
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపే (సెప్టెంబర్ 17) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో భేటీ అయ్యేందుకు అపాయిట్మెంట్ అడిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కేజ్రీవాల్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సక్సేనాను కలిసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆయన రాజీనామాను సమర్పించవచ్చని సమాచారం. ఇదిలా ఉండగా, పార్టీ తదుపరి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆప్ సీనియర్ నాయకులు ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు.
లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నాను . ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం సీట్లో కూర్చోను. ప్రతి ఇంటికి, ప్రతి వీధికి వెళ్తాను.. తప్ప సీఎం కుర్చీలో కూర్చోను. ప్రజల నుంచి నాకు తీర్పు వస్తుంది’ అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి : గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు