శార్దూల్ ఠాకూర్ (ఫైల్ ఫొటో)
భారత ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ చరిత్రలో లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా నిలిచాడు. కాగా ఇండియాలో ప్రస్తుతం దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా.. గ్రూప్-‘ఇ’లో ఉన్న కేరళ- ముంబై జట్లు శుక్రవారం తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కేరళకు శార్దూల్ ఠాకూర్ ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్, ఓపెనర్ సంజూ శాంసన్(4)ను ఆదిలోనే పెవిలియన్‌కు పంపాడు.
అయితే, ఆ తర్వాత ముంబైకి పెద్దగా ఏదీ కలిసిరాలేదు. వరుస విరామాల్లో వికెట్లు తీసినా.. ఓపెనర్ రోహన్ కణ్ణుమల్, సల్మాన్ నిజార్ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. రోహన్ 48 బంతుల్లోనే 87 పరుగులతో చెలరేగగా.. సల్మాన్ 49 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కేరళ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఏకంగా 234 పరుగులు చేసింది.
కాగా ముంబై బౌలర్లలో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి.. ఏకంగా 69 పరుగులు ఇచ్చుకున్నాడు. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రమేశ్ రాహుల్ చెత్త రికార్డును సమం చేశాడు. కాగా రమేశ్ అరుణాచల్‌ప్రదేశ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.
ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలం-2025లో రూ. 2 కో ట్ల కనీస ధరతో శార్దూల్ ఠాకూర్ అందుబాటులో ఉన్నాడు. అయితే, ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపకపోవడంతో అతడు అమ్ముడుపోకుండానే మిగిలిపోయాడు. ప్పుడిలా టీ20మ్యాచ్‌లో చె త్త ప్రదర్శన కనబరిచాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. కేరళ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై ఆఖరి వరకు పోరాడింది. ఓపెనర్లు పృథ్వీ షా(23), అంగ్‌క్రిష్ రఘువంశీ(16) నిరాశపరచగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(18 బంతుల్లో 32) కాసేపు బ్యాట్ ఝులిపించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న అజింక్య రహానే 35 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు.
రహానే ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. మిగతా వాళ్లలో వికెట్ కీపర్ హార్దిక్ తామోర్(23) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 191 పరుగులు చేయగలిగింది. దీంతో కేరళ 43 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది.
చదవండి: Asia Cup 2024: రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment