భారతీయ విద్యార్థులకు మన్మోహన్ సింగ్ పీహెచ్ డీ స్కాలర్ షిప్స్!
2013 సంవత్సరపు డాక్టర్ మన్మోహన్ సింగ్ పీహెచ్ డీ స్కాలర్ షిప్ అవార్డులకు ఇద్దరు భారతీయ విద్యార్థులను కేంబిడ్జి యూనివర్సిటి ఎంపిక చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చీకి చెందిన ఎంఎస్సీ విద్యార్థి రిషికా కుంద్రా, ఐఐటీ బాంబే విద్యార్థి కేదార్ పాండ్యాలు మన్మోహన్ సింగ్ అవార్డుకు ఎంపికయ్యారు.
విశేష ప్రతిభా పాటవాలున్న ఇద్దరు విద్యార్థులను ఈ అవార్డుకు ఎంపిక చేశామని.. త్వరలోనే వారిని కేంబ్రిడ్జి యూనివర్సిటికి ఆహ్వానిస్తామని కేంబ్రిడ్జి అధికారులు తెలిపారు. భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలను, అందించిన సేవలకు గుర్తుగా ఈ అవార్డును నెలకొల్పారు. సైన్స్, టెక్నాలజీ, సోషల్ సైన్స్ రంగంలో విశేష ప్రతిభ చూపిన విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్స్ అందిస్తున్నారు.