ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం! | Study Says 4 Key Nutrients Are Shockingly Lacking In Over 60% Of The People | Sakshi
Sakshi News home page

ఈ నాలుగు కీలక పోషకాలను తక్కువగా తీసుకుంటున్నాం! పరిశోధకుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published Fri, Sep 6 2024 1:52 PM | Last Updated on Fri, Sep 6 2024 3:49 PM

Study Says 4 Key Nutrients Are Shockingly Lacking In Over 60% Of The People

మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మపోషకాలు, స్థూల పోషకాలు ఉండాలని చెబుతుంటారు. సమతుల్య ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వమని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మన ఆహారంలో అత్యంత కీలకమైన పోషకాలను కోల్పోతున్నామట. ఇటీవల పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో తేలింది. మన తీసుకునే ఆహారంలో అత్యంత కీలకమైన,  రోగనిరోధక వ్యవస్థను బలోపేతం  చేసే పోషకాలను కోల్పోతున్నామని  పరిశోధకులు  చెప్పారు. ఇంతకీ ఏంటా నాలుగు కీలక పోషకాలంటే..!

హార్వర్డ్‌ చాన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాంటా బార్బరా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయ్యింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలు కాల్షియం, ఐరన్‌, విటమిన్‌ సీ, ఈతో సహా శరీరానికి అవసరమయ్యే సూక్ష్మ పోషకాలను సరిపోని స్థాయిలో వినయోగిస్తున్నట్లు తెలిపారు. అందుకో 34 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తుల డేటాపై అధ్యయనం చేసినట్లు తెలిపింది. ఇలా మొత్తం 31 దేశాలలోని ప్రజల డేటాను సర్వే చేసి మరీ అంచనా వేసినట్లు పేర్కొన్నారు. 

అందులో పురుషుల, స్త్రీల డేటాను వేరు చేసి మరి అధ్యయనం చేసినట్లు తెలిపారు. వారందరిపై దాదాపు 15 విటమిన్లు, ఖనిజాల గురించి అధ్యయనం చేసింది. అందులో నాలుగు కీలక పోషకాలను ఆహారం నుంచి చాల తక్కువ మోతాదులో తీసుకుంటున్నారని తేలింది. 

ముఖ్యంగా అయోడిన్‌, విటమిన్‌ ఈ, కాల్షియం, ఐరన్‌ తగినంతగా తీసుకోవడం లేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. ఇక సగానికి పైగా ప్రజల్లో రిబోఫ్లావిన్‌, ఫోలేట్‌​, విటమిన్‌ సీ, బీ6, నియాసిన్‌ తదితరాలను చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. అంతేగాదు ప్రపంచ జనాబాలో దాదాపు 22% మంది చాలా తక్కువ స్థాయిలో ఈ పోషకాలను తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు పరిశోధకులు. ఇవి మన రోగనిరోధక వ్యవస్థను బలోపతం చేయడంలో కీలక పాత్ర పోషించేవని తెలిపారు. 

(చదవండి: పెళ్లిలో తోడిపెళ్లి కూతురు/పెళ్లి కొడుకు సంప్రదాయం ఎలా వచ్చిందంటే..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement