తిరువనంతపురం: అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ముంబై డబ్బావాలాలకు మరో గౌరవం దక్కింది. ఠంచనుగా ఆహారాన్ని సమయానికి అందిస్తూ సమయపాలనకు చిరునామాగా మారిన ముంబై డబ్బావాలాల విజయగాథను కేరళలో 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ పాఠ్యాంశంగా చదువుకోనున్నారు. డబ్బావాలాల గురించి హ్యూ, కొలీన్ గాంట్జర్‌లు రాసిన ‘ది సాగా ఆఫ్ ది టిఫిన్ క్యారియర్స్’ను ఒక అధ్యాయంగా చేర్చారు.
కేరళ రాష్ట్ర విద్యా పరిశోధనా, శిక్షణా మండలి(ఎస్సీఈఆరీ్ట) 2024 కోసం పాఠ్యప్రణాళికలో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. ఇందులో భాగంగా డబ్బావాలాల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ఒక అధ్యాయాన్ని సిలబస్‌లో ప్రవేశపెట్టింది. 1890లో మహా హవాజీ బచే.. దాదర్ నుంచి ముంబైలోని ఒక కోటకు డెలివరీ చేసిన మొదటి లంచ్ బాక్స్ మొదలు ఇప్పటిదాకా డబ్బావాలాలు ముంబైకి అందించిన సేవలను ఈ అధ్యాయం వివరిస్తుంది.
‘‘1890లో దాదర్ శివారులోని ఓ పార్శీ మహిళ బొంబాయి వాణిజ్య నడిరోడ్డున పని చేసే తన భర్తకు టిఫిన్ క్యారియర్ అందించడానికి సహాయం చేయమని మహాదు హవాజీ బచేని కోరింది. అది డబ్బావాలాల ఆరంభం’’అని చాప్టర్ పేర్కొంది. ‘‘ఆ వినయపూర్వక ప్రారంభం నుంచి, ఓ స్వయం–నిర్మిత భారతీయ సంస్థ ఒక గొప్ప నెట్‌వర్క్‌గా ఎదిగింది. వారి సేవ, అంకితభావం, కచ్చితత్వం అంతర్జాతీయంగా వ్యాపార పాఠశాలలకు ఓ మేనేజ్‌మెంట్ పాఠంగా మారింది. ప్రిన్స్ (ఇప్పుడు ఇంగ్లాండ్ రాజు) చార్లెస్ ప్రశంసలనూ అందుకుంది’’అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment