సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల యువతకు క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోంది. తాజాగా ప్రపంచంలోని 160 దేశాల నుంచి 35 ఏళ్ల లోపు యువత నుంచి అభిప్రాయాలను కేంబ్రిడ్జి యూనివర్శిటీ సేకరించగా కేవలం 48 శాతం మంది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. 1990, 2000 దశకాల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై మూడింట రెండు వంతుల మంది విశ్వాసం వ్యక్తం చేయగా, ఇప్పుడు వారి శాతం యాభైకన్నా దిగువకు పడిపోవడం గమనార్హం. అప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల 62 శాతం యువత విశ్వాసం వ్యక్తం చేయగా ఇప్పుడు కేవలం 48 శాతం యువత మాత్రమే విశ్వాసం వ్యక్తం చేశారు.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 54 శాతం ఉండగా, అది 1950వ దశకానిని 57 శాతానికి పెరిగింది. 1990, రెండువేల సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరం భారీగా పెరగడంతో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం 62 శాతానికి పెరిగింది. అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలో మే 25వ తేదీన ఓ నల్లజాతీయుడు, ఓ తెల్లజాతి పోలీసు చేతిలో చనిపోవడం, ఇంగ్లండ్‌లోని బ్రిస్టల్ సిటీలో ప్రజా ఉద్యమంలో భాగంగా జూన్ ఏడవ తేదీన ఎడ్వర్డ్ కొలస్టన్ విగ్రహాన్ని విధ్వసం చేయడం తదితర పరిణామాల నేపథ్యంలో యువతలో ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం సన్నగిల్లింది. 160 దేశాల నుంచి 50 లక్షల మంది యువతను శాంపిల్‌గా తీసుకొని కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఈ సర్వేను నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment