write
-
ఖైదీలు నెలకు ఎన్ని లేఖలు రాయవచ్చు?
జైలు ప్రపంచం చాలా విచిత్రమైనది. చాలామంది జైళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటారు. కానీ ఎవరూ జైలుకు వెళ్లాలని కలలో కూడా అనుకోరు. ఎన్సీఆర్బీ అందించిన ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా 2020’ నివేదికలోని వివరాల ప్రకారం 2020 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4.83 లక్షల భారతీయ పౌరులు వివిధ జైళ్లలో ఉన్నారు. వీరిలో 76 శాతానికి పైగా అండర్ ట్రయల్ నిందితులు కాగా, 23 శాతం మంది దోషులుగా తేలిన వారున్నారు. ఈ అండర్ ట్రయల్ ఖైదీలు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, శిక్ష పడిన వారిలో ఎక్కువ మంది 30 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారే ఉన్నారు. జైళ్లలో ఖైదీల సంఖ్య ఏటా పెరుగుతోంది. కాగా జైలులోని ఖైదీలు తమ కుటుంబాలకు నెలకు ఎన్ని ఉత్తరాలు రాయవచ్చనేది చాలామందిలో ఉండే సందేహం. జైలు నిబంధనల ప్రకారం శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రతి 15 రోజులకోసారి లేఖ రాయవచ్చని ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జైలు సూపరింటెండెంట్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రతి ఖైదీ నెలకు రెండుసార్లు లేఖ రాయవచ్చు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీ తన కుటుంబ సభ్యులకు లేదా దగ్గరి బంధువులకు మాత్రమే లేఖలు రాయవచ్చు. దీనికి సంబంధించిన రికార్డును జైల్లో భద్రపరుస్తారు. కాగా జైలులోని ఖైదీలు లేఖలు రాసేటప్పుడు అవి జైలుకు, అక్కడి నిబంధనలకు విరుద్ధంగా ఉండకూడదు. జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా ఖైదీ లేఖ రాస్తే ఆ లేఖను జైలు అధికారులు బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారు. -
ఆలోచించండి ఓ అమ్మానాన్న.. ఈసీ వినూత్న ప్రయత్నం
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు త్వరలో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయబోతున్నారు. "నా భవిష్యత్తు దేశంలోని బలమైన ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉంది. దీని కోసం ఓటరు జాబితాలో మీ పేర్లను తప్పకుండా చూసుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని పిల్లలు తమ తల్లిదండ్రులను కోరనున్నారు. జాతీయ సగటుతో సమానంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం చొరవతో ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖల సహకారంతో కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) చొరవలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయడంలో సహాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ (పాఠశాల విద్య)కి లేఖ రాసింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కుటుంబంలోని అర్హులైన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని పిల్లలు ఇచ్చే "ప్రతిజ్ఞ లేఖ"పై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సగటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. 2019లో జాతీయ సగటు 67.4 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 59.21 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో దేశ సగటు 66.44 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 58.44 శాతం ఓటింగ్ నమోదైంది. -
18 ఏళ్ల వరకు చదవడం, రాయడం రాదు! కానీ ప్రొఫెసర్ అయ్యాడు!
