సాక్షి, ముంబై: కరోనా కారణంగా ప్రభుత్వం అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా దెబ్బతిన్న ముంబై డబ్బావాలాలు ప్రత్యామ్నాయ వేటలో పడ్డారు. అందులో భాగంగా ‘డబ్బావాల సెంట్రల్ కిచెన్’అనే కొత్త పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించాలని ముంబై డబ్బావాలాలు నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. కొత్త వ్యాపారం ద్వారా ప్రతీరోజు సుమారు 70 వేల వినియోగదారులకు భోజన సౌకర్యం కల్పించనున్నారు.
130 ఏళ్ల నుంచి లంచ్ బాక్స్‌లు చేరవేత
మేనేజ్‌మెంట్ గురుగా పేరు సంపాదించుకున్న ముంబై డబ్బావాలాలు స్వాతంత్య్రానికి ముందు అంటే సుమారు 130 ఏళ్ల నుంచి ముంబైలోని వివిధ కార్యాలయాలు, వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు లంచ్‌బాక్స్‌లు చేరవేస్తున్నారు. ఇదివరకు లంచ్ బాక్స్‌లు తారుమారైన సంఘటనలు లేవు. కార్యాలయాల్లో లంచ్ టైమ్‌కు ముందే ఉద్యోగుల చెంతకు లంచ్ బాక్స్‌లు చేరవేసేవారు. క్రమశిక్షణలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. కాని కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం 2020 మార్చిలో లాక్‌డౌన్ అమలు చేసింది. అప్పటి నుంచి ముంబై డబ్బావాలాల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది.
చదవండి: (భార్య చనిపోతే.. మరో కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు..)
కార్యాలయాలన్నీ మూసివేయడంతో ఉపాధి కరువైంది. అనేక డబ్బావాలాల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. గత్యంతరం లేక కొందరు సెక్యూరిటీ గార్డులుగా మారారు. మరికొందరు మంది స్వగ్రామాలకు తరలిపోయి అక్కడ వ్యవసాయ కూలీలుగా, మరికొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఎవరు, ఎక్కుడున్నారో తెలియదు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆంక్షలు వి«ధించడంతో ఎవరు, ఎçప్పుడు విధులకు వస్తున్నారో తెలియని ఆయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో డబ్బావాలాలకు ఇప్పటికీ ఉపాధి లేకుండా పోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా సెంట్రల్ కిచెన్ ఏర్పాటు చేసి ఉపాధి పొందాలని నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment