సంతోషాన్ని కొనుక్కోవచ్చు | Buy happiness | Sakshi
Sakshi News home page

సంతోషాన్ని కొనుక్కోవచ్చు

Published Sun, Apr 10 2016 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

సంతోషాన్ని కొనుక్కోవచ్చు

సంతోషాన్ని కొనుక్కోవచ్చు

లండన్: డబ్బును మనకు ఇష్టమైన వాటిని కొనడానికి ఖర్చు చేస్తే సంతోషం కూడా వెంటపడి వస్తుందని ఓ అధ్యయనంలో లేలింది. కేంబ్రిడ్జి జడ్జి బిజినెస్ స్కూల్, కేంబ్రిడ్జి వర్సిటీ, యూకేలోని ఒక బ్యాంకుతో కలిసి జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 625 మంది బ్యాంకు ఖాతాదారులు 6 నెలలు జరిపిన 76 వేల లావాదేవీలను పరిశీలించి దీన్ని కనిపెట్టారు. లావాదేవీలను 112 రకాలుగా వర్గీకరించగా, పరిశోధకులు 59 రకాలకు తగ్గించి అనంతరం వాటిని విశ్లేషించారు.

వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులను కొన్న ఖాతాదారులు వారి బంధువుల దగ్గర ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు చెప్పారంట. ‘ధనం, సంతోషాల మధ్య బలహీన సంబంధం ఉందని గత అధ్యయనాలు చెప్పాయి. బ్యాంకు లావాదేవీలను పరిశీలించి మేం ఇది తప్పని కనుగొన్నాం. వ్యక్తిత్వానికి సరిపోయే వస్తువులను కొన్నప్పుడు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ సంతోషం పొందుతారు’ అని పరిశోధకుల్లో ఒకరైన  గ్లాడ్‌స్టోన్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement