Indian under-19 cricket
-
రేపే భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. లైవ్ ఎక్కడో తెలుసా?
అండర్-19 ఆసియాకప్ 2024లో దాయాదుల పోరుకు సమయం ఆసన్నమైంది. శుక్రవారం(నవంబర్ 30) దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.ఈ హైవోల్టేజ్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు మొదలు కానుంది. కాగా ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ పటిష్టమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టోర్నీలో యంగ్ ఇండియా మొహమ్మద్ అమన్ నేతృత్వంలో ఆడనుంది. ఆండ్రీ సిద్ధార్థ్, ఆయుష్ మాత్రే , నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ వంటి అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారు.ప్రణవ్ పంత్, యుధాజిత్ గుహ వంటి ఎక్స్పేసర్లు కూడా టీమిండియాలో ఉన్నారు. దీంతో మరోసారి చిరకాల ప్రత్యర్ధికి భారత జట్టు తీవ్ర పోటీ ఇచ్చే అవకాశముంది.అయితే పాక్ జట్టును కూడా తక్కువగా అంచనా వేయలేం. సాద్ బేగ్ సారథ్యంలోని పాక్ జట్టు కూడా దృడంగా ఉంది. ఫర్హాన్ యూసఫ్, షాజైబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ వంటి సూపర్ స్టార్లు ఉన్నారు.పాక్‌దే పైచేయి.. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియాపై పాకిస్తాన్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్లు మూడు సార్లు ముఖాముఖి తలపడగా.. పాక్ రెండింట, భారత్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. చివరగా భారత్-పాక్ జట్లు అండర్-19 ఆసియాకప్ 2023లో తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో భారత్‌పై 8 వికెట్ల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది. 259 పరుగుల లక్ష్యాన్ని కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. అయితే దుబాయ్ పేస్ ఫ్రెండ్లీ కండీషన్స్ పాక్‌కు మరోసారి అనుకూలంగా మరో అవకాశముంది.లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?అండర్ 19 అసియాకప్- 2024 ఎడిషన్‌కు సంబంధించిన మ్యాచ్‌లు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అదే విధంగా సోనీ లివ్ యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు.తుది జట్లు అంచనాపాకిస్తాన్: సాద్ బేగ్(కెప్టెన్/వికెట్ కీపర్) ఫర్హాన్ యూసఫ్, హసన్ ఖాన్, మహ్మద్ అహ్మద్, షాజైబ్ ఖాన్, ఫహమ్-ఉల్-హక్, హరూన్ అర్షద్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, నవీద్ అహ్మద్ ఖాన్, ఉమర్ జైబ్.భారత్: మహ్మద్ అమన్ (కెప్టెన్), ఆండ్రీ సిద్ధార్థ్, ఆయుష్ మ్హత్రే, వైభవ్ సూర్యవంశీ, కిరణ్ చోర్మలే, హార్దిక్ రాజ్, అనురాగ్ కవాడే (వికెట్ కీపర్), నిఖిల్ కుమార్, సమర్థ్ నాగరాజ్, నమన్ పుష్పక్, యుధాజిత్ గుహ.చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
అఫ్గాన్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. ఫైనల్లో టీమిండియాతో ఢీ
ప్రోటీస్ గడ్డపై అఫ్గానిస్తాన్- భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న అండర్-19 ట్రై సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్.. ప్రోటీస్ బౌలర్ల దాటికి 139 పరుగులుకు కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా 5 వికెట్లతో అఫ్గాన్ పతనాన్ని శాసించాడు. మోకోనా 3 వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్ బౌలర్లలో నుమాన్ షా(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్ బ్యాటర్లలో స్టీవ్ స్టోల్క్(40), వైట్‌హెడ్(33) పరుగులతో రాణించారు. ఇక జనవరి 10న జరగనున్న ఫైనల్ పోరులో దక్షిణాఫ్రికా- భారత జట్లు తలపడనున్నాయి. -
టీ20 వరల్డ్‌కప్ షురూ.. దక్షిణాఫ్రికాను ఢీకొట్టనున్న భారత్
