అండర్-19 ఆసియాకప్ 2024లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం(నవంబర్ 30) దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.
ఈ హైవోల్టేజ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మొదలు కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ పటిష్టమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీలో యంగ్ ఇండియా మొహమ్మద్ అమన్ నేతృత్వంలో ఆడనుంది. ఆండ్రీ సిద్ధార్థ్, ఆయుష్ మాత్రే , నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ వంటి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు.
ప్రణవ్ పంత్, యుధాజిత్ గుహ వంటి ఎక్స్‌పేసర్లు కూడా టీమిండియాలో ఉన్నారు. దీంతో మరోసారి చిరకాల ప్రత్యర్ధికి భారత జట్టు తీవ్ర పోటీ ఇచ్చే అవకాశముంది.అయితే పాక్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయలేం. సాద్ బేగ్ సారథ్యంలోని పాక్ జట్టు కూడా దృడంగా ఉంది. ఫర్హాన్ యూసఫ్, షాజైబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు ఉన్నారు.
పాక్‌దే పైచేయి..
కాగా అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు మూడు సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ రెండింట, భారత్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. చివరగా భారత్-పాక్ జట్లు అండర్-19 ఆసియాకప్ 2023లో తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే దుబాయ్ పేస్ ఫ్రెండ్లీ కండీషన్స్ పాక్‌కు మరోసారి అనుకూలంగా మరో అవకాశముంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అండర్ 19 అసియాకప్- 2024 ఎడిషన్‌కు సంబంధించిన మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదే విధంగా సోనీ లివ్ యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.
తుది జట్లు అంచనా
పాకిస్తాన్: సాద్ బేగ్(కెప్టెన్/వికెట్ కీపర్) ఫర్హాన్ యూసఫ్, హసన్ ఖాన్, మహ్మద్ అహ్మద్, షాజైబ్ ఖాన్, ఫహమ్-ఉల్-హక్, హరూన్ అర్షద్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, నవీద్ అహ్మద్ ఖాన్, ఉమర్ జైబ్.
భారత్: మహ్మద్ అమన్ (కెప్టెన్), ఆండ్రీ సిద్ధార్థ్, ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, అనురాగ్ కవాడే (వికెట్ కీపర్), నిఖిల్ కుమార్, సమర్థ్ నాగరాజ్, నమన్ పుష్పక్, యుధాజిత్ గుహ.
చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment