గణేష్ ఉత్సవాల్లో అత్యంత కీలకఘట్టమైన సామూహిక నిమజ్జనం మంగళవారం (సెప్టెంబర్ 17) జరగనుంది. ఈ ఈ మేరకు ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ గణేష్ నిమజ్జనంతో పాటు, ట్రాఫిక్ ఆంక్షలపై మీడియాతో మాట్లాడారు.
రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేసినట్లు విధించినట్లు తెలిపారు. అంతేకాదు ప్రయాణం సౌకర్యార్థం ప్రజలు ఆర్టీసీ, ఎంఎంటీఎస్, మెట్రో రైళ్లను విస్తృతంగా వాడుకోవాలని చెప్పారు.
ట్యాంక్ బండ్ దగ్గర 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించామని, రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు (మంగళవారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ గణేష్ తరలింపుకు ఏర్పాట్లు. సాయంత్రం 4గంటల్లోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుంచి వెల్లడించారు.
ఇక శోభాయాత్ర మొదలైన రెండు గంటల్లోనే ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జనాలు, ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో సిటీలోకి భారీ వాహనాలకు పర్మిషన్ లేదని తేల్చి చెప్పారు. నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ట్రాఫిక్ అడిషనల్ పోలీస్ కమిషనర్ విశ్వప్రసాద్ కోరారు.
ఇదీ చదవండి : రేపే కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా
Comments
Please login to add a commentAdd a comment