bring
-
మరో రాష్ట్రంలో లవ్ జిహాద్ చట్టం..?
ముంబయి: లవ్ జిహాద్ చట్టాన్ని దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో త్వరలో మహారాష్ట్ర కూడా చేరనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్రాలోనూ లవ్ జిహాద్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నట్లు చెప్పారు. పలు రాష్ట్రాల్లో తీసుకువచ్చిన ఈ చట్టాన్ని సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్ఫష్టం చేశారు. హిందూ యువతులను వివాహం పేరిట మతమార్పిడీకి పాల్పడే కుట్ర జరుగుతోందని బీజేపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో దీనిని అరికట్టడానికి ఇప్పటికే పలు రాష్ట్రాలు చట్టాన్ని కూడా తీసుకువచ్చాయి. 'పెళ్లి పేరిట యువతులపై మతమార్పిడీకి పాల్పడుతున్నారనే కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ ఉంది. ఇదే విషయాన్ని గతంలోనూ అసెంబ్లీలో ప్రస్తావించాను. పలు రాష్ట్రాలు తీసుకువచ్చిన లవ్ జిహాద్ చట్టంపై అధ్యయనం చేస్తున్నాం. అనంతరం మహారాష్ట్రాలోనూ ఆ చట్టాన్ని తీసుకువస్తాం' అని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. మోదీ వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు స్టే విధించిన అంశంపై ఫడ్నవీస్ స్పందించారు. కోర్టు తీర్పు తమకు అనుగుణంగా రాగానే కాంగ్రెస్ వేడుకలు జరపడంపై ఆయన ఆక్షేపించారు. కొందరు రాజ్యాంగ విలువలను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి దుయ్యబట్టారు. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసు అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్కి హాజరైన అనంతరం ఫడ్నవీస్ మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో 18000 పోలీసు రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: మోదీ-యోగీ సోదరీమణుల ఆత్మీయ ఆలింగనం.. -
ఇక్కడి వాళ్లు విదేశాల్లో చనిపోయారా? డెడ్ బాడీ తేవడానికి ఒక పోర్టల్
విదేశాల్లో భారతీయ పౌరులు మరణించినప్పుడు, వారి మృతదేహాలను భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. దీని కోసం అన్ని ఎయిర్‌లైన్స్ ఏజెన్సీలు ‘ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించాయి. ఫలితంగా విదేశాలలో మరణించిన వ్యక్తి సంబంధీకులు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తును ఆమోదించి, విదేశాల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియను సంబంధిత అధికారులు ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో చేపట్టనున్నారు. సుదీర్ఘ ప్రక్రియ.. ఇకపై సులభతరం! ఇన్నాళ్లూ భారతీయ పౌరులెవరైనా విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలను తీసుకురావడానికి కుటుంబ సభ్యులు సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి వచ్చేది. ఒక్కోసారి వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టేది. అసాధారణ పరిస్థితుల్లో ఎవరైనా మృతి చెందిన సందర్బంలో వారి మృతదేహాలను తీసుకువచ్చేందుకు మరింత సమయం పట్టేది. ఇటువంటప్పుడు కొన్నిసార్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోవాల్సి అవసరం కూడా ఏర్పడేది. ఈ నేపధ్యంలోనే విదేశాల నుంచి భారతీయుల మృతదేహాలను తీసుకొచ్చే ప్రక్రియను సడలించాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ దిశగా సానుకూల చర్యలు మొదలయ్యాయి. ‘ఓపెన్ ఈ- కేర్’ అంటే ఏమిటి? ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫారమ్‌ను అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు కలిసి సిద్ధం చేశాయి. ఇక నుంచి విదేశాల్లో ఎవరైనా భారతీయ పౌరులు మరణిస్తే మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మరణించిన వ్యక్తి కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తును సంబంధిత అధికారులు తనిఖీ చేసిన తర్వాత, మృతదేహాలను తీసుకువచ్చే ప్రక్రియను వీలైనంత త్వరగా జరుగుతుంది. 48 గంటల్లోగా ఆమోదం విదేశాల్లో ఉన్న భారతీయుల మృత దేహాలను తిరిగి తీసుకురావడంలో జాప్యాన్ని నివారించేందుకు ఈ- పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ- పోర్టల్ ద్వారా సెంట్రల్ ఇంటర్నేషనల్ హెల్త్ డివిజన్, నోడల్ అధికారులు, రవాణాదారులు, విమానయాన సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్‌ల ద్వారా సమాచారం పొందుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ కోసం నియమితులైన నోడల్ అధికారి దరఖాస్తును తనిఖీ చేసి, 48 గంటల్లోగా ఆమోదం తెలియజేస్తారు. రిజిస్టర్డ్ నంబర్ ద్వారా అప్లికేషన్ స్థితిని ఈ-కేర్ పోర్టల్‌లో సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్ -
స్కూలుకు తుపాకీ తెచ్చిన బాలుడు
నాప్లెస్: ఫ్లోరిడాలోని నాప్లెస్లోఉన్న ఓసియోలా ఎలిమెంటరీ స్కూలుకు చెందిన 11 ఏళ్ల బాలుడు తన బ్యాగులో తుపాకీ పెట్టుకొని పాఠశాలకు రావడం కలకలం రేపింది. కౌంటీ షెరిఫ్ అందించిన వివరాల ప్రకారం.. 4వ గ్రేడ్ చదువుతున్న బాలుడు తనతో పాటు తుపాకీని స్కూలుకు తెచ్చుకున్నాడు. అయితే అందులో బుల్లెట్లు లేవు. ఆ తుపాకీని తోటి విద్యార్థులకు చూపించి బెదిరించినట్లు పాఠశాల అధికారులు గుర్తించారు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు బాలున్ని అదుపులోకి తీసుకున్నారు. -
తెలంగాణకు బహుమతి తేవాలి
అక్టోబర్ 3 నుంచి అండర్–19 క్రీడాపోటీలు భువనగిరి టౌన్ : వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అండర్–19 బాలబాలికల షూటింగ్, బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి తెలంగాణ జట్టు పతకాలు సాధించాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు. స్థానికంగా క్రీడలు జరగనున్న మైదానాన్ని గురువారం ఆయన పరిశీలించారు. క్రీడల నిర్వహణకు లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడాకారులకు వసతి, భోజన ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. అంతకు ముందు శిథిలావస్థకు చేరిన జూనియర్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అలాగే పట్టణంలో రూ.30లక్షలతో చేపట్టిన పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, నాయకులు నక్కల చిరంజీవి, కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, పి.అనిల్ ఎస్జీఎఫ్ అండర్–19 అర్గనైజింగ్ సెక్రెటరీ గువ్వ దయాకర్‌రెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సోమనర్సయ్య, పీఈటీలు రమణ, బాలకిషన్, కోనేటీ గోపాల్, యాదయ్య, మల్లేష్, నర్సింహ, పాల్గొన్నారు. -
జెడ్పీకి పూర్వవైభవం తీసుకొస్తా..
సీఎంతో మాట్లాడి జిల్లాకు మరిన్ని నిధులు జెడ్పీకి కేంద్ర నిధులు ఇవ్వడం లేదు నిధుల కొరతతో అభివృద్ధికి ఆటంకం జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యం ‘సాక్షి’ఇంటర్వ్యూలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవిత ఖమ్మం జెడ్పీసెంటర్: జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రంపై ఒత్తిడి చేసి జిల్లా పరిషత్‌లు పూర్వ వైభవం తీసుకవచ్చేందుకు పాటుపడతానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు చేపట్టి ఆదివారానికి రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’తో ఆమె పలు అంశాలపై ముచ్చటించారు. కేంద్ర ప్రభుత్వం పలు పథకాలకు బ్రేక్ వేసిందని, దీంతో జిల్లా పరిషత్ పాలనకు కొంతమేర ఆటంకం కలిగిందన్నారు. ముఖ్యమంత్రి కే సీఆర్‌తో మాట్లాడి జిల్లా అభివృద్ధికి నిధులు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మంత్రి తుమ్మల నాగేశ్వరావు విశేష కృషి చేస్తున్నారని, ఆయన సహకారంతో అభివృద్ధికి తన వంతు పాటుపడతానన్నారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, త్వరలో తండాలను సైతం పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. కొత్త జిల్లాలు ఏర్పడినా జిల్లా పరిషత్ పాలన రెండుచోట్ల ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ వివరాలు.. ప్ర: పాలనలో సంతృప్తికరంగా ఉందా...? జ: రెండేళ్ల పాలన సంతృప్తికరంగా ఉంది. అందరి సహకారంతో ఉన్న నిధులతో జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో తొలి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యా, ఈ పదవి దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ప్ర: రెండేళ్ళలో మీరు చేసిన అభివృద్ధి ..? జ: రెండేళ్ళ పాలనలో రూ. 424 కోట్లతో జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాం. మంచినీటి సరఫరా, బోర్లు, íసీసీ రోడ్ల, అంగన్వాడీ బిల్డింగ్‌ల నిర్మాణం చేపట్టాం. రోడ్లు, వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. పలు రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు ప్రతిపాదనలు పంపాం. ప్ర: జిల్లాల విభజనలో మీ పయనం ఎటు..? జ: జిల్లాల పునర్విభజన పక్రియ జరుగుతుంది. ఇంకా మూడేళ్ళు కాలపరిమితి ఉంది. నిర్ణయం తీసుకోలేదు. సమయం వచ్చినప్పుడు నిర్ణయం ప్రకటిస్తా. ప్ర: రాబోయే రోజుల్లో చేపట్టే అభివృద్ధి పనులు ..? జ: జిల్లా అభివృద్ధికి నిధులు వచ్చేలా కృషి చేస్తా. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రయత్నిస్తా. స్థానిక సంస్థల కేంద్ర బిందువు జెడ్పీ సొంత వనరులపై దృష్టి సారిస్తా. ప్ర: కేంద్ర నిధులు పరిస్థితి ఎంటీ..? జ: జిల్లా పరిషత్‌లకు కేంద్రం నుంచి ప్రతి ఎటా కోట్లాది రూపాయల నిధులు వచ్చేవి. వాటిలో నుంచి గ్రామ పంచాయతీలకు 50 శాతం, మండల పరిషత్‌లకు 30 శాతం, జిల్లా పరిషత్‌కు 20 శాతం నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేశాం. కాని గత రెండేళ్ళుగా ప్రభుత్వం బీఆర్జీఎఫ్ పథకాన్ని కేంద్రం ఎత్తి వేసింది. దీంతో నిధులు రాక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ప్ర: ప్రభుత్వ ప«థకాలు ఎలా అమలవుతున్నాయి..? జ: తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరుగుతుంది. ఇంటింటికి నీరు అందించే లక్ష్యంతో ‘మిషన్ భగిరథ’ జిల్లాలో పరుగులు తీస్తుంది. సెప్టెంబర్ నాటికి జిల్లాలో 102 హ్యబిటేషన్లలో నీరు అందించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సా«రథ్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాకతీయ మిషన్, హరితహారంలో జిల్లా అగ్రస్థానంలో ఉంది. ఓడీఎఫ్ లక్ష్యంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతుంది. -
రుణాలు సకాలంలో అందేలా చర్యలు
లాభాల బాటలో సహకార బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు ఖమ్మం వ్యవసాయం : రైతులకు సకాలంలో రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత రుణమాఫీ నిధుల్లో సగం నిధులు రూ.58 కోట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు విడుదలయ్యాయని, నిధులను 1.51 లక్షల రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన రైతులకు రుణాలు ఇవ్వనున్నామని, పట్టాదారు పాస్‌పుస్తకం కలిగిన రైతులకు రూ.3 లక్షల వరకు పంట రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. గతేడాది జేఎల్‌జీ కింద ఎంపిక చేసిన 5,600 భూమిలేని నిరుపేద రైతుల గ్రూపులకు రూ.56 కోట్ల రుణాలు ఇచ్చామని, ఆ రుణాలు చెల్లించినవారికి తిరిగి రూ.1.50 లక్షల చొప్పున రుణాలు ఇస్తామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ద్విచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించామని, అందుకోసం రూ.50 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రుణాలను జిల్లాలోని ముల్కలపల్లి సహకార సంఘం నుంచి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 10 సంఘాలకు ఐసీడీపీ కింద గోదాముల నిర్మాణానికి రూ.2.15 కోట్లు మంజూరు చేశామని, గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సహకార బ్యాంక్ లాభాల్లో నడుస్తోందని, గతేడాది రూ.9.62 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏటీఎంలను ఆగస్టులో ఏర్పాటు చేయటానికి నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో బ్యాంక్ సీఈఓ వి.నాగచెన్నారావు పాల్గొన్నారు. -
సిబ్బందికి కొత్త సౌకర్యం...
షాంఘై ః ఉద్యోగులనుంచి అధిక పనిని పొందాలంటే ఒక్కో కంపెనీ ఒక్కో సౌకర్యం కల్పిస్తుంటుంది. కొందరు ప్రత్యేక బోనస్ లు, ఇంక్రిమెంట్లు, టూర్లు, ఔటింగ్ ఇలా వారికి అప్పుడప్పుడు ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారితో పని చేయించుకుంటాయి. కానీ ఓ చైనా కంపెనీ మాత్రం తన సంస్థలోని ఉద్యోగులు ఒత్తిడి లేకుండా చక్కగా పనిచేసేందుకు భిన్నంగా ఆలోచించింది. వారు తమ పెంపుడు జంతువులతోపాటు ఆఫీసులకు వచ్చే సౌకర్యం కల్పించింది. చైనా షాంఘై లోని ఇంటర్నెట్ మార్కెటింగ్ కంపెనీ తమ ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పని చేసేందుకు కొత్త సౌకర్యాన్ని కల్పించింది. సిబ్బంది తమతోపాటు పెంపుడు జంతువుల్ని కూడా ఆఫీసుకు తెచ్చుకునే ఏర్పాటు చేసింది. వారిని ప్రోత్సహించేందుకు కల్పించిన కొత్త సౌకర్యంతో అద్భుత ఫలితాలు సాధించడంతోపాటు, సిబ్బంది హాయిగా, ఆనందంగా పనిచేయగల్గుతున్నట్లు యాజమాన్యం చెప్తోంది. కార్యాలయంలో పోటీ, డిమాండ్ సిబ్బందిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోందని, అది వారి పనిపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డ కంపెనీ అధిపతి జావో కాంగ్ చాంగ్.. వారు ఒత్తిడినుంచీ ఎలా రిలాక్స్ అవ్వగలరో పరిశోధించాడు. ముందుగా వారి ప్రొఫైల్స్ అధ్యయనం చేసి ఎక్కువశాతం ఉద్యోగుల ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లు గమనించాడు. వాటిని తెచ్చుకొని మరీ ఆఫీసుకు రావచ్చంటూ ('బ్రింగ్ యువర్ పెట్ వర్క్ డే' ) ప్రత్యేక సౌకర్యాన్ని ప్రకటించాడు. యజమాని తీసుకున్న నిర్ణయం భారీ విజయాన్ని సాధించింది. ఉద్యోగులంతా ఎంతో రిలాక్స్ గా ఉండటంతోపాటు, ఒకరికొకరు సహాయ పడుతూ ఉత్సాహంగా టీమ్ వర్క్ చేస్తున్నారు. నేనుకూడా పెట్ లవర్ అని, పెంపుడు జంతువులను ఎక్కువ సమయం ఒంటరిగా వదిలి వచ్చిన తర్వాత పొందే ఆందోళన ఎంతటిదో తనకు స్వానుభవం ఉందని, అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఏర్పాటు చేసినట్లు జావో చెప్తున్నాడు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వివరించగా.. వారు ఆహ్వానించారని, కంపెనీ ఉత్పాదకత పెంచడంలో అదో అనధికారిక విధానంగా అమలు చేసినట్లు జావో వివరించాడు. ప్రస్తుతానికి పెట్స్.. సిబ్బందితోపాటు ఆఫీసులోనే తిరుగుతూ ఉంటాయని, భవిష్యత్తులో అవి ఆడుకునేందుకు, నిద్రపోయేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలను కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. జావో కాంగ్ చాంగ్ నూతన ఆలోచన విజయవంతమవ్వడంతో ఇప్పుడు ఇతర స్టార్ట్ అప్ కంపెనీలు సైతం అటుగా దృష్టి సారిస్తున్నాయి. -
ఏపీలో నూతన ఇసుక పాలసీ!!
-
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
-
ఫేస్బుక్లో ఓ బామ్మ సంచలనం!
