సాధారణంగా మనలో ఎక్కువ శాతం మంది కుడి చేత్తో రాస్తారు. కొందరు మాత్రం ఎడమ చేతితో రాస్తారు. మరి కొందరిలో రెండు చేతులతో రాయగలిగే ప్రతిభ ఉంటుంది. కానీ ఏక కాలంలో రెండు చేతులతో ముందు నుంచి వెనక్కి.. పైన ఒక చేత్తో.. కింద మరో చేత్తో రాసేవారిని ఎప్పుడైనా చూశారా. లేదా అయితే ఈ వీడియో చూడండి.. ఆశ్చర్యంతో మీరు కూడా వావ్ అంటారు. మనోజ్ కుమార్ అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సూపర్ టాలెంట్ అంటూ ప్రశంసలు పొందుతుంది. బహుళ ఏకాగ్రత కలిగిన ఈ కళను అవధానకలా అంటారని తెలిపారు. (చదవండి: ఒక్క ట్వీట్‌తో ఊహించని స్పందన)
Incredible India!! 🇮🇳🇮🇳
— Manoj Kumar (@BharatKumar1857) October 29, 2020
This art of multiple concentration was known as अवधानकला avadhanakala.@anandmahindra @RandeepHooda @AnupamPKher @ARanganathan72 @aamir_khan @sachin_rt @SrBachchan @DrKumarVishwas @harbhajan_singh @ImRaina @SwetaSinghAT pic.twitter.com/rL5cOMVrpz
ఇక ఈ వీడియోలో ఓ అమ్మాయి తన బ్లాక్ బోర్డు మీద రెండు చేతులతో ఏక కాలంలో రాస్తుంది. ముందు నుంచి వెనక్కి.. పై నుంచి కిందకు రాయడం వీడియోలో చూడవచ్చు. ఏ మాత్రం తడబాటు లేకుండా చాలా చాకచక్యంగా రెండు చేతులతో రాస్తున్న ఈ అమ్మాయి టాలెంట్ అందరిని అబ్బురపరుస్తుంది. ‘ఇన్‌క్రీడబుల్ ఇండియా’ పేరుతో వీడియోని షేర్ చేయడమే కాక ఆనంద్ మహీంద్రా, రణ్‌దీపా హుడా, అనుపమ్ ఖేర్, హర్భజన్ సింగ్, సీనియర్ బచ్చన్, ఏ రంగనాథన్, ఆమిర్ ఖాన్, రైనా, స్వేతా సింగ్,డాక్టర్ కుమార్ విశ్వాస్ వంటి ప్రముఖులను ట్యాగ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment