అమరావతిలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఏర్పాటుకై ఢిల్లీలో మంత్రి గంటా, వర్సిటీ అధికారులు సమావేశమయ్యారు.
- పాల్గొన్న వై.ఎస్.చౌదరి, గంటా శ్రీనివాసరావు
సాక్షి, న్యూఢిల్లీ
ఏపీ రాజధాని అమరావతిలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ఏర్పాటు, ఏపీలో విద్యాభివృద్ధిపై కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ ప్రతినిధులతో కేంద్ర మంత్రి వై.ఎస్.చౌదరి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం ఇక్కడ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వై.ఎస్.చౌదరి మాట్లాడుతూ వర్శిటీ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ వర్శిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీగా అభివృద్ధి చెందుతుందని, అక్టోబరు 15 లోపు సంబంధిత అవగాహన ఒప్పందం కుదురుతుందని వివరించారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగిందని తెలిపారు. ఏపీలో విద్యాభివృద్ధికి కేంబ్రిడ్జ్ సహకారంపై చర్చించామని తెలిపారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో వర్శిటీ సహకారం తీసుకుంటామని తెలిపారు.