సాక్షి, న్యూఢిల్లీ : సామాజిక దూరాన్ని పాటించక పోయినట్లయితే ఒక్క కోవిడ్–19 బాధితుడు నెల రోజుల్లో 406 మందికి ఆ వైరస్‌ను అంటిస్తారని భారత వైద్య పరిశోధనా మండలి అంచనా వేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2,613 మురికి వాడలు ఉన్నాయి. వాటిలో 13.92 రేకులు, మట్టి, గడ్డి లేదా ఇతర పైరప్పులు కలిగిన ఒకటి, రెండు గదుల్లో 65.49 మిలియన్ అంటే, దాదాపు ఆరున్నర కోట్ల మందికిపైగా ప్రజలు నివసిస్తున్నారు.
కరోనా వైరస్ విజృంభించిన మహారాష్ట్ర రాజధాని ముంబైలాంటి నగరాల్లో మురికి వాడల పరిస్థితి మరీ అధ్వాన్నం. గాలి, వెలుతురు లేక దాదాపు ఊపిరాడని గదుల్లో ఐదారుగురు నివసిస్తుంటారు. వారెలా సామాజిక దూరాన్ని పాటించగలరు. రెక్కాడితేగానీ.. డొక్కాడని వారు బయటకు వెళ్లకుండా ఎలా ఉండగలరు? అందుకేనా అక్కడి మురికి వాడల్లో కరోనా కరాళ నత్యం చేస్తోంది? అసలే ఇది వేసవి కాలమని ముంబై, ఢిల్లీ, ఇతర మెట్రో నగరాల్లో మురికి వాడల్లో నివసించేవారు లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే గడిపినట్లయితే వారిపై కరోనా దాడి చేయక ముందే వారు ఎండ వేడికి తాళలేక మత్యువాత పడే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీకి చెందిన ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ రిసర్చర్ టాన్యా సింగ్ హెచ్చరిస్తున్నారు. చదవండి: లాక్‌డౌన్: అక్క, తమ్ముళ్లను 13ఏళ్ల తర్వాత కలిపింది
రేకుల రూములతో పోలిస్తే బయటి వాతావరణమే చల్లగా ఉంటుందని, పైగా బయటకు వెళ్లలేకుండా బందీలమయ్యామని, పొద్దు పోవడం లేదని, బోర్ కొడుతుందనే భావం కలిగినట్లయితే మురికి వాడల వాసులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి వారికి లాక్‌డౌన్ సందర్భంగా కనీసం రాత్రి పూటైనా బహిరంగ ప్రదేశాల్లో నిద్రించే అవకాశం కల్పించక పోయినట్లయితే వారి ప్రాణాలకు ముప్పుందని ఢిల్లీ, ఢాకా, ఫైసలాబాద్ నగరాల్లోని మురికి వాడల్లో పరిశోధనలు జరిపిన టాన్యా సింగ్ హెచ్చరించారు. చదవండి: విరాళాలతో కరోనాను తరిమి కొడుతున్న దాతలు
Comments
Please login to add a commentAdd a comment