hand in hand
-
శభాష్ పోలీస్..!
మాడ్గుల: రాత్రివేళ.. రాష్ట్రంకాని రాష్ట్రం.. ఇద్దరు పిల్లలతో ఎటువెళ్లాలో తెలియని స్థితి.. ఆపై మొదలైన పురిటినొప్పులు... ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆమెకు రంగారెడ్డి జిల్లా మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలోని గస్తీ పోలీసులు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించారు. ‘డయల్ 100’ కంట్రోల్ రూం నుంచి అందిన సమాచారంతో వెంటనే అక్కడకు చేరుకొని స్థానిక మహిళల చేత దగ్గరుండి పురుడు పోయించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం ఆమె సంబం«దీకుల సహకారంతో తల్లీబిడ్డలను హైదరాబాద్‌లోని కోఠి మెటర్నిటీ ఆస్పత్రికి పంపించారు.ఓ వ్యక్తి ఫోన్ చేయడంతో..: సోమవారం రాత్రి గ్రామంలో గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి డయల్ 100కు కాల్ చేసి ఈ విషయం చెప్పగా కంట్రోల్ రూం సిబ్బంది ఆ సమాచారాన్ని గస్తీ పోలీసులకు చేరవేశారు. దీంతో వారు తక్షణమే అక్కడికి చేరుకొని మహిళ వివరాలు కనుక్కున్నారు. తన పేరు కుమీ భాయ్ అని, కర్ణాటకలోని చెంచోలు మండలం పోలేపల్లి తమ గ్రామమని తెలి పింది. కుటుంబ సభ్యులతో మనస్పర్థలతో వారం క్రితం ఇల్లు వదిలి వచ్చా నని పేర్కొంది. భర్త పేరు, ఫోన్ నంబర్ చెప్పగా పోలీసులు ఆ నంబర్‌కు కాల్ చేశారు. అతను ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.హైదరాబాద్‌లో ఉన్న భార్య తమ్ముడిని పిలిపించి అతని వెంట పంపాలని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అనంత రం పోలీసులు తల్లీబిడ్డలకు ఆహారం అందించి స్థానిక ఆస్పత్రికి తరలిస్తుండ గా పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆ మహిళకు పెట్రో కార్ అడ్డంపెట్టి స్థానిక మహిళల చేత అక్కడే పురుడు పోయించారు. తర్వాత ఆమె సోదరుడిని పిలిపించారు. తల్లీపిల్లలను మాల్ వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి కోఠి మెటరి్న టీ హాస్పిటల్‌కి పంపించారు. ఆస్పత్రిలో మాడ్గుల సీఐ నాగరాజు గౌడ్ ఆమెను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వం చాటుకున్న పెట్రో కార్ సిబ్బంది రాజేందర్, సురేశ్, సీఐ నాగరాజు గౌడ్‌ను రాచకొండ సీపీ సు«దీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ డి.సునీతారెడ్డి అభినందించారు. -
హోస్టన్కు ఆపిల్ ఆర్థిక సాయం
హోస్టన్: వరుస హారికేన్లతో సతమతమౌతున్న హోస్టన్కు ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ ఆర్థిక సాయం ప్రకటించింది. బాధితులకు సహాయమే లక్ష్యంగా పలు సంస్థల సహకారంతో "హ్యాండ్ ఇన్ హ్యాండ్" పేరుతో విరాళాల సేకరణలో భాగంగా 5 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. అంతేకాకండా తమ వినియోగదారులు ఎవరైనా యాప్ స్టోర్ లేదా, ఐట్యూన్స్ ద్వారా నేరుగా విరాళం ఇవ్వచ్చొని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రెడ్ క్రాస్‌కు మరో 3మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చింది. ఆపిల్ ఉద్యోగులు, వినియోగదారుల ద్వారా మరో 2 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు. తొలుత "హ్యాండ్ ఇన్ హ్యాండ్" కార్యక్రమాన్ని ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం వెరిజోన్. మైఖేల్ & సుసాన్ డెల్ ఫౌండేషన్లు ప్రారంభించారు. ఇందుకోసం మైఖేల్ డెల్ 5 మిలియన్లు డాలర్ల విరాళాన్ని ఇచ్చాడు. ఇందుకోసం వెరిజోన్ సైతం 2.5 మిలియన్ డాలర్లు ఆర్థిక సహాయం అందిండంతోపాటు ప్రత్యేక కాల్ సెంటర్ నడుపుతోంది. విరాళాల సేకరణకు సెప్టెంబర్ 12 న ప్రముఖులతో టెలిథాన్ నిర్వహించాలని "హ్యాండ్ ఇన్ హ్యాండ్" నిర్వాహకులు ప్రణాళిక చేస్తున్నారు. ఈ టెలీథాన్ను ప్రపంచ వ్యాప్తంగా ఏబీసీ, సీబీఎస్, ఫాక్స్, ఎన్బీసీ, హెచ్‌బీవీ టీవీ నెట్‌వర్క్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో బెయోన్స్, ఓప్రా, జోన్ స్టివార్ట్, స్టీవెన్ కోల్బర్ట్, డ్రేక్, జార్జ్ క్లూనీలు పాల్గొంటారు. అంతేకాకుండా మ్యూజిక్ స్టార్ జార్జ్ స్ట్రైట్ షోకూడా ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.