![Patrol Police Help For Pregnant Women Telangana Madgula Police Station](/styles/webp/s3/article_images/2024/08/7/police-help.jpg.webp?itok=4SAcDA3z)
రాత్రివేళ ఇద్దరు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని
నిండు గర్భిణికి గస్తీ పోలీసుల Help ఆపన్నహస్తం
మాడ్గుల: రాత్రివేళ.. రాష్ట్రంకాని రాష్ట్రం.. ఇద్దరు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని స్థితి.. ఆపై మొదలైన పురిటినొప్పులు... ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గస్తీ పోలీసులు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు. ‘డయల్ 100’ కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక మహిళల చేత దగ్గరుండి పురుడు పోయించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆమె సంబం«దీకుల సహకారంతో తల్లీబిడ్డలను హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి పంపించారు.
ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో..: సోమవారం రాత్రి గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి ఈ విషయం చెప్పగా కంట్రోల్ రూం సిబ్బంది ఆ సమాచారాన్ని గస్తీ పోలీసులకు చేరవేశారు. దీంతో వారు తక్షణమే అక్కడికి చేరుకొని మహిళ వివరాలు కనుక్కున్నారు. తన పేరు కుమీ భాయ్ అని, కర్ణాటకలోని చెంచోలు మండలం పోలేపల్లి తమ గ్రామమని తెలి పింది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలతో వారం క్రితం ఇల్లు వదిలి వచ్చా నని పేర్కొంది. భర్త పేరు, ఫోన్ నంబర్ చెప్పగా పోలీసులు ఆ నంబర్‌కు కాల్ చేశారు. అతను ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.
హైదరాబాద్‌లో ఉన్న భార్య తమ్ముడిని పిలిపించి అతని వెంట పంపాలని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనంత రం పోలీసులు తల్లీబిడ్డలకు ఆహారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండ గా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళకు పెట్రో కార్ అడ్డంపెట్టి స్థానిక మహిళల చేత అక్కడే పురుడు పోయించారు. తర్వాత ఆమె సోదరుడిని పిలిపించారు. తల్లీపిల్లలను మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కోఠి మెటరి్న టీ హాస్పిటల్‌కి పంపించారు. ఆస్పత్రిలో మాడ్గుల సీఐ నాగరాజు గౌడ్ ఆమెను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వం చాటుకున్న పెట్రో కార్ సిబ్బంది రాజేందర్, సురేశ్, సీఐ నాగరాజు గౌడ్‌ను రాచకొండ సీపీ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ డి.సునీతారెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment