dabbawalas
-
కేరళ 9వ తరగతి పాఠంగా ముంబై డబ్బావాలాలు
తిరువనంతపురం: అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ముంబై డబ్బావాలాలకు మరో గౌరవం దక్కింది. ఠంచనుగా ఆహారాన్ని సమయానికి అందిస్తూ సమయపాలనకు చిరునామాగా మారిన ముంబై డబ్బావాలాల విజయగాథను కేరళలో 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ పాఠ్యాంశంగా చదువుకోనున్నారు. డబ్బావాలాల గురించి హ్యూ, కొలీన్ గాంట్జర్లు రాసిన ‘ది సాగా ఆఫ్ ది టిఫిన్ క్యారియర్స్’ను ఒక అధ్యాయంగా చేర్చారు. కేరళ రాష్ట్ర విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎస్సీఈఆరీ్ట) 2024 కోసం పాఠ్యప్రణాళికలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఇందులో భాగంగా డబ్బావాలాల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ఒక అధ్యాయాన్ని సిలబస్‌లో ప్రవేశపెట్టింది. 1890లో మహా హవాజీ బచే.. దాదర్ నుంచి ముంబైలోని ఒక కోటకు డెలివరీ చేసిన మొదటి లంచ్ బాక్స్ మొదలు ఇప్పటిదాకా డబ్బావాలాలు ముంబైకి అందించిన సేవలను ఈ అధ్యాయం వివరిస్తుంది. ‘‘1890లో దాదర్ శివారులోని ఓ పార్శీ మహిళ బొంబాయి వాణిజ్య నడిరోడ్డున పని చేసే తన భర్తకు టిఫిన్ క్యారియర్ అందించడానికి సహాయం చేయమని మహాదు హవాజీ బచేని కోరింది. అది డబ్బావాలాల ఆరంభం’’అని చాప్టర్ పేర్కొంది. ‘‘ఆ వినయపూర్వక ప్రారంభం నుంచి, ఓ స్వయం–నిర్మిత భారతీయ సంస్థ ఒక గొప్ప నెట్‌వర్క్‌గా ఎదిగింది. వారి సేవ, అంకితభావం, కచ్చితత్వం అంతర్జాతీయంగా వ్యాపార పాఠశాలలకు ఓ మేనేజ్మెంట్ పాఠంగా మారింది. ప్రిన్స్ (ఇప్పుడు ఇంగ్లాండ్ రాజు) చార్లెస్ ప్రశంసలనూ అందుకుంది’’అని పేర్కొంది. -
కొత్త మార్గంగా డబ్బావాలా క్లౌడ్ కిచెన్!
ముంబై డబ్బావాలా.. తెల్లటి యూనిఫాంలో లంచ్‌బాక్సులను సైకిల్స్‌పై రైల్వే స్టేషన్లకు, రైల్వే స్టేషన్ల నుంచి ఆఫీసులకు అందజేస్తూ బిజీబిజీగా గడిపేవారు. సైకిళ్ల మోత, లంచ్ బాక్సుల చప్పుళ్లతో ఆ రోజులన్నీ కళకళలాడేవి. కోవిడ్ ముంబైని తాకింది. తెల్లగా మెరిసే వారి డబ్బాలు కార్పొరేట్ కార్యాలయాల నుంచి అదృశ్యమయ్యాయి. దుమ్ము పేరుకుపోయిన డబ్బాలు, తుప్పు పట్టిన సైకిళ్లు మిగిలిపోయాయి. వారి తెల్లటి యూనిఫాంలు, గాంధీ టోపీలు అల్మారాలో ముడుచుకున్నాయి. కరోనా ప్రభావం వివిధ వర్గాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థల కార్యాలయాలకు లంచ్ బాక్స్‌లు చేసే డబ్బావాలాలపైనా తీవ్రంగా చూపింది. లాక్‌డౌన్‌కు ముందు ముంబైలో సుమారు 5000కుపైగా డబ్బావాలాలుండేవారు. వివిధ కారణాలవల్ల ఈ సంఖ్య రెండు వేలకు చేరింది. ప్రస్తుతం ముంబైలో కేవలం 1,500 డబ్బావాలాలున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు తగ్గిపోవడం వారిని కలవర పెడుతోంది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌లో ముంబైలో డబ్బావాలాలు కనుమరుగయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోమ్‌తో.. ఒకప్పుడు మేనేజ్మెంట్ గురుగా ప్రపంచంలో గుర్తింపు పొందన ముంబై డబ్బావాలాల ఉనికి ప్రమాదంలో పడింది. కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమలుచేసిన లాక్డౌన్ ప్రభావం డబ్బావాలాలపై తీవ్రంగా చూపింది. లాక్డౌన్ సమయంలో రవాణా సదుపాయంలేక వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు. అప్పుడు డబ్బావాలాల అవసరమే లేకపోయింది. వారికి అసలు ఉపాధి లేకుండా పోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మెరుగుపడ్డాయి. ట్యాక్సీలు, బస్సులు, లోకల్ రైళ్లు తదితరా రవాణ వ్యవస్థలు యథాస్థితికి వచ్చాయి. అయినప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. కొన్ని కార్యాలయాలు మూతపడ్డాయి. పని చేస్తున్న మరికొన్ని కార్యాలయాల్లో క్యాంటీన్లు ప్రా రంభించారు. కొందరు ఉద్యోగులు ఇంటి నుంచి లంచ్ బాక్స్‌లు వెంట తీసుకొస్తున్నారు. కొందరు ఉ ద్యోగులు ఆన్లైన్లో ఆర్డర్చేసుకుంటున్నారు. దీంతో డబ్బావాలాల అవసరం లేకుండా పోయింది. లక్ష నుంచి 50 వేలకు.. ఒకప్పుడు ప్రతీరోజు రెండు లక్షల లంచ్‌బాక్స్‌లు చేరవేసిన ఈ డబ్బావాలాలు ఇప్పుడు 40 నుంచి 50 వేల వరకు మాత్రమే అందజేస్తున్నారు. ఫలితంగా వారి ఆదాయానికి గండిపడింది. ఒకప్పుడు ఒక్కో డబ్బావాలా నెలకు రూ.20 నుంచి 25 వేలు సంపాదించేవాడు. లంచ్ బాక్స్‌ల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు రూ.12 నుంచి 15 వేలు ఆదాయం రావడం కూడా గగనమైపోయింది. అరకొర ఆదాయంతో కుటుంబాన్ని పోషించడం కష్టతరంగా మారింది. ఫలితంగా ఈ మార్గాన్ని వదులుకుని మరో ఉద్యోగ వేటలో పడ్డారు. డబ్బావాలాల సంఖ్య తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది. దివాలో నివసించే 40 ఏళ్ల సచిన్ గావ్డే డబ్బావాలాగా జీవితాంతం పేరు తెచ్చుకున్నాడు. అతని ముత్తాతలు 1952 నుండి ముంబైలో డబ్బాలను పంపిణీ చేస్తున్నారు. అదే అతని గుర్తింపు, జీవనాధారం. వర్క్ ఫ్రమ్ హోమ్ తమ జీవితాలను పూర్తిగా తలకిందులు చేసిందని చెబుతున్నాడు. క్లౌడ్ కిచెన్.. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే.. దీన్ని ఎదుర్కోవడానికి డబ్బావాలాల నాల్గోతరం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇటీవలే క్లౌడ్ కిచెన్‌ను మొదలుపెట్టారు. చాలామంది ఇంటి నుంచే పనిస్తుండటంతో లంచ్ బాక్స్‌లను డెలివరీ చేసే తమ సంప్రదాయ వ్యాపారం క్షీణించింది. ఈ నేపథ్యంలో మరింత మంది కస్టమర్లను చేరుకోవడానికి వంట చేయడం, హోమ్‌స్టైల్ మీల్స్ డెలివరీ చేయాలని నిర్ణయించుకున్నారు. మొదట సాకినాకాలో సెంట్రల్ కిచెన్‌ను స్థాపించాలని ప్లాన్ చేశారు. ఒక స్థలం నుంచి నగరవ్యాప్తంగా భోజనాన్ని పంపిణీ చేయడం సవాలుగా మారుతుందని భావించి వికేంద్రీకృత విధానాన్ని ఎంచుకున్నారు. ఇందుకోసం ముంబయిలోని వివిధ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలతో డబ్బావాలాలు భాగస్వాములు అవుతున్నారు. కొంతమంది మహిళలు కలిసి వండిన ఆహారాన్ని ఆయా ప్రాంతాల దగ్గర్లోని ఆర్డర్లకు సప్లై చేస్తున్నారు. దీనివల్ల మహిళలు జీవనోపాధి పొందడంతోపాటు డబ్బావాలాలకు ఉపాధి ఉంటుందని చెబుతున్నారు. ఇందుకోసం వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. ఆన్లైన్ ఆర్డర్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ మెనూని బ్రౌజ్ చేసి ఆర్డర్ చేయొచ్చు. శాఖాహార, మాంసాహార భోజనం ఉంటుంది. ధర పరిమాణాన్ని బట్టి రూ. 