న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలను బ్యాంకులకు ఎగనామంపెట్టిన లిక్కర్ బారన్ విజయ్ మాల్యా ఆర్థిక వ్యవహారాల గుట్టురట్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ మేరకు సుమారు ఆరు దేశాల్లో మాల్యా ఆస్తుల వివరాలను,. ఆర్థిక సంబంధాలను తెలియచేయాల్సిందిగా లేఖలు రాయనుంది. మాల్యాపై బలమైన కేసును పెట్టే యోచనలో భాగంగా ఫ్రాన్స్, సింగపూర్, మారిషస్, ఐర్లాండ్, , అమెరికా , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు త్వరలో ల్‌ఆర్ ను ఈడీ జారీ చేయనుంది.
మల్యాపై కేసును మరింత పటిష్టంగా రూపొందించడానికిగాను ఆరు దేశాలకు ఈ లేఖలను పంపనుంది. ఈ మేరకు ఆయా ఖాతాలపై విచారణ జరిపేందుకు గాను కోర్టు అనుమతిని మంజూరు చేసింది. లెటర్ రోగటరీ (ఎల్ఆర్)ను ఈడి అందుకుంది.
కాగా అమెరికా, ఐర్లాండ్, మారిషస్, ఫ్రాన్స్ దేశాల్లోని 13 షెల్ కంపెనీల ద్వారా రూ. 1,300 కోట్లు ఆర్జించినట్టు ఇటీవల ఈడీ ప్రకటించింది. మరోవైపు మాల్యాను లండన్ నుంచి దేశానికి రప్పించే చర్యల్లో భాగంగా ఈడీ, సీబీఐ అధికారులు లండన్‌కు బయలుదేరి వెళ్లారు. సంబంధిత పత్రాలు, చార్జిషీటుతో ఇద్దరు సభ్యులు బృందం లండన్‌లో క్రౌన్స్ ప్రాసిక్యూషన్ ముందు సమర్పించనున్నారు. 2016లో లండన్‌కు పారిపోయిన మాల్యాను ఏప్రిల్ 18న స్కాట్‌లాండ్ పోలీసులు అరెస్టు, వెంటనే బెయిల్ మంజూరు తెలిసిన సంగతే.
మాల్యాకోసం ఆరుదేశాలకు లేఖలు
Published Wed, Jul 19 2017 12:37 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM
Advertisement
Advertisement