సాక్షి, చేగుంట/ మెదక్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన కేటీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో మెదక్ జిల్లాలో మంత్రి కళ్లెదుటే ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట మండలం రెడ్డిపల్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన కేటీఆర్ వెంటనే కాన్వాయ్ ఆపి కారు దిగి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. తన వెంట ఉన్న వైద్యుడితో బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, బాధితులను తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి హైదరాబాద్‌కు బయలుదేరారు. కాగా కేటీఆర్ చూపిన చొరవకు అక్కడున్న వారు ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: ఐక్యరాజ్యసమితి ప్రశంసలు అందుకున్న 'తెలుగు మహిళ'
మంత్రి @KTRBRS గారు ఈరోజు జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించారు. pic.twitter.com/AgDdpFf55K
— KTR News (@KTR_News) July 16, 2023
Comments
Please login to add a commentAdd a comment