95 నుంచి ప్రారంభమై రూ.120 వరకు ఉంటుంది. రోజువారీ లేదా నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకోవచ్చు. ముందు రోజు సాయంత్రంలోపు ఆర్డర్ చేస్తే లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య డెలివరీ చేస్తున్నారు. (చదవండి: వెదురుతో వండే కూర గురించి విన్నారా? దాని టేస్టే వేరు..!) -
కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు!
సాక్షి, ముంబై: ముంబైలోని డబ్బావాలాల సేవలు గురించి అందరికీ తెలిసిందే. వారు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, స్కూల్‌కి వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్‌లు అందిస్తుంటారు. వారికి బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం అందడం విశేషం. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా. దీన్ని పూణేలో గౌరవ చిహ్నంగానూ, గర్వంగానూ భావిస్తారు. అంతేగాదు ఇక్కడి తలపాగాకి భౌగిళిక హోదా లభించింది కూడా. ఇక్కడి ముంబై డబ్బావాలాలకు బ్రిటీష్ ఎంబసీ ద్వారా ఆహ్వానాలు అందినట్లు మీడియాకి తెలిపారు. ఈ మేరకు ముంబై డబ్బావాలాస్ ప్రతినిధి విష్ణు కల్డోక్ మాట్లాడుతూ.. తమలోని ఇద్దరు డబ్బావాలాలకు ఆహ్వానం అందిందన్నారు. అదీగాక బ్రిటీష్ రాయల్టీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అతను రాజు కాబోతున్నాడు కాబట్టి కింగ్ చార్లెస్‌కి పుణేరి పగడి తోపాటు వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం అని డబ్బావాలా ప్రతినిధి విష్ణు కల్డోక్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కాగా, ఈ ముంబైలోని డబ్బావాలాలు నగరంలో లంచ్‌బాక్స్ డెలివరీ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. #WATCH | Maharashtra: Mumbai's Dabbawalas purchase gifts - Puneri Pagadi & a shawl of the Warkari community - for Britain's King Charles III, ahead of his coronation ceremony on May 6. They say that they have been sent invitations by British Consulate, British Embassy. pic.twitter.com/88RlOhxidQ — ANI (@ANI) May 2, 2023 (చదవండి: శరద్ పవార్ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో) -
డబ్బావాలాల కొత్త వ్యాపారం సెంట్రల్ కిచెన్
సాక్షి, ముంబై: కరోనా కారణంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ముంబై డబ్బావాలాలు ప్రత్యామ్నాయ వేటలో పడ్డారు. అందులో భాగంగా ‘డబ్బావాల సెంట్రల్ కిచెన్’అనే కొత్త పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ముంబై డబ్బావాలాలు నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. కొత్త వ్యాపారం ద్వారా ప్రతీరోజు సుమారు 70 వేల వినియోగదారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు. 130 ఏళ్ల నుంచి లంచ్ బాక్స్‌లు చేరవేత మేనేజ్మెంట్ గురుగా పేరు సంపాదించుకున్న ముంబై డబ్బావాలాలు స్వాతంత్య్రానికి ముందు అంటే సుమారు 130 ఏళ్ల నుంచి ముంబైలోని వివిధ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లంచ్‌బాక్స్‌లు చేరవేస్తున్నారు. ఇదివరకు లంచ్ బాక్స్‌లు తారుమారైన సంఘటనలు లేవు. కార్యాలయాల్లో లంచ్ టైమ్‌కు ముందే ఉద్యోగుల చెంతకు లంచ్ బాక్స్‌లు చేరవేసేవారు. క్రమశిక్షణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కాని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం 2020 మార్చిలో లాక్డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి ముంబై డబ్బావాలాల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..) కార్యాలయాలన్నీ మూసివేయడంతో ఉపాధి కరువైంది. అనేక డబ్బావాలాల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. గత్యంతరం లేక కొందరు సెక్యూరిటీ గార్డులుగా మారారు. మరికొందరు మంది స్వగ్రామాలకు తరలిపోయి అక్కడ వ్యవసాయ కూలీలుగా, మరికొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఎవరు, ఎక్కుడున్నారో తెలియదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆంక్షలు వి«ధించడంతో ఎవరు, ఎçప్పుడు విధులకు వస్తున్నారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో డబ్బావాలాలకు ఇప్పటికీ ఉపాధి లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలని నిర్ణయం తీసుకున్నారు. -
డబ్బావాలాలకు సాయం
ముంబైలో చాలామంది డబ్బావాలాల మీద ఆధారపడతారు. వేడి వేడి ఆహారం నింపిన డబ్బాలను కరెక్ట్ టైమ్‌కి సంబంధిత వ్యక్తులకు అందజేస్తుంటారు ఈ డబ్బావాలాలు. ముంబైలో దాదాపు 2 లక్షలమంది డబ్బావాలాల మీద ఆధారపడి ఉన్నారు. 2013లో ఇర్ఫాన్ ఖాన్ ముఖ్యపాత్రలో డబ్బావాలాల నేపథ్యంలో ‘లంచ్‌బాక్స్’ అనే సినిమా కూడా వచ్చింది. ఇక ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా డబ్బావాలాల జీవితాలను ఇరకాటంలో పడేసింది. ఈ విషయాన్ని గమనించిన నటుడు సంజయ్ దత్ అస్లాం షేక్ అనే మంత్రితో కలిసి దాదాపు 5000 మంది డబ్బావాలాలకు ఆహారం అందజేసే బాధ్యతను తీసుకున్నారు. సంజయ్ దత్‌ని ఆదర్శంగా తీసుకుని డబ్బావాలాలను ఆదుకోవడానికి నటుడు సునీల్ శెట్టి కూడా ముందుకొచ్చారు. పుణేలోని ఒక క్యాంప్‌లో ఉంటున్న 800మంది డబ్బావాలాలకు అవసరమైన నిత్యావసరాలను స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి అందజేశారు సునీల్ శెట్టి. మరో మూడు నెలలపాటు డబ్బావాలాలకు సహాయం చేయాలనుకుంటున్నామని సంజయ్ దత్, సునీల్ శెట్టి పేర్కొన్నారు. -
కరోనా : దయనీయంగా డబ్బావాలాల పరిస్థితి
ముంబై : ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ దేశంలో కూడా రోజురోజుకు మరింత ఉదృతమవుతుంది. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటివరకు అక్కడ వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావంతో వాణిజ్య రాజధాని అయిన ముంబైలో డబ్బావాలతో సర్వీస్‌తో వేల మందికి టిఫిన్స్ అందించే ఉపాధిని కోల్పోయారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రోజుకు సుమారు లక్షకు పైగా కస్టమర్లకు టిఫిన్లను అందిస్తూ డబ్బావాలాలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటారు. కరోనా ప్రభావంతో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. (కరోనా : పాకిస్తాన్లో ఒక్కరోజే 248 కొత్త కేసులు) దేశంలో ఫుడ్ డెలివరీ అందించే ఉబెర్ ఈట్స్, ఇతర సంస్థల్లాగా డబ్బావాలాలు ఎక్కడో హోటల్ నుంచి తెప్పించే టిఫిన్లను తమ కస్టమర్లకు అందించరు. వారే స్వయంగా వండుకొని వెళ్లడమో లేక ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి వారింట్లో వండిన ఆహారాన్ని లంచ్ సమయంలో రిక్షాలో పెట్టుకొని ముంబైలో ఉద్యోగులు పనిచేసే చోటుకు తీసుకొని వస్తారు. ఇలా రోజుకు దాదాపు 2 లక్షల మందికి లంచ్ అందించేలా వారానికి ఆరు రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అయితే గత 130 ఏళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్న డబ్బావాలాలకు ఎప్పుడు ఇంత కష్టం రాలేదు. కరోనా పుణ్యమా అని వ్యాపారం సరిగా లేకపోవడంతో వారంతా రోడ్డు పాలయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి లాక్డౌన్ నిర్వహిస్తుంది. కాగా ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదని ప్రధాని మోదీ తెలిపారు. దీంతో డబ్బావాలా కార్మికుల కష్టాలు ఇప్పట్లో తొలిగేలా కనిపించడం లేదు. కరోనా జోరుగా విస్తరిస్తోన్న మహారాష్ట్రలో లాక్డౌన్ ఎత్తివేసే అవకాశాలు లేకపోవడంతో డబ్బావాలల పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ప్రభుత్వం ఏమైనా సాయమందిస్తుందేమేనని డబ్బావాలలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ప్రజలు ఎవరైనా సరే మాస్కులు లేకుండా బయటికి వస్తే అరెస్టు చేయాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే బుధవారం పోలీసులను ఆదేశించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు 5వేలకు పైగా నమోదవ్వగా, మృతుల సంఖ్య 166కు చేరుకుంది. (లాక్డౌన్: ఒడిశా కీలక నిర్ణయం) -
రాకుమారుడికి కుర్తా...రాణిగారికి చీర
ముంబై : బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(33), అమెరికా నటి మేఘన్ మార్కల్(36)ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. బ్రిటన్‌లోని బెర్క్‌షైర్ కౌంటీ విండ్సర్లోని సెయింట్ జార్జి చర్చిలో జరిగిన ఈ వేడుకకు సుమారు 600 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. వారిలో మనదేశానికి చెందిన బాలీవుడ్ నటి ప్రియాంరా చోప్రాతో పాటు ముంబై కేంద్రంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘మైనా మహిళా ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా కూడా హాజరయ్యారు. వివాహ వేడుక సందర్భంగా ఈ జంటకు వివిధ దేశాల నుంచి బహుమతులు అందుతుండగా, వాటిలో మన దేశానికి చెందినవి కూడా ఉన్నాయ. ఈ రాయల్ వెడ్డింగ్‌కు మన దేశం నుంచి ముంబైకి చెందిన డబ్బావాలాలు, భారతీయ ‘పెటా’ సంస్థ బహుమతులు పంపారు. చీరను పంపిన డబ్బా వాలాలు.... ముంబైకి చెందిన డబ్బావాలలతో బ్రిటన్ రాజ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. 2003 భారతదేశ పర్యటనకు వచ్చిన ప్రిన్స్ చార్లెస్‌కు తొలిసారి డబ్బావాలలతో పరిచయం ఏర్పడింది. డబ్బావాలాల పనితీరు, సమయ పాలన, నిబద్థత ప్రిన్స్ చార్లెస్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి. వారి పనితీరును మెచ్చుకోవడమే కాక తన వివాహ వేడుకకు డబ్బావాలాలను కూడా ఆహ్వానించాడు చార్లెస్. నాటినుంచి డబ్బావాలాలకు రాజకుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. అయితే ప్రస్తుతం జరిగిన మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి వీరిని ఆహ్వానించలేదు. అయినప్పటికీ ప్రిన్స్ చార్లెస్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా నిన్న జరిగిన ప్రిన్స్ హ్యారీ వివాహానికి డబ్బావాలాల తరుపున వీరు ప్రత్యేక బహుమతులు పంపారు. రాకుమారుడు హ్యారీ కోసం కుర్తా, తలపాగాను, మేఘనా మార్కల్ కోసం పసుపు, ఆకుపచ్చ రంగుల కలయికలో ఉన్న ‘పైథానీ’ చీరను బహుమతిగా పంపారు. అంతేకాక వివాహ వేడుక సందర్భంగా ముంబై ప్రభుత్వ ఆస్పత్రిలోని రోగుల కుటుంబాలకు మిఠాయిలు పంచారు. ఈ విషయం గురించి డబ్బావాలా అసోసియేషన్ ప్రతినిధి సుభాష్ తాలేకర్ ‘గతంలో ప్రిన్స్ చార్లెస్ వివాహానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ వేడకకు హాజరయిన మమ్మల్ని సాదరంగా ఆదరించిడమే కాక మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అందుకే ప్రిన్స్ హ్యారీ వివాహా వేడుకకు మమ్మల్ని ఆహ్వానించనప్పటికి, మేము మా సంతోషాన్ని తెలపాలనుకున్నాం. అందుకే ఇలా మా తరఫున బహుమతులు పంపామ’న్నారు. పెటా బహుమతి ‘మెర్రి’... డబ్బావాలాలతో పాటు ‘పెటా’(పిపుల్ ఫర్ ద ఎథికల్ ట్రిట్మెంట్ ఆఫ్ ద అనిమల్స్) కూడా మేఘన్ మార్కెల్, ప్రిన్స్ హ్యారీల వివాహానికి బహుమతి పంపింది. వీరి వివాహానికి గుర్తుగా ‘పెటా’ ఒక ఎద్దుకు వీరిద్దరి పేర్లు కలిసేలా ‘మెర్రి’(మేఘన్లో మె, హ్యారీలో రి కలిపి మెర్రి) అనే పేరును పెట్టి, ఆ ఎద్దు ఫోటో తీసి దానితో పాటు ఒక సందేశాన్ని కూడా పంపారు. ‘మెర్’రి(ఎద్దు) ని పూలమాలతో అలంకరించి ఫోటో తీసారు. ఫోటోతో పాటు పంపిన సందేశంలో మెర్రి కథను తెలియజేసారు. ఆ సందేశంలో ‘కొన్నాళ్ల క్రితం మహారాష్ట్రలో గాయలతో, ఒంటరితనంతో బాధపడుతున్న మెర్రిని చూడటం జరిగింది. పాపం అది తన జీవిత కాలమంతా బరువులను మోస్తూ సేవ చేసింది. వయసు పైబడి, అనారోగ్యంతో బాధపడుతున్న మెర్రిని ఇప్పుడిలా ఒంటరిగా వదిలేసారు. మేము ‘మెర్రి’ బాధ్యతను తీసుకుని, దానికి వైద్యం చేయించి ఒక సంరక్షణా కేంద్రానికి తరలించాము. ప్రస్తుతం ‘మెర్రి’ సంరక్షణా కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటూ తన మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతుంద’ని తెలిపారు. ‘ఈ రాయల్ వెడ్డింగ్ సందర్భంగా జనాలకు మూగ జీవుల పట్ల దయగా వ్యవహరించాలనే సందేశాన్ని ప్రచారం చేయాలని భావించాము...