అతనికి 11 ఏళ్లు వచ్చే వరకు మాటలే రాలేదు. ఇక 18 ఏళ్లు వచ్చే వరకు ఆ యువకుడు చదవడం రాయడం నేర్చుకోలేకపోయాడు. కానీ ఓ ప్రఖ్యాత యూనివర్సిటీకి ప్రోఫెసర్ అయ్యాడు. పైగా నల్లజాతీయుల్లో పిన్న వయస్కుడైన ప్రోఫెసర్‌గా నిలిచాడు. అదేలా సాధ్యం అనిపిస్తుంది కదూ!. కానీ జాసన్ ఆర్డే అనే వ్యక్తి అనితర సాధ్యమైనదాన్ని సాధ్యం చేసి చూపి అందరికీ గొప్ప మార్గదర్శిగా నిలిచాడు. అసలేం జరిగిందంటే..జాసన్ ఆర్డే అనే వ్యక్తి లండన్‌లోని క్లాఫామ్‌లో జన్మించాడు. అతను పుట్టుకతో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఈ డిజార్డర్ ఉండే పిల్లలకి సాధారణ పిల్లలో ఉండే పరిణతి ఉండదు. మానసిక ఎదుగుదల సంక్రమంగా ఉండక.. అందరి పిల్లల మాదిరి నేర్చుకోలేక వెనుకబడిపోతారు. జాసన్ ఈ సమస్య కారణంగా 11 ఏళ్లు వచ్చే వరకు మాట్లాడలేకపోయాడు. దీంతో చదవడం, రాయడం వంటికి 18 ఏళ్లు వచ్చే వరకు కూడా నేర్చుకోలేకపోయాడు. అదీగాక జాసన్‌కి ఎవరోఒకరి సాయం తప్పనిసరిగా ఉండాల్సి వచ్చింది. ఐతే జాసన్ దీన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు, ఎలాగైనా.. తనంతట తానుగా ఉండగలగేలా, అన్నినేర్చుకోవాలి అని తపించేవాడు. తన తల్లి బెడ్రూంలో వరుసగా లక్ష్యాలను రాసుకుని ఎప్పటికీ చేరుకుంటానని ఆశగా చూసేవాడు జాసన్. నెల్సన్ మండేలా జైలు నుంచి విడుదలైన క్షణాలు, 1995లో రగ్బీ ప్రపంచకప్‌లో దక్షిణాప్రికా సింబాలిక్ విజయాన్ని కైవసం చేసుకోవడం తదితరాలను టీవీలో చూసిన తర్వాత తన మనోగతాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. వారు పడ్డ కష్టాలను తెలుకుని చలించిపోయాడు. అప్పుడూ అనుకున్నాడు అత్యున్నత చదువులను అభ్యసించి.. కేంబ్రిడ్జి యూనివర్సిటికి ప్రోఫెసర్ కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఐతే అకడమిక్ పరంగా తనకు రాయడం, చదవడం వంటివి నేర్పించే గురువు లేరు కాబట్టి దీన్ని ఒక అనుభవంగా తీసుకువాలి. నాలా బాధపడేవాళ్ల కోసం ఉపయోగపడేందుకైనా ముందు దీన్ని అధిగమించాలి అని గట్టిగా తీర్మానించుకున్నాడు. అలా జాసన్ ఎన్నో తిరస్కరణల అనంతరం రెండు మాస్టర్స్‌లో అర్హత సాధించాడు. సర్రే యూనివర్సిటీ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టడీస్‌లో డిగ్రీ పొందాడమే గాక 2016లో లివర్‌పూల్ జాన్ మూర్స్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందాడు. 2018 తొలి సారిగా ప్రోఫెసర్‌గా తన తొలి పత్రాన్ని ప్రచురించాడు. ఆ తర్వాత యూనివర్శిటీ ఆఫ్ గ్లాస్గో స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఉద్యోగం సంపాదించడంతో యూకేలో నల్లజాతీయులు అతి పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా నిలిచాడు. ప్రోఫెసర్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన భాస్కర్ వీరా. జాసన్‌ని అసాధారణమైన ప్రోఫెసర్‌గా పిలుస్తుంటారు. ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన తరగతుల ముఖ్యంగా నల్లజాతీయులు, ఇతర మైనార్టీ వర్గాల వరకు అండగా నిలవడమేగాక మార్గదర్శిగా ఉంటాడన్నారు. చదవండి: తన అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ మరణం: జెలెన్స్కీ) -
వాటే టాలెంట్.. నోరు వెళ్లబెట్టాల్సిందే
సాధారణంగా మనలో ఎక్కువ శాతం మంది కుడి చేత్తో రాస్తారు. కొందరు మాత్రం ఎడమ చేతితో రాస్తారు. మరి కొందరిలో రెండు చేతులతో రాయగలిగే ప్రతిభ ఉంటుంది. కానీ ఏక కాలంలో రెండు చేతులతో ముందు నుంచి వెనక్కి.. పైన ఒక చేత్తో.. కింద మరో చేత్తో రాసేవారిని ఎప్పుడైనా చూశారా. లేదా అయితే ఈ వీడియో చూడండి.. ఆశ్చర్యంతో మీరు కూడా వావ్ అంటారు. మనోజ్ కుమార్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సూపర్ టాలెంట్ అంటూ ప్రశంసలు పొందుతుంది. బహుళ ఏకాగ్రత కలిగిన ఈ కళను అవధానకలా అంటారని తెలిపారు. (చదవండి: ఒక్క ట్వీట్‌తో ఊహించని స్పందన) Incredible India!! 🇮🇳🇮🇳 This art of multiple concentration was known as अवधानकला avadhanakala.@anandmahindra @RandeepHooda @AnupamPKher @ARanganathan72 @aamir_khan @sachin_rt @SrBachchan @DrKumarVishwas @harbhajan_singh @ImRaina @SwetaSinghAT pic.twitter.com/rL5cOMVrpz — Manoj Kumar (@BharatKumar1857) October 29, 2020 ఇక ఈ వీడియోలో ఓ అమ్మాయి తన బ్లాక్ బోర్డు మీద రెండు చేతులతో ఏక కాలంలో రాస్తుంది. ముందు నుంచి వెనక్కి.. పై నుంచి కిందకు రాయడం వీడియోలో చూడవచ్చు. ఏ మాత్రం తడబాటు లేకుండా చాలా చాకచక్యంగా రెండు చేతులతో రాస్తున్న ఈ అమ్మాయి టాలెంట్ అందరిని అబ్బురపరుస్తుంది. ‘ఇన్క్రీడబుల్ ఇండియా’ పేరుతో వీడియోని షేర్ చేయడమే కాక ఆనంద్ మహీంద్రా, రణ్దీపా హుడా, అనుపమ్ ఖేర్, హర్భజన్ సింగ్, సీనియర్ బచ్చన్, ఏ రంగనాథన్, ఆమిర్ ఖాన్, రైనా, స్వేతా సింగ్,డాక్టర్ కుమార్ విశ్వాస్ వంటి ప్రముఖులను ట్యాగ్ చేశారు. -
మాల్యాకోసం ఆరుదేశాలకు లేఖలు
న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలను బ్యాంకులకు ఎగనామంపెట్టిన లిక్కర్ బారన్ విజయ్ మాల్యా ఆర్థిక వ్యవహారాల గుట్టురట్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సుమారు ఆరు దేశాల్లో మాల్యా ఆస్తుల వివరాలను,. ఆర్థిక సంబంధాలను తెలియచేయాల్సిందిగా లేఖలు రాయనుంది. మాల్యాపై బలమైన కేసును పెట్టే యోచనలో భాగంగా ఫ్రాన్స్, సింగపూర్, మారిషస్, ఐర్లాండ్, , అమెరికా , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు త్వరలో ల్‌ఆర్ ను ఈడీ జారీ చేయనుంది. మల్యాపై కేసును మరింత పటిష్టంగా రూపొందించడానికిగాను ఆరు దేశాలకు ఈ లేఖలను పంపనుంది. ఈ మేరకు ఆయా ఖాతాలపై విచారణ జరిపేందుకు గాను కోర్టు అనుమతిని మంజూరు చేసింది. లెటర్ రోగటరీ (ఎల్ఆర్)ను ఈడి అందుకుంది. కాగా అమెరికా, ఐర్లాండ్, మారిషస్, ఫ్రాన్స్ దేశాల్లోని 13 షెల్ కంపెనీల ద్వారా రూ. 1,300 కోట్లు ఆర్జించినట్టు ఇటీవల ఈడీ ప్రకటించింది. మరోవైపు మాల్యాను లండన్ నుంచి దేశానికి రప్పించే చర్యల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులు లండన్‌కు బయలుదేరి వెళ్లారు. సంబంధిత పత్రాలు, చార్జిషీటుతో ఇద్దరు సభ్యులు బృందం లండన్‌లో క్రౌన్స్ ప్రాసిక్యూషన్ ముందు సమర్పించనున్నారు. 2016లో లండన్‌కు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18న స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు, వెంటనే బెయిల్ మంజూరు తెలిసిన సంగతే. -
నన్ను ఇన్వాల్వ్ చేయకండి..
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీకాలం అనంతరం మళ్ళీ అధ్యాపక వృత్తిలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. సెప్టెంబర్ 4 తో ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆయన తిరిగి అధ్యాపక వృత్తిలోకి వెడతారని సహచరులతో చెప్పినట్లుగా వచ్చిన వార్తలపై స్పందించారు. బెంగళూరులో జరిగిన ఓ సమావేశంలో అదేవిషయంపై వ్యాఖ్యానించారు. తనను అనవసర విషయాల్లోకి లాగొద్దని, తాను ప్రపంచంలో ఎక్కడైనా ఉంటానని రఘురాం రాజన్ తెలిపారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో జరిగిన అసోచామ్ సమావేశంలో పాల్గొన్న ఆర్బీఐ గవర్నర్ రంగ రాజన్ ఆయన భవిష్యత్ జీవితంపై ఎవ్వరూ ఊహా కథనాలు అల్లొద్దని స్పష్టం చేశారు. మరో రెండు నెలలు పదవిలో ఉంటానని, తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా తాను నివసించే అవకాశం ఉందని అన్నారు. ముఖ్యంగా భారత్ లో ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. సమావేశం సందర్భంగా మాట్లాడిన ఆయన.. క్రెడిట్ రేటు మందగించడానికి అధిక వడ్డీరేట్లు కారణం కాదన్నారు. బ్యాలెన్స్ షీట్లను పటిష్ఠపరచడం, రుణాలను పెంచడం వంటివి చాలా సున్నితమైన ఆంశాలుగా ఆయన వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్బీఐ ప్రభుత్వ బ్యాంకులకు సాయపడుతున్నట్లు తెలిపారు. -
రోహిత్ కోసం ప్రపంచ స్కాలర్ల లేఖ..!
ప్రపంచ పండిత సమాజం ఏకమైంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి ఆత్మహత్య ఘటన ఇప్పుడు భారత్ తో పాటు, దక్షిణాసియా అంతర్జాతీయ స్కాలర్లను ఏకతాటిపైకి తెచ్చింది. భారత ఉన్నత విద్యలో కుల వివక్షపై న్యాయ పోరాటానికి నడుం బిగించింది. ఈ నేపథ్యంలో పలు దేశాల్లోని విద్యావంతులు, ప్రొఫెసర్లు సంతకాలు చేసిన ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. ఐదుగురు దళిత పీహెచ్ డీ విద్యార్థులను వర్శిటీ నుంచి బహిష్కరించడం కుల వివక్షకు తార్కాణమని.. విద్యార్థులు కనీసం మాట్లాడేందుకు అనుమతించకుండా రాజకీయ ఒత్తిడులతో వారిని బహిష్కరించడం అన్యాయమని, ఈ విషయంలో వెంటనే న్యాయం విచారణ చేపట్టాలని వారు లేఖలో డిమాండ్ చేశారు. విద్యార్థులపై పాలకుల పక్షపాత వైఖరి, రాజకీయ నాయకుల ప్రమేయం భయంకర పరిణామాలకు దారితీస్తోందని ప్రపంచ స్కాలర్ల సమాజం ధ్వజమెత్తింది. యూనివర్శిటీ బహిష్కరించిన ఐదుగురు దళిత విద్యార్థుల్లో ఒకరైన స్కాలర్ స్టూడెంట్ వేముల రోహిత్.. వర్శిటీ బహిష్కరణ తన గుర్తింపునకు భగం కలిగించిందన్న నిరాశకు లోనయ్యాడని.. తక్షణ గుర్తింపుకోసం స్వంత జీవితాన్నేబలి చేసుకున్నాడని వారంటున్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో యువకుల మేధో, వ్యక్తిగత అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన ప్రాధమిక బాధ్యతలో విద్యా సంస్థలు వైఫల్యం చెందుతున్నాయని ఆరోపించారు. సంస్థల్లో సమస్యలను చక్కగా పరిష్కరించలేని పరిస్థితుల్లో రోహిత్ వంటి దళిత విద్యార్థులెందరో వివక్ష, నిరాశలతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ స్కాలర్ల సమాజం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే రోహిత్ సహ విద్యార్థులు నలుగురినీ విచారించాలనీ, రోహిత్ కుటుంబానికి సహకారం అందించడంతోపాటు... అతడి ఆత్మహత్యపై ప్రత్యేకంగా పోలీస్ విచారణ జరిపించాలని దక్షిణాసియా అంతర్జాతీయ స్కాలర్స్... హైదరాబాద్ వర్శిటీ అధికారులను కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయ విచారణ చేపడితే సరిపోదని, భవిష్యత్తులో కూడ ఇటువంటి సంఘటనలు జరగకుండా నివారించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. రోహిత్ వంటి విద్యార్థుల పౌర జీవితంతోపాటు వారి ఆరోగ్యవంతమైన రాజకీయ చర్చకు విశ్వవిద్యాలయాలు వేదికలు కావాలన్నారు. భారత విశ్వవిద్యాలయాల్లో ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రమేయం, కుల వివక్ష ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ప్రతికూల కీర్తికి దోహదపడుతోందన్నారు. గౌరవ ప్రదమమైన, మంచి వాతావరణంలో విద్యాబోధన సాగించడంతోపాటు వర్శిటీల్లో రాజకీయ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
అన్నా లేఖతో ఆత్మరక్షణలో ఏపీ సర్కార్
-
రీల్ పై రియల్ లైఫ్ చూపిస్తా:షకీలా
-
'తెలంగాణ వద్దు.. తెలంగాణ రాష్ట్రం ముద్దు'
హైదరాబాద్: టీవీలలో చదివేటపుడు, పత్రికలలో రాసేటపుడు తెలంగాణ అని కాకుండా తెలంగాణ రాష్ట్రంగా పేర్కొనాలని తెలంగాణ రాష్ట్రం ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సూచించారు. అన్ని పత్రికలు, టీవీ చానెళ్ల ఎడిటర్లకు రాజీవ్ శర్మ ఈ మేరకు లేఖ రాశారు. సంయుక్త ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ అనే సంబోంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అని పేర్కొనాలంటూ ప్రధాన కార్యదర్శి కోరారు. -
మోడీకి వీసా ఇవ్వొద్దు