అఫ్గాన్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. ఫైనల్లో టీమిండియాతో ఢీ | SA U19 triumph over AF U19 by 5 wickets | Sakshi
Sakshi News home page

అఫ్గాన్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. ఫైనల్లో టీమిండియాతో ఢీ

Published Mon, Jan 8 2024 8:45 PM | Last Updated on Mon, Jan 8 2024 9:13 PM

SA U19 triumph over AF U19 by 5 wickets - Sakshi

ప్రోటీస్‌ గడ్డపై అఫ్గానిస్తాన్‌- భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న అండర్‌-19 ట్రై సిరీస్‌ తుది అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో భాగంగా జోహాన్స్‌బర్గ్‌ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా చిత్తు చేసింది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌.. ప్రోటీస్‌ బౌలర్ల దాటికి 139 పరుగులుకు కుప్పకూలింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో క్వేనా మఫాకా 5 వికెట్లతో అఫ్గాన్‌ పతనాన్ని శాసించాడు. మోకోనా 3 వికెట్లు పడగొట్టాడు. అఫ్గాన్‌ బౌలర్లలో నుమాన్‌ షా(35) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 25.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో స్టీవ్‌ స్టోల్క్‌(40), వైట్‌హెడ్‌(33) పరుగులతో రాణించారు. ఇక జనవరి 10న జరగనున్న ఫైనల్‌ పోరులో దక్షిణాఫ్రికా- భారత జట్లు తలపడనున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement