
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మధురా నగర్ పీఎస్ పరిధిలో స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుండి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు.
వివరాల ప్రకారం.. మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ముగ్గురు కానిస్టేబుల్స్ నామోదర్, నాగరాజు, సతీష్‌లను సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. అయితే, వీరు ముగ్గురు పీఎస్ పరిధిలోని స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నుంచి నెలవారీ వసూళ్లు చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. లంచాలతోపాటుగా అక్కడి యువతులతో వీరు రాసలీలలకు కూడా పాల్పడుతున్నారని ఫిర్యాదు కూడా వచ్చాయి. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో సదరు స్పా సెంటర్‌లోకి ముగ్గురు కానిస్టేబుల్స్, మరో హోంగార్డ్ వెళ్లిన దృశ్యాలను పోలీసులు.. సీసీ కెమెరాల్లో పరిశీలించారు. వారిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సీపీ సస్పెండ్ చేశారు. అలాగే, వారితోపాటు ఉన్న హోంగార్డ్ రాజును పోలీసు శాఖకు చెందిన మోటారు ట్రాన్స్‌పోర్టుకు పంపించి చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment