లండన్ : ధనికులకు ఫేస్‌బుక్‌లో ఎక్కువ మంది విదేశీ స్నేహితులు ఉంటారని మనమంతా అనుకుంటాం కదా! ఇదంతా తప్పని ఫేస్‌బుక్ తాజా సర్వే వెల్లడించింది. ధనికప్రజలపై ఫేస్‌బుక్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి సాయంతో ఇటీవల ఓ సర్వే జరిపింది. దీని ప్రకారం.. డబ్బున్నవారికి ఫేస్‌బుక్‌లో చాలా తక్కువ మంది విదేశీ స్నేహితులు ఉన్నట్లు తెలిపింది.
ఫేస్‌బుక్ వినియోగదారుల్లో ప్రజల సామాజిక, ఆర్థిక హోదా అంతర్జాతీయంగా వారికి ఉన్న సంబంధాలపై విశ్లేషణ చేసింది. వీరిలో ఆర్థికంగా తక్కువ హోదా కలిగిన వారికి ధనికుల కంటే 50 శాతం విదేశీ మిత్రులు ఉన్నారని సర్వే గుర్తించింది.