సంజయ్ దత్, సునీల్ శెట్టి
ముంబైలో చాలామంది డబ్బావాలాల మీద ఆధారపడతారు. వేడి వేడి ఆహారం నింపిన డబ్బాలను కరెక్ట్ టైమ్‌కి సంబంధిత వ్యక్తులకు అందజేస్తుంటారు ఈ డబ్బావాలాలు. ముంబైలో దాదాపు 2 లక్షలమంది డబ్బావాలాల మీద ఆధారపడి ఉన్నారు. 2013లో ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యపాత్రలో డబ్బావాలాల నేపథ్యంలో ‘లంచ్‌బాక్స్’ అనే సినిమా కూడా వచ్చింది. ఇక ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా డబ్బావాలాల జీవితాలను ఇరకాటంలో పడేసింది.
ఈ విషయాన్ని గమనించిన నటుడు సంజయ్ దత్ అస్లాం షేక్ అనే మంత్రితో కలిసి దాదాపు 5000 మంది డబ్బావాలాలకు ఆహారం అందజేసే బాధ్యతను తీసుకున్నారు. సంజయ్ దత్‌ని ఆదర్శంగా తీసుకుని డబ్బావాలాలను ఆదుకోవడానికి నటుడు సునీల్ శెట్టి కూడా ముందుకొచ్చారు. పుణేలోని ఒక క్యాంప్‌లో ఉంటున్న 800మంది డబ్బావాలాలకు అవసరమైన నిత్యావసరాలను స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి అందజేశారు సునీల్ శెట్టి. మరో మూడు నెలలపాటు డబ్బావాలాలకు సహాయం చేయాలనుకుంటున్నామని సంజయ్ దత్, సునీల్ శెట్టి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment