ప్రపంచంలోనే అతిచిన్న ఇంజన్
లండన్: ప్రపంచంలోనే అతిచిన్న ఇంజన్‌ను కేంబ్రిడ్జి వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మీటరులో వందలకోట్లవ వంతు సైజులో దీన్ని తయారు చేశారు. కాంతి ఆధారంగా పనిచేసే ఈ ఇంజన్ నానో యంత్రాల అభివృద్ధికి సహాయపడుతుందని చెప్పారు. ఇందులో తక్కువ ఆవేశమున్న బంగారం అణువులు, పాలిమర్స్‌ను వాడారు. ఈ ప్రక్రియలో లేజర్‌తో ‘నానో-ఇంజిన్’ను వేడి చేస్తే నీటిలో, జెల్‌లో ఉండే పాలిమర్ తొలగిపోయి కొన్ని సెకన్లలోనే స్థితిస్థాపక శక్తి నిల్వ చేసుకుంటుంది.