(ఫైల్ ఫొటో)
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కు బ్రేక్ ఇచ్చి ఇటీవల లండన్ పర్యటించారు. కేంబ్రిడ్జ్ యూనివర్సీటీలోని జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడానికి వెళ్లారు. అయితే రాహుల్ గాంధీకి జడ్జ్ బిజినెస్ స్కూల్‌లో ఖలీస్థానీ అనుకూల సిక్కుల నుంచి నిరసన సెగ తగిలినట్లు తెలుస్తోంది.
అయితే బిజినెస్ స్కూల్ అధికారుల జోక్యంతో నిరసన అదుపలోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పోలీసులు.. ఖలీస్థానీ అనుకూల సిక్కు నిరసనకారులను జడ్జ్ బిజినెస్ స్కూల్‌లోకి తాము అనుమతించలేదని పేర్కొనటం గమనార్హం.
పరమజిత్ సింగ్ పమ్మా ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై నిరసన తెలిపినట్లు యూకే పోలీసులు తెలిపారు. పరమజిత్ సింగ్ పమ్మా.. యూరప్‌లోని సిక్ ఫర్ జస్టిస్ సంస్థ కో-ఆర్డినేటర్. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు, అమృత్‌సర్ హత్యలకు కారణం గాంధీ కుంటుంబమేనంటూ నిరసన తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపట్టే పలు విదేశి పర్యటనల్లో సైతం ఆయన తమ నిరసన తప్పించుకోలేరని నిరసనకారులు సవాల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక.. ఖలీస్థానీ అనుకూల సిక్కుల నిరసన నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రసంగం అనతంరం.. యూకే పోలీసులు కల్పించిన పటిష్టమైన భద్రత నడుమ యూనివర్సిటీ నుంచి బయటకు రాగలిగినట్లు తెలిసింది. అయితే ఈ నిరసన ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.
Comments
Please login to add a commentAdd a comment