యువ భారత్‌ శుభారంభం | U-19 Asia Cup: India thrashes Nepal by 171 runs | Sakshi
Sakshi News home page

యువ భారత్‌ శుభారంభం

Published Sun, Sep 30 2018 12:19 AM | Last Updated on Sun, Sep 30 2018 12:19 AM

U-19 Asia Cup: India thrashes Nepal by 171 runs - Sakshi

ఢాకా: ఆసియా కప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్‌... రికార్డు స్థాయిలో ఏడోసారి కప్‌ను ముద్దాడిన మరుసటి రోజే యువ భారత జట్టు అండర్‌–19 ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా శనివారం నేపాల్‌ అండర్‌–19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత అండర్‌–19 జట్టు 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన యువ భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (113 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా... వికెట్‌ కీపర్‌ సిమ్రన్‌ సింగ్‌ (82; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లలో భీమ్‌ షార్కి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో నేపాల్‌ తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి చివరకు 36.5 ఓవర్లలో 133 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్‌‡్ష త్యాగి, సిద్ధార్థ్‌ దేశాయ్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా మన్‌దీప్‌కు 2 వికెట్లు దక్కాయి. యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. టోర్నీలో భాగంగా నేడు యూఏఈతో భారత్‌ తలపడనుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement