యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం తర్వాతే మరే పెంపుడు జంతువైనా.. చాలా మంది ఇంట్లో కుక్కను పెంచుకుంటారు. జాతి శునకం ఇంట్లో ఉండటం గర్వంగా భావిస్తారు. శునక జాతిలో ఎంతో గుర్తింపు పొందిన, ఖరీదైన, అందమైన గోల్డెన్ రిట్రీవర్ ను పెంచుకుంటున్న జర్మనీకి చెందిన ఓ యజమాని... అది తమ పట్ల చూపిస్తున్న అభిమానాన్ని, ఇచ్చే సహకారాన్ని వీడియో తీసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పడు ఆ వీడియోకు ఎంతో స్పందన లభిస్తోంది. లక్షకు పైగా వ్యూయర్లను ఆకట్టుకుంది.
యజమాని షాపింగ్ నుంచి తెచ్చిన సరుకులను కారు లోంచి ఇంట్లోకి నోటితో కరచుకొని తరలిస్తున్న వీడియో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంటికి కాపలాగా ఉండేందుకు పెంచిన శునకాన్ని అంతటితో వదిలేయకుండా ఇంటి పనులు చేయడంలో కూడా ఆ కుటుంబం శిక్షణ ఇచ్చింది. దీంతో యజమాని రుణం తీర్చుకోవాలన్న తాపత్రయంతో అతడు ఇంటికి రాగానే రిట్రీవర్ శునకాలు కారు చుట్టూ చేరి ఒక్క వస్తువును కూడా వదలకుండా ఇంట్లోకి చేర్చేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. పెంపుడు జంతువులు పచారీ సామాన్లు మోయడం ఎంతో ఆనందంగా ఉందని, వాటి ప్రేమను, ఆప్యాయతను యజమాని వద్ద ప్రదర్శించేందుకు, విశ్వాసాన్ని చాటుకునేందుకు తాపత్రయపడటం ఒకింత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోందని... కొందరు వ్యూయర్స్ తమ కామెంట్లనూ పోస్ట్ చేస్తున్నారంటే ఆ గోల్డెన్ రిట్రీవర్లకు ఎంత ఫ్యాన్స్ అయిపోయారో తెలుస్తోంది.
యూట్యూబ్ లో ఓ క్యూట్ వీడియో
Published Fri, Oct 9 2015 7:36 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
Advertisement
Advertisement