Under 19 Women T20 WC: తొట్ట తొలి అండర్–19 మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీ దక్షిణాఫ్రికా వేదికగా నేటి నుంచి ప్రారంభంకానుంది. 16 జట్లు తలపడుతున్న ఈ టోర్నీ ఈనెల 29న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. గ్రూప్ ‘ఎ’లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంక, అమెరికా; గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, పాకిస్తాన్, జింబాబ్వే, రువాండా; గ్రూప్ ‘సి’లో ఇండోనేసియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్; గ్రూప్ ‘డి’లో భారత్, దక్షిణాఫ్రికా, స్కాట్లాండ్, యూఏఈ జట్లున్నాయి. నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది. భారత జట్టులో హైదరాబాద్ అమ్మాయి గొంగడి త్రిష, వైజాగ్‌కు చెందిన షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు. భారత జట్టు: షెఫాలి వర్మ (కెప్టెన్), శ్వేత సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), జి త్రిష, సౌమ్య తివారి, సోనియా మెహ్దియా, హుర్లీ గాలా, హ్రిశిత బసు (వికెట్‌కీపర్), సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చనా దేవీ, పర్శవీ చోప్రా, టిటాస్ సాధు, ఫలక్ నాజ్, షబ్నమ్ టీమిండియా ఆడబోయే మ్యాచ్‌ల వివరాలు.. జనవరి 14న సౌతాఫ్రికాతో (భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5:15 గంటలకు ప్రారంభం) జనవరి 16న యూఏఈతో (మధ్యాహ్నం 1:30 గంటలకు) జనవరి 18న స్కాట్లాండ్తో (సాయంత్రం 5:15 గంటలకు) -
యువ భారత్ శుభారంభం
ఢాకా: ఆసియా కప్ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్... రికార్డు స్థాయిలో ఏడోసారి కప్‌ను ముద్దాడిన మరుసటి రోజే యువ భారత జట్టు అండర్–19 ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్ ‘ఎ’లో భాగంగా శనివారం నేపాల్ అండర్–19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (113 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ సిమ్రన్ సింగ్ (82; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో భీమ్ షార్కి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్ తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు 36.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్‡్ష త్యాగి, సిద్ధార్థ్ దేశాయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా మన్‌దీప్‌కు 2 వికెట్లు దక్కాయి. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా నేడు యూఏఈతో భారత్ తలపడనుంది. -
వివాదంలో అండర్-19 కెప్టెన్ కిషన్
ఆటో రిక్షాను ఢీకొట్టిన క్రికెటర్ కారు పాట్నా: భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ వివాదంలో ఇరుక్కున్నాడు. మంగళవారం సాయంత్రం కంకర్‌బాగ్‌లో తాను ప్రయాణిస్తున్న కారు ఓ ఆటో రిక్షాను ఢీకొట్టడంతో వివాదం చోటు చేసుకుంది. సంఘటన తర్వాత తండ్రి ప్రణబ్ పాండేతో కలిసి గొడవకు దిగడంతో పోలీసులు క్రికెటర్‌ను అరెస్ట్ చేశారని కథనాలు వచ్చాయి. అయితే కంకర్‌బాగ్ పోలీసు స్టేషన్ ఇన్చార్జ్ విజయ్ కుమార్ మిశ్రా ఈ కథనాలను ఖండించారు. యాక్సిడెంట్ జరిగింది వాస్తవమే అయినా.. ఇరువర్గాలు సమస్యను అక్కడికక్కడే పరిష్కరించుకున్నాయని తెలిపారు. ‘ఎలాంటి అరెస్టులుగానీ, ఎఫ్‌ఐఆర్‌లుగానీ లేవు. ఇరువర్గాలు స్టేషన్ బయటే ఓ అవగాహనకు వచ్చాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు కిషన్ తండ్రి ప్రణబ్ వాహనాన్ని నడుపుతున్నారు. రిక్షాలో ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి’ అని మిశ్రా వివరించారు. మరోవైపు యాక్సిడెంట్ గురించి ఆందోళన లేదని, క్రికెటర్ యథావిధిగా తన ప్రాక్టీస్‌కు వెళ్లిపోయాడని బిహార్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి నీరజ్ సింగ్ వెల్లడించారు.