ఆమె వయసు 92.. జీవితాన్ని ఎంతో చదివింది. ఎన్నో అనుభవాలు ఆ కళ్లతో చూసింది.. వాటిలో కొన్నింటిని మాటలుగా మార్చి.. కవితరూపంలో తీసుకొచ్చింది. ఆ కవిత.. కర్కశ హృదయులనూ కన్నీరు పెట్టిస్తోంది. గిఫ్ట్ ప్యాక్‌లో బంగారు ఆభరణాలు ఉంటాయని మీరు చూస్తున్నారా? అంటూ వృద్ధాప్యంపై వాండా బి. గోయిన్స్ అనే మహిళ కవిత వల్లిస్తున్న వీడియో ఫేస్బుక్లో సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఆ వీడియోను 40 లక్షల మంది చూశారు. ప్రపంచజ్ఞానాన్నిపదుగురికీ పంచే ప్రయత్నంలో భాగంగా... 'యు ఆర్ లుకింగ్ ఎట్ ది గిఫ్ట్ ర్యాప్... అండ్ నాట్ ద జ్యుయెల్ ఇన్ సైడ్' అంటూ ఆమె జీవితానుభవాలను వల్లె వేస్తుండగా.. ఆమె సంరక్షకురాలు కేథరిన్ క్లాస్ నిట్జర్ విల్సన్ తీసిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సంపూర్ణాయుష్షుతో జీవించిన విండా.. తన జీవితకాలంలో ప్రపంచయుద్ధం, ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ హత్య, సెప్టెంబర్ 11 తీవ్రవాద దాడులతో పాటు ఎన్నో చారిత్రక సంఘటనలను చూసింది. ప్రస్తుతం పోర్ట్ ల్యాండ్ ఆరిజన్‌లో నివసిస్తున్న ఆమె... తన జీవనసారాన్ని, అనుభవాల దొంతరను ప్రపంచంతో పంచుకునే ప్రయత్నం చేసింది. ముందుగా తన కవితను కేర్ టేకర్ విల్సన్‌కు వినిపించింది. కవిత వింటూనే కరగిపోయిన ఆమె... వెంటనే దాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇటువంటి గొప్ప మహిళకు తాను కేర్‌టేకర్‌గా ఉండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానంటూ కామెంట్ పెట్టింది. ఫేస్ బుక్ లో ఈ వీడియోను 40 లక్షల మంది పైగా వీక్షించారు. లక్షా 84 వేల సార్లు షేర్ చేశారు. -
యూట్యూబ్ లో ఓ క్యూట్ వీడియో
యజమానిపై విశ్వాసాన్ని చాటుకోవడంలో శునకం తర్వాతే మరే పెంపుడు జంతువైనా.. చాలా మంది ఇంట్లో కుక్కను పెంచుకుంటారు. జాతి శునకం ఇంట్లో ఉండటం గర్వంగా భావిస్తారు. శునక జాతిలో ఎంతో గుర్తింపు పొందిన, ఖరీదైన, అందమైన గోల్డెన్ రిట్రీవర్ ను పెంచుకుంటున్న జర్మనీకి చెందిన ఓ యజమాని... అది తమ పట్ల చూపిస్తున్న అభిమానాన్ని, ఇచ్చే సహకారాన్ని వీడియో తీసి యూ ట్యూబ్ లో పోస్ట్ చేశాడు. ఇప్పడు ఆ వీడియోకు ఎంతో స్పందన లభిస్తోంది. లక్షకు పైగా వ్యూయర్లను ఆకట్టుకుంది. యజమాని షాపింగ్ నుంచి తెచ్చిన సరుకులను కారు లోంచి ఇంట్లోకి నోటితో కరచుకొని తరలిస్తున్న వీడియో అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంటికి కాపలాగా ఉండేందుకు పెంచిన శునకాన్ని అంతటితో వదిలేయకుండా ఇంటి పనులు చేయడంలో కూడా ఆ కుటుంబం శిక్షణ ఇచ్చింది. దీంతో యజమాని రుణం తీర్చుకోవాలన్న తాపత్రయంతో అతడు ఇంటికి రాగానే రిట్రీవర్ శునకాలు కారు చుట్టూ చేరి ఒక్క వస్తువును కూడా వదలకుండా ఇంట్లోకి చేర్చేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. పెంపుడు జంతువులు పచారీ సామాన్లు మోయడం ఎంతో ఆనందంగా ఉందని, వాటి ప్రేమను, ఆప్యాయతను యజమాని వద్ద ప్రదర్శించేందుకు, విశ్వాసాన్ని చాటుకునేందుకు తాపత్రయపడటం ఒకింత ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోందని... కొందరు వ్యూయర్స్ తమ కామెంట్లనూ పోస్ట్ చేస్తున్నారంటే ఆ గోల్డెన్ రిట్రీవర్లకు ఎంత ఫ్యాన్స్ అయిపోయారో తెలుస్తోంది.