
అజయ్‌కు ఆపన్నహస్తం
ప్రొద్దుటూరు టౌన్:
అజయ్‌కి మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘అజయ్‌ను ఆదుకుందాం’ కథనాన్ని చూసి చాలా మంది చలించిపోయారు. కొందరు సాక్షికి ఫోన్ చేసి వారి వివరాలను తెలుసుకోవడంతోపాటు కొందరు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు డబ్బు అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకుడు శివచంద్రారెడ్డి కేన్సర్‌తో బాధపడుతున్న అజయ్ ఇంటికెళ్లి రూ.10 వేలు సహాయం అందించారు. అజయ్ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి బాలాజిలతోపాటు ఆ ప్రాంత డ్వాక్రా సంఘాల మహిళలు, శ్రీగోపికృష్ణ విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డిని కలిసి అజయ్ పరిస్థితిని వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రదీప్‌రెడ్డిచేత రూ.10
వేలు ఇప్పించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడా రమణారెడ్డి మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో మరింత సాయం అందిస్తామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డితోపాటు పట్టణాధ్యక్షుడు రమణారెడ్డితో కూడా మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సమావేశం ఉందని,ఆ సమావేశంలో అజయ్‌ని ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. విద్యార్థులు సాత్విక్ రెడ్డి, షణ్ముఖనందిని తండ్రి బండి రమణారెడ్డి పిల్లల పుట్టిన రోజు సందర్భంగా రూ.4వేలు సహాయం అందించారు. హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ ప్రవీణ్ రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. అలాగే అజయ్ ఇంటి వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి రూ.10వేలు అందించారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు కృషి...
మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి ఉన్న విషయం తెలుసుకుని అజయ్ తల్లిదండ్రులు, డ్వాక్రా మహిళలు వైఎస్సార్‌సీపీ నాయకుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆయనను కలిశారు. సాక్షి దినపత్రికలో అజయ్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన కథనాన్ని ఆయనకు చూపించారు. లింగారెడ్డి సీఎం పేషి క్లర్క్‌తో మాట్లాడారు. కేన్సర్‌తో బాధపడుతున్న అజయ్‌కి రూ.10 లక్షలు సీఎం
రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వస్తే అక్కడి నుంచి ఎన్టీఆర్ కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళుతామని, అజయ్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకు సంబంధించి వైద్యులతో అంచనా వేయించి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా చూస్తానని లింగారెడ్డి హామీ ఇచ్చారు.
డ్వాక్రా సభ్యుల విరాళం ..
అజయ్ నివాసం ఉంటున్న బాలాజి నగర్–2 ప్రాంతంలో ఉంటున్న డ్వాక్రా సంఘాల మహిళలు అజయ్ పరిస్థితిపై చలించిపోయారు. సంఘాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అజయ్‌కి ఆర్థిక సహాయం అందించేందుకు చర్చిస్తున్నారు. ఇప్పటికే రూ.13వేలు వీరు విరాళాలు వసూలు చేశారు. పట్టణంలో ఉన్న 2,400 సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అజయ్‌కి శక్తిమేర ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు అజయ్‌కి ఆర్థిక సహాయం అందించే దాతలు తల్లి శ్రీలక్ష్మి సెల్ నెంబర్ 9052085893లో సంప్రదించాలని కోరారు.