ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే! | British Indian Student Anoushka Kale Elected President Of Cambridge Union Society | Sakshi
Sakshi News home page

ప్రతిష్ఠాత్మక పదవిలో భారత సంతతి విద్యార్థి అనౌష్క కాలే!

Dec 11 2024 9:40 AM | Updated on Dec 11 2024 9:40 AM

British Indian Student Anoushka Kale  Elected President Of Cambridge Union Society

ఇరవై సంవత్సరాల బ్రిటిష్‌–ఇండియా స్టూడెంట్‌ అనౌష్క కాలే కేంబ్రిడ్జిలోని చారిత్రాత్మకమైన ‘కేంబ్రిడ్జి యూనియన్‌ డిబేటింగ్‌ సొసైటీ’ అధ్యక్షురాలిగా ఎన్నికైంది. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఇంగ్లీష్‌ సాహిత్యం చదువుతున్న కాలే ఈ ప్రతిష్ఠాత్మక పదవిని చేపట్టిన అతి కొద్దిమంది దక్షిణాసియా మహిళల్లో ఒకరిగా నిలిచింది.

‘ఎంతో చరిత్ర కలిగిన కేంబ్రిడ్జి యూనియన్‌ సొసైటీకి అధ్యక్షురాలిగా ఎన్నిక కావడాన్ని గౌరవంగా భావిస్తున్నాను’ అంటుంది అనౌష్క. వివిధ సాంస్కృతిక సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా యూనియన్‌లో మరింత వైవిధ్యాన్ని తీసుకువస్తాను అని చెబుతుంది. గ్లోబల్‌ డిబేట్స్‌పై తనకు ఉన్న ఆసక్తిని తెలియజేసింది. ఇంటర్నేషనల్‌ స్పీకర్స్‌కు ఆతిథ్యం ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి సారించింది.

(చదవండి: ఊరు ఉమెన్‌ అనుకున్నారా... నేషనల్‌!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement