heart touching
-
హృదయాల్ని కదిలిస్తున్న చిన్నారి : వైరల్ వీడియో
సాధారణంగా కన్నబిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కానీ అంధులైన తల్లిదండ్రులను అన్నీ తానై చూసుకుంటోంది ఓ చిన్నారి. అమ్మా, నాన్న చేయి పట్టుకుని అడుగులు నేర్చుకునే వయసులోనే తల్లిదండ్రులను చేయి పట్టుకొని భద్రంగా తీసుకెళుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట ఆకర్షణీయంగా నిలిచింది.In a touching emotional scene, a child is helping his blind parents at an age when they have to teach him to walk. pic.twitter.com/zVVSXHexlx— Akanksha Parmar (@iAkankshaP) July 18, 2024ఆకాంక్ష పర్మార్ అనే యూజర్ ఎక్స్‌లో ఈ ఈ వీడియోను షేర్ చేశారు. ‘ఇదీ సంస్కారం అంటే’ అంటూ నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. హృదయాన్ని కదిలిస్తోంది అంటూ చాలామంది ఎమోషనల్ అయ్యారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే ఇలాంటి వారికోసం ప్రభుత్వం పూనుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని మరికొంతమంది సూచించారు. -
ఈ స్నేహం ఎంత గొప్పదో
-
Heart Touching Photo: ఒక్క ఫోటోతో హృదయాలను కదలిస్తున్న బాలిక
వంద మాటలు మాట్లాడినా అర్థంకాని కొన్ని విషయాలు ఒక్క చిత్రం చూస్తే ఇట్టే అర్థం అవుతాయి. మనం చెప్పలేని ఎన్నో భావాలను ఒక్క ఫోటో చెబుతుంది. వంద మాటలకు సమాధానంగా నిలుస్తుంది.కొన్ని చిత్రాలు మనసుకు హాయినిస్తే.. మరికొన్ని దృశ్యాలు గుండెలు పిండేసేలా కనిపిస్తాయి. ఫోటో జీవిత సత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తుంది. తాజాగా ఓ విద్యార్థిని పాఠశాలలోని తరగతి గదిలో కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మణిపూర్ రాష్ట్రంలోని తమెంగ్‌లాంగ్‌కు చెందిన పదేళ్ల చిన్నారి పమి నాలుగో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో చిన్నారి ఓ రోజు తన రెండేళ్ల చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని తరగతి గదిలో పాఠాలు వినేందుకు వచ్చింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయం పనుల నిమిత్తం పొద్దున్నే పొలానికి వెళ్లడంతో చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యతను తనకు అప్పగించారు. అయితే చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన పామి తన చెల్లెల్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లలేక తనను తీసుకొని స్కూల్‌కి వెళ్లింది. తరగతి గదిలో చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని పాఠాలు వినడం, రాసుకోవడం చేస్తుంది. చదవండి: విద్యార్థులతో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన మహిళా కలెక్టర్.. వీడియో వైరల్! చదువుపై తనకున్న ఆసక్తి, తల్లిదండ్రుల అప్పజెప్పిన బాధ్యతను రెండింటిని కలగలిపి చూపించే ఈ దృశ్యం అందర్ని మనసుల్ని కదిలిస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు.. చెల్లెలి బాధ్యత, భవిష్యత్తు కోసం చిన్నారి పడుతున్న తపనను అభినందిస్తున్నారు. పమి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవడంతో ఈ విషయం రాష్ట్ర మంత్రి వరకు చేరింది. ఈ ఫోటోలపై మణిపూర్ మంత్రి స్పందించారు. చదువు పట్ల చిన్నారికి ఉన్న అంకితభావం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందన్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తను చూసిన తర్వాత బాలిక కుటుంబాన్ని గుర్తించామని, వారిని ఇంఫాల్ తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. బాలిక గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు తానే చదివిస్తానంటూ ఆమె కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. Her dedication for education is what left me amazed! This 10-year-old girl named Meiningsinliu Pamei from Tamenglong, Manipur attends school babysitting her sister, as her parents were out for farming & studies while keeping her younger sister in her lap. pic.twitter.com/OUIwQ6fUQR — Th.Biswajit Singh (@BiswajitThongam) April 2, 2022 -
