లండన్ : అమెరికాలో లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30వ తేదీ తర్వాత ఎత్తివేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండకపోగా, కరోనా వైరస్ రెండవ విడతగా మరింత తీవ్రంగా విజృంభించే ప్రమాదం ఉందని సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివేన్షన్ (సీడీసీ) డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ హెచ్చరించిన నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేసినా కరోనా కట్టడిలో ఉండడానికి తీసుకోవాల్సిన 275 జాగ్రత్తలను కేంబ్రిడ్జి యూనివర్శిటీ నిపుణులు ఖరారు చేశారు. తాము ఖరారు చేసిన ఈ సూచనలను పాటించినట్లయితే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు చెబుతున్నారు.
1. ఇప్పటి వరకు వ్యక్తిగతంగా మనుషులు పాటిస్తున్న అన్ని జాగ్రత్తలు లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా పాటించాలని వారు చెప్పారు. ఇంటా, బయట ఒకరికి ఒకరి మధ్య దూరం రెండు మీటర్లు పాటించడం.
2. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్లు వాడడం, మాస్క్‌లు ధరించడం.
3. ఇంటి గేటు, ప్రధాన డోర్ తలుపులను తెరచి ఉంచడం, ఇంట్లోకి వచ్చేవారు చేతులు వేయాల్సిన అవసరం లేకుండా. లేదా సెలఫోన్, ఎలక్ట్రిక్ సిగ్నల్ ద్వారా వాటంతట అవే తెరచుకునే ఏర్పాటు చేయడం.
4. తరచుగా ముఖంపైకి చేతులు పోకుండా నివారించేందుకు చేతుకు అలారం రబ్బర్ బ్యాండ్ ధరించడం.
5. వీలైనంత వరకు ఎండ తీవ్రంగా ఉన్న వేళల్లోనే బయటకు రావడం.
6. అనవసరంగా ఎవరితో మాట్లాడక పోవడం.
7. ఎస్కలేటర్లు ఎక్కకుండా ఉండడం.
8. క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులను దించినప్పుడు, ఎక్కించుకున్నప్పుడు కారు దిగకుండా తన సీటుకే పరిమితం కావడం.
9. ఆహారం, ఇతర నిత్యావసరాల సరఫరాకు డ్రోన్లు ఉపయోగించడం.
10. పెండ్లిళ్లు, పేరంటాలకు వీలైనంతగా దూరం ఉండడం. అంత్యక్రియలకైనా సరే 20 మందికి మించి అనుమతించకపోవడం.
11. హోటళ్లలో కూడా టేబుళ్లు, కుర్చీలు దూర దూరంగా ఏర్పాటు చేయడం, టేబుల్ ఖాళీ అయినప్పుడల్లా శానిటైజర్లతో తుడవడం.
12. బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి మ్యూజిక్‌ను అనుమతించక పోవడం.
13. 275 సూచనలు వివరించడం కష్టం కనుక ఒక్క మాటలో చెప్పాలంటే సామాజిక సంబంధాలకు దూరంగా ఇంటికి ఎలా పరిమితం అవుతామో, బయటకు వెళ్లినప్పుడు కూడా అన్ని సామాజిక సంబంధాలకు దూరంగా మసలుకోవడం.
Comments
Please login to add a commentAdd a comment