అందుకే మెర్రి(ఎద్దు) ఫొటోను బహుకరించామ’ని పెటా అసోసియేట్ డైరెక్టర్ సచిన్ బంగోరా తెలిపారు. -
‘స్వచ్ఛ భారత్’లో డబ్బావాలాలు
ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, ముంబై: ఇకపై స్వచ్ఛ భారత్‌లో డబ్బావాలాలు భాగస్వాములు కానున్నారు. తమ మూడు లక్షల పైచిలుకు వినియోగదారులకు స్వచ్ఛ భారత్ మెసేజ్‌ను అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవగాహన కార్యక్రమంలో ‘ముంబై జేవిన్‌డబ్బే వాహతుక్ మహామండల్’కు చెందిన దాదాపు 3,500 నుంచి 4,000 మంది డబ్బావాలాలు పాల్గొననున్నారు. తమ వినియోగదారులకు పరిశుభ్రత కోసం పాటించాల్సిన నియమాలను చిట్టీల రూపంలో టిఫిన్ బాక్సుల్లో ఉంచుతామని డబ్బావాలా సంఘం అధికార ప్రతినిధి సుభాశ్ తాలేకర్ అన్నారు. టిఫిన్ బాక్స్‌లను సేకరించేటప్పుడు ఒక వాక్యం శ్లోకం, కీర్తనల ద్వారా కూడా వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు కమ్యూనిటీ ప్లాన్ చేసినట్లు తెలిపారు. వీలైనన్ని మార్గాలను అనుసరించి అవగాహన కల్పించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 1 నుంచే ఈ ‘స్వచ్ఛ’ కార్యక్రమాన్ని డబ్బావాలాల సంఘం సతారాలోని ప్రతాప్ ఘడ్ కోట వద్ద స్వీకరించినట్లు తెలిపారు. -
డబ్బావాలాలు.. రేటు పెంచారు!!
క్రమం తప్పకుండా.. ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా సేవలు అందించే ముంబై డబ్బావాలాలు తమ రేటు పెంచారు. నిత్యావసరాల ధరలన్నీ పెరగడంతో వాటిని తట్టుకోడానికి నెలకు డబ్బాలు అందించడానికి ఛార్జీని వంద రూపాయలు చేశారు. ఈ సంక్షోభ సమయంలో తమకు అండగా ఉండాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు ముంబై డబ్బావాలాల సంఘం మాజీ అధ్యక్షుడు రఘునాథ్ మెడ్గే తెలిపారు. తమ డబ్బావాలాలు ఆత్మహత్యలు చేసుకోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని, వాళ్ల కనీస జీవనం గడవాలంటే ఈ రేటు తప్పనిసరని చెప్పారు. కూరగాయల ధరలతో పాటు రవాణా ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని, అందుకే ధరలు పెంచక తప్పలేదని రఘునాథ్ తెలిపారు. గడిచిన 125 సంవత్సరాలుగా ముంబైలోని 5వేల మందికి పైగా డబ్బావాలాలు ప్రతిరోజూ ఆఫీసులు, పాఠశాలలు, కళాశాలలకు లక్షకు పైగా భోజనం క్యారియర్లు ఇస్తున్నారు. వీళ్లకు నెలకు సుమారు రూ. 8వేల నుంచి 10 వేల వరకు ఆదాయం వస్తుంది. ప్రిన్స్ ఛార్లెస్, రిచర్డ్ బ్రాన్సన్ లాంటివాళ్లు కూడా ఈ వ్యాపారానికి అభిమానులే. 80 లక్షల డెలివరీలకు ఒక్క సారి మాత్రమే పొరపాటు జరుగుతుందని వీరిపై అంచనా.