చూస్తే చాలు కళ్లు చెమరుస్తాయి.. దీపావళి వేళ.. మనసును హత్తుకునేలా
దీపావళి పండగ అంటే సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అంతా ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బిజినెస్ సెక్టార్లో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంది. స్టాక్మార్కెట్లో ప్రత్యేకంగా ముహురత్ ట్రేడింగ్ ఉంటుంది. దాదాపు అన్ని వ్యాపార సంస్థలులు ధమాకా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అయితే మనసును ఆకట్టుకునేలా యాడ్స్ రూపొందించడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అందులో ఈసారి వచ్చిన కొన్ని ప్రకటనలు మనసును హత్తుకునేలా.. గుండె తడిని పెంచేలా.. ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా భావంతో కట్టిపడేసేలా వాటిని రూపొందించారు. పండగ వేళ మీరు వాటిని చూడండి. వీటి తీరే వేరు సాధారణంగా అన్ని యాడ్స్ ఆయా కంపెనీలు తయారు చేసే ప్రొడక్టు గురించి విపరీతంగా ప్రమోట్ చేస్తున్నట్టుగా తయారవుతాయి. కానీ దీపావళి యాడ్స్ అలా కాదు పూర్తిగా భావోద్వేగంగా ఉంటాయి. బ్రాండ్, ప్రొడక్ట్ ప్రమోషన్ అనేది అంతర్లీనంగా ఉంటూ ఎమోషనల్‌గా ఉంటాయి. అందుకే ఏళ్లు గడిచినా సరే వాటిని మరిచిపోవడం కష్టం. సేల్స్‌మేన్ కళ్లలో ఆనందం ఇండియన్ ఆయిల్ యాడ్‌లో .. దీపావళి పండగ సందర్భంగా ఓ స్వీట్ షాప్ కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఆ షాప్ యజమాని వచ్చిన కస్టమర్లందరికీ టేస్ట్ చూడమంటూ కలాకాన్ అందిస్తుంటాడు. ఈ షాప్‌లోని సేల్స్‌మేన్ చూస్తుండగానే కాంప్లిమెంటరీ స్వీట్ మొత్తం అయిపోతుంది. చివరకు షాప్ మూసివేసే సమయంలో ఏమైనా స్వీట్ మిగిలి ఉందా అని సేల్స్‌మేన్ వెతుకుతారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. పండగ వేళ బయటంతా బాణాసంచా వెలుతురుతో సందండి నెలకొంటే సేల్స్‌మ్యాన్ ముఖంలో విచారణం నెలకొంటుంది. మనసంతా బాధతో నిండిపోయి ఉంటుంది. Sometimes, the smallest gesture can light up someone's world. This festive season, let's celebrate all such moments and spread good cheer and warmth.#IndianOil #Indane #XTRATEJ #HappyDiwali pic.twitter.com/s7Xkei8vhF — Indian Oil Corp Ltd (@IndianOilcl) November 2, 2021 మనసంతా నిరాశతో గుండె బరువెక్కిపోయిన సేల్స్‌మేన్ కళ్లలో ఆనందం ఎలా వచ్చింది. ఎవరు ఆ సంతోశానికి కారణమనే అంశాలను ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించారు. చివర్లో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే వాయిస్‌తో యాడ్ మరో లెవల్‌కి వెళ్లిపోతుంది. దీపావళి యాడ్స్‌కి స్పెషల్ ట్రెండ్‌ని క్రియేట్‌ని చేసి వాటిలో రెండేళ్ల క్రితం వచ్చిన హెచ్‌పీ ప్రింటర్స్ యాడ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. ఓల్డ్ అడ్వెర్టైజ్మెంట్కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈసారి కూడా హెచ్‌పీ సంస్థ యాడ్‌ను రెడీ చేసింది. కొన్ని బంధాలకు లేబుళ్లు అక్కర్లేదు అంటూ అమెజాన్ రూపొందించిన యాడ్ తప్పకుండా ఆకట్టుకుంటుంది. దీపావళి రోజున ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తీసుకెళ్లిన కొడుకుతో తండ్రి వాదులటతో ప్రారంభమయ్యే ఎల్ అండ్ టీ యాడ్ ఎండింగ్లో ఇచ్చే ట్విస్ట్‌తో మరో లెవల్‌కి చేరుకుంటుంది. వృద్దాప్యంలో చాదస్తం ఎక్కువైన భర్త, అతనితో వేగలేక పోతున్న భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చెబుతూ ఏయూ బ్యాంక్ రూపొందించిన యాడ్ కూడా ఆకట్టుకుంటుంది. -
అంత్యక్రియల్లో.. తండ్రి సేవలకు గుర్తుగా
సిడ్నీ : ప్రపంచంలో ఏ పిల్లాడైనా సరే తన తండ్రి గొప్పదనం తెలుసుకున్నప్పుడు వారు ఎంతగా మురిసిపోతారో చెప్పనవసరం లేదు. అందులోనూ దేశంకోసం ప్రాణత్యాగం చేసిన తండ్రి విలువను అందరూ గుర్తించినప్పుడు ఆ పిల్లల ఆనందానికి అవదులు లేకుండా పోతాయి. తాజాగా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కార్చిచ్చు ధాటికి అమరుడైన తన తండ్రి అంత్యక్రియల సమయంలో అతని సాహసానికి గుర్తుగా తన 19 నెలల కూతురుకు వోడయ్యర్ వాడిన హెల్మట్‌తో పాటు మెడల్‌ను బహూకరించారు. వీటిని ఆ పాప ధరించినప్పుడు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులు భావోద్వేగానికి గురవడం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో చూసిన ప్రతీ వీక్షకుడి గుండె బరువెక్కుతుంది. వివరాల్లోకి వెళితే.. ప్రసుత్తం ఆస్ట్రేలియాలో కార్చిచ్చు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. కార్చిచ్చు భారీ నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఫైటర్స్ తమ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19న ఫైర్ ఫైటర్స్ కార్చిచ్చు నుంచి ప్రజలను రక్షించడానికి ఫైర్ ఇంజన్లో వెళ్లారు. అయితే ఒక్కసారి కార్చిచ్చు మంటలు మరింతగా వ్యాపించి వారు వెళుతున్న వాహనంపై పడడంతో అందరూ అక్కడికక్కడే మరణించారు. అందులో 36 ఏళ్ల వోడయ్యర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతను న్యూసౌత్ వేల్స్ రూరల్ ఫైర్ సర్వీస్ నుంచి ఫైర్‌ఫైటర్‌గా తన సేవలందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సిడ్నీలో వోడయ్యర్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో భాగంగా 12 మంది ఫైర్ ఫైటర్స్ వరుసగా నిలబడి వోడయ్యర్ మృతదేహానికి హార్డ్ ఆఫ్ గానర్తో గౌరవించారు. అనంతరం వోడయ్యర్ 19 నెలల కూతురైన చార్లెట్‌ను హెల్మట్‌తో పాటు సేవా పతకాన్ని అందించారు. ' చార్లెట్.. ఈరోజు నీ తండ్రి ఎంత గొప్పవాడో నీకు తెలియాలి. మీ నాన్న ఒక గొప్ప వ్యక్తి, దేశకోసం తన ప్రాణాలను పణంగా పెట్టి నిజమైన హీరో అయ్యారు. అతని సేవను మేము ఎప్పటికి గుర్తుంచుకుంటాం' అంటూ అధికారి ఫిట్జ్‌సిమ్మన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. 19 నెలల చార్లెట్ తన తండ్రి జ్ఞాపకార్థంగా ఇచ్చిన హెల్మట్‌తో పాటు సేవా పతకాన్ని ధరించినప్పుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ఆస్ట్రేలియన్ ప్రధాని స్కాట్ మోరిసన్ దంపతులు వోడయ్యర్ కుటుంబసభ్యుల వద్దకు వెళ్లి ఆలింగనం చేసుకొని వారిని ఓదార్చారు. రెండు నెలలుగా ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చుకు ఇప్పటివరకు 26 మంది ఫైర్ ఫైటర్లు తమ ప్రాణాలు కోల్పోగా, వేలాది జంతువులు బలయ్యాయి. -
‘హార్ట్’ టచింగ్ మెసేజ్
సామాజిక మాధ్యమం ట్విటర్లో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర చేసిన ఓ పోస్ట్ గుండెకు హత్తుకునేలా ఉంది. చనిపోయిన కూతురి ఓ తండ్రి ఎంత ప్రేమను కనబరుస్తున్నాడో తెలిపే ఓ వీడియోను ట్వీట్ చేసిన ఆయన..‘ఈ రోజు నేను రెండు ప్రొడక్ట్స్ ప్రారంభించినప్పటికీ.. ఈ వీడియోను మీతో షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో ఎప్పటిదో నాకు తెలియదు.. కానీ అది నా మనసును కదిలించింది. అదే విధంగా ఆ తండ్రి కూడా తన కూతురు గుండెను కదిలించాడు. మన చర్మం ఏ రంగులో ఉన్న.. శరీరంలోని గుండె మాత్రం అందరిలో ఒకేలా కొట్టుకుంటుందనే చక్కటి సందేశం అందులో ఉంద’ని పేర్కొన్నారు. ఆ వీడియోలో ఏముదంటే.. యూఎస్‌లోని ఒరెగాన్కు చెందిన బిల్ కన్నేర్కు గతేడాది తన కొడుకు ఆస్టిన్, కూతురు అబ్బేతో కలిసి ఫ్యామిలీ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఆస్టిన్, అబ్బేలు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదం నుంచి ఆస్టిన్ బయటపడినప్పటికీ.. అబ్బే మరణించింది. తర్వాత బిల్ ఆమె అవయవాలను దానం చేశారు. అయితే తన కూతురిని మరచిపోలేకపోయిన బిల్.. అబ్బే జ్ఞాపకార్థంగా సైకిల్‌పై దేశవ్యాప్తంగా పర్యటించాలని అనుకున్నాడు. అలాగే అవయవ దానం గొప్పతనం గురించి చాటిచెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా అతడు అబ్బే అవయవాలు దానం చేసిన హెల్త్ సెంటర్‌కు వెళ్లి.. ఆమె అవయవాలు ఎవరికైతే అమర్చారో వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆయన విజ్ఞప్తితో హెల్త్ సెంటర్ సిబ్బంది అబ్బే అవయవాలు అమర్చిన వారిని సంప్రదించారు. A lot on today,including two product launches but had to share this post.Don’t know how old the story is but it touched my heart the same way this dad touched his daughter’s heart. A powerful message that no matter what colour our skin,the heart beating underneath is the same... pic.twitter.com/CM3xL87nR9 — anand mahindra (@anandmahindra) 15 November 2018 అందులో ఆమె హృదయాన్ని అమర్చిన లూమోత్ జాక్ మాత్రమే.. అబ్బే తండ్రిని కలిసేందుకు అంగీకారం తెలిపాడు. దీంతో హెల్త్ సెంటర్ నిర్వహకులు అతని వివరాలను బిల్‌కు అందజేశారు. తన యాత్రలో భాగంగా ఫాదర్స్‌డే రోజున లూమెత్ను కలిసిన బిల్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. స్టేతస్కోప్తో లూమెత్ గుండె(అతనికి అమర్చిన అబ్బేది) చప్పుడు విని కూతురిని గుర్తుచేసుకున్నారు. అక్కడే ఉన్న లూమెత్ తండ్రి బిల్‌ను ఓదార్చారు. లూమెత్ విషయానికి వస్తే.. 21 ఏళ్ల లూమెత్ గుండె బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువ కాలం బ్రతకడని వైద్యులు ప్రకటించారు. ఆ సమయంలో అబ్బే గుండె అమర్చడం వల్ల లూమెత్కు మరో జన్మ లభించినట్టయింది. -
హృదయాన్ని హత్తుకునే సినిమాలు చేస్తా
బిచ్చగాడు దర్శకుడు ‘శశి’ పసలపూడి (రాయవరం) : హృదయాన్ని హత్తుకునే సినిమాలు తీయాలనేది తన లక్ష్యమని ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడిన బిచ్చగాడు దర్శకుడు శశి తెలిపారు. తదుపరి తీయబోయే సినిమా షూటింగ్ నిమిత్తం లొకేషన్స్ చూసేందుకు శుక్రవారం ఆయన పసలపూడి గ్రామానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. బీఏ సోషియాలజీ చదివిన తాను ఇప్పటి వరకు ఆరు సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. తెలుగులో తన తొలి సినిమా వెంకటేష్ హీరోగా ‘శీను’కు దర్శకత్వం వహించగా ‘బిచ్చగాడు’ రెండో సినిమా అన్నారు. ఈ సినిమా ఘన విజయం తనకు సంతృప్తినిచ్చిందన్నారు. కథ బలంగా ఉంటే ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారన్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హీరోగా నటించిన ‘ఓ పాపా లాలి’ సినిమా దర్శకడు వసంత్ వద్ద తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశానన్నారు. కె.విశ్వనాథ్, శేఖర్ కమ్ముల, క్రిష్, కరుణాకరణ్ దర్శకత్వ పనితీరు తనను ఆకట్టుకున్నాయన్నారు. ఉత్తమ అభిరుచి ఉన్న సినిమాలు నిర్మిస్తానన్నారు. ప్రస్తుతం తెలుగులో సినిమాకు దర్శకత్వం వహించనున్నానన్నారు. వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. ఆయన వెంట యానాంకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్‌ల ఏజెంట్ మడికి రామస్వామి, షార్ట్‌ఫిల్మ్స్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, యానాం కథల రచయిత సాధనాల బాబు, సినీ నటుడు కర్రి రామారెడ్డి, జూనియర్ రాజనాల ఉన్నారు.