప్రాయాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఇంతకాలం దాన్ని అలాగే భద్రపర్చి ఉంచారు. పిరమిడ్స్ లోపలి రహస్య అరలను, మమ్మీలలోపలి మృతదేహాలను బయటి నుంచే కనుగొనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇలాంటి రహస్యాలను ఇప్పుడు ఛేదించేందుకు ఉపక్రమిస్తున్నారు. ఆ మమ్మీ చేతులు, కాళ్లు, వెన్నుపూస ప్రాంతం బాగానే ఉన్నప్పటికీ ముఖ భాగం, కటి వలయం దెబ్బతిన్నట్టు ఎక్స్‌రేలో వెల్లడైంది. వాస్తవానికి పిండస్థ మమ్మీలను శాస్త్రవేత్తలు కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. 25 నుంచి 37 వారాలలోపు పిండస్థ మమ్మీలను ఇదివరకే కనుగొన్నారు. అయితే 16 నుంచి 18 వారాలలోపు మమ్మీని కనుగొనడం మాత్రం ఇదే మొదటిసారి. మిస్ క్యారేజీ వల్ల పుట్టిన ఈ మృతశిశువును కూడా వారు మమ్మీగా మార్చారంటే పిండస్థ దశ నుంచే వారు మనిషి ప్రాణానికి ఎంతో విలువనిచ్చారనే విషయం స్పష్టమవుతోందని కేంబ్రిడ్డి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు. -
ప్రపంచంలోనే అతిచిన్న ఇంజన్
లండన్: ప్రపంచంలోనే అతిచిన్న ఇంజన్‌ను కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మీటరులో వందలకోట్లవ వంతు సైజులో దీన్ని తయారు చేశారు. కాంతి ఆధారంగా పనిచేసే ఈ ఇంజన్ నానో యంత్రాల అభివృద్ధికి సహాయపడుతుందని చెప్పారు. ఇందులో తక్కువ ఆవేశమున్న బంగారం అణువులు, పాలిమర్స్‌ను వాడారు. ఈ ప్రక్రియలో లేజర్‌తో ‘నానో-ఇంజిన్’ను వేడి చేస్తే నీటిలో, జెల్లో ఉండే పాలిమర్ తొలగిపోయి కొన్ని సెకన్లలోనే స్థితిస్థాపక శక్తి నిల్వ చేసుకుంటుంది. -
సంతోషాన్ని కొనుక్కోవచ్చు
లండన్: డబ్బును మనకు ఇష్టమైన వాటిని కొనడానికి ఖర్చు చేస్తే సంతోషం కూడా వెంటపడి వస్తుందని ఓ అధ్యయనంలో లేలింది. కేంబ్రిడ్జి జడ్జి బిజినెస్ స్కూల్, కేంబ్రిడ్జి వర్సిటీ, యూకేలోని ఒక బ్యాంకుతో కలిసి జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 625 మంది బ్యాంకు ఖాతాదారులు 6 నెలలు జరిపిన 76 వేల లావాదేవీలను పరిశీలించి దీన్ని కనిపెట్టారు. లావాదేవీలను 112 రకాలుగా వర్గీకరించగా, పరిశోధకులు 59 రకాలకు తగ్గించి అనంతరం వాటిని విశ్లేషించారు. వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులను కొన్న ఖాతాదారులు వారి బంధువుల దగ్గర ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు చెప్పారంట. ‘ధనం, సంతోషాల మధ్య బలహీన సంబంధం ఉందని గత అధ్యయనాలు చెప్పాయి. బ్యాంకు లావాదేవీలను పరిశీలించి మేం ఇది తప్పని కనుగొన్నాం. వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులను కొన్నప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ సంతోషం పొందుతారు’ అని పరిశోధకుల్లో ఒకరైన గ్లాడ్‌స్టోన్ చెప్పారు.